YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 613–624 of 835 resultsSorted by latest
Kollayi Gattithe Nemi
₹250.00ఆంద్రదేశ చరిత్రలోనే 1920 -45ల పాతికేళ్ళకు అనిదంపూర్వమైన ప్రాముఖ్యం ఉంది. సామాజికంగా వీరేశలింగం ప్రభ్రుతులు సంస్కరణవాదధోరణులతో జాతి సంస్కారాన్ని ఎన్నో మెట్లెక్కించిన కాలం అది.
సహాయ నిరాకరణం, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు జాతిని అపార త్యాగాలకు సంసిద్ధం చేసిన కాలం అది. సాహితీ, నవ్యసాహితీ, అభ్యుదయోద్యమాలు సాంస్కృతిక రంగాన్ని నూతన స్థాయికి చేర్చిన కాలం అది.
తెలుగు ప్రాంతంలో జాతీయోద్యమ చరిత్ర శాస్త్రీయమైన అవగాహనతో అన్ని వైపుల నుంచి అధ్యయనం చేసి, కళాత్మకత దెబ్బతినకుండా “కొల్లాయిగట్టితేనేమి?” ‘దేశం కోసం’, ‘జ్వాలాతోరణం’, ‘రథచక్రాలు’, అనే చారిత్రక నవలలు మహీధర రామమోహనరావు రాశారు.
కాంగ్రెస్, కాంగ్రెస్ సోషలిస్ట్, ఫార్వర్డుబ్లాకు, రాయిస్టు, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ, అన్నీ కలిసి పరాయి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ, సంక్లిష్ట చారిత్రిక గతితో మానవ సంబంధాలలో వస్తున్న మార్పుల్ని సజీవ రీతిలో చిత్రించిన నవలలు ఇవి.
– మహీధర రామ మోహన రావు
Kunalamma Padalu – కూనలమ్మ పదాలు
₹30.00కూనలమ్మ పదాలు – ఆరుద్ర
సాహిత్యం అర్ణవమైతే ….. ఆరుద్ర మధించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే …. ఆరుద్ర విహరించని ఎత్లుల్లేవు. అతడు పట్టి బంగారం చెయ్యని సాహిత్య శాఖలేదు, ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు.
కేవలం కవిత్వాన్నే తీసుకున్నా అతడు చేసినన్ని ప్రయోగాలు, అంత అందంగా చేసినవారు ఆధునిక కవుల్లో మరొకరు లేరేమో! కవిత్వం కాక, కథలు, నవలలు, నాటకాలు, పత్రికా వ్యాసాలు, పరిశోధనలు – ఇలాగ అతని రచనా వ్యాసంగం బహుముఖంగా జరిగింది.
అతని ”కూనలమ్మ పదాలు” ప్రతిపద రమణీయం, పదపద చమత్కారకం. సమకాలిక జీవితం మీద చురుకైన విసుర్లతో, కరుకైన కసుర్లతో ఈ పదాలు రసప్రదాలు.
Mee Medaduki Padunenta – మీ మెదడుకు పదునెంత
₹40.00నేటి బాలసాహిత్య నిర్మాతలలో వాసాల నరసయ్యగారొకరు. వీరు కరీంనగర్ జిల్లా చౌలమద్దిలో 1942లో జన్మించారు. మెట్పల్లిలో చదివారు. స్కూలు మాస్టారుగా ఉద్యోగజీవితం ప్రారంభించి, పోస్టు మాస్టారుగా రిటైరయ్యారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే 1955లో ”సాగంధికాహరణము” వీధి నాటకం రచించారు. 1958 – 1960 వరకు స్కూల్ మాగజైను ‘అభ్యుదయవాణి’కి సంపాదకత్వం నెరిపారు.
పిల్లల మాసపత్రికల్లోనూ, దిన, వార పత్రికల్లోనూ బాలల కథలు, పొడుపు కథలు, గేయాలు, గ్రంథసమీక్షలు, చాలా వ్యాసాలతోపాటు అనేక గ్రంధాలు వెలువరించారు.
Lenin Kadha
₹50.00లెనిన్ జీవిత కధను ప్రముఖ రచయిత్రి నన్నపనేని మంగా దేవి గారు పిల్లలకు అర్ధమయ్యే విధంగా చక్కని కధను అందించారు.
వీరు బాల సాహిత్యం లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును, భారతీయ విద్యాభవన్ వారి “సర్వోత్తమాచార్య” జాతీయ పురస్కారాన్ని, విశిష్ట విద్యావేత్తగా పలు అవార్డు లను అందుకున్నారు.
Krishna Sastry Sahityam Modati Samputam (Krishna Paksham) – కృష్ణశాస్త్రి సాహిత్యం – 1 – కృష్ణపక్షము
₹50.00ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బెజవాడ నుండి బళ్లారి వెళ్తుండగా రైలు నడకలోని సమాన లయకు స్పందించి…. చుట్టూ వున్న నల్లమల అడవుల సోయగానికి పరవశించి ఆకులో ఆకునై పూవులో పూవునై అంటూ పలవరించారట. భావకవిత్వానికి అది మొదటి శృతి. అక్కడి నుంచీ కృష్ణపక్షం కవితలు ఆవిర్భవించడం మొదలయింది.
ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, వేదన, ప్రకృతి, విరహం, పదాల పోహళింపు, లయ…. వీటన్నిటి కలగలుపే ”కృష్ణపక్షము’. ఇదంతా 1921లో ప్రారంభమయి 1925లో పూర్తయింది. 1922లో కృష్ణశాస్త్రి భార్యా వియాగంతో కన్నీరు ఖండకావ్యం వచ్చింది. ఆ తర్వాత 1926లో ప్రవాసము, 1928లో ఊర్వశి వెలువడ్డాయి. కృష్ణపక్షము తెలుగు కవితా ప్రపంచంలో ఓ పెను సంచలనాన్ని రేపింది. భావకవిత్వం గొంతు సవరించు కుంది కృష్ణపక్షంతోటే. కృష్ణపక్షాన్ని వెక్కిరిస్తూ శుక్లపక్షం వంటి కొక్కిరింత రచనలు వచ్చినా అవి నిలువలేదు. కృష్ణపక్షం మాత్రం నేటికీ వెన్నెలలు కురిపిస్తూనే వుంది. అలా మిన్నెల్ల విహరించి మెరుపై మెరిసిన కృష్ణపక్షముతో పాటు ఈ సంకలనంలో ప్రవాసము, ఊర్వశి కూడా ఉన్నాయి.
నాకుగాదులు లేవు. నాకుషస్సులు లేవు అంటూ నిర్వేదం ప్రకటించి. ఏననంత శోకభీకర తిమిర లోకైకపతిని! అంటూ ప్రకటించుకుంటారు ఇందులో కృష్ణశాస్త్రిగారు. అంతేనా…. తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ జతగూడి దోబూచి సరసాలనాడి దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అంటూ భీష్మించుకు కూచుంటారు.
Iduguru Lofarlu – ఐదుగురు లోఫర్లు
₹100.00సాధారణంగా జైలు నుండి విడుదల అయిన వ్యక్తి బాగా చిక్కిపోయి నీరసంగా బికారిలా కనిపిస్తాడు. జైలు నుండి విడుదల అయిన తాంతియా అలాకాక, వెనుకటికన్న పిక్కబలిసి, మానమర్యాదలు గల గౌరవనీయుడుగా కనిపిస్తున్నాడు. జేబులో నలభై ఎనిమిది రూపాయల పండ్రెండణాల నగదుతో, ముఖమంతా ప్రసరించిన ముసిముసి నవ్వులతో అతను జైలు నుండి బయట అడుగుపెట్టాడు.
అలా బయటకు రాగానే ”యిప్పుడింక నేను దుర్వృత్తుల జోలికి పోను మాహిమ్‌లో ఏ బంకో తీసుకొని మంచి చిల్లర వ్యాపారమేదైనా చేస్తాను” అని స్నేహితులతో చెప్పాడు తాంతియా….
పేజీలు : 120
Virigina Vigrahaalu – విరిగిన విగ్రహాలు
₹80.00సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్ తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.
కిషన్ చందర్ 1914 నవంబర్ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు. ప్రధానంగా ఆయన నవలా రచయిత. ఆయన నవలలు అనేకం భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, రష్యన్, డేనిష్, పోలిష్, జర్మన్, హంగేరియన్, చైనా భాషలలోకి అనువదించబడ్డాయి.
ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకీ, ప్రేమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలి, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికి మాటలతో రూపమివ్వటం – కిషన్‌చందర్ ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి.
పేజీలు : 100
Rahasyam (The Secret) – రహస్యం (ది సీక్రేట్)
₹499.00మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకుని ఉన్నారు
ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగివున్నది, చేజారినది, అపహరించబడినది, లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చేయబడినది, తరువాతి తరాల వారికి అందించబడుతూ వస్తున్నది. శతాబ్ధాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలా మంది అర్థం చేసుకున్నారు. : ప్లేటో, గెలీలియో, బిథోవెన్, ఎడిసన్, కార్నేగి, ఐనస్టీన్ వంటి వారు. వీరితో పాటు మరికొందరు ఆవిష్కర్తలూ, వేదాంతులు, శాస్త్రవేత్తలు, గొప్ప తాత్త్వికులు కూడా దీన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ రహస్యం లోకానికి వెళ్ళడి చేయబడుతోంది.
”ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో, మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవరుచుకోగలరో, మీ మనస్సుకు నచ్చే పని ఎలా చేయగలరో, మీరు ఇష్టపడే వస్తువును ఎలా పొందగలరో తెలుసుకుంటారు. నిజంగా మీరెవరో మీకు తెలియవస్తుంది. జీవితంలో మీకోసం వేచివున్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు”.
పేజీలు : 198
Premalekhalu
₹270.00ప్రేమలేఖలు అంటే ప్రియమైన మిత్రులకి రాయటం. పురుషులుగాని స్త్రీలుగాని సెక్స్ భేదమైనప్పుడు ఆ ప్రేమలోవలెనే లేఖలో కూడా రొమాన్స్ పొయెట్రీ, టెండర్ నెస్ ఎక్కువగా కనిపిస్తాయి. లేఖలు ఎక్కువ అందంగా ఆకర్షకంగా ఉంటాయి. ప్రేమలేఖలు కానివి, పోస్ట్ లో రోజువెళ్ళే లక్ష ఉత్తరాలు – అన్నీ చెత్త. చికాకు వ్యవహారాలకోసం, దొంగ మర్యాదలకోసం, తగాదాలు, నోటీసులు – ఈ రకాలు.
మొత్తానికి విసుక్కుంటో రాసేవీ, ఏడుస్తో చదివేదిగా ఉంటాయి. వాజ్మయంలో లేఖకి స్థానం ఉండాలంటే అది ప్రేమలేఖ కావాలి. లేఖ కంటిన్యువస్ థాట్ గా ఉండాలి. చాలా ప్రియమైన మిత్రుడితో చల్లని కాలవ ఒడ్డునగాని, వెచ్చని గదిలో టీ, సిగరెట్ల ముందుగాని, కూచున్నప్పుడు ఎట్లా మాట్లాడతాము! అట్లా ఉండాలి ఉత్తరం. అంత నాచురల్ గా ఉత్తరం చదివే వారికి ఆ రాసేవారిని కలుసుకుని మాట్లాడుతున్నాము అనిపించాలి. ఉత్తరం చేతుల్లో పట్టుకుని చదివేవారు డే డ్రీమ్స్ లోకి, కలలోకి వెళ్ళకపోతే, ఆ ఉత్తరం వొచ్చి ప్రయోజనం లేదు.