Showing 769–780 of 835 resultsSorted by latest

Khadga Srushti – ఖడ్గ సృష్టి

180.00

నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్‌

ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ అంటున్నాను మళ్ళీ

ఔను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని కూడా అశాంతిలో ముంచుతానని,

ఔను నేనెరుగుదును ఆయుధాలు నా మాటలని, ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని,

నిజానికి నేను కత్తి దూసిన సిపాయిని, కదనరంగంలోని సేనానికి మించిన కసాయిని,

ఎంచేతనంటే, అన్నింటినీ ఎదిరిస్తాను, శాంతిని, క్షేమాన్ని చట్టాలను, కట్టుదిట్టాలను, వాటిని ధిక్కరించడమే నా పని,

అందరూ నాకెంత దూరమైతే అంత బిర్ర బిగుస్తాను,

అందరూ నాతో ఏకీభవిస్తే ఇంత పట్టుదల నాకుండేది కాదేమో!

దేన్నీ లక్ష్యపెట్టను, ఎన్నడూ లక్ష్యపెట్టలేదు. అనుభవాన్ని, ఆచారాన్ని అధిక సంఖ్యాకుల్ని అవమానాలని,

నరకమనేది నన్ను భయపెట్టదు, స్వర్గం నన్నాకర్షించదు,

డియర్‌ కామ్రేడ్‌! విను! నాతో రా మునుముందుకి, ఈ

ప్రోత్సాహం ఎందుకో, ఎక్కడికో నాకూ తెలియదు. అయినా రమ్మనడం మానలేను,

జయాపజయాలతో నిమిత్తం లేదు. ఎడతెగనిది మన యాత్ర.

వాల్ట్‌ వైట్‌మాన్‌ ఆంగ్ల కవితకు శ్రీశ్రీ ‘కామ్రేడ్‌’ శీర్షికన చేసిన అనువాదమిది. ఇంకా ఇందులో శ్రీశ్రీ రచించిన కవితలు – మరికొన్ని అనువాద కవితలు (120) – వాటికి సంబంధించిన ఫుట్‌ నోట్స్‌ ఉన్నాయి.

Kondameeda Gorrela Manda – కొండమీద గొర్రెల మంద

200.00

వాస్తవాలకు దగ్గరగా వుంటూనే చిన్నపాటి గమ్మత్తు కలిగించే పాత్రలూ, వాటి విపరీత చర్యలూ చదవడం మొదలుపెడితే చకచకా జారిపోయే సంభాషలూ, వాటిని పెనవేసుకున్న ఉత్కంఠ.

వందలాది వైవిధ్యభరిత కథలు రచించిన ఎమ్‌.వి.వి.సత్యనారాయణ కలం నుండి మనవైపు చొరబడిన కొండమీద గొర్రెలమంద ఇది. ఆసక్తికర కథనాల సమాహారం కూడా ఇదే!

పేజీలు : 216

Loya Marikonni Kathalu – లోయ మరికొన్ని కథలు

140.00

తెల్లని పలుచటి తడిబట్టను ముఖంమీద కప్పుకుని లోకాన్ని చూసినట్టుగా ఉంటుంది అజయ్‌ ప్రసాద్‌ కథలు చదివితే. అంతా కనబడుతూ ఉంటుంది; ఇంకా కనబడనిది ఏదో వుందని కూడా తెలుస్తూవుంటుంది. స్పష్టాస్పష్టం. అజయ్‌ మానసిక ప్రపంచంలోని మనుషులు ఒక దారప్పోగు లాంటి బలహీన బంధాన్ని మాత్రం ఉంచుకుని సంచరించే జీవులు. అయినా వీరందరిలోనూ ఏదో తెలియని దు:ఖం. అది పొగిలి ఏడ్చేదీ కాదు; బయటకి వ్యక్తం చేయగలిగేదీ కాదు. మొత్తంగా శరీరమంతా జీవితమంత లోతుగా వ్యాపించివున్న దిగులు. ఎక్కడో దూరంగా ఏ బైరాగో తన మొత్తం అనుభవసారాన్నంతా గొంతెత్తి తనలో తానే ఏ తత్వంగానో పాడుతూవుంటే మనకు తెలియకుండానే దానిలో లీనమై అంగీకారంగా తలవూగుతూ వుండగా కనీకనబడని చెమ్మతో కళ్ళు మసకబారే పఠనానుభవం. – పూడూరి రాజిరెడ్డి

ఈ కథల్లో తీరని దిగులుతో కల్పన సాకుగా అజయ్‌ తన జ్ఞాపకాల్ని నిమురుకున్న ప్రతి సందర్భమూ నాకు నచ్చింది. కల్పనలు జ్ఞాపకాలుగా మారుతున్న సందర్బాలు కూడా. – మెహెర్‌

పేజీలు : 166

Madhupuri Kathaa Samputi – మధుపురి కథాసంపుటి

200.00

బ్రిటీషువారు తమ విలాసాల కోసం, తమ సైనికుల విలాసాల కోసం హిమాలయ పర్వతాలలోని శీతల మంద సుగంధ పవనాలు వీచే పచ్చని ప్రదేశాలను ఎంపిక చేసుకునేవారు. ఆ ప్రాంతాలలో ఉండే వెనుకబడిన జాతుల ప్రజల జీవనాలను ధ్వంసించేవారు. విలాస నగరాలకు వచ్చే విలాస ప్రియులు సహజ సౌందర్యవంతులైన అక్కడి స్త్రీల జీవితాలను నరకప్రాయం చేసేవారు. అదేవిధంగా ఈనాటి ప్రభుత్వాలు టూరిజం పేరు మీద అలాగే స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా మారుస్తున్నారు. అణగారిన పేద, బడుగు, బలహీన గిరిజన జాతుల ప్రజల జీవనానిన& ఛిద్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 40 సంవత్సరాల క్రితం రాహుల్‌ సాంకృత్యాయన్‌ హిందీలో రాసిన ”బహురంగీ మధుపురి” కథల సంపుటిని ”మధుపురి” అనే పేరుమీద తెలుగులోకి అనువదించి చారిత్రక, రాజకీయ అంశాల పట్ల ఆసక్తి మెండుగా ఉండే తెలుగు పాఠకుల ముందుకు తీసుకువస్తున్నాం. రాహుల్జీ గ్రంథాలు ఆంధ్రదేశంలో బహుళ ప్రాచుర్యం పొందాయి. ఈ కథల సంపుటి కూడా ఆ విధంగానే తెలుగు ప్రజల మనోభావాల్లో విహరించగలదు.

Pages : 272

Manusmruti Samagra Sastreeya Vyakhya Modati Bhagam – మనుస్మృతి సమగ్ర శాస్త్రీయ వ్యాఖ్య మొదటి భాగం

200.00

మనుస్మృతి గురించి విననవివారుండరు. మూలంలో అసలేముందో తెలిసినవారు తక్కువే అయినా తెలుసుకోవాలనే కుతూహలమున్నవారు ఎక్కువే. ఇది మనుస్మృతికి శాస్త్రీయంగా చేసిన శస్త్ర పరీక్ష. మనువాద విమర్శకులు అనుకుంటున్నట్టు దీనిలో ఉన్నదంతా చెడేనా? లేక సమర్థకులు భావిస్తున్నట్లు దీనిలో ఉన్నవన్నీ నేటికీ పనికొచ్చే మంచి విషయాలేనా? వాస్తవానికి ఈ రెండూ పూర్తి నిజాలు కావు. రెంటిలోనూ కొంత మాత్రమే నిజం. గతితార్కిక దృక్పథంతో, ఆధునిక శాస్త్ర విజ్ఞానం వెలుగులో మనువు చెప్పిన విషయాలలోని మంచి చెడుగులను లోతుగా విశ్లేషించిన తులనాత్మక అధ్యయనమిది. పన్నెండు అధ్యాఆయల ఆ బృహద్గ్రథం మొదటి మూడు అధ్యాఆలలోని మొత్తం 654 శ్లోకాలపై చేసిన సమగ్ర శాస్త్రీయ విశ్లేషణ ఇప్పుడు మొదటి భాగంగా మీ ముందుంది. మరో రెండు భాగాలు త్వరలో వెలువడనున్నాయి. సరళమైన వాడుకభాషలో, సుబోధకమైన శైలిలో రాశారు పుస్తక రచయిత ముత్తేవి రవీంద్రనాథ్‌.

పేజీలు : 288

Nobel Kathalu – నోబెల్‌ కథలు

120.00

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయితలకే నోబుల్‌ బహుమతి దక్కుతుంది. ఆ బహుమతి దక్కినవారిలో కొంతమంది రచనల నుండి మేలిమి కథలను స్వీకరించి, కథా సంకలన రూపంలో తెలుగు పాఠకులకు అందించారు రచయిత్రి శ్రీమతి జి.లక్ష్మి.

ఆమె ఎంచుకున్న రచయితలు, రచయిత్రులు ప్రపంచం నలుమూలలకు చెందినవారు. అందులో థామస్‌ మాన్‌, పెరల్‌ ఎస్‌ బక్‌, టాగోర్‌, సింక్లెయిర్‌, నైపాల్‌, లెస్సింగ్‌, రెమాంట్‌ లాంటివారు మన దేశ పాఠకులకు కూడా బాగా పరిచితులే. ఇరవై మంది రచనల నుండి ఇరవై కథలు అనువదించి ‘నోబెల్‌ కథలు’గా అందించారు లక్ష్మి.

Pages : 158

Oka Koyila Gunde Chappudu – ఒక కోయిల గుండె చప్పుడు

140.00

”ఒక కోయిల గుండె చప్పుడు” కథా సంపుటిలో కథలు స్త్రీల ఆశలను, ఆశయాలను, కోరికలను, ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తాయి. స్త్రీ హృదయ లోతుల్లో దాగివున్న ఎన్నో బాధలను, ఆవేదనలను కూడా మన కళ్ళముందు ఆవ్కిరిస్తాయి. అలా అని ఈ స్త్రీలంతా సమస్యలను చూసి పారిపోరు. కష్టాలకు కృంగిపోరు. కన్నీళ్ళు కారుస్తూ ఇంతే నా రాత అని సర్దుకుపోరు.

జీవితంలో పరుగులు పెడుతూ, ఎదురుతిరిగి నిలబడి ప్రశ్నిస్తారు. సున్నితంగానే అయిష్టాలను తిరస్కరిస్తారు. తనకు తారసపడిన అనేకమంది స్త్రీల మనోభావాలను తన కలంతో అందంగా, అద్భుతంగా చిత్రించి స్త్రీ ఔన్నత్యంలో మనకు తెలియని కోణాలను చూపించారు అత్తలూరి విజయలక్ష్మి ఈ కథలలో.

చైతన్యం తొణికిసలాడే పాత్రలలో, అద్భుతమైన సన్నివేశాలతో, ఆసక్తికరమైన సంభాషణలతో అనేక రకాల జీవితాలను ఒకే కాన్వాస్‌ మీద చిత్రించి, ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా చదివింపజేసే కథలు… వీటిలోని ప్రతి సంఘటనా పాఠకుల మదిని తడుతుంది. ప్రతి పాత్రా పలకరిస్తుంది. కలిసి ప్రయాణం చేస్తుంది.

పేజీలు : 167

Ooru Kanabaduta Ledu – ఊరు కనబడుట లేదు

120.00

 “ఊరు కనబడుటలేదు” కథా సంపుటిలో అన్ని కథలలో మన చుట్టూ ఉన్న మనిషి కనబడతాడు. మనం పోగొట్టుకున్న జ్ఞాపకాల్ని వెతికి పట్టుకోవడానికి, మనం చుట్టూ నిర్మించుకున్న గోడల్ని పగలగొట్టుకునేందుకు ఈ కథలు పనికొస్తాయనడం అక్షరసత్యం. సంగీతాత్మక శైలితో, సమాజంలోని వస్తున్న తిరోగతి మార్పులను ఒడిసిపట్టి, మనిషిపై వాలుతున్న పీడనీడను పారద్రోలడానికి మనిషిని మనందరివాడుగా, మంచితనానికి చుట్టంలా మార్చడానికి చేసిన ప్రయత్నమే ఈ కథా సంపుటి.

            కథానికా శిల్ప రహస్య మర్మాలు బాగా గుర్తించి అలవర్చుకుని కథానిక భాష సముచితంగా, సందర్భ సహితంగా ఉన్నది. చిన్న చిన్న పదాలతో వాక్యాలతో విశేష అర్థం ఆవిష్కరింపజేస్తూ నన్ను నాకు గుర్తుచేశారు.

– పద్మశ్రీ డా కొలకలూరి ఇనాక్

తన చుట్టూ ఉన్న వ్యక్తులనీ, వాళ్ళ ప్రవర్తననీ ఈయన నిశితంగా పరిశీలిస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. ఈ లోకంలో ఇంత అన్యాయం ఎందుకుందని లోపల ఆవేదన చెందుతున్నారు. పీడితుల పట్ల సహానుభూతి ఉంది. స్పందించే హృదయముంది. ఈయన ఎన్నుకున్న కథా వస్తువులతో ఈ విషయం స్పష్టమవుతుంది.

– ముక్తవరం పార్థసారథి

‘ఊరు కనబడుటలేదు’ లోని కథలలో ఎక్కువగా మధ్యతరగతి మనస్తత్వాలను, జయాపజయాలను, అట్టహాసాలను, అవమానాలను, ఆలోచనలను చివరికి వారి తాత్త్వికతను సైతం చిత్రించే ప్రయత్నం కనిపిస్తుంది. ‘ఊరుకనబడుటలేదు’ ‘ఒంటెద్దు బండి’ వంటి ఉత్తమ శ్రేణి కథలు ఇందులో ఉన్నాయి. ఇతని శైలికి లయ ఉంది. అది సంగీతాత్మకంగా ఉంది.

                                    – డా వి ఆర్ రాసాని 

Palegadu – పాలెగాడు

120.00

‘పాలెగాడు’ అన్న పదానికి అర్థం – పాలించేవాడు, పరాక్రమవంతుడు, శౌర్యవంతుడని, ఇది రాయలసీమ మాండలిక పదం. విజయనగర రాజులు రాయలసీమ ప్రాంతానికిగానూ కొంతమంది సామంతరాజుల్ని ఏర్పరిచి వారి ఏలుబడిలో ఉండేందుకు వ్యక్తి పరిధిని బట్టి వంద, రెండు వందల గ్రామాలను ఇచ్చి పాలింపజేశారు. అయితే వారి పాలన సామంత పాలనగా కాకా స్వతంత్ర పాలనగా ఉండేది. అలాంటి పాలెగాళ్ళ సంతతికి చెందిన వ్యక్తి రాయలసీమలో ‘రేనాటి సింహం’ గా పిలువబడే వ్యక్తి, ఒక సామూహక శక్తి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి.

కుంఫీణీ ప్రభుత్వం కుటిలనీతితో, తన రాక్షస కబంధ హస్తాలతో భారతదేశాన్ని వశం చేసుకొని కిరాతక రాజ్యపాలన సాగిస్తున్న కాలంలో వారిపై 1846 లోనే  విప్లవ శంఖం పూరించి, వారి అధికారుల్ని చంపి, భయభ్రాంతుల్ని చేసి రేనాటి సీమలో సంచలనం రేకెత్తించాడు. చారిత్రక సంఘటనలను వస్తువుగా స్వీకరించి రాసిన నవలలు గతంలో అనేకం వచ్చాయి. కాని అజీజ్ చిత్రించిన చారిత్రక నవల పాలెగాడు – నరసింహరెడ్డి సహసగాథ మన హృదయాలను తాకుతుంది. పుస్తకం తెరిచిన తర్వాత మూసివేయకుండా పాఠకులను చదివిస్తుంది.

Raktasruvulu – రక్తాశ్రువులు

180.00

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విప్లవాలలో చైనా విప్లవం ఒకటి. సాయుధ ప్రజా విప్లవం ద్వారా ప్రజాతంత్ర చైనా ఆవిర్భవించింది. భూస్వామ్య విధానానికీ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు సాగిన చైనా సాయుధ పోరాటాన్ని ‘లాంగ్ మార్చ్’ గా ప్రపంచ చరిత్రపుటల్లో నిక్షిప్తం చేయబడింది. కష్టాలు, కన్నీళ్లు, రక్తతర్పణంతో నవ చైనా అవతరించింది. అందుకు ఆనాటి ప్రపంచ దేశాల్లోని పురోగామి శక్తులన్నీ తమ అండదండలు తెలియజేశాయి. భారతదేశాన్నుండి కొట్నీస్ వెళ్లి చైనా విముక్తి పోరాటానికి తన సాహసోపేతమైన సేవలందిస్తూ మరణించాడు. అదే కోవకు చెందినవారు నార్మన్ బెతూన్. తమ దేశాలను, కుటుంబాలను విడిచిపెట్టి మరో దేశం వెళ్లి ఆ ప్రజల కోసం నిస్వార్థ సేవలందిస్తూ ప్రాణత్యాగం చేసిన అమరవీరులు. చరిత్ర పుటల్లో, ప్రజల హృదయాల్లో ఆచంద్రతారార్కంగా వారు నిలిచిపోతారు.

నార్మన్ బెతూన్ కమ్యూనిస్టు. కమ్యూనిస్టు చైతన్యం ఆయన నరనరానా జీర్ణమైపోయింది. చైనా విముక్తి పోరాటంలో పాల్గొనడం తన అంతర్జాతీయ కర్తవ్యంగా భావించాడు. ఒకవైపున భీకరపోరాటం జరుగుతున్నా బాంబుల వర్హం కురుస్తున్నా, మొక్కవోని ధైర్యంతో ఒక అడుగు కూడా వెనక్కు వేయకుండా తనకు తానే నిర్దేశించుకున్న కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన మానవులలో మహోన్నతుడు నార్మన్ బెతూన్. ఆయన జీవిత అమరగాథే “రక్తాశ్రువులు” అనే నవలగా సిడ్నీ గోర్డన్, టెడ్ అలెన్ లు ఇంగ్లీషులో రాసిన నవలను సహవాసి తెలుగులో రచించారు.

Rangabhoomi – రంగభూమి

500.00

కల్పన కంటే సత్యమే సుందరంగా ఉంటుందని నిరూపించిన కథక చక్రవర్తి ప్రేమ్ చంద్. భూస్వామ్య వ్యవస్థ కూలిపోతూ పారిశ్రామిక నాగరికత తోసుకు వస్తున్న సమయంలో, పాత వ్యవస్థలోని కొంత మంచి కూడా ఎలా నశించిపోతుందో చిత్రించే నవల రంగభూమి. గుడ్డివాడు, బిచ్చగాడు ఐన సూరదాసు భూమిని మోసం ద్వారా జాన్ సేవక్ అనే పరిశ్రమికాధిపతి కొని, సిగరెట్ ఫ్యాక్టరీ స్థాపించడం, గ్రామ జీవితంలోని ప్రశాంతత ధ్వంసమై, కృత్రిమత్వం, కుటిలత్వం సూరదాసు తుపాకి గుండ్లకు బలై చనిపోతాడు.

గాంధీజీ సిద్ధాంతాలతో సంపూర్ణ విశ్వాసం గల ప్రేమ్ చంద్ జీవితాంతం త్యాగమయ జీవితం  గడిపాడు. సోషలిస్టు ప్రపంచం గోర్కీ సాహిత్యంతో ఆకర్షితుడై, 1936లో ప్రథమ అభ్యుదయ రచయితల మహాసభకు అధ్యక్షత వహించి ఆ ఉద్యమానికి మూల పురుషుడైనాడు. ప్రేమ్ చంద్ ఉత్తమ రచనలలో ఒకటి రంగభూమి.

Rangula Cheekati Kathalu – రంగుల చీకటి కథలు

100.00

 ఈ కధల్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇండ్ల చంద్రశేఖర్ అనే రచయితని నేను ఎరగను. అతడి కధల్ని నేను చదవలేదు. కొన్ని అంతర్జాల పత్రికల్లోనూ, రెండో మూడో ఆదివారం దిన పత్రికల్లోనూ వచ్చినట్లుంది. అతడు ఎలా ఉంటాడో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. ఏ ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నాడో తెలీదు. ఏ జీవితాన్ని తెలుగు పాఠకుల కళ్ళ ముందు బొమ్మ కటిస్తున్నాడో తెలీదు. మొత్తం మీద పన్నెండు కధలు నా చేతిలోకొచ్చి చేరేయి. ఆఫీసు పని వత్తిది, ఇటీవల కాలపు సమస్యలు – కధల్ని ఒక్కొక్కటి చదివేసరికి నెల – ఈ నాలుగు మాటలు రాయడానికి మరికాసిన రోజులు –

                                                    చంద్రశేఖర్ ది ఒంగోలు పక్కనుండే కందులూరు పల్లె నుంచి వచ్చిన వాడు. హైదరాబాద్ లో స్థిరపడినట్టుంది. ఈ కధల్లో చిత్రించిన వాతావరంణం, జీవితం, నా ముందు రూపు కట్టిన అనేక పాత్రలు, జీవితం చుట్టూ అల్లుకున్న సమస్త భావోద్రేకాలు – ఈ కధలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి కలల్లో నడిపిస్తాయి, సెంటిమెంటుని పండిస్తాయి, వీర ఆగ్రహాన్ని, ఆవేశాన్ని రగిలిస్తాయి.

                                                                         -చంద్రశేఖర్ ఇండ్ల.