-
Rangula Cheekati Kathalu – రంగుల చీకటి కథలు
₹100.00ఈ కధల్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇండ్ల చంద్రశేఖర్ అనే రచయితని నేను ఎరగను. అతడి కధల్ని నేను చదవలేదు. కొన్ని అంతర్జాల పత్రికల్లోనూ, రెండో మూడో ఆదివారం దిన పత్రికల్లోనూ వచ్చినట్లుంది. అతడు ఎలా ఉంటాడో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. ఏ ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నాడో తెలీదు. ఏ జీవితాన్ని తెలుగు పాఠకుల కళ్ళ ముందు బొమ్మ కటిస్తున్నాడో తెలీదు. మొత్తం మీద పన్నెండు కధలు నా చేతిలోకొచ్చి చేరేయి. ఆఫీసు పని వత్తిది, ఇటీవల కాలపు సమస్యలు – కధల్ని ఒక్కొక్కటి చదివేసరికి నెల – ఈ నాలుగు మాటలు రాయడానికి మరికాసిన రోజులు –
చంద్రశేఖర్ ది ఒంగోలు పక్కనుండే కందులూరు పల్లె నుంచి వచ్చిన వాడు. హైదరాబాద్ లో స్థిరపడినట్టుంది. ఈ కధల్లో చిత్రించిన వాతావరంణం, జీవితం, నా ముందు రూపు కట్టిన అనేక పాత్రలు, జీవితం చుట్టూ అల్లుకున్న సమస్త భావోద్రేకాలు – ఈ కధలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి కలల్లో నడిపిస్తాయి, సెంటిమెంటుని పండిస్తాయి, వీర ఆగ్రహాన్ని, ఆవేశాన్ని రగిలిస్తాయి.
-చంద్రశేఖర్ ఇండ్ల.
-
Simhaavalokanam – సింహావలోకనం
₹120.00సింహావలోకనం – మూలం : యశ్‌పాల్, అనువాదం : ఆలూరి భుజంగరావు
సింహావలోకనం …. ఈ దేశ ప్రజలకు మానవోచితమైన జీవితాన్ని – జీవనాన్ని, స్వేచ్ఛా – స్వాతంత్య్రాలనూ సమకూర్చడం కోసం నిరంతరం సంఘర్షపథంలో రక్తతర్పణం గావిస్తూ విప్లవాన్ని ఆవాహనం చేస్తున్నాం! – యశ్‌పాల్
ప్రజల జీవితాన్ని, జీవనాన్ని – కలుషితం చేస్తూ, పాలకవర్గాలు, వారి తొత్తులూ దోపిడి, అణచివేతల్నూ, నిరంతర హత్యల్నూ, దొంగ ఎదురు కాల్పుల్నూ సాగిస్తూ విప్లవ పోరాటాల్ను రక్తపుటేరుల్లో ముంచడంతోపాటు వంచనా శిల్పంతో ప్రజల మేధస్సులు విభ్రమింప చేయ ప్రయత్నిస్తున్నంత కాలం ఈ దేశానికి – సింహావలోకనం – ప్రాసంగికమే. – ఆలూరి భుజంగరావు