-
Anaganaga oka cinema
0₹200.00జననం – ప్రాధమిక విద్యాభ్యాసం మచ్చబొల్లారం.ఇంటర్ వరకు బొల్లారంలో చదివి, సికిందరాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో బి.కాం. చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీ, ఆంధ్రసారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో గ్రంధాలయ సమాచార శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాను. సాంకేతిక విశ్యాసఖలో గ్రంథపాలకుడిగా పంపికయి హైదరాబాద్ లోని పాలిటెక్నీకల్ లో ఇరవయుదేళ్ళుగా పని చేసి, 2014 లో పదవి విరమణ పొందారు.
ప్రాస్తుతం పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాహిత్యం, సినిమాలు, అభిమాన వ్యాపకాలు. హాలీవుడ్ సినిమా, కథావలోకనం, తెలుగులో మారుపేరు రచయితలు, కథావిష్కరం పుస్తకాలను వెలువరించారు. అయుదు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. తెలంగాణ తొలితరం – మలితరం కథకులు: కథనరీతులు, నాటక విమర్శ, సాహిత్య వ్యాసాలు పుస్తకాలుగా రానున్నాయి.
-
-
Cinema Oka Alchemy
0₹300.00అత్యంత ఆధునిక కళాప్రక్రియగా రూపొందిన సినిమా తన సంస్కరణవాడ, గ్రామీణ మూలాల నుంచి వేరుపడి ఇవాళ అది పూర్తి వ్యాపారాత్మకమైంది. నాటకరంగం విషాదంగా నిష్క్రమిస్తున్న వేళ, సినిమా వేయిపడగలు విప్పి హోరెత్తుతోంది. ఆధునిక వ్యాపారవేత్తలు, మాఫియా కలాపోశాకులుగా తల ఎత్తాక.. ఈ రంగం నుంచి ఇంకా ఏమైనా ఆశించగలమా? హరిపురుషోత్తమ రావు అన్నట్లు ‘యథాపాలకవర్గం, తథాసాంస్కృతిక రంగం.’
ఈ ప్రధాన స్రవంతికి భిన్నంగా ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమా కొత్త ఆశలతో చిగురిస్తోంది. మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాల సమాహారమే వెంకట్ సిద్దారెడ్డి వెలువరించిన దృశ్యమాలిక ‘సినిమా ఒక ఆల్కెమీ.’
-
Cini Katha
0₹275.00డా. పాలకోడేటి సత్యనారాయణరావు
ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్నెన్నో మైలురాళ్లు. ఈనాడు మనం చూస్తున్న సినిమా ఒక్కరోజులో రూపు దిద్దుకున్నదీ కాదు, ఒక్క వ్యక్తివల్ల సాధ్యమయిందీ కాదు. నేటి మన సినిమా ఒకనాడు, వెలుగునీడలపట్ల మనిషి ఆసక్తితో ఆరంభం అయిందనీ, కేవలం కొన్ని ఫొటోలతో మొదలయిందనీ జ్ఞప్తికి తెచ్చుకుంటే, సినిమా పురోగతి అబ్బురం అనిపిస్తుంది. దేశవిదేశాలలో సినిమా పరిశ్రమ పురోగతిని పరిశీలించడం ఒక అద్భుతమయిన అనుభూతిని కలిగిస్తుంది. ఒక్కో అడుగుగా సినిమా పరిశ్రమ నడక – అనేక దిశలనుంచీ, బహుముఖంగా సాగింది. ఈ అడుగుజాడలను అనుసరిస్తూ ముందుకు సాగటం అనేకమందిలో ఆలోచనలనూ, గత వైభవ మధురస్మృతులనూ కలుగజేస్తాయి.
సినిమా వేసిన తొలి అడుగులనుంచీ, నేటివరకూ జరిగిన శాస్త్ర సాంకేతిక పురోగతినీ, ప్రపంచంలో విడుదల అయిన ఉత్తమ చిత్రాలనూ గుర్తు చేస్తూ, మనపై ఆ చిత్రాల ప్రభావాన్నీ వివరిస్తూ, కేవలం ఒక్క నిమిషం నిడివితో ఉండేలా – ఈటీవి సినిమా ఛానల్ కోసం రూపొందించిన కార్యక్రమం ‘సినీ కథ’.
ప్రతీ దినం – ఆ క్యాలండర్ తేదీనాడు సినిమారంగంలో ఏం జరిగిందీ అనేది … సినిమాప్రపంచవీక్షణంగా, ప్రధానంగా తెలుగు సినిమా చరిత్ర కేంద్రంగా, నాటి చరిత్రకు నేటి దర్పణంగా ఈటీవి ప్రేక్షకులముందుకు వచ్చిన కార్యక్రమం ‘సినీ కథ’. ఈ కార్యక్రమం – 2017 డిసెంబర్ 1 నుంచి ధారావాహికంగా ప్రతిదినమూ ఈటీవి సినిమా ఛానల్లో ప్రసారం అవుతున్న విశిష్ట కార్యక్రమం ఇది. సినిమా చరిత్రను విభిన్నమైన దృష్టికోణంలో చూడదలిచేవారికి – ఇదొక వినూత్నమైన సమాచార విందుభోజనం. ఆరగించండి!!…………..
-
-
-
-
-
Vamsi Evo Konni Gurtukostunnayi
0₹600.00‘ఏవరినన్నా పెళ్లి చేసుకోవాలి ఈ నెలలో…
అనుకుంటా బజార్లో నడుస్తా వస్తున్న నాకు ఒంట్లో నలతగా ఉన్నట్టనిపించడంతో, హాస్పిటల్కెళ్తే తెలిసింది గర్భవతినని…’ అంటా రాయడం మొదలెట్టానో లేదో ఒక్క కుదుపుతో ఆగి మళ్లీ కదిలింది మేమెక్కినా రైలు.“నా పేరు కళ… పూర్తి పేరు జీవకళ…’
“నీ పేరేంటీ?”
“రూప.”
“పూర్తి పేరు చెప్పు?”
“సాధురూప.”…………
Features