YOU MAY ALSO LIKE…
-
Prema Lekhalu|ప్రేమ లేఖలు-చలం
₹275.00
-
Robin Hood
₹200.00
-
Palapitta Katha-2025-Vilakshana Kathala Sankalanam
₹200.00
-
Odyssey ( Homer)
₹250.00
Showing 1–12 of 46 resultsSorted by latest
Bhinnamga Undataniki Sahasinchandi Sampannuluga Yedagandi
₹225.00‘భిన్నంగా ఉండటానికి సాహసించండి సంపన్నులుగా ఎదగండి’ అనే ఈ పుస్తకం’ త్వరగా ధనవంతులు అవండి’ అనే మరో కరదీపికలాంటిది కాదు. ఇది ఒక వ్యావహారిక జ్ఞానంతో ఆలోచనలని రేకెత్తిస్తూ 150 ఏళ్ళ సాంస్కృతిక, వాణిజ్య చరిత్రలోకి చేసే ఒక యాత్ర. దీన్నిండా ఎన్నో ఉపయోగకరమైన సలహాలూ, ఆసక్తిదాయకమైన వాస్తవాలు, వినోదాన్ని పంచే వృతాంతాలు ఉన్నాయి. ఈ పుస్తకం కాలిఫోర్నియాలో బంగారం గనుల కోసం అన్వేషణ కొనసాగించిన కాలం నుంచి యుద్దకాలంలోని బెర్లిన్ నంగరం దాకా వెళ్లి, మళ్ళీ ఈనాటి సిలికాన్ వ్యాలీ వరకూ వస్తుంది. డిస్నీల్యాండ్ నుండి సౌది అరేబియాకీ, లీవై స్ట్రాస్ నుంచి స్టార్ బక్స్ కాఫీ దాకా, జాన్ డి రాక్ఫెల్లర్ చమురుబావుల నుంచి వారెన్ బఫెట్ ఒమాహ దాకా మనల్ని తీసుకుపోతూ, అన్ని రకాల ప్రతికూల పరిస్థితులనీ ఎదుర్కొంటూ విజయం సాధించాలనే పట్టుదల, మరింత ఎత్తుకి ఎదిగే ప్రయత్నం చేసే స్త్రీ పురుషుల కధలని మనసుకి ఆకట్టుకునేలా రచయిత చెబుతాడు.
వాణిజ్యవేత్తలైన స్త్రీ పురుషులు, ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, సుప్రసిద్దులైన స్టీవ్ జాబ్స్, కోకో షనేల్, ఆర్నాల్డ్ స్వాజినేగర్ లాంటి వారి విజయగాధలను ప్రస్తావిస్తూ, జీవితంలో కొద్దోగొప్పో (లేక ఏమాత్రం)సాఫల్యం సాధించని అధికశాతం జనానికీ ఈ విజేతలకీ మధ్య ఉన్న తేడా కేవలం ఎక్కువ సంపద ఉండడం వల్ల మాత్రమే కాదని ఈ పుస్తకం విశదీకరిస్తుంది. విజయానికి అవసరమైన ఒక స్పష్టమైన తాత్వికతని అందిస్తుంది. కలలుకనే సాహసం చెయ్యగలవారందరి కోసం రాయబడిన పుస్తకం.
Saanukula Aalochana Sakthi – The Power of Positive Thinking
₹200.00ఇంటర్ నేషనల్ బెస్ట్ సెల్లర్
ప్రపంచ ప్రసిద్ది పొందిన The Power of Positive Thinking పుస్తకమును ‘సానుకూల ఆలోచన శక్తి’ గా తెలుగులోకి తీసుకువచ్చారు.
లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాలను విజయవంతం చేసుకోవడానికి సహాయపడింది ది పవర్ అఫ్ పాజిటివ్ థింకింగ్. అనూహ్యమైన అమ్మకాలు సాధించిన ఇందులో డాక్టర్ పీల్ ఆచరణలో విశ్వాసం యొక్క శక్తిని నిరూపిస్తారు. ఈ పుస్తకంలో వివరించిన ఆచరణీయ కిటుకులతో మీరు మీ జీవితంలో బలం పుంజుకోవచ్చు. పైగా మీ కోరికలను, ఆశలను నేరవేర్చుకోవటానికి అవసరమైన ఉపదేశాన్ని పొందవచ్చు. మీరు నేర్చుకోనేవి :
. మీ మీద ,మీరు చేసే ప్రతిదాని మీద నమ్మకం పెంచుకుంటారు.
. గొప్ప శక్తిని, పట్టుదలని పెంచుకుంటారు.
. మీ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తి పెంచుకుంటారు
. చింతపడే లక్షణాన్ని పోగొట్టుకుని విశ్రాంతికరమైన జీవనాన్ని సాధిస్తారు.
. మీ వ్యక్తిగత, వృత్తిపర సంబంధ బాందవ్యాలని మేరుగుపరుచుకుంటారు.
. మీ పరిస్థితుల మీద అధికారం పొందుతారు.
. మీ మీద మీరు దయగా ఉంటారు.
పాఠకుడు ఆనందమైన, తృప్తికరమైన,ప్రయోజనకరమైన జీవితాన్ని సాధించడానికి తోడ్పడాలన్న ఏకైక లక్ష్యంతో రాయబడింది ఈ పుస్తకం.
……. నార్మన్ విన్సెంట్ పీల్
Dabbu Oka Shakthi Pravaham Part 1 & 2
₹900.00డబ్బు అంటే ఏమిటి?
‘డబ్బు’ ఇది ఏమాత్రం పరిచయం అవసరంలేని పదం. ప్రపంచంలోని ప్రతిఒక్కరూ (ఆత్మజ్ఞానులు తప్ప మిగిలిన అందరూ కొంచెం ఎక్కువగానో, తక్కువగానో అందరూ డబ్బుకోసం పరుగులు పెట్టేవారే, ప్రయత్నం చేసేవారే, చింతించేవారే.
మరి అందర్నీ ఇంతగా ప్రభావితం చేస్తున్న ఈ డబ్బు గురించి మనకు తెలుసా? అసలు ‘డబ్బు’ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏమిటో
“ఇది కూడా ఒక ప్రశ్నేనా… డబ్బంటే ఏంటో తెలీదా” అని అనుకుంటున్నారా? అయితే చెప్పండి.
దీనికి వివిధ రకాల సమాధానాలు రావచ్చు. ఎవరి జవాబు ఎలా ఉన్నా, మనలో చాలామందికి ‘డబ్బు’ అంటే ఏమిటో స్పష్టంగా తెలీదు. విచిత్రమేమిటంటే, మనకు తెలియదని కూడా మనకు తెలీదు! ‘డబ్బు’ అంటే ఏమిటో మనకు సరిగా అర్థంకాకపోయినా, మనకు తెలుసుననే భ్రమలో దానివెనక దానికోసం పరుగులు పెడుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఇన్ని తంటాలు!
సరే, మళ్ళీ మన ప్రశ్న దగ్గరకొద్దాం. డబ్బు అంటే ఏమిటి? సాధారణంగా చాలామంది అనుకునేది, డబ్బంటే మనం రోజూ చూసే (లేదా) ఖర్చుపెట్టే కాగితపు డబ్బు లేదా నాణేలు అని. కానీ అది డబ్బు కాదు! దానిని “కరెన్సీ (Currency)” అంటారు. లేదా ద్రవ్యము, నగదు అని అంటారు. అయితే మరి డబ్బు అంటే ఏమిటి?
వివిధ స్థాయిలలో డబ్బు యొక్క అసలైన అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ఊహాత్మక కథ సహాయంతో మన ప్రయత్నం మొదలు పెడదాం.
బాగా ధనవంతుడైన ఒక కోటీశ్వరుడున్నాడనుకుందాం. అతను ఒకసారి వ్యాపారరీత్యా ఏ అండమాన్ నికోబర్ దీవులకో వెళ్ళాడు అక్కడ ఒక హోటల్లో బస చేశాడు. తిరిగి బయలుదేరేటప్పుడు హోటల్ బిల్ కట్టడానికి తన క్రెడిట్ కార్డును ఉపయోగించాడు. అయితే ఏదో సాంకేతిక లోపం వల్ల (because of some technical problem) అక్కడ అప్పుడు ఎలాంటి లావాదేవీ యంత్రాలు…………
Pipe Line Kadha
₹195.00అనగనగా ఒకనాడు పాబ్లో, బ్రూనో అనే ఇద్దరు యువకులు ఇటలీలో ఒక గ్రామం లో పక్కపక్కనే నివసించేవారు. వారు వరసకు అన్నదమ్ములు అవుతారు. ఇద్దరూ మంచి స్నేహితులు.
వారు కనే కలలు కూడా చాల పెద్దవి.
ఎదో ఒకనాడు ఎలాగో ఒకలా ఆ గ్రామంలో అందరికంటే ధనవంతులు కావడం గురించి వారి నిర్విరామంగా మాట్లాడుకునేవారు. ఇద్దరు తెలివైనవారు, కష్టపడి పనిచేస్తారు. వాళ్లకు కావాల్సింది ఒక అవకాశం మాత్రమే.
ఒక నాడు ఆ అవకాశం వారిని వరించింది. దగ్గర్లో ఉన్న నదినుంచి గ్రామంలో ఉన్న ఒక పెద్దతొట్టికి నీరు చేరవేయటానికి ఇద్దరు మనుషులను వినియోగించాలని ఆ గ్రామం నిశ్చయించింది. ఉద్యోగం పాబ్లో, బ్రునోలను దొరికింది. తరువాత ఎం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.
-బర్కి వాడ్జెస్.