YOU MAY ALSO LIKE…
-
Prema Lekhalu|ప్రేమ లేఖలు-చలం
₹275.00
-
Robin Hood
₹200.00
-
Palapitta Katha-2025-Vilakshana Kathala Sankalanam
₹200.00
-
Odyssey ( Homer)
₹250.00
Showing all 8 resultsSorted by latest
Taratarala Telugu Visheshamshalu & Sahityamshalu 1&2
₹320.00అందరికీ నచ్చే సుందర రచన
ముప్పై వసంతాల నాటి ముచ్చట్లతో ముందుమాటను ఆరంభిస్తాను. నాడు నేను ఉస్మానియా యూనివర్సిటి తెలుగు విభాగంలో పరిశోధక (పిహెచ్.డి) విద్యార్థిని. భాగ్యనగరంలో అది సాయంత్రం. నాలుగైదు కార్యక్రమాలైనా జరుగుతున్న బంగారపు రోజులవి. చిక్కడపల్లి ఈ సభల కీలక వేదిక. నావంటి నలుగురైదుగురు నవయువకులు దాదాపు ప్రతిరోజూ ఈ కార్యక్రమాలకు హాజరు కావడం రివాజు.
అప్పట్లో చీకోలు సుందరయ్య గారు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో “రంగ తరంగం” పేరుతో నగరంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల సమీక్షా కథనాలు వ్రాసేవారు. అంత స్పష్టంగా చెప్పలేను కానీ, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కృష్ణశాస్త్రి గారిమీద సిద్ధాంత గ్రంథం ఏదో ఆవిష్కరణసభ. ఆవిష్కరణ | కర్త సి.నా.రె. దిగ్గజాల వంటి కవులు, అనేకమంది సాహిత్యా భిమానులైన శ్రోతలు. సభ కిటకిటలాడుతున్నది. కొంతమంది చోటు దొరకక నిలబడ్డ పరిస్థితి. సి.నా.రె. ప్రసంగం సహజ సిద్ధమైన సభారంజకంగా సాగిపోతున్నది. మధ్యలో తన | ప్రసంగానికి కొంచెం విరామం ఇచ్చి “చూశారా ! ఈ కార్యక్రమం దిగ్విజయం | అయినట్టే లెక్క. మా మిత్రుడూ ప్రతిభావంతుడైన పాత్రికేయుడు చీకోలు | సుందరయ్య సైతం నిలబడే వార్త రాస్తున్నాడు” అన్నారు సి.నా.రె. అందరి దృష్టి సుందరయ్య గారి వైపు దిరిగితే సుందరయ్య గారి చూపు మాత్రం సి.నా.రె. ప్రసంగాన్ని సునిశితంగా వీక్షిస్తున్నది. ఆ రోజుల్లో సుందరయ్య ‘రంగ తరంగం ……..
Adhunika Andhra Kavitvam
₹600.00సెలవులు అయిపోయి బడులు తెరిచారని పిల్లలు ఏడుస్తారనే అనుకున్నానిన్నాళ్ళూ.. ఈ రోజు… తెలుగు మాట ని వదిలేసి. గేయాచార్యుడు స్వర్గం బడి లో తెలుగు నేర్పడం కోసం నిష్క్రమించాడని. తెలుగు జాతి ఏడవాల్సి వస్తుందని ఊహించలేదు. దేవుని కి నిద్ర పట్టడం లేదు అనుకుంటాను. ‘ లాలీ లాలీ ‘అని జోలలు పాడించుకోవాలనే. స్వార్థం అయి ఉంటుంది.. లేకుంటే ఈ వాగ్దేవుడీతో, వినయ విశారదుడితో ఆయన కేం పని? ఒక్క ఒక్క రోజు ఒక్క మాటైనా అనని నిగర్విని..మననుండి తీసుకెళ్ళాడు… ‘అణువూ అణువున వెలసిన దేవా’ అని కీర్తించడమే పాపమా?.. లోకంలో పాపమింకా పెరగాలి కాబోలు.. .’విశ్వంభరా’ తత్వం తో ‘భూగోళమంత మానవుడి’ పరిణామ రహస్యాలను తెనిగించి, ‘నీ ధర్మం, నీ సంఘం నువ్వు మరవద్దు’. అన్న మానవత్వ ప్రవక్త ని మన నుండి దూరమెందుకు చేస్తాడు? ‘మంచిని సమాధి చేస్తారా?’ అని మనల్ని దండించే మానవీయ మూర్తి ఇంకెవరున్నారు? ఈ దుర్వార్త తో రామప్ప నాగార్జున సాగర్ లు స్థాణువులైపోవా?. .ఓ వైశ్వానరా!- తేట తెలుగు తో. అటు అగ్ని కణాల్ని ఇటు తుహిన తుషారాల్ని కురిపించిన అభినవ కవితా సవ్యసాచీ! మేమింకా అలానే ఉన్నాం… మంచి ని సమాధి చేస్తూ… అంతరంగం లోకి కాకుండా, ఆకాశం వైపు మోరెత్తి చూస్తూ.. మరో మానవ మత ప్రవక్త కోసం ఎదురు చూస్తూ.. – :చిట్టేల. శ్రీధర్ కుమార్, సూళ్లూరుపేట
Idi Manava Samajamena
₹50.00మానవులు ఉన్నది, ‘మానవ సమాజమే’ అవుతుంది. అయితే, ఆ సమాజంలో ఉన్న తీరు తెన్నుల్ని చూస్తే, అడుగడుగునా, ‘ఇది మానవ సమాజమేనా?’ అనే ప్రశ్న రావలసి ఉంటుంది. సమాజంలో ఉన్న మొత్తం సమస్యల్లో, తక్షణం మొట్టమొదట పరిష్కారం కావలసిన కౄర సమస్య ఒకటి ఉంది. మానవుల మనస్సుల్నీ, మేధస్సుల్నీ, అతి కౄరత్వంలోకి ఈడ్చిన ఈ సమస్య, అట్టడుగు కులపు హిందూ స్త్రీ పురుషుల్నీ, అతి బీద స్థితిలో ఉన్న ముస్లిం స్త్రీ పురుషుల్నీ, కొన్ని తెగల ఆదివాసీ స్త్రీ పురుషుల్నీ, యజమానుల ఇళ్ళల్లో ఉండే పాయిఖానా దొడ్లలోని మలమూత్రాల్నీ తమ స్వంత చేతులతో ఎత్తివేస్తూ శుభ్రాలు చేసే ‘పాకీ చాకిరీ’కి కట్టిపడేస్తుంది!
‘పాకీ చాకిరీ’ అనే దాన్ని, రోడ్లని ఊడ్చే పని లాగానో, చచ్చిన జంతువుల్ని పాతిపెట్టే పని లాగానో, జమ కడితే, పాకీ పనిలో ఉండే బాధల్నీ, అవమానాల్నీ, దుఃఖాల్నీ, అర్ధం చేసుకునేదేమీ ఉండదు. ధనిక మానవుల ఇళ్ళల్లో కుక్కులూ పిల్లులూ ఉంటే, వాటి మల మూత్రాల్ని ఎత్తడం కూడా ఆ ఇంటి సేవకులైన బీద మానవుల పనే కదా?
మానవులు నివసించే సమాజాన్ని గురించి, ‘ఇది, మానవ సమాజమేనా?’ అని ప్రశ్నించుకోవచ్చునా? అటువంటి ప్రశ్న ఎందుకు వచ్చిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోండి..
– రంగనాయకమ్మ
Konni Kalaalu Konni Samayalu – కొన్ని కలాలు కొన్ని సమయాలు
₹280.00సమాజంలో ఎక్కడ ఏ కొద్దిపాటి అవకతవకలు జరిగినా ముందు కవులూ, రచయితలు స్పందిస్తారు. తమ స్వరాన్ని వినిపిస్తారు. వారి వల్ల, వారి అక్షరాల వల్ల విప్లవాలు, సంస్కరణలు, మేళ్ళు నేరుగా జరగకపోవచ్చు కాని, జనాన్ని చైతన్యవంతుల్ని చేయడంలో వారు ముందుంటారు. వారి అక్షరాలు ముందుంటాయి. సృజనకారులకు అడ్డుగోడలు పనికిరావు. వారు విశ్వమానవులు! మానవీయ విలువల్ని కాపాడుతూ వచ్చిన కొంతమంది సాహితీ మహనీయుల జీవితాల్ని, వారి సృజనాత్మక కృషిని ఈ పుస్తకంలో గుర్తు చేసుకోవడం జరిగింది. ఇందులో ఎకడమిక్ విభజనలేవీ లేవు. ఇందులో చేర్చని మహాకవులు, రచయితలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి గూర్చి నేను రాయకపోవడం వల్ల చేర్చలేకపోయాను. భవిష్యత్తులో రాయగలిగితే, మరో పుస్తకంతో పాఠకుల ముందుకొస్తాను. ఇందులో తెలుగు రచయితలు, భారతీయ రచయితలు, విదేశీ రచయితలు అని మూడు విభాగాలుగా విభజించాను. పక్కపక్కనే ఉండడం వల్ల సాహిత్యకృషి పోల్చి చూసుకోవడానికి, బేరీజు వేసుకోవడానికి, అధ్యయన పరులకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నాను. చదవడం తగ్గించిన నేటి తరానికి వ్యక్తిత్వ వికాస దిశగా తపన గురించి, వారు నిలబెట్టాలనుకున్న జీవిత విలువల గూర్చి తెలియజేస్తుంది. – దేవరాజు మహారాజు
Vidyardhi Vyasalu
₹100.00ఈ గ్రంథమునందు విద్యార్థులు తప్పని సరిగా అలవరచుకోనదగిన, క్రమశిక్షణ, ఆత్మావిశ్వాసము, సమయపాలన, శారీరక, మానసిక దృఢత్వము, బాహ్యామభ్యంతర శుచి, ఒత్తిడిని అధిగమించుట, శీల నిర్మాణము, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిత్వ వికాసము, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ, సమతా భావములు వంటి సద్గుణములు పెంపొందించుకొనుటకు ఉపయుక్తమైన, ఆదర్శ విద్యార్థి, ఉత్తమ గురువు, యోగాసనములు, ప్రాణాయామము, శీలము, నైతిక విలువల వంటి వ్యాసములు ఆణిముత్యములు. ప్రతి విద్యార్థియు ఈ పుస్తకము చదివి ఆ ఆణిముత్యముల విలువను పొందురుగాక!
Krishna Sastry Sahityam – 5 Vyasaavali – Vyasaalu – కృష్ణశాస్త్రి సాహిత్యం – 5 వ్యాసావళి – వ్యాసాలు
₹225.00‘ఆధునికాంధ్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిభావంతుడైన రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. అట్టివారి రచనలు లోకానికి త్వరగా సమగ్రంగా అందాలి. ఆ ప్రయత్నంలో సంకీర్ణ వ్యాసాలు, సాహిత్య ప్రసంగాలు, యక్షగానాలు, శ్రవ్యనాటికలు, గేయాలు, ఖండకావ్యాలు క్రమంగా ప్రకటితం కావడం ఆంధ్ర సాహిత్య ప్రియులకు ఎంతైనా హర్షదాయకమనుకుంటాను” అన్నారు శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 1-10-65న విశ్వోదయ ప్రచురణలకు ‘రెండుమాటలు’ వ్రాస్తూ. ఆనాటి ఆయన ఆశయం నేడు కార్యరూపం ధరిస్తున్నది. అందులో భాగంగా విడుదలయింది కృష్ణశాస్త్రి సాహిత్యం – 5 వ్యాసావళి – వ్యాసాలు. ఇందులో – కవిపరంపర – కవితా ప్రశస్తి – మహా వ్యక్తులు – అప్పుడు పుట్టి ఉంటే – పుష్పలాలికలు – బహుకాల దర్శనం – అమూల్యాభిప్రాయాలు ప్రకరణలున్నాయి. ఇందులో మొదటి ప్రకరణం ‘కవిపరంపర’ విడివిడికవుల కవితా విశిష్ట లక్షణాలను వివరించేది.
తొలిచి చూసి, లోపల దాగి ఉన్న సౌందర్యాన్ని పెల్లగించి చూచే కృష్ణశాస్త్రి గారి కవిచూపు సునిశితమైన సాహిత్య విమర్శకుని చూపు కూడా అని ఈ ‘కవిపరంపర’లోని దిగువ ఉదాహరించిన వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.
”నన్నయ వైకుంఠాన్ని భూలోకంలో అవతరింపజేస్తాడు, తిక్కన్న భూలోకాన్ని స్వర్గం దగ్గరకు ఎత్తడానికి ప్రయత్నిస్తాడు.”
”శబ్ధం పలకడమే కాదు, పాడుతుంది”.
”ఏడెనెమిది వందల ఏళ్ళ నుండి పల్లెల్లో, పట్టణాల్లో, ఇళ్ళల్లో, రచ్చ చావళ్ళలో ఈ భారతం చదువుకుని పురాణంగా చెప్పి తెనుగు వారు తమ జీవితంలో కలిపేసుకున్నారు. తిక్కన్న రచనలో అంత జీవచ్ఛక్తి, చైతన్యం ఉన్నాయి”.
”వారు (తిరుపతి వేంకట కవులు) గొప్ప కవులు, అయితే పద్యకవిత్వం కన్నా వారి వచనం గొప్పదని నా నమ్మకం”.
కవిగా, వక్తగా, భావకవిత్వోద్యమ జయస్తంభంగా, భక్త కవిగా, సినీ కవిగా శ్రీ కృష్ణశాస్త్రిని గుర్తించినంతగా సాహిత్య విమర్శకుడిగా ఆయన్ను లోకం గుర్తించినట్టు లేదు. దేశంలో నవ్య సాహిత్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లోనే ఆయన చేసిన రేడియో ప్రసంగాలు ఇంతవరకూ గ్రంథరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణం. ఇదిగో – ఇపుడీ సంపుటం ఆ లోపాన్ని పూరిస్తుంది.