YOU MAY ALSO LIKE…
-
Prema Lekhalu|ప్రేమ లేఖలు-చలం
₹275.00
-
Robin Hood
₹200.00
-
Palapitta Katha-2025-Vilakshana Kathala Sankalanam
₹200.00
-
Odyssey ( Homer)
₹250.00
Showing all 10 resultsSorted by latest
Cinima Musings
₹225.00The Great Beauty
ఈ చిత్రంలో అరవై ఐదేళ్ల Jep Gambardella ఒక రాత్రి తనకు బాగా పరిచయం ఉన్న అమ్మాయితో casual sex అనంతరం బెడ్ మీదే కూర్చొని తీరిగ్గా సిగరెట్ తాగుతుంటాడు. “You didn’t seem to enjoy it much. You didn’t seem to care” అంటుంది ఆమె. “It was okay” లాంటి కామెంట్ ఏదో చేసి పెద్దగా ఆమెను పట్టించుకోడు Jep. వెంటనే ఆమె మీద బోర్ కొట్టి అక్కడి నుంచి వచ్చేస్తాడు కూడా. సినిమాలో తర్వాత తనకు బాగా నచ్చిన అమ్మాయి Ramona పక్కనే ఒక రాత్రంతా కబుర్లు చెబుతూ పడుకుని, ఉదయం “It feels good to not make love” అంటాడు. అతను impotent కాదు, శృంగారం మీద ఏవగింపూ లేదు. నిజానికి దశాబ్దాల పాటు రోమ్ లోనే ఉంటూ నైట్ పార్టీల్లోనే సగం జీవితం గడిపి ఎందరో అందగత్తెలతో రసవత్తరమైన జీవితాన్ని పూర్తిగా అనుభవించిన రసప్రియుడే ఇతను. కానీ ప్రస్తుతం అతనికి ఏమీ రుచించడం లేదు. ఉన్నపళంగా చప్పగా కనిపిస్తున్న జీవితంలో అతనికి నిరాసక్తతే తప్ప అందం కనబడ్డం లేదు.
చుట్టూతా చూస్తే అందం ఎక్కడ లేదు? రోమ్ నగరాన్ని పల్చటి పొరలో చుట్టేసిన వెన్నెల రాత్రిలో లేదా ? ఆ ఖరీదైన గుండ్రటి విద్యుద్దీపాల మసక వెలుతురులో transparent డ్రెస్సులో మంద్ర సంగీతానికి మత్తుగా ఊగుతున్న ఆ super model శరీర లయలో లేదా? ఆ రద్దీ నగరపు గుండె గదుల్లో నిద్రపోతున్న మధ్యయుగాల…………….
Screenplay Direction
₹150.00మన తెలుగులో సినీ పరిజ్ఞానం గూర్చి తెలుసుకోవాలనుకున్న వారికి పుస్తక రూపంలో ఏ సమాచారమూ లభించదు. ఈ లోపం చిత్ర రంగ ప్రారంభదశ నుండి మనలను వెంటాడుతూనే ఉంది. కారణమేమిటంటే మొదటి నుండి మనకున్న సాంకేతిక నిపుణులు వాళ్ళ అనుభావాలను గ్రంథస్తం చేయలేకపోయారు. అనుభవజ్ఞుడు వ్రాయలేడు. వ్రాయగలిగిన వారికి సాంకేతిక నైపుణ్యం తెలియదు. ఈ ఇబ్బంది వలన మన తెలుగు సినీ రంగంలోని దర్శకులు, సాంకేతిక నిపుణులు తమ అనుభవాలను తమలోనే అణచివేసుకున్నారు.
నేను ‘నటసోపానం’ అనే నట సాంకేతిక సిద్ధాంత గ్రంథం వ్రాసిన తరువాత చాలా మంది మిత్రులు మన తెలుగులో స్క్రీన్ ప్లే, దర్శకత్వం గూర్చిన సమాచారం ఇసుమంతైనా లేదు. ఆ కొరత తీర్చగల్గే బాధ్యత తీసుకోమని నన్ను ప్రోత్సహించడంతో ఈ చిన్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాను. కళా రంగంలో తమ కలలను సాకారం చేయదలచుకొన్న వారు తప్పని సరిగా నటసోపానం చదివి తీరాలి. ఎందుకంటే అందులో కళలకు సంబంధించిన సమస్త సమగ్ర సంపూర్ణ సమాచారం వాదించిన విస్తరిలా ఉంది. ఒక నటుడు జీవితాంతం శ్రమపడి నేర్చుకున్న అనుభవసారం కంటే ఒక్క నటసోపానం, ఎన్నో రెట్లు గురువు రూపంలో మీకు సాంకేతిక సంస్కారం బోధిస్తుంది ఇది వాస్తవం.
ఈ చిన్న పుస్తకంలో రెండు గొప్ప విషయాల గురించి వివరించడం జరిగింది. ఒకటి స్క్రీన్ ప్లే, రెండు డైరెక్షన్. ఈ భాగాలలో పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించలేనివాడు కథను ప్రేక్షకామోదంగా చిత్రించలేడు. చిత్ర రంగంలో నాకున్న అనుభవం కొంచమేనని చెప్పలేను. అపారమని అంతకన్నా చెప్పలేను. కాని నేను రచించిన ఈ చిన్న పుస్తకం వర్ధమానులను ఉత్తమ విలువలు గల స్క్రీన్ ప్లే రైటర్స్ గా, డైరెక్టర్స్ గా తీర్చి దిద్దగలదని క్లాప్ కొట్టి మరీ చెప్పగలను.
Screen Play_Vanda Satyalu
₹300.00ఆశంస
ఎందరో మహాను భావులు. అందరికీ వందనాలు. ‘స్క్రీన్ ప్లే’ అన్న మకుటంతో కదన రచనలో వచ్చే సమస్యలేమిటి అనే విషయంపై, నూతనంగా చలన చిత్ర కథలు, సంభాషణలు, కథన రచనలో పాల్గొనే ఎందరో అధునాతన రచయితలు, సినిమా రచన చెయ్యాలని అభిలషించే యువతీ యువకుల కోసం, ఈ గ్రంథం రచించాలన్నది ఏనాటి నుంచో నా మనసులో పాతుకుపోయిన ఆకాంక్ష.
దాని కోసం అమెరికా వెళ్ళినప్పుడు చాలా ‘హాలీవుడ్ స్క్రీన్ ప్లే’ గ్రంథాలు కొని తీసుకు రావటం జరిగింది. 2007వ సంవత్సరం నుంచి తెలుగు విశ్వవిద్యాలయంలో “స్క్రీన్ ప్లే’ తరగతులు నిర్వహించి, తెలుగు సినీ రచయితల సంఘం పక్షాన కూడా ‘స్క్రీన్ ప్లే’ తరగతులు నిర్వహించడం జరిగింది.
అంతే కాకుండా రాఘవేంద్రరావు గారు, ఎ. కోదండరామిరెడ్డి గారు, బి. గోపాల్ గారు ఇలా ఎంతో మంది దర్శకులను ‘షూటింగ్ స్పాట్ లో గమనించి కొన్ని స్క్రీన్ ప్లే వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది.
బొబ్బిలి బ్రహ్మన్నలో ఒక షాట్ తీసినప్పుడు ఇలా ఎందుకు చేసారు అని అడిగితే అభినయానికి విలువనిచ్చి అని చెప్పారు. అలాగే శారదగారి పాత్ర కూతురు ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు తలుపు తీసే షాట్లో ఎదురుగా కృష్ణంరాజు గారు కనిపించాలిగదా అంటే అది జనం ఊహిస్తారు. అందుకని కెమెరా లోపల పెట్టి తలుపు తియ్యగానే సజెషన్లో హీరో నిలబడి వుంటాడు. అతని అభినయం తెలిసిపోతుంది. అతను బాధగా ఉన్నాడా? కోపంగా ఉన్నాడా అనేది. తలుపు తెరిచి చూడగానే కట్రాయిలా నిలబడ్డ భర్తను చూసి వెనకడుగు వేస్తే, ఆమెకు గుండెఝల్లు మంది అన్న ఎక్స్ ప్రెషన్ ‘ఆడిటోరియా’నికి తెలుస్తుంది అన్నారు. ఇలా ఆయనను ఎన్నో సినిమాలలో చిన్న………….
Anaganagaa Ok Cinema
₹200.00జననం – ప్రాధమిక విద్యాభ్యాసం మచ్చబొల్లారం.ఇంటర్ వరకు బొల్లారంలో చదివి, సికిందరాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో బి.కాం. చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీ, ఆంధ్రసారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో గ్రంధాలయ సమాచార శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాను. సాంకేతిక విశ్యాసఖలో గ్రంథపాలకుడిగా పంపికయి హైదరాబాద్ లోని పాలిటెక్నీకల్ లో ఇరవయుదేళ్ళుగా పని చేసి, 2014 లో పదవి విరమణ పొందారు.
ప్రాస్తుతం పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాహిత్యం, సినిమాలు, అభిమాన వ్యాపకాలు. హాలీవుడ్ సినిమా, కథావలోకనం, తెలుగులో మారుపేరు రచయితలు, కథావిష్కరం పుస్తకాలను వెలువరించారు. అయుదు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. తెలంగాణ తొలితరం – మలితరం కథకులు: కథనరీతులు, నాటక విమర్శ, సాహిత్య వ్యాసాలు పుస్తకాలుగా రానున్నాయి.
Varma Mana Karma The Passion Of RGV
₹150.00Cinema Kadhalu
₹225.00ఈ భూమి మీద పుటిన ప్రతి జీవి తన పరిణామ క్రమంలో ముందుకు సాగుతూ తమ జాడలను వదిలివెళ్తుంది. కానీ మనిషి వేరు. సాహిత్యం, సంగీతం, చిత్రకళ, చలనచిత్రం, శిల్పకళ లాంటి ఎన్నో కళారూపాలతో ఈ భూమి మీద తన ఉనికిని ప్రత్యేకం చేసుకున్నాడు. కళలే లేని మానవ చరిత్రని ఉహించగలమా? అటువంటి కళల్లో అన్నింటికంటే సరికొత్తది చలనచిత్రకళ. ఎన్నో శతాబ్ధాలుగా ఏదుగుతూ వచ్చిన కళారూపాలను తనలో ఇముడ్చుకొన్న శక్తివంతమైన మాధ్యమం చలన చిత్రం. వందేళ్ల క్రితం మొదలై తనకై తనగా అభివృద్ధి చెందుతూ, మిగితా కళారూపాలనుంచి స్ఫూర్తి పొందుతూ కొత్తకొత్త రూపాలను సంతరించుకుంటూ వస్తున్న ఈ కళకు, సాహిత్యంలో ఏంతో అవినాభావ సంబంధం ఉంది. మొదట్నుంచి కూడా సాహిత్యమే సినిమాకు ముడిసరుకు. సాహిత్యంలో గొప్పవిగా బావించబడ్డ ఎన్నో కధలు, నవలలు చలనచిత్రాలుగా రూపొందాయి.
-వెంకట్ శిద్ధారెడ్డి.
Cinema Oka Alchemy
₹230.00అత్యంత ఆధునిక కళాప్రక్రియగా రూపొందిన సినిమా తన సంస్కరణవాడ, గ్రామీణ మూలాల నుంచి వేరుపడి ఇవాళ అది పూర్తి వ్యాపారాత్మకమైంది. నాటకరంగం విషాదంగా నిష్క్రమిస్తున్న వేళ, సినిమా వేయిపడగలు విప్పి హోరెత్తుతోంది. ఆధునిక వ్యాపారవేత్తలు, మాఫియా కలాపోశాకులుగా తల ఎత్తాక.. ఈ రంగం నుంచి ఇంకా ఏమైనా ఆశించగలమా? హరిపురుషోత్తమ రావు అన్నట్లు ‘యథాపాలకవర్గం, తథాసాంస్కృతిక రంగం.’
ఈ ప్రధాన స్రవంతికి భిన్నంగా ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమా కొత్త ఆశలతో చిగురిస్తోంది. మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాల సమాహారమే వెంకట్ సిద్దారెడ్డి వెలువరించిన దృశ్యమాలిక ‘సినిమా ఒక ఆల్కెమీ.’
Amma (Maxim Gorki)
₹300.00“గోర్కిని నేను వ్యక్తిగతంగా ఎరుగుదను. యూరోపియన్ రచయితల్లో ప్రజ్ఞావంతుడైనట్టి, ఘనుడైనట్టి రచయితగానే కాకుండా బుద్ధిశాలి, దయాళుడు, సానుభూతిపరుడైన మానవుడిగా కూడా నేనతన్ని అభిమానిస్తాను”.
– లియో టాల్ స్టాయ్ డైరీ నుండి.
“గోర్కి ప్రతిభా భాండారానికి ఒకటే పేరు – సత్యం”
– సైఫాన్ జ్వైగ్.
“నూతన సారస్వత పతాకపైన చిత్రించి వుంది – గోర్కి హృదయం. మరి ఈ హృదయంలో వుంది – సర్వ ప్రపంచ శాంతి.”
– కృష్ణచంద్ర
విశ్వ విఖ్యాత రష్యన్ రచయిత, సుప్రసిద్ధ రచనా విజ్ఞానవేత్త మక్సీమ్ గోర్కి (1868 – 1936) నవల “అమ్మ” తెలుగు పాఠకుల అపారాభిమానాన్ని చూరగొంది. ఈ నవలను చదివి కమ్యునిస్టులైన వాళ్ళు ఎంతోమంది వున్నారు. ఈ అభిమానాన్ని పురస్కరించుకొని తిరిగి ఈ నవలను వెలువరించారు.
– రచయిత గురించి
Sweet Home
₹200.00Sint magnam sed optio est ut. Rerum facilis eos voluptatum non. Eius asperiores nulla amet.