YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 313–324 of 860 resultsSorted by latest
Dyana Margam
₹299.00ప్రశ్న: ‘ధ్యానం’ అంటే ఏమిటి?
ఎం: ధ్యానం అనేది చాలా విస్తృతమైన భావన. ఇంగ్లీషులో ఉపయోగించే మెడిటేషన్ అనే పదం పతంజలి యోగ సూత్రాలలోని ధారణ, ధ్యాన, సమాధి అనే మూడు భాగాలను సూచిస్తుంది.
ధారణ అంటే సామర్థ్యం లేదా శక్తి, లేదా తమ మనస్సును ప్రత్యేకించి ఒకే ఆలోచనా ప్రవాహంలో కేంద్రీకరించేలా అభ్యాసం చేయడం. అది పరిపక్వం చెంది నిరంతర ప్రక్రియగా మారినప్పుడు ధారణ, ధ్యానంగా మారుతుంది. ధ్యానం కొంతకాలం పాటు కొనసాగిన తర్వాత కలిగే అనుభవం ద్వారా సమాధి అంటే ఏమిటో అర్థం అవుతుంది. చాలాసార్లు ఇలాంటి ప్రశ్న అడిగిన వ్యక్తి పద్ధతిని గురించి అడుగుతున్నారు.
ధ్యానానికి సంబంధించిన అభ్యాసాలన్నీ పతంజలి యోగ సూత్రాలలో పొందుపరచబడి ఉన్నాయి. ధ్యానం గురించి మనం చర్చించేటప్పుడు చెప్పుకుందాం. వాస్తవమైన అనుభవం అనేది కేవలం అభ్యాసంతోనే వస్తుంది. ఇది ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది. అయితే, మెళకువలను అభ్యసించడం అనేది మంచి ప్రారంభమే. సుదీర్ఘకాలం స్థిరంగా, నిరంతర సాధనగా పతంజలి ఈ వ్యాయామాన్ని వివరించారు. ఇదే నైరంతర్యాభ్యసేన’, దీర్ఘకాలే.
ఎలాంటి అంతరాయాలు లేకుండా చాలా కాలం పాటు కచ్చితంగా చేసినప్పుడు…………
Chitra Veena
₹200.00మనసు మీటిన “చిత్రవీణ”
ఉరుదూ ముషాయిరాల్లో కొందరు గజలను “తరన్నుమ్” (రాగయుక్తం) గానూ, మరికొందరు “తహెత్” (రాగం లేకుండా) గానూ వినిపిస్తారు.
గజల్ ప్రధానంగా గాన ప్రక్రియకు చెందినదే అయిననూ, ఎవరికి వారు రాగరహితంగానూ చదువుకుని ఆనందించవచ్చును. దేని సౌందర్యం దానిదే.
హైదరాబాద్‌కు చెందిన ఉస్తాద్ (నజీర్ అలీ ఆదిల్ గారు)… తన గజళ్ళను తహెత్ (రాగంలేకుండా) గా వినిపించేవారు. అప్పట్లో వారి ముషాయిరాలకూ జనం కోకొల్లలుగా ఉపస్థితి అయ్యేవారు. అమితంగా ఆనందించేవారు కూడా..
ఇప్పుడిది ఇక్కడ ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందీ అంటే, కవయిత్రి విజయ గోలి గారి “చిత్రవీణ” గజళ్ళలో అటు “తరున్నుమ్” లోనూ, ఇటు “తహెత్”లోనూ ఎలా వినిపించిననూ శ్రోతల హృదయాలను అకట్టుకోగలిగే గజళ్ళు పుష్కలంగా వున్నాయని చెప్పడానికే. ఈ క్రింది గజలను చదవండి
“మనసెందుకు గమ్మత్తుగ గగనవీథి తేలుతుంది ! ఏమైనదో తెలియకుంది ఎద చప్పుడు పెరుగుతుంది ! కనుపాపల లాలిపాడ కరుణించదు నిదుర తల్లి కలలలోన రూపమేదొ అలలాగే కదులుతుంది ! నీలిమబ్బు ఛాయలలో జారుకురుల దోబూచుల అల్లరేదొ తీగలాగ అల్లుకుంటు నవ్వుతుంది !
Cherabanda Raju Sahitya Sarvaswam 1 & 2
₹1,000.00సంపాదకుడి మాట
మార్గదర్శి అల్లం రాజయ్య
ప్రపంచ వ్యాపితంగా సామ్రాజ్యవాదం పూర్తిగా విస్తరించి – తను ఆర్థిక మాంద్యంలో కూరుకపోయి స్థానిక ఉత్పత్తి శక్తుల మీద – ఉత్పత్తి సంబంధాల మీద తీవ్రమైన ప్రభావం చూపిన కాలమది. అన్ని దేశాలల్లో దోపిడీ, హింసా, నిరుద్యోగం పెరిగిపోయాయి. వాటికి కారణాలేమిటో తెలియని ప్రజలు తీవ్రమైన భావోద్వేగాలకు లోనయ్యారు. కోపోద్రిక్తమైన యువకులు, విద్యార్థులు పారిన్లో తిరుగుబాటు చేశారు. హెచిమిన్ నాయకత్వంలో క్రూరమైన జిత్తులమారి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు పోరాటం పతాకస్థాయికి చేరింది. అది రష్యా సోషల్ సామ్రాజ్యవాదంగా రూపొందుతున్న కాలం. చైనాలో కొత్తగా రూపొందుతున్న పెట్టుబడిదారీవర్గానికి వ్యతిరేకంగా మావో సాంస్కృతిక విప్లవానికి పిలుపునిచ్చిన కాలం.. ఇలా ప్రపంచవ్యాపితంగా పెను సంచలనాలు – యుద్ధాలు చెలరేగుతున్న కాలం అది.
మన దేశంలో నెహ్రూ మార్కు బూటకపు సోషలిజం విఫలమయ్యింది. భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలోని వైరుధ్యాలను అర్థం చేసుకోలేక పోరాడే ప్రజలకు నాయకత్వం వహించే చారవ కోల్పోయింది. వర్గపోరాటం సానే వర్గ సామరస్యం వల్లిస్తూ రివిజనిజంలో కూరుకుపోయి రెండుగా చిలింది. దేశం జాతుల బందీభానాగా, ఉత్పతి శక్తుల బందిఖానాగా మారింది. గ్రామాలు సుదీర్ఘ కాలం కులాల కాన్సంట్రేషన్ క్యాంపులుగా మారి ఉత్పత్తి శక్తుల వికాసానికి ఆటంకమయ్యాయి. సంతో దాదో రేవో తేలుకొని పోరాడవలసి వచ్చింది. ఈ పోరాటాలన్నిట్లో సరైన నిర్మాణం, నాయకత్వం లేక వేలాది మంది విద్యార్థులు కదం తొక్కుతున్న కాలం అది.
అలాంటి గడ్డుకాలంలో తెలంగాణా సాయుధ పోరాటం జరిగి(1948-51) నాయకత్వ హం వలన విరమించబడిన నేపథ్యం గల నల్గొండ జిల్లాలోని అంకుశాపురంలో బద్దం
హ 1944లో పడి గాయాల నొప్పుల నీతిలో బాల్యం గడిపాడు. సంవత్సరం లో ఆంధ్ర మహాసభ అతివాద, మితవాద గ్రూపులుగా చిలింది. ఆయన బాల్యం రక్తసిక్త
సాయుధ పోరాటం అతలాకుతలంతో గడిచింది. అయిదవ తరగతి నాటికి బాల తహ పేరు స్కూల్లో భాస్కరరెడ్డిగా మారింది. ఇలాంటి ఒత్తిడి చిత్తడిలో కౌమారపు స్వేచ్ఛా
లలు గన్నారు. పలవరింతల మధ్య కవిత్వం ఓదార్చింది. కవిత్వం పూనిన తరువాత పెట్టు తప్పింది. ఈ గడబిడల మధ్యనే పదహారో ఏట శ్యామలతో పెండ్లి జరిగింది. – రైతు కుటుంబంలో శ్యామల వ్యవసాయ పనుల్లో గొడ్డు చాకిరీలో ఉండగా భాస్కర్ రెడ్డి………….
Chandamama Kathalu- 8 (1969- 2012 Madhyalo Vachina Kathalu Sachitramgaa)
₹400.00శేషపతి అనే ఆయన పనిమీద అడవి అవతల ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాడు. అతనికి అడవిదారి తెలియదు. కాని ఆ గ్రామానికి చెందిన ఒక మనిషి శేషపతిని వెంట తీసుకువెళ్ళి, అక్కడే దిగపడిపోయాడు. అందుచేత వెళ్ళిన పని పూర్తికాగానే శేషపతి ఒంటరిగా తన స్వగ్రామానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన అడవిలో దారి తప్పి, అదృష్టవశాన, చీకటిపడే వేళకు ఏదో గ్రామం చేరాడు.
ఆ ఊరు కొండ కింద ఉన్న ఒక చిన్నగ్రామం ఊరి మొదట్లోనే ఒక పెద్ద పాతకాలపు భవనం ఉన్నది. సింహద్వారపు తలుపులకు నగిషీలున్నాయి. శ్లేషపతి తలుపుమీద బాదగానే, లోపలి నుంచి ఒక వృద్ధుడు వచ్చి తలుపు తీశాడు.
“మా ఊరు పోతూ దారి తప్పాను. ఈరాత్రికి మీ ఇంట ఆశ్రయం ఇయ్యగలరా ?” అని ఆ వృద్ధుణ్ణి శేషపతి అడిగాడు.
వృద్ధుడు శేషపతిని పరిశీలనగా చూసి, “నువు సాంబశివుడి కొడుకువు కాదూ ? మీది పలానా ఊరు కాదూ ?” అని అడిగాడు.
శేషపతి నిర్ఘాంతపోయి, “అవును, మా విషయాలు మీకు ఎలా తెలుసు ?” అని వృద్ధుణ్ణి అడిగాడు.
“నేనూ, మీ నాయనా బాల్యమిత్రులం. పెళ్ళికాగానే నేను ఈ ఊరు ఇల్లరికం వచ్చేశాను. అప్పట్లో సాంబశివుడు అచ్చగా నీలాగే ఉండేవాడు. నిన్ను చూస్తూంటే అతన్ని చూస్తున్నట్టే ఉన్నది. రేపు పండగ ! సరదాగా గడిపి మరీ వెళుదువు గాని!” అంటూ వృద్ధుడు శేషపతిని ఆదరంతో లోపలికి తీసుకుపోయి, తన భార్యకూ,
పిల్లలకూ పరిచయం చేశాడు. తరవాత శేషపతి స్నానం చేసి, భోజనం చేసి, ప్రయాణపు బడలికవల్ల నిద్ర ముంచుకు వస్తూంటే తనకోసం వృద్ధుడు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో, పెద్ద పట్టెమంచం మీద పడుకుని, వెంటనే నిద్రపోయాడు.
ఒక రా త్రివేళ ఏదో అలికిడి అయి శేషపతికి మెలకువ వచ్చింది. ఇంటినిండా మనుషులు మసులుతున్నట్టు తోచింది. పిండివంటల వాసన వస్తున్నది. శేషపతి ఆశ్చర్యపోతూ, తన గదిలో నుంచి ఇవతలికి వచ్చాడు. మరొకగదిలో వృద్ధుడూ, ఆయన భార్యా,
పిల్లలూ గాఢనిద్రలో ఉన్నారు. మిగిలిన ఇల్లంతా హడావుడిగా ఉన్నది. ఇంటినిండా జనం ! కొందరు బూజు దులుపుతున్నారు. కొందరు ఊడుస్తున్నారు. కొందరు ఇల్లు కడుగుతూ పోతున్నారు. కొందరు ఎక్కడి నుంచో బరువైన
Bowmaniyam Jigmat Bowman
₹395.00
ఒక సుదీర్ఘ సంభాషణ -మధురాంతకం నరేంద్ర
1950 ప్రాంతాల్లో ‘ఆంధ్రపత్రిక’లో ‘చంఘిజ్ ఖాన్’ నవల ధారావాహికగా ప్రచురించబడుతున్నప్పుడు, ఆలోచనాజీవులైన కొందరు పాఠకులు దాన్ని రాసిన తెన్నేటి సూరిగారిని “మీరు రాస్తున్నది ఛంఘిజ్ ఖాన్ చరిత్రా? లేకపోతే యిప్పుడు జరుగుతున్న రాజకీయాలపైన వ్యాఖ్యానమా?” అని అడిగారట! జిగ్మంట్ బౌమన్
ప్రతిపాదించిన ‘ద్రవాధునికత’ను తెలుగువాళ్ళకు పరిచయం చేస్తూ తిరుపతిరావు | గారు రాసిన ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు, “యిది ప్రత్యేకమైన సిద్ధాంత |
మేమీ గాదు. ఇప్పుడు ప్రపంచంలో ప్రతిచోటా జరుగుతున్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులనన్నింటినీ యిక్కడి రచయిత వివరిస్తున్నాడు” అనిపించింది.
1870 ప్రాంతాల్లోనే రష్యా ప్రజల్ని గురించి చెప్తూ దొస్తోయేవ్ స్కీ, “యెప్పుడైనా | రష్యన్లు నాస్తికులుగా మారితే అప్పుడు నాస్తికత్వానే మతంగా మార్చేసుకుంటారు | అన్నాడు. యీ స్వభావం నిజానికి కేవలం రష్యనది మాత్రమే గాదు. మానవులందు స్వభావమూ యిదే! అందుకే కార్ మార్క్స్ గొప్ప మానవీయ దృక్పథంతో చూపు దించిన కమ్యూనిజాన్ని గూడా అనేక దేశాలో అనేకమంది మతంగానే మ్చాడు కున్నారు. మార్క్స్ అనుకున్నదొకటి, జరిగింది. వేకటీ. “ద గాడ్ దట్ ఎముక (ఆర్డర్ కోస్టర్, యిగా జియో సిలోన్, రిచర్డ్ రెట్, ఆండ్రే గిడె, లు స్టిఫెన్ స్పెండర్ అనే ఆరుగురు రాసిన వ్యాసాల సమాహారం) అనడం మార్క్సిజాన్ని దేవుడని నమ్మేసిన మానవస్వభావమే స్పష్టంగా కనబడుత లోంచే సిద్ధాంతాన్ని తీసుకోవాలని నమ్మి, తాను చిత్త శుద్ధం భూమికలోనే దిట్టంగా నిలబడి, సమకాలీన ప్రపంచంలో ప్రతి అధ్యయనం చేయడం కోసం, సిద్ధాంతాల అచ్చుల్ని (moulds) బయటకు వచ్చిన సాహసి బొమన్. అందువల్ల బొమనను చ మనం జీవిస్తున్న ప్రపంచాన్ని చదివి అర్థం చేసుకోవడమే ఆ
ఎమె స్పష్టంగా కనబడుతోంది. జీవితం తాను చిత్తశుద్ధితో నమ్మిన సోషలిస్టు లన ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని
బ్బల్ని (moulds) పగలగొట్టుకుని ల్ల బొమనను చదవడమంటే మనల్ని,…………
Bapu Cartoon Samputi- 2
₹260.00-ముళ్లపూడి వెంకటరమణ
“వర్సా/ వరం కోరుకో” “ఎందుకూ?” “బి.ఎల్ చదివి లాయడు పయ్యావు గదా” “అయితే?” “ప్రాక్టీసు పెట్టాలి గదా” “పెడితే “గొప్పలాయరువై కోట్లు గడిస్తానా – గొప్ప జడీపై కీర్తి గడిస్తావా – వరం కోరుకో “నా ప్రాక్టీసు అదికాదు” “మరి రాయెందుకు చదివిపట్టు? ” “తండ్రి ఆజ్ఞ తలదాలిచి “ప్రాక్టీసు పెట్టకపోతే తండ్రి ఆజ్ఞ తప్పినట్టు కాదా ?” “తండ్రి ఆజ్ఞ లాయరు చదవడం వరకే – ప్రాక్టీసుకు ఇది వర్తించదు” “ఇంతకీ ఏం ప్రాక్టీసు చేస్తావు ?” ‘ఇది’ అని అట్టమీద వేసిన పరస్వతి బొమ్మని చూపించాడు బాపు. చదువుల తల్లి సంతోషించింది. “అరె – నాతో మాట్లాడుతూనే నా బొమ్మ గీశావే ” “నాతో మాట్లాడుతూనే నువ్వు వీణ వాయిస్తున్నావు కదా” “చమత్కాంచే – పరేకాని – బొమ్మలు అని ఒక్క మాటలో చెప్పావు. చిత్రకళ సముద్రమంతటిది. అందులో ఎన్ని విధాలున్నాయో – ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పెప్ & బ్రష్ వాష్, పెయింటింగ్స్‌లో రవివర్మ, చామకూర్, దామెర్ల, భాగీరథి, మొక్కపాటి, పిలకా, వైకుంఠం, పైడిరాజు – ఇలా ఎందరో… రేఖా చిత్రాల్లో బాపిరాజు, తలపెట్టి, వపా- తెల్లదొరల్లో దానిన్నీ, మైకేలేంజలో, వార్మన్ రాక్వెల్, పోగార్ – కార్టూముల్లో పూల్ట్, చామ్ – శిల్పంలో రోగాన్ | (ROOM రాయ్ చౌధురి – ఇలా ఎన్నో శాఖలు – ఎందరో మహానుభావులు…..
Bali Kathalu
₹320.00అప్పికట్ల వారి వీధికి ఆహ్వానం
1972లో వడ్డెర చండీదాస్ గారి నవల “
హిమజ్వాల” ఆంధ్రజ్యోతి
భాగానికి వారపత్రికలో సీరియల్ గా వస్తున్నప్పుడు, ప్రతివారమూ ఆ నవలా వేసిన బొమ్మలు కూడా ఆ నవలంత కొత్తగా, అధునాతనంగా వుండేవి. ఆ బొమ్మలు వేసిన చిత్రకారుడి పేరు బాలి. అదీ బాలిగారితో తెలుగు సాహిత్యానికి తొలి పరిచయం. (అప్పటికే కొన్ని నవలలకు బొమ్మలు వేసి ఉంటారు). అప్పటి నుంచీ తెలుగు పత్రికలకో కొత్త చిత్రకారుడు దొరికాడు. అప్పటి పత్రికల చిత్రకారుల్లాగే ఆయన కూడా ఆ తరువాత కార్టూన్లూ గీసి నవ్వించారు. వాళ్లలో చాలా మందికి భిన్నంగా అప్పుడప్పుడు కథలూ రాశారు. బాపూగా రొకటి రెండు కథలు రాసినట్టు యెవరో చెబుతుంటే విన్న గుర్తు. చంద్రగారు చాలా కథలు రాశారు. అయితే యిలా కథల సంపుటాన్ని ప్రచురిస్తున్న తొలి పత్రికా చిత్రకారుడు నాకు తెలిసి బాలిగారొకరే!
యీ సంపుటంలోని కథలన్నీ వొక ప్రముఖ చిత్రకారుడి కుంచెలోంచి వచ్చిన కథలు, అంతకంటే మౌలికంగా విశాఖపట్టణం దగ్గరి అనకాపల్లి అనే వూళ్లో వుంటే వొక మధ్యతరగతి వ్యక్తి బాల్య ప్రజ్ఞాపకాల దొంతరలు. పట్టుమని అయిదారు పేజీలకు మించని కథలే వున్న యీ సంపుటంలో చిత్రంగా, వూహించ రీతిలో, (238వ పేజీ నుంచి దాదాపు 57 పేజీల నిడివుండే) పెద్ద కథ వొకటుంది. దాని పేరు ‘అప్పికట్ల వారి వీధి’. ఆ కథ చదువుతున్నంత సేపూ నాకు ముళ్లప్పూ
వెంకటరమణ గారి ‘జనతా ఎక్స్ ప్రెస్’ కథే గుర్తుకొచ్చింది. ముళ్లపూడి గా బాపూగారనే గొప్ప స్నేహితుడుండేవారు. ఆయన తన స్నేహితుని కథలకు యిం ముబ్బడిగా బొమ్మలేసి పెట్టేవాడు. ‘జనతా ఎక్స్ ప్రెస్’ అనే ఆ పెద్ద కథ నా
ండా…………
Athmayogam Sri Vidya Sadanasaram
₹200.00ఇది శాస్త్రవచనం కాదు. వేదభాష్యం అంతకన్నాకాదు. ఇది శ్రీవిద్యా సాధనకు సంబంధించిన చర్చ మాత్రమే. ఈ చర్చ అంతర్గత భావానికి భంగం కలిగించకుండా ఒక విషయం నుండి మరియొక విషయానికి మారుతూ ముందుకు సాగుతుంది. ఈ కథనంలో కపటంగానీ , సందర్భానుకుల కల్పనలు గానీ లేవు. కేవలం నిజాలు మాత్రమే ప్రస్తావించబడినాయి. ఇది సత్యాన్వేషణ చుట్టూ తిరిగే సత్యవిషయ సంకలనం. సాధనా మార్గంలో కలిగే సందేహాలను నివృత్తి చేసే కొన్ని సమాధానాల క్రోడీకరణ.
సాధన అంటే ఏమిటి? ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? సాధనయొక్క ఫలితాలేమిటి? దాని పర్యవసానంగా భగవతుని ఉనికిని గ్రహించడం ఎలా సాధ్యం? లాంటి లాంటి విషయాలను గురించి ఇక్కడ స్పృశించడం జరిగింది.
Balavyakaranam
₹300.00చిన్నయసూరి గొప్పపండితుడు. వ్యాకరణశాస్ర్తజ్ఞాడు. నేటికీ ప్రాచీన తెలుగు సాహిత్యభాషకు వచ్చిన వ్యాకరణాలలో బాలవ్యాకరణానికి బాలవ్యాకరణమే సాటి. ఇందులో సందేహం లేదు. పది పరిచ్చేదాలతో, 465 సూత్రాలతో కూడుకొని ఉన్న ఈ రచనలోని సూత్రాలను, ఉదాహరణలను గూర్చి ఇంతకుముందున్న వ్యాఖ్యాన కారులు ఎన్నోరకాలుగా కీర్తించారు. అవి నూటికి నూరుపాళ్ళు యదార్ధమైన పొగడ్తలే. అయినా ఇన్నిసూత్రాల్లో ఎక్కడా లోపంలేదా అనే కాంక్షతో పరిశీలిస్తూ చదివితే ఏవో కొన్ని చిన్నపాటివి లాభిస్తాయి. వంట రుచిగా ఉన్నదా! లేదా! అవి చెప్పటానికి వంటచేయటం రావాల్సిన అవసరం లేదుగదా! తినగలిగే ఆసక్తి ఉంటేచాలు. కాబట్టి ఈ వ్యాఖ్యానంలో వ్యాకర్త గొప్పదనాన్ని చూపిస్తూనే, ఎక్కడైనా లోపంగా నాకు అనిపిస్తే దాచకుండా ఆ లోపాన్ని చూపించే ధైర్యం చేశాను. అంతమాత్రాన నేను గోప్పపండితున్ననే భావం కాదు. ఆసక్తితో చదివిన పాఠకున్నని భావం. ఇరువై ఐదు సంవత్సరాలుగా తరగతిగదిలో ఈ వ్యాకరణాన్ని భోదించటం వల్ల – విద్యార్ధుల ఆలోచనలు, వారి ప్రశ్నలు, వానికి సమాధానాలు, విటన్నింటినీ కలగలిపిన సారాంశం ఈ వ్యాఖ్యానం ప్రధానంగా విద్యార్ధులను ఉద్దేశించి ఇది వ్రాయటం జరిగింది. అందుకే “కరదీపికావ్యాఖ్యాన” మని నామకరణం చేశాను. కాబట్టి విద్యార్ధిలోకానికి ఏ మాత్రం ఉపయోగపడినా, నా శ్రమ ఫలించిందని భావిస్తాను.
డా” ఆలేటి మోహన్ రెడ్డి
Balavyakaranam Gantapadham
₹350.00ఎం.ఎ. తెలుగు, సాహితి విద్యార్థులకు ఉపయోగపడే వ్యాకరణ గ్రంథం. ఈ సంపుటం మార్పులు చేర్పులు జరిగి కొత్తగా ముద్రితమైనది.
-పరవస్తు చిన్నయసూరి.
Andhamaina Viplavam
₹300.00ఇటలీలో కళాచంద్రోదయం
ఆరువందల ఏళ్ల క్రితం మన ప్రపంచంలో ఓ అద్భుతం జరిగింది. పద్నాలుగవ శతాబ్దపు తొలి నాళ్లలో ఇటలీలో ఒక విప్లవం మొదలయ్యింది.
కత్తులతో, కాగడాలతో, నినాదాలతో, నెత్తుటి రాతలతో చేసిన హింసాపూరిత విప్లవం కాదది.
అదొక అందమైన విప్లవం. మానవ మేధ లోతుల్లో రాజుకున్న విప్లవం. చిత్రకళ, శిల్పం, స్థాపత్యం, సాహిత్యం , విజ్ఞానం, నగర నిర్మాణం, సాంస్కృతికం ఇలా ఏదీ వదలకుండా మానవ జీవన విభాగాలన్నిటి మీద తన సర్వాంగ సుందరమైన ప్రభావాన్ని ప్రసరించి యూరప్ నాగరికత మీద శాశ్వత ముద్ర వేసింది. ఆ విప్లవం.
ఆ విప్లవం పద్నాల్గవ శాతాబ్దంలో ఎందుకు జరిగింది?
ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే క్రైస్తవ మత చరిత్రను క్లుప్తంగా గమనించాలి. ఒకటవ శతాబ్దంలో యూరప్, ఆసియాకి సరిహద్దుల వద్ద జుడెయాలో క్రైస్తవ మతం ఆవిర్భవించింది. ఆ కాలంలో జుడెయా రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ప్రభుత అనుసరించే పేగన్ (Paganism) మతానికి ఈ కొత్త మతభావాలు విరుదంగా ఉండడంతో, రోమన్ పాలకుల నుండి, సమాజం నుండి కూడా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. మొదటి నాలుగు శతాబ్దాల కాలం పలు రోమన్ పాలకుల నుండి క్రైస్తవులు ఎన్నో రకాల వేధింపులకి గురయ్యారు. ఇలా ఉండగా ఐదవ శతాబ్దపు చివరి దశలో రోమన్ సామ్రాజ్యం తూర్పు, పశ్చిమ విభాగాలుగా విడిపోయింది. పశ్చిమ విభాగం పూర్తిగా ఛిన్నాభిన్నమై పతనం కాగా, తూర్పు విభాగం | కాంస్టాంటినోపుల్ రాజధానిగా మరో వేయేళ్లపాటు వర్ధిల్లింది. – తూర్పు రోమన్ సామ్రాజ్యాన్నే బైజాంటైన్ సామ్రాజ్యం అని అంటారు. ఈ | కొత్త సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని సాధికార మతంగా స్వీకరించింది. దాంతో క్రైస్తవ మతం బాగా బలాన్ని పుంజుకుంది. అన్ని రకాల సామాజిక వ్యవహారాల మీద మతం పట్టు క్రమంగా బలపడుతూ వచ్చింది. జీవితం పట్ల మనిషి దృక్పథాన్ని కూడా మతమే శాసించింది. ఆ దృక్పథం ప్రకారం జన్మతః మానవుడు పాపి. మతం | బోధించిన జీవన సరళిని అనుసరించి జీవిస్తే, జన్మానంతరం సద్గతిని పొంది,…………
Aksharabhyasam
₹150.00అక్షరాభ్యాసం
ఆ రోజు నేను స్కూల్లో పాఠం చెబుతున్నప్పుడు నా స్నేహితుడు పద్మనాభం ఫోన్ చేసి శనివారం నాడు తన కొడుక్కి అక్షరాభ్యాసం చేయిస్తున్నాననీ, నన్ను తప్పక రమ్మని చెప్పాడు.
నేను, పద్మనాభం చిన్నప్పట్నించీ ఒకే ఊరిలో పెరిగాం. ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇద్దరం బీఈడీ చేసాం. నేను పట్నంలో మున్సిపల్ టీచరుగా ఉద్యోగం చేస్తుంటే, వాడు మా ఊరి స్కూల్లోనే టీచర్ గా పని చేస్తున్నాడు. వాళ్ల నాన్న పాతికెకరాల భూస్వామి కావడంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించి మా ఊళ్లోనే పోస్టింగ్ వేయించుకున్నాడు.
– పద్మనాభం ఓ పక్క టీచరు ఉద్యోగం చేస్తూనే ఇంకో పక్క వ్యవసాయం కూడా చేస్తుంటాడు.
వాడికి ఆరేళ్ల క్రితం పెళ్ళైంది. వాడెందుకో ముప్పై ఏళ్ల తరువాత పెళ్ళి
చేసుకున్నాడు.
నేను మా నాన్నగారి దగ్గర స్మార్తం నేర్చుకున్నాను. మా నాన్న గారు మా ఊరి పురోహితుడు. ముందు నన్ను చదివించనన్నారు. నేను చదువుకుంటానని పట్టుపట్టడంతో తప్పక నన్ను చదివించారు.
కానీ కులవృత్తి అని స్మార్తం నేర్పించారు. రెండేళ్ల క్రితం నాన్నగారు చనిపోవడంతో ఊరికి పురోహితుడు లేకుండా పోయాడు. అందుకే ఈ రోజు పద్మనాభం నన్ను పిలిచాడు.. నేనైతే రెండు విధాలుగా ఉపయోగపడతాననీ వాడి ఆశ. |
ఈ విషయం నాకు చాలా రోజుల నుంచీ వాడు చెబుతున్నాడు. వాడి కొడుకు అక్షరాభ్యాసం నేనే చేయించాలనీ.
నేను శుక్రవారం రాత్రి బయలుదేరి ఆఖరి బస్సుకి మా ఊరు వెళ్లాను.