-
-
Krishna Sastry Sahityam – 5 Vyasaavali – Vyasaalu – కృష్ణశాస్త్రి సాహిత్యం – 5 వ్యాసావళి – వ్యాసాలు
₹225.00‘ఆధునికాంధ్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిభావంతుడైన రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. అట్టివారి రచనలు లోకానికి త్వరగా సమగ్రంగా అందాలి. ఆ ప్రయత్నంలో సంకీర్ణ వ్యాసాలు, సాహిత్య ప్రసంగాలు, యక్షగానాలు, శ్రవ్యనాటికలు, గేయాలు, ఖండకావ్యాలు క్రమంగా ప్రకటితం కావడం ఆంధ్ర సాహిత్య ప్రియులకు ఎంతైనా హర్షదాయకమనుకుంటాను” అన్నారు శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 1-10-65న విశ్వోదయ ప్రచురణలకు ‘రెండుమాటలు’ వ్రాస్తూ. ఆనాటి ఆయన ఆశయం నేడు కార్యరూపం ధరిస్తున్నది. అందులో భాగంగా విడుదలయింది కృష్ణశాస్త్రి సాహిత్యం – 5 వ్యాసావళి – వ్యాసాలు. ఇందులో – కవిపరంపర – కవితా ప్రశస్తి – మహా వ్యక్తులు – అప్పుడు పుట్టి ఉంటే – పుష్పలాలికలు – బహుకాల దర్శనం – అమూల్యాభిప్రాయాలు ప్రకరణలున్నాయి. ఇందులో మొదటి ప్రకరణం ‘కవిపరంపర’ విడివిడికవుల కవితా విశిష్ట లక్షణాలను వివరించేది.
తొలిచి చూసి, లోపల దాగి ఉన్న సౌందర్యాన్ని పెల్లగించి చూచే కృష్ణశాస్త్రి గారి కవిచూపు సునిశితమైన సాహిత్య విమర్శకుని చూపు కూడా అని ఈ ‘కవిపరంపర’లోని దిగువ ఉదాహరించిన వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.
”నన్నయ వైకుంఠాన్ని భూలోకంలో అవతరింపజేస్తాడు, తిక్కన్న భూలోకాన్ని స్వర్గం దగ్గరకు ఎత్తడానికి ప్రయత్నిస్తాడు.”
”శబ్ధం పలకడమే కాదు, పాడుతుంది”.
”ఏడెనెమిది వందల ఏళ్ళ నుండి పల్లెల్లో, పట్టణాల్లో, ఇళ్ళల్లో, రచ్చ చావళ్ళలో ఈ భారతం చదువుకుని పురాణంగా చెప్పి తెనుగు వారు తమ జీవితంలో కలిపేసుకున్నారు. తిక్కన్న రచనలో అంత జీవచ్ఛక్తి, చైతన్యం ఉన్నాయి”.
”వారు (తిరుపతి వేంకట కవులు) గొప్ప కవులు, అయితే పద్యకవిత్వం కన్నా వారి వచనం గొప్పదని నా నమ్మకం”.
కవిగా, వక్తగా, భావకవిత్వోద్యమ జయస్తంభంగా, భక్త కవిగా, సినీ కవిగా శ్రీ కృష్ణశాస్త్రిని గుర్తించినంతగా సాహిత్య విమర్శకుడిగా ఆయన్ను లోకం గుర్తించినట్టు లేదు. దేశంలో నవ్య సాహిత్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లోనే ఆయన చేసిన రేడియో ప్రసంగాలు ఇంతవరకూ గ్రంథరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణం. ఇదిగో – ఇపుడీ సంపుటం ఆ లోపాన్ని పూరిస్తుంది. -
Satha Vasanthala Telugu Katha – శత వసంతాల తెలుగు కథ
₹450.00తెలుగు కథకు శ్రీకారం చుట్టిన శ్రీ గురజాడ అప్పారావుగారి కలం నుంచీ ఈనాటివరకూ వచ్చిన కొన్ని వేల కథలలో ఉత్తమ కథలను ఎన్నిక చేసి ప్రచురించాలనే సంకల్పం కలిగినా, ఆ కోరిక 1974 వ సంవత్సరానికి గాని తీరలేదు. ఆ నాటి ఆ కథా సంకలనాన్ని పునర్ముద్రించమని అనేకమంది రచయితల, పాఠకుల అభీష్టం మేరకు కొద్ది మార్పులు, చేర్పులతో తిరిగి ఆనాటి ఆణిముత్యాన్ని అందిస్తున్నాం. ఆంధ్రుల సామాజిక, ఆర్థిక, కుటుంబ జీవనంలో గత వంద సంవత్సరాల్లో వచ్చిన మార్పులకు ఈ కథాసంకలనం అద్దం పడుతుంది.
లాటిన్ అమెరికన్ కవి పాబ్లో నెరుడా అన్నట్లు – కవితలు, కథలు అభాగ్య సోదరుల కన్నీరు తుడిచే చేతిగుడ్డలు కావాలి. వారి పోరాటాలకు సాధనాలుగా కత్తులు లాంటి కథలు కావాలి. “రుమాళ్ళుగా, సవాళ్లుగా, ఎర్రెర్రటి జెండాలు” గా ఆ కథా సంకలనాన్ని స్వీకరించి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ శాత వసంతాల తెలుగు కథను పాఠకులకు సగర్వంగా అందిస్తుంది.
-
-
-
Kovvali Navalalu Konni
₹280.00సామాన్య జనాన్ని రంజింప చేసిన 1000 నవలలను రూపొందించిన ప్రముఖ రచయిత, కర్మయోగి, నిరాడంబరుడు, సాహితీ తపస్వి శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1912లో పశ్చమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి కాంతమ్మ, తండ్రి ప్లీడరు గుమాస్తా వృతిని అవలంబించి రాజమహేంద్రవరానికి నివాసం మార్చుకున్నందున లక్ష్మీనరసింహారావుకు కూడా అదే స్వస్థలం అయింది. తల్లి చిన్నప్పుడే గతించడంవల్ల తండ్రే తక్కిన సోదరులతో పాటుగా ఆయనను పెంచి పోషించారు. 14 సంవత్సరాలు నిండేసరికి స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు. స్థానిక గ్రంధాలయంలోని పుస్తకాలన్నింటినీ చదివారు. కొంతకాలం దేశ సంచారం చేశారు.
ఆనాటి సామాజిక, సాహిత్య పరిస్థితులను తీసుకొని శృంగారము, ప్రేమ మొదలగు వానిని జోడించి వ్యావహారిక భాషలో 2, 3 గంటల్లో చదవడానికి అనువైన నవలలను ముఖ్యంగా ‘కాలక్షేపపు నవలలు’ 1000 రాసి ‘వేయి నవలల కొవ్వలి’ అయ్యారు.
కొవ్వలి రచనలలో పైకి ప్రేమ, శృంగారం ఎక్కువగా కనబడినా సాంఘిక దురాచారాల నిర్మూలన, వితంతు వివాహోద్యమం, బాల్య వివాహ నిరసన, వృద్ధ వివాహాల అవహేళన, స్త్త్రి విద్య, కులమత విభేద నిర్మూలన ఇతివృత్తాలుగా వుండి సముచిత ఆదరణ పొందగలిగాయి. అంతేకాక అందరినీ ఆకట్టుకునే రీతిలో రసవత్తరంగా ముఖ్యంగా మధ్య తరగతి స్త్రీలకు ఆమోదకరంగా తన రచనలను రూపొందించారు. ఆ రోజుల్లో (1940 లలో) ఆంద్ర సాహిత్య చదువరులకు చలువ పందిళ్లు కప్పించిన మహా రచయిత శ్రీ కొవ్వలి.
1940లలో శ్రీ కొవ్వలి పేరు ఊరూరా, వాడవాడలా చదువరులున్న ప్రతి ఇంటా జపించబడింది. ఆబాలగోపాలాన్ని ఆనంద డోలికల్లో ముంచి తేల్చింది.
యావత్ ప్రపంచంలోనూ 1000 నవలలు రచించిన ఖ్యాతి శ్రీ కొవ్వలికే దక్కింది.ఆయన రచనలను ఆదరించినంతగా ఆనాడు మరొకరి నవలలను ప్రజలు ఆదరించలేదు. చదువులను ఎగ్గొట్టి వారి నవలలు విస్తారంగా చదివిన ఆనాటి పసివాళ్ళల్లో ఈనాటి పెద్దలెందరో ఉన్నారు.
కొవ్వలికి మద్రాసు, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలు మాన్యతా పత్రాలు (సర్టిఫికెట్స్ ఆఫ్ ఆనర్ ) ఇచ్చి గౌరవించింది.భారత ప్రభుత్వ విద్యాశాఖ కూడా వీరిని సముచితంగా గౌరవించింది.
“తెలుగు నవలా రచనా పధశోధకులు
తెలుగు ప్రజల పట్టనాభిలాష పోషకులు
వెయ్యి నవలలు వేవేగ వ్రాయసములు” ఐన
శ్రీ కొవ్వలి 1975 జూన్ 8న మహాప్రస్థానమొందారు.
– కొవ్వలి లక్ష్మీనరసింహారావు
-
Manishi Lopali Mahasamudralu
₹80.00నా చిన్న మాట….
పదిహేడేళ్ళ అమ్మాయి తన ప్రాణాన్ని థానే తీసేసుకుంది. కలకలం రేపింది. చిన్నాపెద్దా “అయ్యో” అన్నారు. గాలి కూడా సానుభూతి చూపింది. ఆకాశం కన్నీళ్ళు కార్చింది. “జీవితాన్ని ఎం చూసిందని” అన్నారు. నిజమే! కలలకు చోటులేని ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. “అంత బరువెం మౌసిందని” అన్నారు మరికొందరు. పరీక్షలో ఫెయిలవడం కూడా ఒక కారణమేనా అన్నారు. ఏమో! ఎం తెలుసు. ఆ పరీక్ష చుట్టూ ఎన్ని కలల సాలిగూళ్లు అల్లుకున్నాయో. సమాజం తనకై నిర్మించిన ఎన్ని సౌధాలను ఆ వైఫల్యం కూల్చివేసిందో. మొత్తనికి ఆ ఘటన నన్ను కుదిపేసింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-కిల్లాడ సత్యనారాయణ.
-
Manishi Roopalu – మనిషి రూపాలు
₹280.00కొండప్రాంతాలలో నివసించే ఒక వితంతు యువతి కథ ఇది. ఇందులో మనిషి యొక్క అనేక రూపాలను ఎంతో నైపుణ్యంతో చిత్రించాడు రచయిత. మన సంఘంలో ప్రబలివున్న వైరుధ్యాలనూ, తారతమ్యాలనూ వేలెత్తి చూపించాడు. మనిషి పరిస్థితులకు కేవలం బానిస అనీ, పరిస్థితులే అతని జీవితాన్ని నడిపిస్తాయనీ నమ్ముతాడు రచయిత.
యశ్‌పాల్ విప్లవవాది. అతను తన జీవితంలో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. అతని రచనల్లో సాంఘిక, రాజకీయ భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. నిరుపేదలపై జరుగుతున్న దౌర్జన్యాన్ని ఎదుర్కొనేందుకు, సాంఘిక చైతన్యం కలగజేసేందుకు అతను తన కలాన్ని శక్తివంతంగా ఉపయోగించారు.
పేజీలు : 314
-
Matruthvam
₹200.00డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి వైద్య సాహిత్య రంగాలలో సుప్రసిద్ధులు. గైనకాలజీ మరియు ఆబెట్రిక్స్ నిపుణులైన వీరు కాకినాడలో “విజయలక్ష్మి నర్సింగ్ హోమ్” ప్రారంభించి గత 38 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్నారు. వైద్య రంగంలోనే కాక, సాహిత్య రంగంలో కూడా ప్రసిద్ధి గాంచిన వీరి రచనలు – “మీరు ప్రేమించలేరు”, “మాకీ భర్త వద్దు”, “పేషంట్ చెప్పే కధలు”, “జ్వలిత” – కధానికా సంపుటాలు : ‘సజీవ స్వప్నాలు’, ‘చైతన్య దీపాలూ’, ‘ప్రత్యూష పవనం’, ‘వెలుతురు పువ్వులు’ – నవలలు : ‘మన దేహం కధ’, ‘కౌమార బాలికల ఆరోగ్యం’ – వైద్య పరిజ్ఞానానికి సంబంధించిన రచనలు : ‘వైద్యడు లేని చోట’, ‘మనకు డాక్టరు లేని చోట’, ‘రక్తం కధ’ – అనువాదాలు ఉన్నాయి.
‘డా. ఆలూరి విజయలక్ష్మి రచనలు’ అను అంశంపై నాగార్జున యూనివర్సిటీ తెలుగు విభాగం విద్యార్ధిని పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎమ్.ఫిల్. డిగ్రీ పొందారు.
డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి అనేక సుప్రసిద్ధ సాహితీ సంస్థల నుండి, సామాజిక సంస్థలనుండి ఎన్నో సాహితీ పురస్కారాల్ని, సామాజిక సేవా పురస్కారాల్ని పొందారు.
తెలుగు పాఠకులకు డాక్టర్ విజయలక్ష్మిగారు ఇచ్చిన మరో వినూత్న కానుక – ‘మాతృత్వం : ప్రసూతి సమస్యలు – సలహాలు’. ఈ పుస్తకం గతంలో అశేష పాఠకుల ఆదరణపొంది పలు ముద్రణలు పొందింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మరెన్నో మార్పులు, చేర్పులతో కూడిన పరిస్కృత ముద్రణ.
– ఆలూరి విజయలక్ష్మి
-
-
Navala Prajalu – నవల ప్రజలు
₹100.00మానవజాతి చరిత్రలో ఎన్నో కొత్తకళలు (ఉదాహరణకు సినిమా) పుట్టాయి. కానీ ఇంతవరకూ ఏ కళకూడా పూర్తిగా నశించిపోలేదు. తన చైతన్యాన్నీ వాస్తవిక ప్రపంచంపట్ల తన సంవేదననూ అభివృద్ధి చేసే ఏ అంశాన్ని కూడా మానవుడు జారవిడుచుకోడు. నవల కొత్తకళేకావచ్చు. కానీ దాని వేళ్ళు సూదూరగతంలో ఉన్నాయి. ప్రాచీనగ్రంథాలైన ”టిమాల్కియోస్ బాంక్వెట్,” ”డాఫ్నీ అండ్ ఓలీ” వద్దనో, మరింత వెనక్కువెళ్ళితే సుప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్ (క్రీ.పూ.5వ శతాబ్దం) వద్దనో నవల చరిత్ర ప్రారంభమౌతుంది. కానీ స్వతంత్ర ఆధునిక సాహిత్య ప్రక్రియగా నవల మన నాగరికతకు సంబంధించింది మాత్రమే. సొంత నిర్మాణ సూత్రాలను కలిగి, అందరిమెప్పునూ, ఆమోదాన్ని పొందిన సాహిత్య ప్రక్రియ అయిన నవల మన నాగరికతకు – మరీ ముఖ్యంగా ముద్రణా యంత్రయుగానికి చెందిన వస్తువే.
సాహిత్యంలో కొద్దిభాగం మాత్రమే వాస్తవికత. ఈ సూత్రం నాటకానికి కూడా వర్తిస్తుంది. అంతమాత్రంచేత కళగా నాటకానికున్న ప్రత్యేక గాంభీర్యాన్ని కాదంటున్నామని భావించకూడదు. నవల కేవలం కల్పనాత్మకమైన వచనం మాత్రమేకాదు. అది మానవ జీవితానికి సంబంధించిన వచనం. మానవుణ్ణి మొత్తంగా తన పరిధిలోకి తీసుకొని, అతణ్ణి సంపూర్ణంగా చిత్రించటానికి ప్రయత్నించిన మొట్టమొదటి కళారూపం నవల. మానవుడి రహస్య జీవితాన్ని దృశ్యమానం చేయగలిగిన శక్తి నవలకు ఉంది…..