Showing 493–504 of 835 resultsSorted by latest

Money Purse 2

300.00

సంపాదించడానికి ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తూనే ఉన్నారు. భూమ్మీద లెక్కలేనన్ని ఆదాయ మార్గాలున్నాయి. కానీ మనలో చాలామంది – సంపాదించిన దానిని వృధా కాకుండా పొదుపు చేయడానికి, మంచి ఆదా మార్గమేదో తెలుసుకోవడానికి శోధించడం లేదు పూర్తిస్థాయిలో. అందుకే ఆదాయ మార్గాల గురించి కాకుండా, అనవసర వ్యయాల గురించి, ఆధిక లాభాలనిచ్చే ఆదా మార్గాల గురించి చర్చించా ఈ పుస్తకంలో.

చిట్ ఫండ్స్  లాభమా? నష్టమా?

నేలను నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడా…?

రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఏ జాగ్రత్తలు తీసుకొవాలి?

వంద రూపాయలతో పది వేల కోట్లు……. ఎలా?

ఏడాదికి 9% వడ్డీ గిట్టబాటయ్యే ఎండోమెంట్ బీమా పాలసీ ఏది?

ఎల్ ఐ సి ఎండోమెంట్ పాలసీ లో రాబడి ఎంత?

ఏది ఉత్తమ పెట్టుబడి?

నమ్మకానికి అమ్మ వంటిది ఎల్ ఐ సి మాత్రమేనా?

ప్రైవేటు బీమా కంపెనీలను నమ్మ వచ్చా?

ఏజంటు లేకుండా పాలసీ తీసుకోవచ్చా?

పిల్లలని కోటిశ్వరులను చేయడం ఎలా?

పోస్టల్ అర్ డి, బ్యాంక్ అర్ డి ల లో ఏది ఎక్కువ లాభం?

వేయి రూపాయలు= లక్ష రూపాయలు

బంగారానికీ కల్తీ కావాలి

ఆరోగ్య మహాభాగ్యానికి ఏమి చేయాలి?

బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ లాభమా? నష్టమా?

బంగారం ఎలా కొంటే మంచిది?

జీవిత బీమా తక్కువయితే నేరం, ఎక్కువయితే ప్రమాదం

….ఇంకా ఎన్నో ఆర్ధిక సందేహాలకు చదవండి….

ఇది 5వ ముద్రణ…

Money Purse 3

300.00

ఏడాదికోసారి ‘హెల్త్ చెకప్’ చేయించుకుంటే రోగాలు రాకుండా జాగ్రత్తపడొచ్చు. ‘వెల్త్ చెకప్’ చేయించుకుంటే ఆర్ధిక సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కానీ వెల్త్ చెకప్ ఎవరు చేస్తారు? మనీపర్స్ చదివితే వెల్త్ చెకప్ అయి ఆర్ధికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకాలు.

                                              – గంపా నాగేశ్వరరావు గారు

               లక్ష్మీదేవి తన భార్యే అయినా వెంకటేశ్వర స్వామి నిత్యం నిలబడి సంపాదిస్తున్నాడు. కానీ కుబేరుడు..? కుబేరుడిలా కూర్చొని, పడుకుని, నిద్రపోతూ కూడా సంపాదించాలి అనుకుంటారా? కుబేరుడిలా శ్రమలేని ఆదాయం రావాలంటే ఆయనలా మీ డబ్బుని ఎక్కడ, ఎప్పుడు, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియాలి. ఆ ఆర్ధిక అక్షరాశ్యతలో భాగంగానే మనీపర్స్ 1 & 2 వచ్చాయి. ఇప్పుడు మనీపర్స్ – 3 మీ చేతిలో ఉంది. చదవండి…

ఈ పుస్తకం ద్వారా ఎక్కువ లాభం పొందాలి అనుకుంటున్నారా మీరు? ఐతే, కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశ్యంతో చదవకండి. తెలుసుకుంటే జీవితాలు మారవు. తెలిసిన విషయాలను ఎంతవరకు ఆచరిస్తున్నారని మిమ్మల్ని మీరు సమీక్షించుకోవడానికి చదవండి. పొద్దున్నే లేచి ఓ గంట నడిస్తే లాభం అని నాకు తెలిస్తే… ఏం లాభం? నడిస్తే లాభం. అలా రోజూ నడిచేంత వరకు నడక వల్ల ప్రయోజనాలు తెలుసుకుంటూనే ఉండాలి నేను. అలాగే మన జీవిత ఆర్ధిక ఆరోగ్యం ఎలా ఉందో మనకి మనం తెలుసుకునేందుకు మన ఫైనాన్స్ ని మనమే స్కానింగ్ చేసుకోవాలి. అందుకు ఈ పుస్తకం కొంతవరకు పనికొస్తుందని నమ్ముతున్నా.

ఈ పుస్తకంలో…

ఎంత సంపాదించాలి?

ఇల్లుకొందామా? అద్దెకుందామా?

పర్స్ లో పైసా తీయకుండా ఫ్లాట్ ఋణం తీర్చవచ్చా?

ఇంటి రుణ వాయిదాలు భారం అయితే.. ఏం చేయాలి?

అద్దెకారు తీయన… సొంతకారు పుల్లన ?

 

Money Purse

250.00

డబ్బులు చెట్లకు కాస్తున్నాయా?… అవును కాస్తాయి!! విత్తునాటే నేలనుబట్టి చెట్టు పెరుగుదల ఫలాలు ఉంటాయి. రూపాయి కూడా అంతే! నువ్వు దాన్ని పోస్టాఫీసులో నాటుతావా? బ్యాంకులో నాటుతావా? షేర్స్ లో నాటుతావా? ఇంటిపై నాటుతావా? బీమాలో నాటుతావా? లేదా అన్నీకలిపిన నేలలో నాటుతావా? అన్నదాన్ని బట్టి ఫలం. మరి ఎక్కడ నాటాలి? మీరు ఎవరినీ అడగాల్సిన పని లేకుండా వంగా రాజేంద్రప్రసాద్ చెబుతారు. ‘ఫీజు’ రూపాయలు. ‘చదువులు మనకన్నీ నేర్పుతాయి. డబ్బును ఎలా వాడుకోవాలో తప్ప’ అన్న ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు మిమ్మల్ని ఆలోచనల్లో పడేసి ఉంటే ఆ మిగిలిన ఒక్క నైపుణ్యాన్ని నేర్పే టీచరే ఈ పుస్తకం. పత్రికల్లో ఆర్ధిక సలహాలు అందిస్తున్న రాజేంద్రప్రసాద్ వృధా వాక్యాలు వాడకుండా ఇంత సరళంగా ఆర్ధిక పాఠాలెలా చెప్పారన్నదే పెద్ద ప్రశ్న.

– సాక్షి దినపత్రిక

Mohana Roopa

100.00

దక్షిణ ఎక్సప్రెస్ లయబద్దంగా శబ్దంచేస్తూ హైదరాబాద్ వెడుతుంది.

        పేరుకు మాత్రమే ఎక్సప్రెస్ . వేగం మాత్రం మందంగా పెళ్ళికూతురు నడకలా ఉంది. ఇంద్రమోహన్ కళ్ళు విప్పి చుట్టూ కలయజూచాడు. త్రి టైర్ స్లీపర్ కోచిలో అందరు నిదురబోతున్నారు.

          కొందరు ఖరీదయిన పరుపులు పరుచుకుంటే మరికొందరు దుప్పట్లు పరుచుకుని చేతిసంచో, తోలుపెట్టొ, చెయ్య తలక్రింద పెట్టుకుని నిదుర  బోతున్నారు.

        మూడో అంతస్తులో పడుకున్నాడు. ఇంద్రమోహన్ కి  క్రింది  సీటే దొరికింది. నాగపూర్ లో ఓ లావుపాటి స్త్రీ యెక్కింది. ఆమెను చుస్తే నీళ్ళగోలెం పై చెంబు బోర్లించినట్లు అనిపిస్తుంది.తరువాత ఏం  జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

                                                                                     -మాదిరెడ్డి సులోచన.

Misrani

260.00

ఇది సస్పెన్స్ నవల కాదు. క్రై0 నవల కాదు.

ఇది స్వతంత్రానికి పూర్వం జైపూర్ సంస్థానానికి చెందిన 84 ఏళ్ళ ఓ మహిళ కథ. కాబట్టి విభజనకి పూర్వం భారతీయ చరిత్ర ఇందులో చదవచు.

ఇంకా సినిమా అవుట్ డోర్ షూటింగ్ విశేషాలు , వివిధ భారతీయ వంటకాల గురించి, ఓ మహిళ జీవితంలోని అనేక మలుపు తిప్పిన సంఘటనల గురించి ఇందులో చదవచ్చు.

ఒకటి ఒంటరి అంకె , అందమైన జీవితం, మందాకినీ , జాబిలి మీద సంతకం నవలల్లా ఇది కూడా ఓ మహిళ జీవిత కథ.

మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి అందిస్తున్న 108 వ నవల మిస్రాణి

” Maha Nati” Cinema Aa” Nati” Ki Nyayam Cheyudu!

70.00

” Maha Nati” Cinema Aa” Nati” Ki Nyayam Cheyudu!

పెళ్ళి కానీ యువతీ, పెళ్ళి చేసుకునే ముందు, తనకు భర్త కాబోయే వాడి ప్రవర్తన “ఫలానా రకం  ” అని తెలిసినా , అప్పుడు కూడా ఆమె, అతని వ్యభిచార ప్రవర్తనని పాటించుకోనక్కరలేదా? భార్యగా సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రమే భర్తతో సంబంధాల గురించి ఆలోచిస్తుందా?- ఎలా వుంది సినిమా సావిత్రి జవాబు? “నేను ని భార్యగా వున్నాను కాబట్టి, నన్ను ఇప్పుడు మోసం చెయ్య కూడదు’ అంది. మరి, తను అతనికి భార్యగా మరలను కున్నపుడు , అతనికి అప్పటికే తాళి కట్టించు కున్న భార్య వుందని ఈమెకి తెలుసు కదా? అతడికి తను కొత్త భార్యగా అవడం అంటే, అతడు మొదటి భార్యని మోసం చేస్తున్నాడని  ఆ మోసంలో తను కూడా బాగస్తురాలిని  అవుతున్నానని అర్ధమే కదా? అది సావిత్రికి అప్పుడు తెలియదా?

The Secret- Magic

499.00

ఒక పదం అన్నింటినీ మార్చేస్తుంది

ఇరవై శతాబ్దాలకు పైగా ఒక పవిత్ర గ్రంథంలోని కొన్ని పదాలను చదువరులందరూ అపార్థం చేసుకున్నారు. ఆ పదాలు వారిని గందరగోళపరిచాయి. చరిత్రలో కొంతమంది పాఠకులు మాత్రమే ఆ పదాలలో ఒక గూడార్థం వున్నదనీ, ఆ అర్థాన్ని కనుక్కోగలిగితే మన కళ్ళముందు ఒక నూతన ప్రపంచం సాక్షాత్కరిస్తుందనీ తెలుసుకున్నారు.

“మ్యాజిక్” లో రోండా బర్న్ ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచం ముందు పరిచింది. ఒక 28 రోజుల అద్భుతమైన సాధనతో ఆమె ఈ జ్ఞానాన్ని నిత్యజీవితానికి ఎట్లా అన్వయించుకోవాలో మనకు భోదిస్తున్నది.

మీరెవరైనా కానీ మీరెక్కడున్నా కానీ మీ ప్రస్తుత పరిస్థితులెలా వున్నా గానీ ఈ “మ్యాజిక్” మీ జీవితం మొత్తాన్నీ మార్చివేస్తుంది.

Malapalli – మాలపల్లి

300.00

అవి జాతీయోద్యమం రోజులు,

ఈ రచనను బ్రిటీషు ప్రభుత్వం

రెండు పర్యాయాలు నిషేధించింది.

రచయితను – రచనను ప్రముఖులు

వేనోళ్ళ కొనియాడారు.
తెలుగు సాహిత్యంలోని గొప్ప నవలలో ‘మాలపల్లి’ ఒకటి. స్వాతంత్య్రోద్యమ కాలంనాటి తెలుగు జన జీవితాన్ని, విభిన్న భావజాలాల సంఘర్షణలను అద్బుతంగా చిత్రీకరించిన నవల ‘మాలపల్లి’. తెలుగువారిపై ‘మాలపల్లి’ చూపించిన ప్రభావం బ్రిటీషువారిని కలవరపరచి ఈ నవలను నిషేధించేలా చేసింది.

Maa Bhoomi – మా భూమి

80.00

ఈ నాటకంలో గ్రామీణ ప్రాంతాలలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యంగా తీర్చిదిద్దబడిన పాత్రలు, బిగువైన సన్నివేశాలు, సహజమైన సంభాషణలు, పాత్రోచితమైన భాష, మాండలికాలు, సామెతలు, ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సందర్భోచితంగా ఉన్న పాటలు ప్రేక్షకుల్ని ఉత్తేజపరుస్తాయి. ఇంత విశిష్టమైన నాటకం తెలుగు నాటక రంగంలో మరొకటి లేదనటం అతిశయోక్తి కానేకాదు.

హిందూ-ముస్లిం ఐక్యత, జనాభాలో సగంగా వున్న మహిళలు, ఉద్యమాలో కూడా ముందుండాలనీ, ప్రజా ఉద్యమాలలో సామాన్యులే అసామాన్యపాత్ర నిర్వహించగలరనే విషయాలను నాటకంలో స్పష్టం చేయడం ద్వారా ‘మా భూమి’ ఇతివృత్తానికి మరింత పుష్టి చేకూరింది.

కొన్ని గొప్ప నాటకాలు చదువుకునేందుకు మాత్రమే… ప్రదర్శన కష్టతరం.. మరికొన్ని నాటకాలు ప్రదర్శనలో మాత్రమే గొప్పగా వుంటవి. కాని ‘మా భూమి’ నాటకం చదువుటకూ, ప్రదర్శనకూ అనువైన గొప్ప నాటకం.

Love Stories that Touched my Heart

147.00

We have all come across the first flush of love and recall the lingering aroma of it. For all ages love remains one of the most congenial experiences for everyone. Mankind has coined various definitions to portray this delightful feeling, yet this little word is a feeling that can’t just be characterized. It must be elaborated as stories romantic tales.

The book ‘Love Stories That Touched My Heart’ is compilation of those stories that came from readers all over the nation. It is a selection of such stories from readers who have a tale to share and possess a flair for writing. The collection of stories published in this book was selected from over 2000 entries that were submitted in a competition held by Penguin India. It describes all emotions connected with love – anger, frustration, anxiety, eagerness, delicateness and nervous energy. While routing through these emotions, plenty of writers in this treasury takes you through first infatuation, first breakup, love- marriage, love in the second innings, love across decades, love across genders and sexual orientations and love across generations. Nominated and edited by author Ravinder Singh, this anthology is made up of heart touching stories that will make you feel that love is the most spiritual emotion. So if you are romantic enough and love to read tales of romances that yield from the real life, then the book is ideal bet for you. The book is easily available on Amazon India.

About the author:

There is no doubt that author Ravinder Singh is a smash hit creator. I Too Had a Love Story, his introductory novel, is his own story that has touched a great many hearts. ‘Will Love Happen Twice?’ is his second novel. In the wake of spending the greater part of his life in Burla, a residential town in western Orissa, Ravinder has settled down in Chandigarh. Ravinder adores playing snooker in his leisure time.

The book is published by Penguin Publishers, it increases the trustworthiness. Penguin Books is a British publishing house which was established in 1935 by Sir Allen Lane. Penguin’s prosperity exhibited that huge amount of readers existed for genuine books. Penguin additionally significantly affected public debate in Britain, through its books on legislative subject like Politics, Arts and Science.

Hrudayanetri – హృదయనేత్రి

80.00

‘గోపాలాన్ని – నా వెంట తీసుకెడతానురా తమ్ముడూ. వాడు బట్టలు సంచీలో పెట్టుకు ఏడుస్తున్నాడురా!” అంటూ తండ్రిని రాముడత్తయ్య అడగటం, తలుపు వెనకన నక్కి నిల్చుని వింటున్నాడు గోపాలం.
పొందూరు ఖద్దరు చీరె – గోచీపోసి ట్టుకుని, గుండ్రటి సిగమధ్యన రాళ్ళ చామంతి పువ్వు చుట్టుకున్న రాముడత్తయ్య అంటే గోపాలానికి ప్రాణం. రాముడత్తయ్య ‘వందేమాతరం’ అంటుంది. ఎవరో గాంధీగారుట, ఆయన్ని మహాత్ముడంటూ, ‘ఆ గాంధీగారు స్వరాజ్యం తెచ్చిపెడతాడు – తెల్లవాళ్ళందరిని తరిమి కొడతాడు’ అంటూ – రాత్రిళ్ళు పక్కన పడుకోపెట్టుకుని కథలు చెప్పే రాముడత్తయ్య, వూరికి వెళ్ళిపోతోందీ అంటే ఏడుపు వచ్చింది గోపాలానికి –
”నీతో నేనూ వచ్చేస్తాను” అంటూ సంచీలో చొక్కాలాగూ పెట్టుకుని, రాముడత్త కొంగు వదలకుండా తిరుగుతున్నాడు పదేళ్ళ గోపాలం.
రాముడత్తయ్య అని పిలవబడే రామలక్ష్మమ్మగారు ఆ యింటి పెద్దాడబడుచు. నలభై ఏళ్ళుపైన వుంటాయి. పిల్లలు లేరు. ఆవిడ గురించి – విడ్డూరంగా పెద్దవాళ్ళు చెప్పుకోవటం చాలాపార్లు వినివున్నాడు గోపాలం. తన తల్లి సుబ్బమ్మకి, ఒదినగారంటే భయం – పైకి ‘ఒదినగారూ’ అంటూ – గౌరవంగా పిలుస్తూ – భయభక్తులతో వున్నా! ….