Showing 637–648 of 835 resultsSorted by latest

Peddibhotla Subbaramaiah Kathalu 2 – పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు 2

100.00

గాంధీని చూసినవాడు అనే పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలో బోట్స్వానా నుంచి తాతగారి గ్రామానికి అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ వస్తారు. అది ఎన్నికల సమయం కూడా. ఆ సందర్బంలో వాళ్ళు ఆ గ్రామంలోని ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులకు విస్తుపోతారు. వాళ్ళు ”విన్నదాన్నిబట్టి, చదివినదాన్ని బట్టి ఇక్కడ బహుశా ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్పగా ప్రజాస్వామ్యం ఎన్నికల పద్ధతి అమల్లో ఉంది…. కాని ఆచరణలో జరుగుతున్నదేమిటి?… ఈ దేశం ఎంత గొప్పది…ఇక్కడ ఎన్ని పుణ్యనదులు, ఎన్ని ఎడారులు..ఎంత దాక్షిణ్యం…ఎంత క్రౌర్యం…ఎంత జ్ఞానం… ఎంత అజ్ఞానం… ఎన్ని నీళ్ళు..ఎంత నీళ్ళకరువు..ఎన్ని కులాలెన్ని, మతాలు ఎన్ని, ఎంత ఐశ్వర్యం ఎంత ఆకలి! ఎందరెందరో మఠాధిపతులెన్ని ఆరాధన పద్ధతులు..ఎన్ని భాషలు…ఎంత నిశ్శబ్దం…ఎంత వైవిధ్యం..మళ్ళీ ఎంత ఏకత్వం! ఆలోచిస్తూవుంటే ఆశ్చర్యమనిపించింది. ఒకప్పటి చప్పన్నారు దేశాలు, మరొకప్పటి అయిదువందల పైచిలుకున్నా పెద్ద రాజ్యాలన్నీ కలిపి అప్పటివారి పుణ్యమా అని ఏకఖంతమై భాసిల్లింది ఈ భూమి!”

ఈ కథలో డ్రాయింగ్‌ మాస్టారు గొప్ప ఆశావాది. ఆయన అన్నా, చెల్లెళ్ళకు చెప్పింది: ”ఈ దేశం తీరే అంత! ఎంత శాతి ఉందో అంత అశాంతి ఉంది. ఎంత సంతృప్తి ఉందో అంత అసంతృప్తి ఉంది. ఎంత జీవకారుణ్యం ఉందో అంత కర్కశత్వమూ ఉంది. ఎన్ని రంగుల చర్మాలున్నాయో అంత ఐకమత్యమూ ఉంది. ఈ వ్యవస్ధకు యాభైఏళ్ళ వయస్సు వచ్చింది. ఇక ఇప్పుడే ప్రమాదమూరాదు. బాలారిష్టాలన్నీ దాటాయనే అనుకోవచ్చు….

Peka Mukkalu – పేక ముక్కలు

220.00

సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్‌ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.

కిషన్‌ చందర్‌ 1914 నవంబర్‌ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్‌.ఎల్‌.బి. పట్టా పుచ్చుకున్నారు. ప్రధానంగా ఆయన నవలా రచయిత. ఆయన నవలలు అనేకం భారతీయ భాషలతోపాటు ఇంగ్లీష్‌, రష్యన్‌, డేనిష్‌, పోలిష్‌, జర్మన్‌, హంగేరియన్‌, చైనా భాషలలోకి అనువదించబడ్డాయి.

ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలి, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికి మాటలతో రూపమివ్వటం – కిషన్‌ చందర్‌ ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి. ”గాలిబ్‌ వారసుడు”గా సాహితీ లోక సమాదరణ పొందిన కిషన్‌ చందర్‌ 1977 మార్చి 8న కీర్తిశేషులయ్యారు.

ఈ నవలకు పెట్టిన ”పేకముక్కలు” అన్న పేరు చాలా విధాలా సార్థకనామం. ఇందులో ఉన్న పాత్రలు పేకముక్కలు. ఇందులో రాజులూ, రాణీలూ, జాకీలూ, జోకర్లూ, పొడిముక్కలూ అందరూ ఉన్నారు. సినిమా ఒక కళా కాదు, ఒక వ్యాపారమూ కాదు – పేకాట, జూదం! కాని అది కొద్దిమందికే జూదం. మిగిలినవారిలో సుఖజీవనం కోసం వచ్చినవాళ్ళుంటారు. తమ ఆదర్శాలు సఫలం చేసుకోవటానికి వచ్చినవారుంటారు. బ్రతుకు తెరువులలో ఇది ఒకటనుకుని, పెద్ద ఆశలేమీ లేకుండా వచ్చినవారుంటారు. ఈ రకాలన్నీ ఈ నవలలో ఉన్నాయి.

సినిమా జీవితం ఒక విలక్షణమైన జీవితం. మామూలు జీవితపు విలువలకిక్కడ చలామణీ లేదు. ఈ సంగతి తెలియగానే మామూలు జీవితపు విలువలను సునాయాసంగా విసర్జించేస్తారు కొందరు. మరి కొందరు వాటిని గాఢంగా అంటిపెట్టుకుంటారు. ఆ కారణంగా నలిగి హూనమైపోతారు. అంతులేని ఆశనూ, అగాధమైన నైరాశ్యాన్నీ రేకెత్తించగల విచిత్ర జీవితం సినిమా జీవితం.

జీవితాన్ని వాస్తవంగా చిత్రించటమే ఒక విశేషం కాదు. డిటెక్కివు నవలల్లో కూడా వాస్తవ జీవితమే ఉన్నది. ఈ నవలలో సినిమాకారుల జీవితాన్ని ఉన్నదున్నట్టు చిత్రించటంలో సరిపుచ్చుకోక, రచయిత ఆ జీవితంలోని సత్యాలన్నిటినీ నగ్నంగా ప్రదర్శించారు. ఆ కారణంచేత ఇది ఉత్తమ రచన అనిపించుకుంటుంది. ఎప్పటికైనా సినిమా కళ ఉన్నతికి రావాలంటే, అందుకు జరగదగిన కృషిలో ఈ నవల ఒక భాగమవుతుందా అంటే, అవుతుందని నేను నమ్మకంగా చెప్పగలను. – కొడవటిగంటి కుటుంబరావు

పేజీలు : 264

Penam Meeda Nundi Poyyilo Paddam – పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం

60.00

అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది :

నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గతంలో హైదరాబాద్‌ అభివృద్ధి పైనే కేంద్రీకరరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని, తాను కూడా కొంతమేరకు పొరపాటు చేశానని, గతంలో వలే కాక 13 జిల్లాలలోను అభివృద్ధిని వికేంద్రీకరించి, నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజలందరి సుఖసంతోషాలకు సౌభాగ్యానికి కృషిచేస్తానని హామీ యిచ్చారు. శ్రీకాకుళం జిల్లా నుండి అనంతపురం జిల్లా వరకు ఏయే జిల్లాలో ఏయే అభివృద్ధి పనులను తన ప్రభుత్వం చేపట్టనుందో సుదీర్ఘమైన జాబితా కూడా ప్రకటించారు. కానీ ఆ విషయాన్ని ఆయన మరచిపోయి అమరావతి, పోలవరం తన రెండు కళ్ళు అని పదేపదే ప్రకటిస్తూ వచ్చారు. నూతన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఆదాయం, కేంద్రం నుండి వచ్చు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన పథకాలు, అభివృద్ధి పనులు మరియు కొనసాగుతున్న ఇరిగేషన్‌ పథకాలను సత్వరమే పూర్తిచేయటం మున్నగు వాటిపైన లోతుగా అధ్యయనం చేసి సరైన నిర్ణయాలు తీసుకోకవలసి వుంటుంది.  అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చాలా పెద్దదిగా, చాలా గొప్పదిగా వుంటే పెట్టుబడులు ఆకర్షించబడతాయి అనేది ఆయన భావన. ఒక ప్రాంతంలో లభ్యమయ్యే ముడి వస్తువులు, భౌతిక వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మున్నగు అంశాలను దృష్టిలో పెట్టుకుని నూతన పరిశ్రమలు ఏర్పాటవుతాయేతప్ప రాజధాని నగరం పెద్దదిగా వుంటే అక్కడికే పరిశ్రమలు వస్తాయనే భావన సరికాదు.

పేజీలు : 72

Pranam Unnantha Varaku – ప్రాణం ఉన్నంత వరకు

160.00

ప్రేమ ఒక అందమైన, అద్వితీయమైన, అద్భుతమైన అనుభవం.

మాతృప్రేమ, పితృప్రేమ, సోదరప్రేమ ఇలా అనేకమైన ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా లభించేవే. అవి మానవ జీవితానికి అవసరమైనవని చెప్పేందుకు ఎలాంటి సందేహంలేదు.

కానీ ఒక పురుషుడు, స్త్రీ మధ్య ఏర్పడే ప్రేమ, యవ్వనం నుంచి మరణం వరకు సాగే ప్రేమ, సృషఙ్టకి నాంది పలికే ప్రేమ, మిగిలిన అన్ని ప్రేమలకు ఆధారమయ్యే ప్రేమ అన్నింటికన్నా ప్రత్యేకమైనదని నా అభిప్రాయం. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలు కలిసి చదువుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని, ప్రణయాన్ని వివాహం ద్వారా సార్థకపరచుకుని సాగించే ప్రయాణం అత్యుత్తమైనది.

ప్రేమ కుల మతాలకు, భాషా ప్రాంతాలకు అతీతమైనది.

ప్రేమించేందుకు నిజాయితీ కలిగిన ధైర్యం, ధైర్యంగా చెప్పగలిగే సత్యం, సత్యం కోసం చేసే త్యాగం, త్యాగంలో కూడా మరుగుపడని అనురాగం అనేవి నాలుగు స్తంభాలు. బలమైన ఈ నాలుగు స్తంభాలపై నిలబడిన ఒక ప్రేమ కథ ఇది.

నిజమైన ప్రేమకు నిర్వచనం ఈ నవల. జీవితంలో వాస్తవిక దృక్పథం, ఆత్మాభిమానం, మంచిని పెంచే పట్టుదల, ఎన్ని కష్టాలు ఎదురైనా సడలని వ్యక్తిత్వంతో నిజాయితీగా, ధైర్యంగా ఉంటే అదే కష్టాల మెడలు వంచి మనకు విజయం చేకూరుస్తుందని చెప్పేదే ఈ నవల. అంతే కాదు ఈ రోజుల్లో మన దేశంలోని సాంఘిక సమస్యలపై కూడా కొరడా ఝళిపించి, మార్గదర్శం చేయిస్తుంది. కేవలం కాలక్షేపం కాదు, మీకు ఎన్నో కొత్త విషయాలు, విద్య, వైద్య, పారిశ్రామిక పురోగతి లాంటి వాటిపై ఒక కొత్త కోణంలో ఆలోచింపచేస్తుంది.

పేజీలు : 192

Samkshipta Prapancha Charitra

225.00

గతకాలపు సంఘటనలను వివరించేదే చరిత్ర. గతాన్ని విస్మరించిన వ్యక్తికి, జాతికి సరియైన భవిష్యత్తు ఉండదు. అయితే చరిత్ర అధ్యయనం గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన తారీఖులను, వ్యక్తుల పేర్లను నేమరువేయడానికే పరిమితమైతే దానివలన ఉపయోగం ఉండదు. గతంలో జరిగిన సంఘటనల కారణాలను, ఫలితాలను, పర్యవసానాలను, మంచి చెడ్డలను గ్రహించి వాటి నుండి గుణపాఠం నేర్వగలిగినప్పుడే చరిత్ర అధ్యయనానికి సార్ధకత ఉంటుంది. – అప్పుడే భవిష్యత్తుకు మార్గ దర్శకమవుతుంది. జాతులు వివేకవంతమవుతాయి. ఈ దృష్టితో చూసినప్పుడు చరిత్ర అధ్యయన ఆవశ్యకత అర్ధమవుతుంది.

అంతర్జాతీయ వాణిజ్యం, శాస్త్రవిజ్ఞానం శీఘ్రగతిని విస్తరిస్తున్న ఆధునికయుగంలో ప్రపంచం రోజురోజుకీ సంకుచితమై వివిధ దేశాలూ పరస్పరాధారభూతమవుతున్నాయి. ఈ స్థితిలో మానవుడు తన దేశ చరిత్రనే కాక ప్రపంచ చరిత్రను కూడా అధ్యాయం చేయవలసిన అగత్యం ఏర్పడింది. అయితే తెలుగులో ప్రపంచ చరిత్ర గ్రంధాలు తగినంతగా లభ్యం కావడం లేదు. ఈ కొరత కొంతవరకైనా తీర్చడమే ఈ సంక్షిప్త గ్రంథ రచనా లక్ష్యం.

– రచయిత

Rekkadinantha Kaalam.. – రెక్కాడినంత కాలం…

200.00

అన్నంగుడ్డ’, ‘సానరాయి’ వంటి కథల్లో కంసాలుల జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రించిన దేవేంద్ర విస్తృతమైన కాలభూమికపైన మరింత విశాలంగా ఆ పనిని యీ నవలలో నిర్వహించాడు…. ఈ నవల రాజకీయాల గురించీ పెద్దగా ప్రసక్తి తీసుకురాకుండానే, ఈ దురన్యాయానికున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాన్నంతా నిలదీసి ప్రశ్నిస్తుంది. – మధురాంతకం నరేంద్ర

పేజీలు : 255

Vaaduka Telugu Padakosam

200.00

తెలుగు భాషా పద నిఘంటువులు చాలా వచ్చాయి. వాటిలో కావ్యభాషకు పదజాలమే ఎక్కువగా లభిస్తుంది. ప్రత్యేక నిఘంటువులద్వారా, పదకోశాలద్వారా – పరిభాషా పదాలకూ, ప్రత్యేక పదాలకూ, వృత్తి పదాలకూ, పదబంధాలకూ అర్థాలు కూడా లభిస్తాయి. ఇలాంటి వాటిలో నానార్థ పదకోశాలు, పర్యాయపద పదకోశాలు, మాండలిక నిఘంటువులు, మాండలిక వృత్తి పదకోశాలు, పత్రికాభాషా పదకోశాలు చేరతాయి. ఈ పదకోశం ఆధునిక ప్రమాణ రూపాలను మాత్రమే గ్రహించింది. అంతేకాదు ఇతర నిఘంటువులలో సులభంగా లభ్యంకాని పర్షో అరబిక్ పదాలు, ఆంగ్ల పదాలు కొన్ని ఇందులో లభిస్తాయి. సమాచార రంగంలో వ్యాప్తిలో వున్న మరికొన్ని పదాలను కూడా చేర్చాము. ఇది ఒక తొలి ప్రయత్నం మాత్రమే. ఇంకా ప్రసార సాధనాల్లో నలిగిన చాలా అన్య దేశ్యాలనూ, సృజనాత్మక భాషలో కనిపించే మరెన్నో మాండలిక పదాలనూ నిఘంటువులలో మనం చేర్చుకోవలసిన అవసరం ఎంతో వుంది.

          ఈ వాడుకతెలుగు పదకోశంలో దాదాపు 20,000 పదాలు ఉన్నాయి. తెలుగు భాషాభిమానుల సూచనలను అనుసరించి మలి ముద్రణలో ఈనాటి అవసరాలకు తగినట్లుగా మరిన్ని పదాలను ఈ కోశంలో చేర్చడానికి ప్రయత్నిస్తామని సవినయంగా మనవి. మా ఈ తొలి ప్రయత్నాన్ని సమాదరిస్తారని ఆశిస్తూ….

– ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

Cancer Code

150.00

కెనడా దేశస్తుడైన డా॥ ఫంగ్ కిడ్ని వైద్య నిపుణులు. ఒబేసిటీ, డయాబెటిస్, ఫాస్టింగ్లపై ఆయన రాసిన పుస్తకాల                      ద్వారా సాంప్రదాయ వైద్యంపై

గొప్ప తిరుగుబాటు చేశారు. జర్మనీకి చెందిన హెన్రిచ్ వార్నర్ (1888-1970) ఒక భౌతిక శాస్త్రవేత. ఆయన కణాలు శక్తిని ఎలా తయారు చేసుకుంటున్నాయన్న అంశంపై విస్తృత అధ్యయనం చేశాడు. జీవశాస్త్రానికి భౌతిక, రసాయన శాస్త్రాలను జోడించాడు. సాధారణ కణాలకు, కాన్సరు కణాలకు జీవక్రియలలో గల తేడాలను గుర్తించాడు.. జీవశాస్త్ర పరిణామ వాద కోణం నుండి ఈ సమస్యను పరిశోధించారు.
అపుడు కాన్నరు మెట్లు మెట్లుగా ఎదగడం లేదని, పెరుగుదల, చొరబాటు, వ్యాప్తి వంటివి దశలవారీగా జరగడం లేదని అర్థమైంది. శరీరంలో కాన్సరు కొంతకాలం పాటు పెరిగాక మాత్రమే వ్యాప్తి చెందగలదన్న భావన తప్పు అని తేలింది. ఆరంభం నుండే వ్యాప్తి కూడా కాన్సరు లక్షణంగా గుర్తించారు.

దశలవారీగా పెరుగుదల వుండి వుంటే కాన్సరుకు చికిత్స సులువయి ఉండేది. కాన్సరు వచ్చిన భాగాన్ని సర్జరీ చేసి తొలగిస్తే అది అక్కడికి నిలిచి ఉండాలి. కానీ కాన్సరు వచ్చినట్లు గుర్తించేనాటికే ఆ కణాలు ఇతర శరీర భాగాల్లోకి చేరుతున్నట్లు బయటపడింది.

మమ్మోగ్రఫి పరీక్ష చేసే 10 మందిలో ఒకరికి మాత్రమే కాన్సరు పాజిటివ్ అన్న ఫలితం వస్తుంది. అలా పాజిటివ్ గా తేలిన వాళ్ళలో నూటికి 5 మందికే కాన్సరు వుంది. 95 మందిలో అవసరం లేకున్నా ఆ పరీక్షకు కొనసాగింపుగా మళ్ళీ బయాప్సీ పరీక్షలు, గడ్డల సర్జరీ, కొందరికి కీమోథెరపీలు కూడా చేస్తున్నారు. ఎక్కువ మందిలో రొమ్మును మొత్తంగా తొలగించడం (Mastectomy), రేడియేషన్ ఇస్తున్నారు. అమెరికాలో తీసిన లెక్కలలో పాజిటివ్ ఫలితం వచ్చిన వాటిలో 30 నుండి 50 శాతం తప్పు రిపోర్టులని తేలింది. దీనితో పాటు మమ్మోగ్రఫీ అయ్యాక పెరిగే మానసిక, శారీరక వ్యధలవల్ల జీవితపు నాణ్యత తగ్గిపోతుంది.

35 శాతం కాన్సర్లు పోషకాహారంతో ముడిపడి ఉంటాయి. కాన్సరుకు పొగాకు తర్వాత రెండో కారణం ఆహార లభ్యతే. అదనపు బరువు కాన్సరును తెచ్చిపెట్టే అంశం అని చెప్పుకున్నాం. అనేక రకాల కాన్సర్లు తగ్గుముఖంలో ఉన్నప్పటికీ, ఊబకాయ సంబంధ కాన్సర్లు సోకడం పెరుగుతోంది. అందువల్ల వాటి నివారణ కోసం ఆహారపరమైన వ్యూహాలు రూపొందించుకోవలసిందేనంటాడు జాసన్ఫంగ్.

కాన్సరు రాకుండా అద్భుతాలు సృష్టించగల ఆహారాలేమీ లేవు. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇన్సులిన్ అధికం కావడం వల్ల వస్తున్న ఊబకాయం, మధుమేహం-2లను నివారించగల వ్యూహమే కాన్సరుకూ పనికి వస్తుంది.

Upavasam – ఉపవాసం

100.00

చరిత్ర పొడవునా ఇతర మేధావులు కూడా ఉపవాసపు ప్రాధాన్యత గుర్తిస్తూనే వచ్చారు. ”మోతాదు మించితే విషమవుతుంది” అని చెప్పిన వైద్యుడు పాగా సెల్సస్‌ కూడా దీన్ని గుర్తించాడు. ”ఉపవాసం అతి పెద్ద చికిత్సా మార్గమని – అదే వైద్యుడనీ” రాశాడాయన. అమెరికా నిర్మాతలలో ఒకరైన బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ ”మందులన్నింటిలోకి మెరుగైనవి విశ్రాంతి, ఉపవాసమూ” అని అన్నాడు. ప్రఖ్యాత అమెరికన్‌ రచయిత, తత్వవేత్త అయిన మార్క్‌ ట్వెయిన్‌ కూడా ”మంచి మందులు, మంచి డాక్టర్ల కన్నా సగటు రోగికి ఎక్కువగా మేలు కలిగించేది ఉపవాసమే” నని రాశాడు. మన భారతీయ ఆయుర్వేదవైద్యులు ”లంఖణం పరమౌషదం” అని ఏనాడో చెప్పారు.

ఉపవాసంలో జరిగే ”ఆటోఫగీ” ప్రక్రియను కనుగొన్నందుకు జపాన్‌ శాస్త్రవేత్త అయిన యోషినోరి ఓసుమికి 2016 నోబెల్‌ బహుమతి లభించింది.

పేజీలు : 168

Antarani Vasantham

250.00

జీవితాన్ని ఎన్ని పేజీల్లోనైనా రాయొచ్చు. ‘అంటరాని వసంతం’ ఈ కొద్ది పేజీలలో పూర్తయ్యే జీవితం కాదు. నిజానికి పూర్తి కాలేదు కూడా.