-
Thriller – థ్రిల్లర్
₹80.00చిన్నప్పుడు ఇంట్లో – తల్లి – తండ్రి – పనిమనిషి – పెద్దయ్యాక బాస్ – ఇంటి యజమాని – అతడికొడుకు – అందరూ తమ స్వార్ధం కోసం తమ జీవిత విధానానికి అనుగుణంగా కొన్ని -రీజనింగ్’లు సమకూర్చుకుని ఆమెకి మనష్యులంటే అసహ్యం పుట్టేలా చేశారు. ప్రేమకన్నా పెద్ద స్వార్ధం లేదనే సినికల్ భావానికి లోను చేశారు. ఆమె విద్యాధరి. అటువంటి పరిస్థితుల్లో ఆమెకి పరిచయమయ్యాడు ఓ విచిత్రమైన యువకుడు ….. అనుదీప్.
ఆమె శరీరం మీదే ఆమెకి తెలియకుండా ప్రేమలేఖ రాసి ప్రజెంట్ చేశాడు. ఆమె కోసం, కుడి చేతిని భుజం వరకూ కోసేసుకున్నాడు. ప్రేమకన్నా గొప్ప శక్తి లేదని నిరూపించటం కోసం ప్రపంచం మొత్తం మీద విద్యుచ్ఛక్తి సరఫరాని ఇరవైనాలుగ్గంటల పాటు నిలిపివేశాడు. ఆమె కంగారు పడింది. కంగార్లోంచి ప్రేమ పుడుతుందా ? థ్రిల్లర్…. థ్రిల్లర్…. థ్రిల్లర్…. చదువుతున్నంతసేపూ ఉద్వేగమూ ఉత్కంఠా… చదివాక మనస్సంతా మధురమైన బాధా తియ్యటి వేదనా…. మనుషుల్లోని ప్రేమ రాహిత్యాన్ని ఎత్తి చూపిన నవల మాత్రమే కాదు. ఇది తెలుగులో ‘అబ్సర్డ్- రచనలు లేని లోటుని తీర్చిన నవల కూడా. -
Tulasi – తులసి
₹100.00ప్రశ్నలకు చూడకుండా సమాధానం చెబుతాననీ తాను దైవాంశ సంభూతురాలిననీ చెప్పుకుంటుంది సిద్ధేశ్వరీదేవి. జనం నుంచి లక్షలు వసూలు చేస్తూ మోసం చేస్తూన్న ఆ ”దేవి” బండారాన్ని బట్టబయలు చేయాలని ప్రయత్నిస్తుంది ఓ యువతి. ఆమె తులసి. ఈ తులసిని ఎలాగైనా కనిపెట్టి చేతబడి చేయాలని దార్కా అనే ఒక మహా మాంత్రికుడు బిస్తా నుంచి బయలుదేరతాడు. సిద్ధేశ్వరిదేవికి ఈ మాంత్రికుడు తారసిల్లుతాడు. అతడిని లోబరుచుకుని జనాన్ని ఇంకా దోచుకోవాలనే కుతంత్రం పన్నుతుంది సిద్ధేశ్వరి. అయితే అనుకోకుండా దార్కా తులసితో చేయి కలుపుతాడు. ఆ తర్వాతి కథ తులసిలో చదవాల్సిందే.
తెలుగునాట సంచలనం సృష్టించిన ‘తులసీదళం’ నవలకు ఇది కొనసాగింపు. తులసి అనే చిన్నారికి చేతబడి చేసిన కాద్రా క్షుద్రదేవతల మూలాన చనిపోతాడు. దానికి పగ తీర్చుకోవాలనుకున్న విషాచి దార్కాసాహుకు మంత్ర విద్యలు నేర్పుతాడు. అందుకు ప్రతిఫలంగా అతడడిగే గురుదక్షిణ కాద్రా చావుకు కారకులైన ముగ్గురు నాగరికుల ప్రాణాలు. గురువుకు మాట యిచ్చిన దార్కా ఒకే ఒక్క వెంట్రుక సాయంతో ఒకే ఒక్క ఆధారమయిన తులసిని వెదుక్కుంటూ వెడతాడు.
చివరికి ఏం జరిగింది ? దార్కాతులసి స్నేహితులెలా అయ్యారు ? క్షుద్రశక్తులు ఉన్నాయా ? లేవా ? దీనికి సైన్స్ ఏం చెబుతోంది ? హేతువాదానికీ చేతబడుల వంటి విశ్వాసాలకీ లంగరు వేసే నవల ‘తులసి’. ప్రచురణ – నవసాహితి బుక్ హౌస్.
-
Yugantam – యుగాంతం
₹60.00‘భూమి మీద సకల చరాచరాలు నాశనం కాబోతున్నాయా? ప్రొఫెసర్ ఆనందమార్గం అంచనా నిజమయ్యే పక్షంలో ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాక్సిమా సెంక్చువరీ అనే నక్షత్రం భూమికి దగ్గరగా దూసుకు వస్తోంది. కొన్నివేల కోట్ల మైళ్ళ వేగంతో వస్తూన్న ఈ నక్షత్రం భూమి యొక్క పరిధిలోకి ఆగష్టు పదిహేడు ప్రొద్దున్న పదకొండు గంటలకి ప్రవేశించి, మూడు సెకన్ల కాలంపాటు ఉండి అనంత విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అయితే భూమిలో వుండే పదార్థాలన్నీ పోటీపడి ఆ నక్షత్రాన్ని చేరుకోవడానికి తొందర పడడంలో భూమి పేలిపోతుంది. కాగితంలో పకోడీలు దట్టంగా కూరి నొక్కితే పేలినట్లు భూమి పేలిపోతుందా? పదిహేడో తారీఖు వరకూ వేచి చూద్దాం. ప్రొఫెసర్ మాటలే గాని యధార్థమైతే చూడడానికి మనం ఎలానూ వుండముగా….”
ఇండియన్ టైమ్స్‌లో ప్రచురితమైన సంచలన వార్త అది. దాంతో అంతా గగ్గోలెత్తింది. మనిషి మనుగడ మీద జూదం మొదలయింది.
అష్టగ్రహ కూటమి ఏర్పడి ప్రపంచ వినాశనం జరగుతుందని ఒకనాడు గగ్గోలు…
స్కైలాబ్ విరుచుకుపడనుందని ఒకసారి చెలరేగిన గందరగోళం…
గ్రహాలూ గ్రహశకలాలూ తోకచుక్కలూ భూమిని ఢీ కొంటాయంటూ తరచు పేపర్ వార్తలు సృష్టించే కంగారు…
అలా ప్రపంచం నాశనమవుతుందంటే… ఆ క్షణాల్లో ప్రతి ఒక్కరికీ తెలిసే – రాజకీయ నాయకుల రంగులు. వ్యాపారస్తుల యావ. సైంటిస్టుల కీర్తి కాంక్ష. నిరుద్యోగుల నిస్సహాయత. కలుసుకోలేని ప్రేమికుల ఆవేదన. ముష్టివాళ్ళ అతిసాహస వైఖరి. మిడిల్‌క్లాస్ సంసారుల నైతిక క్షోభ… వీటన్నిటినీ చిత్రిస్తూ ఉత్కంఠభరితంగా సాగిపోయే యండమూరి వీరేంద్రనాథ్ ఫాంటసీ-
-
The Dairy Of Misses Sarada – ది డైరీ ఆఫ్ మిసెస్ శారద
₹100.00ఏమిట్రా అంత దీక్షగా చదువుతున్నావ్ ?’ గ్లాసులో మందుపోస్తూ ఒకడు రెండో వాడిని అడిగాడు. పచ్చి మిరపకాయల బజ్జీల పొట్లం విప్పి, బజ్జీల్ని ప్లేట్లో పడేసి, కాగితం పారెయ్యబోతూ ఆగి దాన్ని చదువుతున్న రెండో వాడు తలెత్తి ”ఇదేదో ఇంటరెస్టింగుగా వుందిరా, డైరీలో కాగితంలా వుంది’ అన్నాడు. ఎప్పటిదో పాత డైరీలో కాగితం. ‘ఇదేదో ఆడపిల్ల డైరీలో కాగితంలా వుంది. క్రింద శారద అని వుంది’. మూడోవాడు ఆ కాగితాన్ని లాక్కుని బిగ్గరగా చదవడం ప్రారంభించాడు.
‘మనుష్యులు రెండు రకాలు. తెలివైనవాళ్ళు. తెలివితక్కువ వాళ్ళు – మనుష్యులు రెండు రకాలు. బలమున్న వాళ్ళు. బలం లేని వాళ్ళు – తెలివిగానీ బలముగానీ లేనివాళ్ళు సామాన్యులౌతారు – బలం వున్నవాడు నీతిని వదిలేస్తే పొలిటీషియన్ అవుతాడు – తెలివి వున్నవాడు నీతిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు – తెలివైన వాడు నీతిని వదిలెయ్యకపోతే టీచరో మేధావో అయిసంతృప్తి పడతాడు – బలమైన వాడు నీతిని వదిలెయ్యకపోతే శ్రామికుడై శక్తిని ధారపోస్తాడు – నా జీవితాన్ని దర్పణంగా చేసి, నలభై సంవత్సరాల చరిత్రని అందులో ప్రతిబింబంగా చేసి చూస్తే నాకు తెలిసిన సత్యం ఇది. ఎందుకో ఈ రాత్రి నా జీవితంలో ఆఖరిరోజు అనిపిస్తుంది. ఇదే నా డైరీలో ఆఖరిపేజీ అనిపిస్తుంది – శారద”.
రెండు విభిన్నలోకరీతుల్ని రెండు విభిన్న కోణాల్లో యండమూరి వీరేంద్రనాథ్ వివరించిన విలక్షణమైన నవల ‘ది డైరీ ఆఫ్ మిసెస్ శారద’.
-
Vijayam Vaipu Payanam – విజయం వైపు పయనం
₹60.00ఒక శుక్రవారం సాయంత్రం – లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాయులీనం లీలగా వినిపించసాగింది. స్పష్టంగా వినడం కోసం, బయటికొచ్చాను. నాలాంటి మరికొంతమంది లైబ్రరీ బయట కనిపించారు. అందరమూ నిశ్శబ్దంగా ఆ ఫిడేలు మీద గమకాల్ని ఆస్వాదిస్తూ తాదాత్క్యంతో వింటున్నాం.
ఆ సమయంలో ఒక ముఫ్పై ఏళ్ళ వ్యక్తి ఇద్దరు పిల్లల్తో వచ్చి కూర్చున్నాడు. ఆ పిల్లలిద్దరూ ఒకర్నొకరు కొట్టుకుంటూ, అల్లరిచేస్తూ మా మధ్య తిరుగుతూ అల్లరి చెయ్యసాగారు.
అందరికీ అది చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇక సహించలేక ‘ఇది లైబ్రరీ, మీ పిల్లల్ని గోల చెయ్యవద్దనండి’ అన్నాను కరుగ్గా. అతడు తన నిస్తేజమైన కళ్ళతో నావంక చూసాడు. ‘గోల చేస్తున్నారు కదూ, అవును. పిల్లలు… వాళ్ళ అమ్మ ఇప్పుడే చనిపోయింది. అరగంట తర్వాత ఇస్తామన్నారు. ఆస్పత్రిలో గొడవ చేస్తున్నారని ఇలా తీసుకు వచ్చాను’ అన్నాడు.
అతడి మీద అప్పటివరకూ ఉన్న కోపం జాలిగా మారింది. కోపం జాలిగా, అసూయ ప్రేమగా, ద్వేషం స్నేహంగా, పగ ప్రేమగా, అసమర్ధత సమర్ధతగా, ఆవేశం ఆలోచనగా మారవచ్చు.ఇవన్నీ మన బలహీనతల స్థాయి భావాలు.
కావలసినదల్లా పరిస్థితిని పై స్థాయిలోంచి పరిశీలించగల్గడమే. సమస్యని అవతలి కోణంలోంచి చూడగల్గడమే.
అప్పుడు మనకెవరూ శత్రువులుండరు. మనకి సమస్యలుండవు. ఉన్నా, వాటిని నవ్వుతూనే పరిష్కరించుకోగల స్థిరత్వం మనకి అలవడుతుంది. అదే యండమూరి వీరేంద్రనాథ్ చెపుతున్న ‘విజయం వైపు పయనం’