YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 673–684 of 835 resultsSorted by latest
Dindukinda Nallatachu – దిండుకింద నల్లతాచు
₹120.00”నవ్య నవలల పోటీలో రూ. 50,000 ల ప్రథమ బహుమతి పొందిన నవల”
”చూడూ కళ్యాణీ! నాకు పెళ్ళయిన ఆడాళ్లంటే చాలా ఇష్టం. అందులోనూ మొహానికి పసుపు రాసుకుని, ప్రొద్దున్నే తులసి కోటకి పూజ చేసేవాళ్ళంటే మరీ ఇష్టం. ఒక్కసారి వప్పుకో. మళ్ళీ నీ జోలికి రాను” అంటూ దగ్గరగా జరిగాడు. సరీగ్గా ఆ సమయానికి బయట నుంచి కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. కల్యాణి చిగురుటాకులా వణికిపోయింది.
”దేశమంతా ఒకే మతం ఉంటే గొడవలు ఉండవా? మరి లెబనాన్ దేశంలో హజ్బుల్లా షియాలు సున్నీలు ఎందుకు ఊచకోత కోస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్‌లో ఆల్‌ఖైదా సున్నీలు షియాల్ని ఎందుకు చంపుతున్నారు? మన పక్క దేశం పాకిస్థాన్‌లో షియాలకీ, సున్నీలకీ మధ్య ఎందుకంత రక్తపాతం?” అని ఆగి, ”మనిషి సుఖంగా బ్రతకటానికి కావల్సింది మతం కాదురా. మానవత్వం” అన్నాడు.
”మానవత్వం అన్నం పెట్టదు”
”అమెరికాలో అన్నంట ఉంటుంది. తినటానికి టైమ్ ఉండదు. సొమాలియాలో టైమ్ ఉంది. తినటానికి అన్నం ఉండదు. ఆఫ్ఘన్లో మతం ఉంది. అక్కడ శాంతి లేదు. అన్నీ ఉన్న భారతదేశాన్ని ఎందుకురా ఇలా పాడు చేస్తున్నారు?”…
పేజీలు : 192
Idli – Orchid – Akasam – ఇడ్లి – ఆర్కిడ్ – ఆకాశం
₹150.00ఆత్మహత్య చేసుకోవాలని నా స్నేహితుడి ఆఫీసు 26వ అంతస్థుకి చేరుకున్నాను. అతణ్ణి బయటకు పంపి, కీటికీలోంచి బయటకు దూకబోతుండగా ఒక సంఘటన నన్ను మార్చింది. 600 కోట్ల హోటల్‌కి అధిపతిగా చేసింది.
ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ సెపరేట్‌గా గిన్నెలో సర్వ్ చేసేవాళ్ళం. మూడూ ఒకే దానిలో ఇచ్చేలా ‘దొప్ప’లున్న ”కామత్” ప్లేట్లు తయారు చేయించారు. దానితో అంట్లు తోమే వారి ఖర్చు నెలకి పాతికవేలు తగ్గింది.
‘నీ జీవితాశయం ఏమిటి’ అని ఓబెరాయ్ నన్ను అడిగారు.” మీ హోటల్ కన్నా పెద్దది కట్టడం” అన్నాడు. పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు – కల!
భారత రాష్ట్రపతికి లస్సీ కావాలని మా హోటల్‌కి కబురొచ్చింది. అందమైన ఫ్లాస్క్ మీద ‘కామత్’ అని ప్రింట్ చేయించి లస్సీ పోసి పంపాను. పది లక్షలు వెచ్చించినా ఇంత వ్యాపార ప్రకటన దొరకదు.
14 భాషల్లో అనువదింపబడి – రెండు యూనివర్సిటీలకీ నాన్‌డిటెయిల్డ్‌గా ఉన్న పుస్తకం.
ప్రపంచ ప్రతిష్ఠాత్మకమైన హోటల్‌గా ప్రథమ బహుమతి పొందిన ‘ఆర్కిడ్స్’ హోటల్ అధినేత విఠల్ ఆత్మకథకి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ విశిష్ఠ రూపకల్పన.
ఎలా ప్రారంభించాలో, ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలో, ఎలా బ్రేక్‌త్రూ సాధించాలో ఈ పుస్తకం చెపుతుంది. ఇది చదివి ఒకరైనా స్ఫూర్తి చెందితే ఈ రచన ఆశయం నెరవేరినట్టే.
Loya Nunchi Sikharaniki – లోయ నించి శిఖరానికి
₹150.00విద్యార్ధులకి శిక్షణాతరగతులు ప్రారంభిస్తూ ”మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి” అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు.
”ఏ వయసులో?” అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, ”ఇరవై అయిదేళ్ళకి” అంటారు.
”అప్పుడేమి జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? పెళ్ళవుతుందా? (నవ్వులు)
అసలు పైకి రావటం అంటే ఏమిటి? ఒక లక్షాధికారి ముప్పై ఏళ్ళకే ముసలివాడై పోయాడు. మరొకడు తల్లి దండ్రుల్ని అనాధాశ్రమంలో చేర్చాడు. వీరు జీవితంలో పైకి వచ్చినట్టా?”
పెద్దవాళ్ళు కూడా అంత తొందరగా సమాధానం చెప్పలేని ప్రశ్న.
శఠగోప రహస్యాన్ని విశదీకరిస్తూ, షడ్గుణ ఐశ్వర్యాల్ని వివరిస్తూ, వ్యక్తిత్వ వికాసమంటే ”స్వార్థాన్ని పెంచడం” అన్న కొందరి అభిప్రాయాల్ని పటాపంచలు చేస్తూ, రెండు కోట్ల రూపాయలపైగా అమ్మకాలు సాధించిన ”విజయానికి అయిదు మెట్లు” రచయిత అందిస్తున్న మరో మాస్టర్ పీస్ ‘లోయ నుంచి శిఖరానికి’.
Manchupula Varsham – మంచుపూల వర్షం
₹50.00వ్యక్తుల్ని ప్రేమించేకొద్దీ, వారి నుంచి దూరమైతే విరహం, వారికి కోపం వస్తే బాధ. వారు వేరే వారిపట్ల కాస్త ఎక్కువ శ్రద్ద చూపితే ఈర్ష్య! అదే ప్రాణంలేని సంగీతం, పెయింటింగ్, రచన, పఠనం మొదలైన వాటి పట్ల అభిరుచి పెంచుకుంటే మనకి మనమే వాటితో రమించవచ్చు. అవి అలగవు, కోరికలు తీర్చమని బలవంతపెట్టవు. మరికొంత సమయం తమకోసం కేటాయించమని అడగవు. అందుకే ప్రకృతితో స్నేహం ఎల్లప్పుడూ నిరపాయకరం.
సామాన్యుడు ఎవరేం చెప్పినా నమ్ముతాడు. ఎలా ? ఎందుకు? అని ఆలోచించడు. హేతువు వున్నదాలేదా ? ఇదెలా జరుగుతుంది ? అని తెలివైనవాడు తర్కిస్తాడు. తనకి తెలియని హేతువు కూడా వుండొచ్చుకదా, కారణం వున్నదే కరెక్టనుకోవటం దేనికి ? అని మేధావి ఆలోచిస్తాడు. హేతువు కన్నా, తనకిగానీ, ప్రపంచానికి గాని ఆ పనివల్ల వచ్చే ‘ఉపయోగం’ గురించి జ్ఞాని ఎక్కువ పరిశీలిస్తాడు.
మనిషి ఎలా సంతృప్తిగా బ్రతకాలో చెప్పేదారిలో, ఒక మైలురాయి లాంటి వాడు భగవంతుడు. కర్తవ్య నిర్వహణ మానేసి కేవలం అతణ్ణి పూజించేవాడు, ప్రయాణం మానేసి ‘మైలురాయి’ని పూజిస్తున్నవాడి కింద లెక్క.
ఈ ప్రపంచంలో మోసగాళ్ళందరూ ఎప్పుడూ రకరకాల అబద్ధాలు ఆడుతూ వుంటారనీ, అందమైన కట్టుకథలు విపరీతంగా చెప్పేస్తూ వుంటారనీ, మామూలు మనుషుల కన్నా వాళ్ళు చాలా డిఫరెంట్‌గా వుంటారని మనమనుకుంటే అది చాలా తప్పు. వాళ్లూ మనలాగే ఉంటారు. వారి సిన్సియారిటీని హానెస్టీగా ఎప్పుడూ భావించకూడదు. సిన్సియారిటీ అంటే శ్రద్ధ. హానెస్టీ అంటే నిజాయితీ. అతడు చాలా సిన్సియర్ అనటానికీ, అతడు చాలా హానెస్ట్ అనడానికీ చాలా తేడా ఉంది. నమ్మకద్రోహులే ఒక్కోసారి చాలా శ్రద్దగా వుంటారు.
మనో వైజ్ఞానిక సాహిత్యంలో అపూర్వ సంచలనాలను సృష్టిస్తున్న వ్యక్తిత్వ పుస్తకాలు – తప్పుచేద్దాంరండి, విజయానికి ఆరోమెట్టు, మైండ్ పవర్ నెంబర్ 1 అవటం ఎలా, విజయంలో భాగస్వామ్యం, విజయానికి అయిదుమెట్లు-గెలుపుకోసం ప్రతి వ్యక్తి ఆచరించవలసిన సూత్రాల్ని పై పుస్తకాల్నుంచి క్లుప్తీకరించి పాఠకుల సౌలభ్యం కోసం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అందిస్తున్న విజయ రహస్యాల సంకలనం ‘మంచుపూల వర్షం’.
Manchi Mutyalu – మంచి ముత్యాలు
₹70.00తెలుగు సాహిత్యపు గత వైభవాన్ని పరిశీలిస్తే మనకందులో ఎందరో మణిదీపాలవలె వెలిగినవారు కనిపిస్తారు. గురజాడ అప్పారావు, శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన లబ్ధ ప్రతిష్ఠులే కాక కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, బుచ్చిబాబు లాంటి సమర్థులైన మనోవిశ్లేషకులను కూడా తెలుగుతల్లి మనకందించింది. సామాజిక దురన్యాయాలపై తిరుగుబాటు బావుటాలెత్తిన రాచకొండ, చలం మొదలైన వారు ఎటూవున్నారు. ఇక నాటకరంగాన్ని పరిశీలిస్తే మాలపల్లి, కన్యాశుల్కం నుంచి మరో మొహంజొదారో, రాగ రాగిణి, రాతి మనిషి లాంటి గొప్ప నాటకాలందించిన రచయితలూ మనకు వున్నారు. వీరు గాక, చాసో, కాళీపట్నం, పెద్దిభొట్ల వంటి అత్యుత్తమ కథకులూ బాలగంగాధర తిలక్, జంధ్యాల పాపయ్య శాస్త్రి, బసవరాజు అప్పారావు లాంటి భావుకులయిన కవులూ తెలుగు సాహితీ పీఠానికి ముత్యాలు అద్దేరు.
వేర్వేరు రంగాలలో అత్యున్నత స్థాయి సంపాదించిన మహా రచయితల సరసన యండమూరి వీరేంద్రనాథ్‌ని నిలబెట్టే సాహసం మేము చేయము గాని, ఆయనకి కథ, నవల, నాటకం, కవిత్వం, సినిమా కథా, మాటల రచన ఈ రంగాల్లో ప్రవేశమూ, తగు మాత్రపు ఖ్యాతీ ఉన్న సంగతీ మరువలేము.
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గత 35 సంవత్సరాల సాహితీ జీవనంలో జీవితం పట్ల, సమాజం సట్ల, మనిషి ప్రవర్తన పట్ల తన రచనల్లో వెలువరించిన భావాలనూ, పరాకాష్ఠగా భావించదగిన ఆణిముత్యాల్నీ ఏరికూర్చి మనకందిస్తున్నారు ప్రచురణకర్తలు. విభిన్నమైన రీతుల్లో, ఇన్ని ప్రక్రియల్లో చేపట్టిన ఒకే రచయిత రచనలోని విలువైన మాటలన్నీ ఒక పుస్తక రూపంలో రావటం తెలుగు సాహిత్య చరిత్రలో ఇదే మొదలు.
Mind Power – మైండ్ పవర్
₹270.00ఈ ‘మైండ్ పవర్’ పుస్తకంలో మానవ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల అంశాలు వున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక మనోతాత్త్విక విశ్లేషణ (). సైద్ధాంతికంగా చెబితే అంత తేలిగ్గా అర్ధంకాని విశ్లేషణలను సైతం చిన్నచిన్న సంఘటనల సాయంతో విడమరచి చెప్పడంలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గొప్పతనం వెల్లడయింది. పుస్తకం ఆరంభం నుంచీ, అంతం వరకూ రచయిత తన సహజశైలిలోని జిగి, బిగిని సడలనివ్వలేదు. ఇతర ‘పర్సనాలిటి డెవలప్మెంట్’ పుస్తకాల లాగా ఒకసారి చదివేసి పక్కన పెట్టేసే పుస్తకం కాదిది.
జీవితంలోని వివిధ దశల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు ఇందులో పొందుపరచారు. అందువల్ల ప్రతివ్యక్తీ దీనిని పదేపదే చదివి తీరాల్సిందే. అసామాన్యులు మెదడు చెప్పినట్లు చేయకుండా, తాము చెప్పినట్లు ‘మెదడు’ నడుచుకునేటట్లు ‘ట్యూన్’ చేసుకుంటారు. అలాంటివారే నెంబర్‌వన్ కాగలుగుతారు. మనిషిని మెదడు వాడుకునే దశనుండి మెదడును మనిషి వాడుకునే దశకు చేరుకోవాలంటే యండమూరి వీరేంద్రనాథ్ ‘మైండ్పవర్’ మంచి అక్షర సాధనం కాగలదు.
సామ్యవాదం కోసం మనోశక్తి, మనో ప్రణాళిక, మనోధైర్యం, మనో విశ్లేషణ, మనశ్శాంతి కాక ‘ఆర్ధికావగాహనావలోకం’ కోసం అవన్నీ తెలుసుకోవాలనుకుంటే, అదే పాజిటివ్ థింకింగ్ అనుకుంటే ఇది అవశ్య పఠనీయ గ్రంథం. పాఠకుడి మానసిక స్థాయిని పెంచి తద్వారా సమస్యల్ని పరిష్కరించే ఆత్మవిశ్వాసాన్నీ, నేర్పునీ, అందించిన ఈ ప్రయత్నం ప్రశంసనీయం.
Nene Naa Ayudham – నేనే నా ఆయుధం
₹150.00ఓటమి పట్ల నిరాశ చెందకూడదనీ, కష్టాల్ని ధైర్యంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని నమ్మి,
వేలాదిమందికి మార్గదర్శిగా నిలిచిన “మేధ” సంస్థల అధినేత డా.చిరంజీవి జీవితం,
మెగా రైటర్ యండమూరి కలం నుండి…..
”ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు…
కాకినాడలో పోస్టర్లు అతికించడానికి వాడగా మిగిలిపోయిన మైదా పిండితో
చపాతీలు కాల్చుకుని తిన్న రోజులు గుర్తొచ్చి కళ్ళనీళ్ళొచ్చాయి.”
వ్యాపారంలో పోటీ… ఎత్తులు-పైఎత్తులు…
విస్తరించటానికి చేసే ప్రయత్నాలు… ఎక్కే శిఖరాలు, పడే లోయలూ….
ఆర్టీసీ బల్లల మీద నిద్ర… సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం…!
పదో క్లాసు ఫెయిలు నుంచి.. డాక్టరేట్ వరకూ…!
అట్టడుగు స్థాయి నుంచి లక్షల సంపాదన వరకూ ఎదిగిన
ఒక నిరుద్యోగి జీవిత చరిత్ర!
ప్రతీ నిరుద్యోగీ, వ్యాపారవేత్తా,
జీవితంలో పైకి రావాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తీ చదవ వలసిన పుస్తకం ”నేనే నా ఆయుధం”.
Nissabda Visphotanam – నిశ్శబ్ద విస్ఫోటనం
₹150.00కిడ్నాపులు, బ్లాక్ మెయిలింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, పరువు హత్యలు, బ్యాంకు అప్పులు ఎగ్గొట్టినవారిని విదేశాలకు పంపటం – ఇలా ప్రభుత్వానికి సమాంతరంగా నడిచే ఈ మాఫియా పేరు ‘ట్రయాడ్’…! ఇదొక బలమైన కోటరీ. రాజకీయంగా వారి వెనుక చాణుక్యని మించిన మేధావులు ఉన్నారు. రక్తం తాగే రౌడీలున్నారు. నువ్వొక చిన్న స్కూల్ టీచర్‌వి. ఇంత పెద్ద మాఫియాని ఎలా ఎదుర్కొంటావ్? నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావ్?”
”నన్ను రక్షించుకోవటానికి డాలూ; నేను ఎదుర్కోవటానికి కత్తీ ఉన్నాయండీ.”
”కత్తీ, డాలూనా?”
”అవునండీ. ఎదుర్కోవటానికి ‘భారతం’, రక్షించుకోవటానికి ‘భగవద్గీత”’
—
బోల్డెంత సస్పెన్సూ, కాసింత రొమాన్సూ, అక్కడక్కడ పురాణాలూ, కొండకచో ప్రబంధ వర్ణనలూ… భారతంలోని లౌక్యం, భాగవతంలోని అర్థం కలగలిపి….. నిశ్శబ్ద విస్ఫోటనం.
పేజీలు : 232
Padamati Koyila Pallavi – పడమటి కోయిల పల్లవి
₹50.00పాశ్చాత్య కవితా ఝరిని తెలుగు సాహితీ క్షేత్రానికి తీసుకురావాలన్న ప్రయత్నంలో ‘పడమటి కోయిల పల్లవి’కి ‘తీయ తెనుగు అను పల్లవి’ జత కూర్చి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ సారధిగా కట్టిన కవితా వారధి ఈ పుస్తకం.
కీట్స్, వర్డ్స్‌వర్త్, కోలరిడ్జ్, డన్మోర్, ఈట్స్ లాంటి కవుల కవితల్లో అంతర్లీనంగా ఉన్న భావం చాలా అద్భుతంగా వుంటుంది. ఇవన్నీ నారికేళ పాకాలు. మామూలుగా చదివితే అంతగా ఆకట్టుకోవు. లోతుగా వెళ్ళి పరిశీలించాలి. ముఖ్యంగా ‘ప్రాఫెట్’ అయితే ప్రతి వాక్యమూ ఆణిముత్యమే.
‘పిల్లల్ని ప్రేమించే ప్రయత్నం తప్పుకాదు. వారు తిరిగి ప్రేమను ఇవ్వాలన్న నిబంధనే మహాపాపం’. (ప్రాఫెట్)
మనిషి జీవితపు విందులో పంచభక్ష్య పరమాన్నాలన్నీ వడ్డించబడతాయి. చివర – మృత్యువు వాటిని తుడిచి పెట్టుకు పోతుంది (రిచర్డ్ బ్రాన్ ఫీల్డ్)
అనుభవం శయ్యమీద కలిసిన రెండు శరీరాలు. మనసు మాత్రం నీది నీదే- నాది నాదే (డి.హెచ్.లారెన్స్)
ఇలాంటి గొప్ప భావాలు ఈ కవితల్లో వున్నాయి. భావాన్ని యధాతధంగానే అనువదించినా, కొన్ని చోట్ల తెలుగు దనం చేర్చారు. ఇంగ్లీషు కవిత్వానికి అవసరమైన ‘మాత్రల్ని’ వదిలి, వీలైన చోట్ల అంత్యప్రాసల్ని చేర్చారు.
ఈ కవితల్ని కళ్ళతో చదవకండి. మనసుతో చదవండి. కొన్ని వాక్యాల్ని మనల్ని నిలబెట్టేస్తాయి. ఆ కవులు ఎంత మధనపడి, ఎంతచిన్న వాక్యాలలో ఎంత పెద్ద భావాల్ని పొదిగారో అర్ధమవుతుంది.
Pillala Perla Prapancham – పిల్లల పేర్ల ప్రపంచం
₹100.005000 పేర్లు వున్న ఏకైక పుస్తకం – యండమూరి వీరేంద్రనాథ్
అందమైన పేరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
‘స్నేహ’ – మంచి పేరు. ‘సంధ్య’ చాలా మందికి వుండే అందమైన పేరు. కానీ – ‘స్నేహ సంధ్య’ మరింత అందమైన కాంబినేషన్. వినగానే ‘బావుంది’ అనిపించేటంత ముచ్చటైన పేరు. నీహారిక, వేదసంహిత లాంటి ఎన్నో అందమైన పేర్లను పాఠకలోకానికి పరిచయం చేసిన యండమూరి వీరేంద్రనాథ్ కలంలోంచి జాలువారిన ముత్యాల జల్లు ఈ పుస్తకం. గతంలో వచ్చిన పిల్లల పేర్ల పుస్తకాలకి భిన్నంగా – మరో 500 పేర్లు అధికంగా – నవ్యత కోరుకునే పాఠకులకి బహుమతిగా – యండమూరి అందించే ముచ్చటయిన పేర్ల పుస్తకం ”పిల్లల పేర్ల ప్రపంచం” చదవండి. ఎంపిక చేసుకోండి. తెలుగులో ఇన్ని (5000) పేర్లతో వెలువడుతున్న తొలి పుస్తకం ఇది. అంతేకాదు జన్మనక్షత్రాలకు అనుగుణంగా వీలైనన్ని పేర్లు పొందుపరుచబడ్డ పుస్తకం కూడా. చివరన పిల్లలు ఉండవలసిన సగటు బరువును సూచించే పట్టిక కూడా ఇందులో వుంది.
Prema Oka Kala – ప్రేమ ఒక కళ
₹150.00ఈ పుస్తకం ‘స్నేహం-ఆప్యాయత-ప్రేమ-మోహం-దాంపత్యం-రొమాన్స్-అనుబంధం’ అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది.
అమ్మ నుంచి ప్రేమతో తొలిముద్దు, నాన్నతో పొరపాటుల దిద్దుబాటు, స్నేహితుల్లోని నచ్చిన గుణాల్ని ప్రేమించటం, వారి మైనస్-పాయింట్స్ మనస్ఫూర్తిగా ఒప్పుకోవటం… ఆ విధంగా మనిషి తన ప్రేమ పరిధిని పెంచుకుంటాడు. (అయితే కొన్నిసార్లు నమ్మిన సిద్ధాంతం కోసం విభేధించటానికి వెనుకాడడు కూడా. కానీ విభేధం వేరు, శత్రుత్వం వేరు).
ఈ పుస్తకంలో….
స్నేహం : స్నేహంలోంచి ప్రేమలోకి…స్నేహితుల్లో రకాలు…అకస్మాత్తుగా గుడ్‌బై చెప్పే స్నేహితులు…ఖరీదైన స్నేహాలు…మంచి స్నేహితుడి పది లక్షణాలు… స్నేహం స్వార్థమా?… ఎటువంటి స్నేహితుల్ని వదిలిపెట్టాలి?
ప్రేమ : తూపు తొలి చూపు… తొలి స్పర్శ… పప్పీ లవ్… పెళ్ళికి ముందు ప్రేమ… ప్రేమ వివాహాలు… పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు… ప్రేమలో ఎమోషన్స్… ప్రేమ – ఈర్ష్య.
దాంపత్యం : ఈ నాటి ఈ బంధం ఈ నాటిదే… లివ్-ఇన్-రిలేషన్… సెకండ్ సెటప్… సర్దుబాటు.
శృంగారం : వద్దనకు ఈ ముద్దు … రొమాన్స్… వాత్సాయన… విరహ వర్ణన… శృంగారానికి ఆరు మెట్లు
అనుబంధం : మూడు రకాల అనుబంధాలు ఉన్నాయి.
Samasyalu – Parishkaralu – సమస్యలూ – పరిష్కారాలు
₹120.00సమస్య రాగానే మనం పరిష్కారం ఆలోచించటం మానేసి, విచారించటం ప్రారంభిస్తాం.
సముద్రం ఎంత పెద్దదైనా, నీళ్ళని లోపలికి రానివ్వకపోతే పడవ మునగదు. సమస్య ఎంత పెద్దదైనా, మనసులోకి రానివ్వకపోతే బాధ ఉండదు.
పాతికశాతం సమస్యలు పరిష్కారం లేనివి. పరిష్కారం లేని ఈ పాతిక శాతం గురించీ మనం జీవితంలో సగవంతు కాలం ఆలోచిస్తూ గడిపేస్తాం. ఇంకో యాభై శాతం సమస్యలు మనకి ఇతరుల వల్ల వచ్చేవి. అవి తీరాలంటే మారవలిసింది వాళ్ళు. మనం కాదు. తాగుబోతు భర్త, దుబారా భార్య, గయ్యాళి అత్తగారు, చెడుదార్లో సంతానం వగైరా. వాళ్ళని మార్చటం ఎలా అని నిరర్ధకంగా విచారిస్తూ మరో పాతిక శాతం కాలం గడిపేస్తాం.
మిగిలిన పాతిక శాతం సమస్యల్నుంచి బయటపడాలంటే కఠినమైన నిర్ణయాలు అమలు జరపాలి. దురదృష్టవశాత్తూ ఇటువంటి సందర్భాల్లో మనం ఆలోచిస్తూ కూర్చుంటాము తప్ప నిర్ణయాలు తీసుకోము. తీసుకున్నా, అమలు జరపం.
ఏ సమస్యకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే సమస్య తాలూకూ సాంద్రత తగ్గుతుందో ఆత్మీయంగా చెప్పే పుస్తకం.
పేజీలు : 183