-
Shivangi
₹200.00శివంగి
ఎదురుగా ఎటువంటి అడ్డంకి వున్నా, వెనుకా ముందూ చూసుకోకుండా ఎగిరి అవతలి పక్కకు దూకటం సమీరుడి అశ్వానికి వున్న పెద్ద అలవాటు.
కళ్ళేలను బిగించి పట్టుకున్నా, పళ్ళు బిగించి గట్టిగా అరిచినా, కొంచెంగా కూడా పట్టించుకోదు అది.
రాళ్ళు రప్పలు కాదు…దట్టమైన ముళ్ళ పొదలు ఇవి. కింద పడటం అంటూ జరిగితే కత్తులతో చీరినట్లు గాయాలు అవుతాయి. ‘జాగ్రత్తరా నాన్నా…’ మూడు బారల వెనుకగా తన వాహనాన్ని నడిపిస్తున్న సమీరుడి తండ్రి చిన్నగా హెచ్చరించాడు
సూర్యుడు పడమటి దిక్కుకి పడిపోతున్నాడు. పగటి సమయమంతా
శ్రాంతిగా తమతమ నెలవుల్లో పడుకుని వున్న జంతువులన్నీ వళ్ళు రుచుకుంటూ వేటలకు బయలుదేరే సమయం దగ్గరపడుతోంది.
మూడు క్రోసులుంది రహదారి… త్వరగా వెళ్ళకపోతే అడవిలో వుండగానే కటిపడిపోతుంది’ అంటూ కాలిమడమలతో తన అశ్వాన్ని కదిలించాడు మీరుడు. గట్టిగా సకిలించింది అది. అతని తండ్రి అనుమానపడుతున్నట్లుగానే ఎదుట న్న ఒక పెద్ద పొదమీద నుంచి ఎగిరి అవతలకి దూకింది.
-
Warrior Shadow
₹120.00చారెడేసి కన్నులు, చేమంతి బంతులు
ముంగురుల ముద్దుమోము – మనస్సు నిలువనీయదే
బావికాడ కడవతో వయ్యారపు నీ నడక
గుండెపట్టి గిల్లిందే-ఒళ్ళు తిమ్మిరెక్కిందే
నా వంక చూడవా నడుమొంపు చిన్నదాన
ఒక్క నవ్వు నవ్వవా రంగపూరు నెరజాణఇవ్వాళో రేపో విరిగిపోయేటట్లున్న చెక్కబల్లమీద ఎడమచేత్తో దరువు వేస్తూ పెద్ద గొంతుతో పాడటం మొదలు పెట్టాడు గంగారాం.
మాట్లాడేటప్పుడు మహా కరుకుగా ధ్వనిస్తుంది అతని కంఠం.
పాటలు మొదలు పెట్టిన మరుక్షణం మార్దవంగా మారిపోతుంది.
తలలు వంచుకుని తమదారిన తాము వెళ్ళిపోవాలనుకునే వారుకూడా ఆగిపోవాల్సిందే. పాట పూర్తి అయ్యేవరకూ ఆగి విని తీరాల్సిందే.