-
-
Maha Vishnu Puranam
0₹400.00బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్టుని పుత్రుడు శక్తీ. శక్తీ భార్య గర్భవతిగా వుండగా అతడిని, అతడి నూర్గురు సోదరులని బ్రహ్మ రాక్షసుడి చేత చంపించాడు విశ్వామిత్రుడు.
తల్లి గర్భాన్నించి పుడుతూనే ‘ఓం నమో నారాయణాయ…’ నామ స్మరణతో జన్మించాడు శక్తీ కుమారుడు పరాశరుడు. పుట్టిన నాటినించి నిరంతర నారాయణ తపోదీక్షలో మునిగిపోయిన కన్నకొడుకుని చూసి ఆ తల్లి ఆవేశంతో రగిలిపోయింది. నీ తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకో…” అంటూ కొడుకుని రెచ్చగొట్టింది తల్లి. ప్రతీకారేచ్చతో రగిలిపోయిన పరాశరుడు అధర్వణ మంత్ర ప్రయోగంతో సుదీర్ఘ సత్రయాగం ఆరంభించాడు. ఆ యాగ ప్రభావం చేత మహామహులైన దానవులేందరో శలభాల్లా ఎగిరివచ్చి యాగాకుండలంలో పది మలమల మాడిపోయారు.
‘దానవజాతిని సమూలంగా నాశనం చెయ్యవద్దు’ అన్న తాత వశిష్టుడు కోరిక మన్నించి యాగాన్ని విరమించాడు పరాశరుడు. దానవజాతికి మూలపురుషుడైన పులస్త్య బ్రహ్మ సంతసించి “నా జాతి నాశనం కాకుండా కాపాడావు. నీకేం కావాలో కోరుకో…”అన్నాడు.
” మహావిష్ణు పురాణమును సంస్మరణ మాత్రానే గ్రహించవలసిన భవ్య జ్ఞానాన్ని అనుగ్రహించండి.” అని వరం కోరుకున్నాడు పరాశరుడు. అలా భూలోకానికి చేరువైంది ‘మహావిష్ణు పురాణము’. యుగయుగాలుగా మానవజాతిని మాధవ భక్తి పరులుగా, మర్చి మోక్ష మార్గాన్ని చూపుతోంది ‘మహావిష్ణు పురాణము’ ఇంటింటా ఉండదగ్గ పురాణగ్రంధ రాజం ‘మహావిష్ణు పురాణము’.
-
Sai Geethamritha Sa(Ga) Ram
0₹230.00కె. వివేకానంద రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, అలాగే “సాయి కీర్తన” గారు కూడా ఫోన్ ద్వారా పరిచయం .
వివేకానంద రెడ్డి గారు చాలాకాలంగా వేలాది ఆధ్యాత్మిక గ్రంధాలని చదువుతున్న వ్యక్తి. నా ఆధ్యాత్మిక నవల “జయం” చదవం ద్వారా వారు నాకు పరిచయమయ్యారు. అయన తరచూ షిర్డీ వెళ్తూ, దారిలో హైద్రాబాద్ లోని మా ఇంటికి వస్తుంటారు. ఆయనది భక్తి మార్గం.
పుట్టుకతో అన్యమతస్తురాలైన కుమారి సాయి కీర్తన వారి మతాన్నే కాక హిందూమతాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసారు. వీరిద్దరూ సాయి భక్తులే. కుమారి “సాయి కీర్తన”, “సాయి సచ్చరిత్ర” ని చదివి దాని గూడార్ధాన్ని గురించి వివేకానంద రెడ్డి గారితో చర్చించాక, ఈ పుస్తకానికి అంకురార్పణ జరిగింది. వీరు పరస్పర సహాకారంతో ఈ పుస్తకాన్ని రాసారు.
ఈ పుస్తకం షిర్డీ సాయి భక్తులకే కాక , ఆధ్యాత్మిక ఆసక్తి గల అందరికి నచ్చుతుందని ఆశిస్తూ.
-
Seetaramanjaneya Samvadamu
0₹350.00ఈ సీతారామాంజనేయ సంవాదానికి కీ.శే.గురుమూర్తి గ్రంధకర్త. నారాయణ శాస్త్రులు సరళ వ్యాఖ్యానం రాశారు. 29 ఏళ్ళ తరువాత యిప్పుడు మారిన వాడుక భాషకు అనుగుణంగా మూలభంగం కాకుండా వోరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు సరళ వ్యాఖ్యానం రాశారు. ఆధ్యాత్మిక రామాయణానుభూతి (రామాయణంలో ఈ సంవాదం లేదు) తో గురుమూర్తి గారు రాసినదే ఈ సీతారామాంజనేయ సంవాదం. భక్తునికీ భగవంతునికీ మధ్య జరిగిన సంవాదమిది. ఆనందానికీ, ఆనందోబ్రహ్మకూ నిదర్శనం.
-
Sri Purnima
0₹430.00మంగళకరమైన ఐశ్వర్యమే …. ‘ శ్రీపూర్ణిమ ‘
ఆచార్యుని అనుశాసనంలాంటి అపూర్వ గ్రంధాలను అందిస్తూ, అద్భుతాలను
సృజియిస్తూ, అఖండ జెండాగా ఎగురుతూ, భక్త పాఠకులపై ఆనందరస వర్షాన్ని
కురిపిస్తున్న మనోహర రచనల రచయిత, సర్వాంతర్యామిత్వాల సంకలనకర్త పురాణపండ
శ్రీనివాస్ లోకకళ్యాణకారకంగా అందించిన మంగళ గ్రంధం ‘ శ్రీపూర్ణిమ’ గ్రంధం .
తెలుగునాట వండర్ ఫుల్ వర్కోహాలిక్ గా పేరుపొందిన శ్రీనివాస్ రమణీయ
సౌందర్యాల రచనాశైలికి, పుస్తక నిర్మాణ చాతుర్యానికి, సంకలనాల
నైపుణ్యానికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు, సీనియర్ ఐఏఎస్ అధికారి
కె.వి.రమణాచారి సమర్పణలో ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ
ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పరమ రమణీయ శోభలతో ,
సుసంపన్నంగా అందించిన ఈ మంచి పవిత్ర గ్రంధాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం
కళ్యాణమండపంలో మహాపండితోత్తములు చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి
మంగళాశాసనాలు చెయ్యడం ఒక అపూర్వ సన్నివేశమైతే … ఇప్పటికి ఈ శ్రీపూర్ణిమ
సుమారు ఇరవై ఐదు ప్రచురణలు నోచుకోవడం ఒక పవిత్ర సంచలనమని చెప్పక తప్పదు.సుమారు ఏడువందల యాభైపేజీలలో , వేదవిహితమైన మంత్ర భాగాలతో , స్తోత్ర
వైభవాలతో, వాటికి పురాణపండ శ్రీనివాస్ ప్రామాణికమైన వ్యాఖ్యానాలతో ఈ
శ్రీపూర్ణిమ గ్రంధం రూపుదిద్దుకోవడంతో చాలామందితో కూడుకున్న భక్త సమాజం
తమ పూజాపీఠాలలో ఈ శ్రీపూర్ణిమను ఒక అఖండ శక్తిగా ఉంచుతున్నారు.ఒక భౌతిక సాధనంతో కొలవలేని అప్రమేయ అంశాలెన్నో ఈ ‘ శ్రీపూర్ణిమ’ లో చోటు
చేసుకోవడం వల్లనే , ధర్మభావన వాళ్ళ ప్రేరేపితమైన పారమార్ధిక శక్తులుండటం
వల్లనే, వేంకటాచల క్షేత్ర అతీంద్రియ మహనీయతల్ని అద్భుతంగా వర్ణించడం
వల్లనే, సమస్త బ్ర హ్మాండం లోని ప్రతి అణువూ నారసింహుని విరాట్రూపంలోని
అభిన్నరూపమని చక్కని కథతో నిరూపించడం వల్లనే … తేజస్వుల వర్చస్సుగా ఈ
బుక్ సంచలనమై విశేషంగా ఆకర్షిస్తోంది. కేవలం స్తోత్ర భాగాలే కాకుండా
పురాణపండ శ్రీనివాస్ మధ్యలో ఇఛ్చిన స్క్రిప్ట్ సూపర్బ్.ముఖపత్రంపై తిరుచానూరు అలమేలుమంగమ్మ దివ్యతేజస్సుల శోభతో ఈ పుస్తకం నిస్సందేహంగా ఒక అఖండ ప్రకాశంగా భక్త పాఠకులకు షోడశకళాప్రపూర్ణంగా అందిందనేది సత్యం.
బాహ్య ఆవరణలనుండి మనల్ని భగవంతుని వైపు నడిపించిన శ్రీపూర్ణిమ
పుస్తకాన్ని అందుకున్న వారెంత ధన్యులో. మహా మహా తలలు తిరిగిన,
నోరుతిరిగిన వేద పండితులు, పీఠాధిపతులు సైతం శ్రీనివాస్ కృషిని
అభినందించి ఆశీర్బలాలు అందించడం ఒక మంచి మంగళ పరిణామం.శ్రీపూర్ణిమ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మంగళకరమైన ఐశ్వర్యమే !
ఈరోజుల్లో ఒక పుస్తకం రెండేళ్లలో ఇరవైఐదు ప్రచురణలకు నోచుకోవడమంటే ఆ
రచయిత తాలూకు తపస్సు ఫలించినట్లే.అందువల్లనే ఈ రచయిత మరొక అమోఘ రచనా సంకలనం ‘ నన్నేలు నాస్వామి ‘ ఆంజనేయ
ఉపాస్య గ్రంధాన్ని అమిత్ షా వంటి రాజకీయ దిగ్గజం, ఈ దేశహోమ్ శాఖామంత్రి
ఆవిష్కరించారంటే ఇదేమీ మామూలు విషయం కాదు. -
Thirumala Divyakshetram
0₹450.00శ్రీనివాసుడి అవతరణ ఎలా ఎందుకు జరిగింది?
తిరుమల దేవుడి రూపు విష్ణువుదా? శివుడిదా ? శక్తిదా ?
కాళీ మాయల్నుండి శ్రీనివాసుడు భక్తుల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడు?
ఆలయ తలుపులు మూసేసే ముందు గర్భగుడిలో పూజాద్రవ్యాలు ఎందుకు ఉంచుతారు.
స్వామివారి హస్త విన్యాసాలు బోధించే తత్వం ఏమిటి?
ఆనంద నిలయంలో కొలువైన ఇతర దేవత మూర్తులేవారు?
అది మానవుడు తిరుమల పరిసరాల్లో తిరుగాడాడా?
ఏడుకొండల కి ఆ పేర్లు ఎలా ఎందుకు వచ్చాయి.
మెట్ల దారిలో అడుగడుగునా మైమరిపించే విశేషాలేమిటి?
మరెన్నో…
సింహప్రసాద్