YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 325–336 of 860 resultsSorted by latest
Aha Oho Ikigai
₹90.001. ప్రారంభం
అది అందాల మైసూరు నగరంలోని దాసప్రకాష్ హోటల్.
ఆటోలోంచి దిగిన పూర్ణిమ చకచకా నడుస్తూ తన అన్నావదినలు బస చేసిన గదికి వెళ్లింది.
ఆమె అన్నయ్య రత్నాకర్ ప్రముఖ వ్యాపారవేత్త, వదిన వనజ వైద్యురాలు. వాళ్లకు తొమ్మిదో తరగతి చదువుచున్న పదమూడేళ్ల బాబు అన్వేష్. వాళ్లు ఉండేది హైదరాబాద్లో.
గదిలో అడుగు పెట్టిన పూర్ణిమను చూడగానే “చెల్లీ, వచ్చేశావా! పద పద. మాకు మంచి అల్పాహారం పెట్టిద్దువుగాని” అన్నాడు రత్నాకర్ సరదాగా నవ్వుతూ,
“రాకరాక వచ్చారు. అల్పాహారంతో సరిపుచ్చుతానేంటి! మీరిక్కడ ఉన్నన్ని రోజులూ మా మైసూరు ప్రసిద్ధ వంటకాల రుచి చూపిస్తాలే, అన్నయ్యా” అంది పూర్ణిమ కొంటెగా.
వనజ అందుకుని “మేముండేది ఈ రోజు సాయంత్రం వరకేనమ్మా. తరువాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం. వ్యాపారరీత్యా మీ అన్నయ్య విదేశాలకు వెళ్లాలట” అంది.
“అవునా ? ఇంతకీ మీరు ఏ పనిమీదొచ్చారు, వదినా ?” అడిగింది పూర్ణిమ.
“మీ అన్నయ్యకు ఇక్కడ ఏదో ముఖ్యమైన బిజినెస్ పని ఉంది. నాకేమో మా డాక్టర్ల సదస్సు ఉంది. అవును పూర్ణిమా, ఇక్కడ మైసూరు విశ్వవిద్యాలయంలో ఎంతో ఇష్టపడి సైకాలజీ కోర్సులో చేరావు కదా! ఎలా ఉంది ?” అడిగింది వనజ…………
1232 KM Gruhonmukhanga Sudhirgha Prayanam
₹350.00నాంది
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ 24 మార్చి 2020 రోజున భారతదేశంలో భకోవిడ్-19 మహమ్మారి ఇంకా పెరిగిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడుతూ లాక్ డౌన్ ప్రక్రియను మొదలుపెట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే అది అమలు చేయబడింది.’
మూడు భాగాలలో అది మే 31వ తారీఖు వరకు కొనసాగింది. సార్స్ కోవి 2 అనే ఈ వైరస్ కి సమాధానంగా ఎన్నో దేశాల్లో, జరిగిన ఎన్నో ప్రక్రియలలో, భారతదేశంలో జరిగిన ఈ లాక్ట్రాన్స్లోనే ప్రక్రియను మాత్రం కొందరు వ్యక్తులు క్రూరమైనది గా వర్ణించారు.
138 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో 21 రోజుల లాక్ట్రాన్ ప్రకటించడం అంటే, మినహాయింపు ఉన్నా వారు తప్పించి మరెవ్వరూ బయటకు వచ్చే వీలు కానీ, సౌకర్యం కానీ లేదు. దేశ ప్రజలను ఈ మహమ్మారి నుంచి రక్షించడానికే ఈ ప్రక్రియను అమలులో పెట్టినట్లు దేశ ప్రధాని ప్రజలకు చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు పౌర శాఖ తో కలిసి పని చేసి, పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాయి అని, నిత్యావసర వస్తువుల సరఫరా లో ఎటువంటి అంతరాయము కలగకుండా తాము చర్యలు |
– ఈరోజు అర్ధరాత్రి నుండి, దేశం మొత్తం సంపూర్ణంగా లాక్టిన్’ లోకి వస్తుంది.
Viswa Vijetha By Yandamuri Veerendranath
₹250.00మొదటి అధ్యాయం
1898వ సంవత్సరం. కలకత్తా ఉత్తర ప్రాంతం. హారిసన్ రోడ్. మూడంతస్తుల భవనంలో ఒక మారుమూల గది. మంచం మీద రెండేళ్ళ బాలుడు టైఫాయిడ్ జ్వరంతో పడుకుని ఉన్నాడు. అతడి వళ్ళు కాలిపోతోంది. గుమ్మం దగ్గర నిలబడి ఇద్దరు వ్యక్తులు అతని వైపే ఆందోళనగా చూస్తూ ఉన్నారు. అందులో ఒకరు ఆ కుర్రవాడి తండ్రి గారి
మోహన్ డే. పక్కనే ఉన్న వ్యక్తి ఆ బాలుడిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ బోస్. మోహన్ డే స్నేహితుడు.
“అబ్బాయి బలహీనంగా ఉన్నాడు. చికెన్ సూప్ ఇస్తే మంచిది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం” అన్నాడు డాక్టర్ బోస్.
“మేం వైష్ణవులం. ప్రాణం పోయినా ఒప్పుకోను.”
బోస్ బ్రతిమిలాడుతున్నట్టూ “నీకంత అభ్యంతరమైతే మా ఇంట్లో చేయించి తీసుకువస్తాను మోహన్. దయచేసి ఒప్పుకో. ఇది జీవన్మరణ సమస్య” అన్నాడు.
“తప్పనిసరి అయితే ఇక నీ ఇష్టం” అయిష్టంగా జవాబిచ్చాడు తండ్రి. ఇంటిలో చికెన్ సూప్ తయారు చేయించి తెప్పించాడు డాక్టర్ బోస్. బాలుడిని రెండు చేతులు | మీద పైకి లేపి స్వయంగా తాగించబోగా మరుక్షణం వాంతి అయిపోయింది. అది చూసిన తండ్రి విశ్రాంతంగా ఊపిరి తీసుకున్నాడు. ఆ పై మరో రెండు రోజులు గడిచాయి. ఏ సూపు అవసరం లేకుండానే ఆ బాలుడు ఆరోగ్య వంతుడయ్యాడు.
“నీ కొడుకు అంత పెద్ద విషజ్వరంతో బాధపడుతూ ఉంటే, అతడి ఆరోగ్యం గురించి అంత ధీమాగా ఎలా ఉన్నావ్? ఏమిటి నీ ధైర్యం?” ఆశ్చర్యంగా ప్రశ్నించాడు | బోస్.
పుట్టగానే మా అబ్బాయి జాతకచక్రం వేసిన జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? నా కొడుకు సముద్రాలు దాటుతాడని, వందకి పైగా గుళ్ళు కడతాదని, | కృష్ణతత్వాన్ని వాడవాడలా చాటిన ప్రవక్తగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పాడు. దాన్ని మనసా వాచా పూర్తిగా విశ్వసించిన నేను, భగవత్సంకల్పం వల పుట్టిన నా కొడుకు ఏ జ్వరము ఏమీ చేయదని మనస్ఫూర్తిగా నమ్మాను” అన్నాడు…………..
Garuda Puranamu
₹800.00హిందూ మత ధార్మిక గ్రంధాలలో స్మృతులు ఒక భాగము. పురాణాలు కూడా స్మృతులే. పురాణాలలో గరుడపురాణం అంతగా అపనమ్మకాలు పాలైన వాటిల్లో మరొకటిలేదు. కొందరు పూర్వాచార పరాయణులు గరుడపురాణం చదవటం కాదు, కనీసం తాకడానికి కూడా ఇష్టపడరు. అందుకు కారణం ఆ పురాణం బ్రహ్మఖండంలో జీవికి మరణం తర్వాత కలిగే వివిధ సంస్కారాలు, అంత్యేష్టి వివరించబడటమే. అయితే గరుడపురాణం గరుడపురాణం మూడు భాగాలని అందులో బ్రహ్మ ఖండం చాలా చిన్నదని, ఆ ఖండంలోనే కొంత జీవి మరణానంతర కర్మకాండల గురించి చెప్పబడినదని ఎక్కువమందికి తెలియదు.
గరుడపురాణం వైష్టవ పురాణాలలో ఒకటి. ఇది మహావిష్ణువుకు అయన వాహనమైన గరుడునికి సంభాషణగా వివరింపబడిన పురాణం. గరుడపురాణం లో చాలా విలువైన సమాచారాన్ని పురాణ పాటకులకు తెలియచేస్తుంది. ఈ పురాణంలో చాలా విలువైన సమాచారాన్ని పురాణ పాటకులకు తెలియచేస్తుంది. ఈ పురాణంలో వైద్యము, వ్యాకరణము, రత్నపరీక్ష, జ్యోతిష్యము, వంటి అనేక శాస్త్రాలు వివరించబడ్డాయి. అందుకని దీనిని విజ్ఞాన సర్వస్వ లక్షణాలు ఉన్న పురాణంగా పురాణ పండితులు విశ్లేషిస్తున్నారు. అంతేగాక భారతీయ విజ్ఞానం అనేక సందర్భాలలో ఎటువంటి మినహాయింపులు లేకుండా ఈ పురాణంలో వివరించబడ్డాయి. అందువలన ఈ పురాణాన్ని విజ్ఞానం కావాలనుకునే వారందరూ అధ్యయనం చేయటం అవసరం. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలను పెట్టుకోనవలసిన అవసరం లేదు. దీనిని జిజ్ఞాసువులైన వారందరూ పటించిన భక్తి ముక్తి పొందగలరు.
Agnipatham_Mattimanushulu
₹150.00విభిన్న ఇతివృత్తాలతో విలక్షణ నవలలు
కథారచయితగా ‘పాలపిట్ట’ పాఠకులకు సుపరిచితులైన గన్నవరపు నరసింహమూర్తి రాసిన రెండు నవలలు ఇవి. పోలీస్ వ్యవస్థలో నిజాయితీగా పని చేయడానికి పూనుకున్న ఒక యువ ఐపిఎస్ అధికారి ఎదుర్కొన్న సవాళ్ళను, రాజకీయ వ్యవస్థ ఒత్తిళ్ళను అధిగమించి నిజాయితీగా పని చేసిన తీరును ‘అగ్నిపథం’ నవల ఆవిష్కరించింది. నీతి, నిజాయితీ, చట్టాన్ని అమలు చేసే పట్టుదల గల పోలీసు అధికారులు ఉన్నపుడు పోలీస్ వ్యవస్థ విశ్వసనీయత ఇనుమడిస్తుంది. ఈ విషయాన్ని సాధికారికంగా నిరూపించిందీ నవల. ఆద్యంతం ఆసక్తికరమైన కథనంతో నడిచింది. ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతంలోని ప్రకృతినీ, పరిస్థితులనీ, సమస్యలనీ బలంగా చిత్రించిన నవల ఇది. ప్రజలకు సేవ చేయడానికి అంకితమై పనిచేసే అధికారులు జనానికీ, సమాజానికి ఎన్నివిధాల మేలు చేసే అవకాశం ఉన్నదో ఈ నవల చదివితే బోధపడుతుంది.
ఉత్తరాంధ్రలోని వ్యవసాయిక పరిస్థితులను, నీటి ప్రాజెక్టుల కోసం ఆందోళనలని చిత్రించిన నవల ‘మట్టిమనుషులు’. అంతేగాక తన ఊరి ప్రజల కోసం తపించే ఓ ఐఐటి చదువుకున్న యువకుడి జీవనగమనం భూమికగా రూపుదిద్దుకున్న నవల ఇది. వ్యవసాయరంగం సంక్షోభరహితంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ నవలలో రచయిత చర్చించారు. అలాగే పల్లెల నుంచి వలసలు ఆగిపోవాలంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలో బాగా చెప్పారు. ముఖ్యంగా మానవ సంబంధాల ప్రాముఖ్యాన్ని ఆరంగా చిత్రించారు రచయిత. ఈకాలాన అమెరికాకు తరలిపోవడమే లక్ష్యంగా ఉన్నత చదువుల్లో చేరుతున్నారు. దీనికి భిన్నంగా తన గ్రామం కోసం, అక్కడి ప్రజల కోసం, నీటివసతుల కలువ కోసం ఓ యువకుని తపనని, కృషిని దృశ్యమానం చేసిన నవల ‘మట్టిమనుషులు, ఈ నవలా పఠనం ఉదాత్త అనుభవం. ముఖ్యంగా సన్నివేశాల కల్పన, సంబాపణలు సహజంగా ఉన్నాయి. గన్నవరపు నరసింహమూర్తి కథనశైలిలోని ప్రత్యేకత…………
Nalla Trachu
₹120.00నల్లతాచు
ఇంతకుముందు ‘వారియర్ షాడో’ కథను గురించి కొంచెం గుర్తుచేసే ప్రయత్నం ఇది. దేశంలో ఉన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్సంస్థలన్నిటినీ తందనాలు తొక్కిస్తున్న గజదొంగ షాడోని పట్టుకోవటంలో సహాయం చేసేందుకు వచ్చిన సిఐబి చీఫ్ కులకర్ణిగారికి చాలా దగ్గిరిగా వచ్చి కూడా ఆయన దృష్టిలో పడకుండా తప్పించుకున్నాడు షాడో.
సరిహద్దులకు ఆవల నివశించే అసరుద్దీన్ అనే పెద్దమనిషిని బంధించి, అతని ఎస్టేట్ ని తను స్వాధీనం చేసుకున్న అజ్మల్ భాయ్ అనే ఒక క్రిమినల్ ఆట కట్టిస్తాడు అతను.
ఆ ఎస్టేట్లో బంధింపబడిన భాంజీ సాబ్ కూతుర్నీ, ఇతర ఆడబిడ్డలను చెరనుంచి విడిపిస్తాడు.
భాంజీసాబ్ సరిహద్దులకు ఇవతల ఉన్న తన ఎస్టేట్లో ఒక విచిత్రమైన ఒంటెల్ని పెంచుతూ ఉంటాడు,……….
Sagara Ghosha
₹440.00ఇది విశ్వకావ్యం. భూమి చరిత్రే ఈ కావ్యంలోని ఇతివృత్తం. మానవుడే దీంట్లో నాయకుడు. ఇది మనిషి కథ. కోట్ల ఏళ్లనాటి భూమి పుట్టుక నుండి నిన్న మొన్నటి ఘట్టాల వరకు ఇంచుమించుగా మానవుని మహాప్రస్థానంలోని అన్ని సంఘటనలు ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇది పర్యావరణ పద్య కావ్యం. మనిషి భౌతిక పరిసరాలు అందంగానూ, ఆనందాయకంగాను ఆలోచించాలని తెలియజెప్పే కావ్యం ఇది. ఆదిశంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో అన్ని దేశాల సాంస్కృతిక చరిత్రని పరిశీలించి, విశ్లేషించిన కావ్యం.
ఇది 1116 పద్యాలతో నిండిన కావ్యం. ఒక ఆశ్వాసానికి 108 చొప్పున 10 ఆశ్వాసాలు ఉన్నాయి. అవతారికలో 36 పద్యాలు ఉన్నాయి. వృత్తాలు పాతవే అయితే ఇతివృత్తం కొత్తది. ఒకానొక ప్రౌడవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చొని, సముద్రాన్ని వర్ణిస్తూ, తన్మయస్థితిలో ఉంటాడు. ఇంతలో ఒక పిల్ల కెరటం ఒడ్డుకు వచ్చి, ఆ కవి ఒళ్ళో వాలుతుంది. ఒక పసిపాప తన ఒడిలోకి వచ్చినట్లుగా భావించి, ఆ కవి ఆ కెరటాన్ని ప్రేమగా చేరదీస్తాడు. లాలిస్తూ దాని ఒళ్ళంతా నిమురుతూ ఉంటే, దాని వీపంతా జిడ్డు జిడ్డుగా, మడ్డిగా కనబడుతుంది.
“స్వచ్చంగా ఉండవలసిన నీటికెరటానివి, ఇలా ఉన్నావేమిటి”? అని ప్రశ్నిస్తాడు. తాను ఇరాక్ తీరం నుంచి కొట్టుకు వస్తున్నానని, సద్దాం హుస్సేన్ సముద్రంలో ఆయిల్ పారబోసినప్పటి నుండి తన పరిస్థితి ఇలా అయిందని కెరటం వాపోతుంది. తాను కొద్ది రోజులు కవి ఒడిలోనే విశ్రాంతి తీసుకు వెళతానని ఆర్థిస్తుంది. గుండె కరిగిన కవి ఆ తరంగ బాలికకు కవిత్వంతోనే అతిథి మర్యాదలు చేసి, జోలపాడి నిద్రపుచ్చుతాడు. తరంగం మేల్కొన్న తరువాత అది తిరిగి వచ్చిన తీరాలలోని విశేషాలను చెప్పమని ఆర్థిస్తాడు. అప్పుడా కెరటం చెప్పిన మానవుని జీవిత కథే ఈ సాగరఘోష.
Seetaramanjaneya Samvadamu
₹350.00ఈ సీతారామాంజనేయ సంవాదానికి కీ.శే.గురుమూర్తి గ్రంధకర్త. నారాయణ శాస్త్రులు సరళ వ్యాఖ్యానం రాశారు. 29 ఏళ్ళ తరువాత యిప్పుడు మారిన వాడుక భాషకు అనుగుణంగా మూలభంగం కాకుండా వోరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు సరళ వ్యాఖ్యానం రాశారు. ఆధ్యాత్మిక రామాయణానుభూతి (రామాయణంలో ఈ సంవాదం లేదు) తో గురుమూర్తి గారు రాసినదే ఈ సీతారామాంజనేయ సంవాదం. భక్తునికీ భగవంతునికీ మధ్య జరిగిన సంవాదమిది. ఆనందానికీ, ఆనందోబ్రహ్మకూ నిదర్శనం.
Rich Dad Poor Dad
₹399.00రిచ్ డాడ్ పూర్ డాడ్….
* ధనికులు అవాలనుకునే వారు ఆదాయాన్ని అధికంగా సంపాదించాలి అనే కట్టుకధని పటాపంచలు చేస్తుంది.
* మీ ఇంటిని మీరొక ఆస్తి అనుకునే నమ్మకాన్ని సవాలు చేస్తుంది.
* తమ పిల్లలకి డబ్బు గురించి నేర్పించటానికి నేటి విద్యా విధానం మీద ఎందుకు ఆధారపడకూడదో తల్లిదండ్రులకు తెలియజేస్తుంది.
* ఆస్తి, అప్పులకు ఆర్ధికపరమైన శాశ్వత నిర్వచనాలను ఇస్తుంది.
* మీ పిల్లలు భవిష్యత్తులో ఆర్ధికంగా విజయం సాధించటానికి, వాళ్ళకు ఏం నేర్పాలో మీకు బోధిస్తుంది.
రాబర్ట్ కియోసాకీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది జనానికి డబ్బు గురించి ఎలా ఆలోచించాలో నేర్పి, వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చారు. సూటిగా మాట్లాడడం లోనూ, ధైర్యంగా మూసభావాలని ఎదుర్కోవడంలోనూ అతను పేరు పొందారు. తరచూ అతని వైఖరి సాంప్రదాయక వివేకాన్ని ధైర్యంగా ఖండిస్తూంటుంది. ఆర్దిక స్వాతంత్ర్యాన్ని ఆవేశపూరితంగా సమర్ధించే వ్యక్తీగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
రిచ్ డాడ్ పూర్ డాడ్ అత్యుత్తమ వ్యక్తిగత ఆర్ధిక గ్రంథం
“భవిష్యత్తులో భాగ్యవంతులవాలనుకునేవాళ్ళు రిచ్ డాడ్ పూర్ డాడ్ తోనే మొదలుపెట్టాలి.”
– యు.ఎస్.ఎ.టుడే
“జనం డబ్బు కోసం కష్టాలు పడటానికి ముఖ్యకారణం, వాళ్ళు ఎన్నో ఏళ్ళు విద్యాలయాల్లో చదువుకున్నప్పటికీ, డబ్బు గురించి అక్కడ ఏమీ నేర్చుకొకపోవటమే! దాని ఫలితం – వాళ్ళు డబ్బు కోసం పనిచేయటం నేర్చుకుంటారు…. కాని, డబ్బు చేత పనిచేయించటం వాళ్ళెన్నడూ నేర్చుకోరు.”
– రాబర్ట్ కియోసాకీ
Janani Janmabhoomi
₹90.00శ్రీమతి రుకాయ బేగం దిండునానుకుని కూర్చుంది. ఆమె నిశ్చలంగా కూర్చున్నా, చూపులు మాత్రం చంచలంగా కదులుతున్నాయి. మాటి మాటికీ ద్వారం వైపు దృష్టిసారించి, నిరాశగా నిట్టూరుస్తోంది. తాంబూలం సేవద్దామని “పాన్ దాన్ ” తీసింది. ఎమనుకున్నాడో మళ్ళి మూసింది. “చుక్కుమా! ఓ చుక్కుమ్మ!” అని పిలిచింది విసుగ్గా.
“అమ్మ!” అని, చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వచ్చింది చుక్కమ్మ.
“వంటయిందా?”
“అయిందమ్మా! కాఫి, చా ఎమన్నా పెట్టనా అమ్మ?”
“వద్దులే. వీళ్ళిద్దరూ రాలేదు. చూడే! ఇంకా రాలేదు… ” ఆమె మాట పూర్తికాకముంటే ఇరవైఏళ్ళ యువతీ, పంజాబీ దుస్తులు వేసుకుని వచ్చింది. ఆమెను చూడగానే రకయాబేగం కళ్ళు వెడల్పు అయ్యాయి. “వచ్చావా సాజి?” అన్నది సంబరంగా. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
శప్తభూమి
₹135.00శప్తభూమి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. రాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు. అప్పటి జీవితము చిత్రించిన చారిత్రాత్మక నవల. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారం శప్తభూమి.
ఈ నవలలోని చారిత్రక పాత్రలను సమీక్షించుకుంటున్నప్పుడు ఎక్కువమంది అణగారిన వర్గాల వారే అయి ఫున్నారన్న సంగతి తెలిసివచ్చింది. వారు దళిత బహుజన కులాలవారే ఈ విషయం గుర్తించిన తర్వాత రాయలసీమ చారిత్రక నవల కాస్తా, రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా రూపం తీసుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా, చారిత్రక కథ నుండి చారిత్రక నవలకూ, చారిత్రక నవల నుండి దళిత బహుజన చారిత్రక నవలకూ ప్రయాణించిన ఆలోచన క్రమం కూడా ఈ నవలా రచన వెనుక పనిచేసింది.
– బండి నారాయణస్వామి
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
₹200.00“వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”
“ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”
“సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”
“తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “