-
Ardha Nari
₹320.00పితృస్వామ్య దృక్పధం పై యుద్ధం ఈ అర్ధనారి
జి. లక్ష్మీనరసయ్య
బండి నారాయణస్వామి రాసిన ఐదో నవల అర్ధనారి. గత నాలుగు నవలల్లో నాలుగు విభిన్న ఇతివృత్తాలను డీల్ చేశాడు. గద్దలాడతండాయి నవలలో దళిత బహుజన సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని పునాది దృష్టి నుంచి చూపాడు. మీరాజ్యం మీరేలండి దళిత బహుజన రాజకీయ చూపుతో వచ్చిన నవల. రెండు కలల దేశం పీడితకుల ప్రజల తాత్వికతను వెల్లడించింది. శృభూమి 18వ శతాబ్దపు రాయలసీమ చరిత్రలోని దళిత బహుజన ఘట్టాల్ని ముందుకు తెచ్చింది. ప్రస్తుతం మన ముందున్న అర్ధనారిలో ట్రాన్స్ జెండర్ వాస్తవికత గురించి బహుముఖ చిత్రణ ఉంది. తెలుగు నవలలో ఈ వస్తువును ఇంత వివరంగా లోతుగా డీల్ చేయడం ఇంతకుముందు జరగ లేదు. ఈ వస్తువుకు సమాంతరంగా పడుపువృత్తిని గురించిన మరో కథనం కూడా ఇందులో నడిచింది. రెండు సమస్యల వెనకా ఉన్న పితృస్వామిక సమాజాన్ని విస్తార విశ్లేషణకు గురిచేయడం ఉంది. ట్రాన్స్ జెండర్ ప్రపంచాన్ని రమణి ఉరఫ్ చంద్రన్న జీవితం ద్వారా నిర్మించుతూ పడుపు వృత్తి వాస్తవికతను రామలక్ష్మి పాత్ర ద్వారా చూపాడు. దిగువ మధ్యతరగతి బహుజన వ్యవసాయ కుటుంబానికి చెందిన చంద్రన్న అనే యువకుడు రమణిగా పరిణమించిన క్రమంలో కుటుంబం నుంచి, సమాజం నుంచీ, ప్రభుత్వం నుంచి నిరాదరణకు గురై అవమానాల్నీ, హింసనీ, వివక్షనీ, వంచననీ అనుభవించిన తీరు సమంజసంగా చిత్రించాడు రచయిత. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్ వ్యవస్థ నిర్మాణాన్ని అందులోని ఖాదాన్ లనూ, గురువులనూ, నానీలనూ, చేలాలను వారి జీవన విధానాన్ని రోజువారీ…………
-
Gaddaladatandayi
₹200.00ఈ నవలను చదవటం ఏ పాఠకుడికైనా తన సామజిక జీవితానుభవాన్ని విస్తృతపరుస్తుందని నా నమ్మకం. ఈ నవలకు కేంద్రం ఒక చిన్నపల్లె అయినప్పటికీ, దాని పరిధి దేశమంత విస్తృతమైనట్టిది. కొన్ని నదుల నీళ్ళు ఒక జలాశయంలో ఇమిడినట్టుగా, ఎన్నో సాంఘిక , ఆర్ధిక రాజకీయ సవ్యాపసవ్య సందర్భాలు ఈ నవలలో ఎంతో చిక్కగా, కుదురుగా ఇమిడి వుండటం, రచయిత శిల్పప్రతిభకు పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. ఇందులోని ప్రతి వాక్యం వెనుకా, వెన్నాడుతున్నట్టుగా రచయిత గొంతుక ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. మన సామజిక జీవితం ఎంత భీభత్సంగా ఉందొ, మానవ సంబంధాలు గానుగలో పిప్పిలా ఎలా పిండీకృతం అవుతున్నాయో’ ఎంతో భయానకంగా, రౌద్రంగా, వర్ణించి చూపెడుతుంది ఈ నవల. మౌఖిక సంప్రదాయాన్ని రచయిత పాటించడం ద్వారా పాఠకుడిని తల ప్రక్కకు తిప్పనివ్వకుండా నిమగ్నం చేయటం ఈ నవల రచనలో రచయిత సాధించిన అద్భుత శిల్ప ప్రయోజనం – పాత్రలూ, జీవితమూ, భాషా, యాసా, సన్నివేశ కల్పనా, విమర్శనాపూర్వక వాస్తవికత, రచయిత కంఠస్వరం, ప్రయోజన దృష్టి, యిలాంటివన్నీ ఒకే కూర్పులో కలిసిపోవటం ద్వారా, ఈ నవల సాధారణ పాఠకుడి నుండి నద్విమర్శకుని వరకూ హృదయగతమవుతుందని నేను గాఢంగా నమ్ముతున్నాను.
-
Mee Rajyam Meerelandi
₹200.00బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప
హిందువు కాడంటేనేను హిందువును కాను
నాస్తికుడైతే తప్ప
కమ్యూనిస్టు కానేరడు అంటే
నేను కమ్యూనిస్టును కాను
అవినీతిని తాత్వికరించుకున్న దొంగలరాజ్యమ్ లో
ఆ దోపిడీ స్వభావపు పాలనాధికారమ్ కోసమే
తమ దళిత రాజకీయాలూ ఉన్నాయంటే
నేను దళితవాదిని కాను.
భిన్న భిన్న ప్రాంతాల వివిధాత్మక జీవితాన్ని
గుర్తించి ఆమోదిస్తే తప్ప
నేను ప్రతియా తాత్వికుణ్ణి కాలేను.
-