-
Kotta Katha 2018
₹149.00సంపాదకుల మాట స్త్రీలు చెప్పమన్న కథలు
కథ రాయాలని కూచున్నప్పుడు రచయిత ఎదురుగా ఒక స్త్రీ వచ్చి ‘నా కథ రాయి’ అనే సందర్భాలు గతించిపోయేలా లేవు. 1980ల తర్వాత స్త్రీవాద దృక్పథంతో కథ, నవల తెలుగులో వికసించినా నాటి నుంచి నేటి వరకూ వందల కథలు వెలువడా రచయిత ఎదురుగా స్త్రీలు కూచుని ‘మా కథ రాయవేమి?’ అని డిమాండ్ చేస్తూనే ఉన్నారంటే అనంత ముఖాల స్త్రీ సమస్యల ప్రాసంగికత ఎప్పటికీ గతించిపోదనే | అనిపిస్తున్నది.
కొత్త కథ – 2022లో తొమ్మిది కథలు స్త్రీల మానసిక, భౌతిక, సామాజిక సమస్యలను చర్చించే ప్రయత్నం చేయడం ఒక ముఖ్యమైన పరిశీలనాంశంగా తీసుకోవాలి. ఎదగవలసినట్టుగా ఎదగలేకపోయిన అమ్మాయి’ కథ నుంచి ‘అవసరం లేనంతగా ఎదిగిన గృహిణి’ కథ వరకూ రచయితలు ఈ సంకలనంలో కథనం చేశారు. ఇంత వైవిధ్యమైన చూపు కలిగి ఉండటంలో ‘రైటర్స్ మీట్ భాగస్వామ్యం ఏ కొంచెమైనా ఉంటుందనే భావన మాకు సంతోషం కలిగిస్తున్నది……
-
Kottha Katha 2018
₹149.00చెప్పుకోవడానికి ఒక కథంటూ లేకుండా ఎలా బతుకుతున్నావ్? అంటాడు దోస్తోవ్ స్కీ, నిజమే కదా! చెప్పుకోవడానికి ఏమీ లేనివాడు అందరికంటే దురదృష్టవంతుడు. భాష తెలియని ఆది మానవుడు సైతం తన కథలను గుహలలో బొమ్మల్లా చిత్రీకరించాడు. నోటి మాటగానో, తాళపత్ర గ్రంథాల ద్వారానో, దేవాలయాల గోడలపైన చెక్కిన శిల్పాల ద్వారానో మనకి వారసత్వంగా వచ్చిన ప్రక్రియ కథ.
నవ్వు తెప్పించే హాస్యకథల రూపంలోనో, ఆలోచింపజేసే నీతికథల రూపం లోనో, మనసును రంజింపజేసే శృంగారభరితమైన కథల రూపంలోనో కథ అనే ఈ పురాతన కళాప్రక్రియ నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే గత వందేళ్ళకి పైగా వచ్చిన ఆధునిక కథ సంగతి వేరు. మన జీవితాలను గతంతో అనుసంధానం చేస్తూనే, మారుతున్న సమాజానికి అనుగుణంగా మన ఆలోచనలను వ్యక్తం చేయడానికి కథ కొత్త మార్గాలను వెతుక్కుంటూనే ఉంది. అలా వెతుక్కుంటూ చేరిన విభిన్న, వినూత్న కథల సంకలనం ఈ కొత్తకథ 2018.