• Peka Mukkalu - పేక ముక్కలు

    Peka Mukkalu – పేక ముక్కలు

    0

    సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్‌ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.

    కిషన్‌ చందర్‌ 1914 నవంబర్‌ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్‌.ఎల్‌.బి. పట్టా పుచ్చుకున్నారు. ప్రధానంగా ఆయన నవలా రచయిత. ఆయన నవలలు అనేకం భారతీయ భాషలతోపాటు ఇంగ్లీష్‌, రష్యన్‌, డేనిష్‌, పోలిష్‌, జర్మన్‌, హంగేరియన్‌, చైనా భాషలలోకి అనువదించబడ్డాయి.

    ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలి, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికి మాటలతో రూపమివ్వటం – కిషన్‌ చందర్‌ ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి. ”గాలిబ్‌ వారసుడు”గా సాహితీ లోక సమాదరణ పొందిన కిషన్‌ చందర్‌ 1977 మార్చి 8న కీర్తిశేషులయ్యారు.

    ఈ నవలకు పెట్టిన ”పేకముక్కలు” అన్న పేరు చాలా విధాలా సార్థకనామం. ఇందులో ఉన్న పాత్రలు పేకముక్కలు. ఇందులో రాజులూ, రాణీలూ, జాకీలూ, జోకర్లూ, పొడిముక్కలూ అందరూ ఉన్నారు. సినిమా ఒక కళా కాదు, ఒక వ్యాపారమూ కాదు – పేకాట, జూదం! కాని అది కొద్దిమందికే జూదం. మిగిలినవారిలో సుఖజీవనం కోసం వచ్చినవాళ్ళుంటారు. తమ ఆదర్శాలు సఫలం చేసుకోవటానికి వచ్చినవారుంటారు. బ్రతుకు తెరువులలో ఇది ఒకటనుకుని, పెద్ద ఆశలేమీ లేకుండా వచ్చినవారుంటారు. ఈ రకాలన్నీ ఈ నవలలో ఉన్నాయి.

    సినిమా జీవితం ఒక విలక్షణమైన జీవితం. మామూలు జీవితపు విలువలకిక్కడ చలామణీ లేదు. ఈ సంగతి తెలియగానే మామూలు జీవితపు విలువలను సునాయాసంగా విసర్జించేస్తారు కొందరు. మరి కొందరు వాటిని గాఢంగా అంటిపెట్టుకుంటారు. ఆ కారణంగా నలిగి హూనమైపోతారు. అంతులేని ఆశనూ, అగాధమైన నైరాశ్యాన్నీ రేకెత్తించగల విచిత్ర జీవితం సినిమా జీవితం.

    జీవితాన్ని వాస్తవంగా చిత్రించటమే ఒక విశేషం కాదు. డిటెక్కివు నవలల్లో కూడా వాస్తవ జీవితమే ఉన్నది. ఈ నవలలో సినిమాకారుల జీవితాన్ని ఉన్నదున్నట్టు చిత్రించటంలో సరిపుచ్చుకోక, రచయిత ఆ జీవితంలోని సత్యాలన్నిటినీ నగ్నంగా ప్రదర్శించారు. ఆ కారణంచేత ఇది ఉత్తమ రచన అనిపించుకుంటుంది. ఎప్పటికైనా సినిమా కళ ఉన్నతికి రావాలంటే, అందుకు జరగదగిన కృషిలో ఈ నవల ఒక భాగమవుతుందా అంటే, అవుతుందని నేను నమ్మకంగా చెప్పగలను. – కొడవటిగంటి కుటుంబరావు

    పేజీలు : 264

    220.00
    Add to cart
  • Iduguru Lofarlu - ఐదుగురు లోఫర్లు

    Iduguru Lofarlu – ఐదుగురు లోఫర్లు

    0

    సాధారణంగా జైలు నుండి విడుదల అయిన వ్యక్తి బాగా చిక్కిపోయి నీరసంగా బికారిలా కనిపిస్తాడు. జైలు నుండి విడుదల అయిన తాంతియా అలాకాక, వెనుకటికన్న పిక్కబలిసి, మానమర్యాదలు గల గౌరవనీయుడుగా కనిపిస్తున్నాడు. జేబులో నలభై ఎనిమిది రూపాయల పండ్రెండణాల నగదుతో, ముఖమంతా ప్రసరించిన ముసిముసి నవ్వులతో అతను జైలు నుండి బయట అడుగుపెట్టాడు.

    అలా బయటకు రాగానే ”యిప్పుడింక నేను దుర్వృత్తుల జోలికి పోను మాహిమ్‌లో ఏ బంకో తీసుకొని మంచి చిల్లర వ్యాపారమేదైనా చేస్తాను” అని స్నేహితులతో చెప్పాడు తాంతియా….

    పేజీలు : 120

    100.00
    Add to cart
  • Janglee - జంగ్లీ

    Janglee – జంగ్లీ

    0

    కిషన్‌చందర్‌ రాసిన ”జంగ్లీ” (నవల) ఒకనాటి బొంబాయ్‌ నగర జీవితాన్నీ, మహానగరంగా పెరుగుతున్న ఆ నగర వైరుధ్యాలనూ ప్రత్యేకించి కూటికీ, గుడ్డకూ, గూడుకూ కరువైన సాదాసీదా జనజీవనాన్ని గురించి అత్యంత అద్భుతంగా మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరుగుదలతోపాటు దాన్ని అంటిపెట్టుకుని ఉండే దారిద్య్రం, సంపన్నతలను మనం ఈ నవల ద్వారా గమనించవచ్చు. జీవిత వైవిధ్యాన్ని, మానసిక అంతర్మథనాన్ని కిషన్‌చందర్‌ గొప్పగా చిత్రించాడు. అనామకులైన ఇద్దరు పేద యువతీయువకుల ప్రేమగాథను కష్టాలకూ, కన్నీళ్ళకూ వేదికైన బొంబాయ్‌ నగర  ”ఫుట్‌పాత్‌” అలగాజన’ జీవనస్రవంతిలో ఆ ప్రేమజంట ఏ విధంగా జీవనాన్ని సాగిస్తూ కలలు కన్న విషయాన్ని కిషన్‌చందర్‌ సాహితీలోకానికి అందిస్తాడు. అందుకే ఆయన భారతీయ సాహిత్య శిఖరంలో నిలవగలిగిన కొద్దిమందిలో ఒకరైనారు.

    పేజీలు :186

    150.00
    Add to cart
  • Kishan Chandar Rachanalu - 1 Gadidala Kathalu - కిషన్‌ చందర్‌ రచనలు - 1 గాడిదల కథలు

    Kishan Chandar Rachanalu – 1 Gadidala Kathalu – కిషన్‌ చందర్‌ రచనలు – 1 గాడిదల కథలు

    0

    సాహిత్యంలో వ్యంగ్యానికున్న శక్తి అందరికీ తెలిసిందే! వ్యంగ్యం అనండి; అవహేళన అనండి; అందులో కిషన్‌ చందర్‌ పెట్టింది పేరు. శరీరానికి దెబ్బ తగలకుండా మనస్సుకు మెత్తగా చురుకపెట్టే శక్తి కిషన్‌ చందర్‌ రచనకుంది. గాడిదను ఆసరగా తీసుకొని ఢిల్లీ రాజనీతినీ, బొంబాయి వ్యాపారనీతినీ ఎండ గట్టాడు కిషన్‌ చందర్‌ ”ఒకానొక గాడిద ఆత్మకథ”లోనూ ‘తిరిగి వచ్చిన గాడిద”లోను. అదే గాడిద మరో దేశానికి ప్రయాణం చేసి తన అనుభవాలను పాఠకుల కందించేలా రాశాడు ”నేఫాలో గాడిద”లో.

    పేజీలు : 216

    100.00
    Add to cart
  • Padi Rupaayala Notu - పది రూపాయల నోటు

    Padi Rupaayala Notu – పది రూపాయల నోటు

    0

    పది రూపాయల నోటు అనేది డబ్బుకు గుర్తు.

    దాని చుట్టూ సమాజంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను

    రచయిత అద్బుతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడిదారీ

    అనంతర సమాజంలో అవసరమైన ఉన్నత మానవ

    విలువలకు పెట్టుబడిదారీ సమాజంలోనే

    పునాదులేర్పడతాయని ఈ నవలలోని కొన్ని పాత్రల

    ద్వారా రచయిత మనకు చూపిస్తాడు.

    మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలపై

    ఆధారపడి వుంటాయన్న సత్యాన్ని తెలియజేశాడు.

    కిషన్‌ చందర్‌ రచనలు సమాజ స్వరూపానికి అద్దం

    పడతాయి. మ¬దాత్త శ్రమకి, ప్రేమకీ నీరాజన

    మిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలీ, జీవిత వైవిధ్యం,

    మానసిక అంతర్మథనానికీ మాటలతో రూపమివ్వటం

    ఆయన ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి.

    పేజీలు : 136

    100.00
    Add to cart
  • Virigina Vigrahaalu - విరిగిన విగ్రహాలు

    Virigina Vigrahaalu – విరిగిన విగ్రహాలు

    0

    సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్‌ తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.

    కిషన్‌ చందర్‌ 1914 నవంబర్‌ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్‌.ఎల్‌.బి. పట్టా పుచ్చుకున్నారు. ప్రధానంగా ఆయన నవలా రచయిత. ఆయన నవలలు అనేకం భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌, రష్యన్‌, డేనిష్‌, పోలిష్‌, జర్మన్‌, హంగేరియన్‌, చైనా భాషలలోకి అనువదించబడ్డాయి.

    ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకీ, ప్రేమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలి, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికి మాటలతో రూపమివ్వటం – కిషన్‌చందర్‌ ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి.

    పేజీలు : 100

    80.00
    Add to cart
HIDE FILTER
Shopping cart close