-
NTR A Biography
₹650.00విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగువారుండరు. అన్నగారి సినీ జీవితం, రాజకీయ చరిత్ర గురించి ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఇటీవల వచ్చిన ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’ చిత్రం ద్వారా ఆయన గురించి తెలియని మరిన్ని విషయాలను నేటి యువత తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ మహానుభావుడి గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలను పొందుపరిచి ఆయన జీవిత కథను ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారులు పుస్తక రూపంలో అందిస్తున్నారు. ‘ఎన్టీఆర్ బయోగ్రఫీ’ పేరిట ప్రచురితమైన ఈ పుస్తకాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి కె.చంద్రహాస్ సంయుక్తంగా రచించారు.
-
NTR Samagra Jeevitha Katha
₹400.00శ్రీమంతం, సారవంతం అయిన కృష్ణాతీరాన రైతుబిడ్డగా పుట్టిన నందమూరి తారక రామారావు ఈడు రాగానే పక్వానికొచ్చిన కళాకాంతుల్ని మూటగట్టుకుని వైనతేయుడిగా రెక్కవిదిల్చి చెన్నపట్నంలో వాలారు. రాముడై, కృష్ణుడై విశ్వవిఖ్యాత నటసార్వభౌముడై వెండితెరకు సొగసులద్దారు. తెలుగునాట పూజామందిరాలలో నిలువెత్తు స్థానం సంపాదించుకున్నారు. కర్మయోగిగా జనామోదం పొందారు. మరోసారి రెక్కవిదిల్చి ప్రభంజనమై తెలుగుజాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. జననేతగా జేజేలందుకుని తెలుగువాడికి కొండగుర్తుగా నిలిచిన ఆ మహనీయుని జీవితాన్ని ఆవిష్కరించే పుస్తకం యన్.టి.ఆర్.