YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 13–24 of 860 resultsSorted by latest
Robin Hood
₹200.00Robin Hood
చిలిపి చిన్నరి చికిలి పిట్టల
పలుకు జిలిబిలి పాటలో
అడవి గాలులు సుడిసి వచ్చే
వడులలో సవ్వడులలో
వినిపించు వీనులవిందుగా – రా
బినుల పాట పసందుగా
చోరుడైనా-వీరుడూ నగ
ధీరుడూ సముదారుడూ –
అయిన రాబిన్ అమరగాథలు
కదుపుల గిట్ట కుదుపుల
దుసికిలిన కెంధూళులూ………
Palapitta Katha-2025-Vilakshana Kathala Sankalanam
₹200.00Palapitta Katha-2025-Vilakshana Kathala Sankalanam
Odyssey ( Homer)
₹250.00Odyssey ( Homer)
ఆకాశపు అంచుల్లో, మనుషుల ఊహలకు కూడా అందనంత ఎత్తులో ఉండే ఒలింపస్ పర్వతం మీద అప్పుడే సూర్యోదయం అవుతోంది. అది దేవతల నివాసం. అక్కడ మేఘాలు తెల్లటి దూది పింజాల్లా భవనాల చుట్టూ తిరుగుతుంటాయి. అక్కడ నక్షత్రాలు రాత్రిపూటే కాదు, పగలు కూడా అక్కడి బంగారు. వీధుల్లో మెరుస్తూనే ఉంటాయి. ఆ పర్వతం మీద ఉన్న అత్యంత ఎత్తైన భవనంలో, దేవతలందరికీ రాజు అయిన జ్యూస్ తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. జ్యూస్ అంటే సామాన్యుడు కాదు. ఆకాశంలోని ఉరుములకు అధిపతి. ఒక్కసారి కోపంతో ఆయన కనుబొమ్మ ముడిపడితే చాలు, కింద భూలోకంలో సముద్రాలు అల్లకల్లోలం అవుతాయి, ఆకాశం నుండి పిడుగులు విరుచుకుపడతాయి.
ఆ రోజు జ్యూస్ మనసు ప్రశాంతంగా ఉన్నా, భూలోకంలో మనుషులు చేసే పనులను చూస్తుంటే ఆయనకు వింతగా అనిపిస్తోంది. ఆయన తన ముందున్న బంగారు పాత్రలోని అమృతాన్ని నెమ్మదిగా తాగుతూ, అక్కడే ఉన్న దేవతలందరికీ వినిపించేలా గంభీరంగా ఇలా అన్నాడు.
“చూడండి! ఈ మనుషులు ఎంత వింతైన వారు! వాళ్ళు చేసే ప్రతి తప్పుకు, ప్రతి మూర్ఖత్వానికి దేవతలైన మనల్నే నిందిస్తారు. నిజానికి వాళ్ళ తలరాతను మనమేదో రాస్తున్నామని, మనమే వాళ్ళను కష్టాల్లోకి నెడుతున్నామని వాళ్ళు భ్రమపడుతుంటారు. కానీ అసలు విషయం అది కాదు. వాళ్ళ తెలివితక్కువ పనులే వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడతాయి. ఉదాహరణకు ఈ ఏగిన్నే తీసుకోండి. ట్రాయ్ యుద్ధం ముగిసి అగమెమ్నన్ తన ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఈ ఏగిస్టస్ అతని భార్య క్లైటెమ్నెస్ట్రాను లోబరుచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో కలిసి అగమెమ్నన్ని దారుణంగా చంపేశాడు. అది తప్పు అని, దానికి శిక్ష తప్పదని మేము మా దూత ద్వారా ముందే హెచ్చరించాం. ‘ఒరేయ్! అగమెమ్నన్ జోలికి వెళ్ళకు, అతని భార్యను…………………..
Nee Premalo Munigaka
₹210.00
Nee Premalo Munigaka
అహంకారం . ఈ ఒక్క ఎక్కడి అహంకారం మనిషిని ఎక్కడి వరకైనా తెసుకువెళ్ళగలదు. ఎదుటి వాడి మీద గెలవాలి అనే అహంకారం, మనిషిని విచక్షణ కోల్పోయేలా చేసి, పిచ్చోడిలా మార్చగలదు. నేను చేసేదే కరెక్ట్, నేను మాత్రమే తెలివిగలవాడిని, అందరి మీదా నేనే గెలవాలి అనే అహంకారం ఉన్న మనిషి ఎప్పటికి గెలవలేడు, ప్రశాంతంగా బ్రతకలేడు.
వర్షాకాలం కనుక ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉంది. సమయం ఉదయం ఆరవుతున్నా చలి వలన కలిగిన బద్దకంతో అనుకుంట హైదరాబాద్ నగరం అంతా నిద్ర మత్తులోనే ఉంది. కొందరు ఆఫీస్‌కి టైమ్ అవుతుందని తప్పక దుప్పటి తీసి బలవంతంగా లేస్తున్నారు. కొందరు ఇంకాసేపు ఆగి గుద్దాంలే అని, తమకి తామే సర్దిచెప్పుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్నారు. శుక్రవారం అందునా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా కావడంతో, కొందరు ఆడవాళ్ళు మాత్రం ఈ వర్షం, చలిని లెక్కచేయకుండా పూజలు చేసి, లక్ష్మీదేవిని ఇంప్రెస్ చేయాల్సిందే, అని పట్టు వదలకుండా లేచి తల స్నానాలు మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
జూబ్లీహిల్స్ పక్కన ఉన్న బస్తీలో ఒక చిన్న మూడు అంతస్తుల భవనం ఉంది. చెప్పుకోవడానికి మూడంతస్తుల భవనమే, కాని ఒక్కో అంతస్తులో ఇరికించి కట్టిన సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. దాని గోడలు పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షం వలన ఆ మూడవ అంతస్తు పైన ఉన్న స్లాబ్ మధ్యలో ఉన్న సన్నని రంధ్రం గుండా కారుతున్న వర్షం నీరు, ఇంటి హాల్ నడి మధ్యలో పెట్టి ఉన్న పాత గిన్నెలో పడుతూ ఉంది. ఆ గిన్నెలో కారే ఒకో చినుకు టక్టాక్ మంటూ……………..
Nannaku Prema Kopam Maryadatho
₹250.00నాన్నకు ప్రేమ కోపం మర్యాదతో — మణికాంత్ గెల్లి
తండ్రి-కొడుకు అనుబంధంలోని సంక్లిష్టతలను, ప్రేమను, కోపాన్ని మరియు మర్యాదను అద్భుతంగా ఆవిష్కరించే ఈ రచన మణికాంత్ గెల్లి కలం నుండి జాలువారిన భావోద్వేగ కావ్యం. నాన్న అంటే కేవలం ఒక వ్యక్తి కాదు — ఆయన ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక జీవన పాఠం.
ఈ పుస్తకంలో రచయిత తన నాన్నతో గడిపిన క్షణాలను, వారి మధ్య జరిగిన మాటల యుద్ధాలను, మౌన సంభాషణలను, మరియు అనుచ్చరితమైన ప్రేమను అత్యంత సహజంగా మరియు హృదయస్పర్శిగా చిత్రిస్తారు. తండ్రి కోపం వెనక దాగిన అపారమైన ప్రేమను, మర్యాద వెనక ఉన్న ఆత్మీయతను పాఠకులు తమ స్వంత జీవితాలలో అనుభవించినట్లు అనిపిస్తుంది.
తెలుగు కుటుంబ విలువలను, తరాల మధ్య అంతరాలను, మరియు తండ్రి-పిల్లల బంధపు లోతును అర్థం చేసుకోవాలనుకునే ప్రతి పాఠకుడూ తప్పక చదవాల్సిన పుస్తకం.
Nanna Gurthimpu leni Sainikudu
₹375.00Nanna Gurthimpu leni Sainikudu
ఏప్రిల్ 24. కాశ్మీర్లో అప్పుడప్పుడే శీతల వాతావరణం పోయి
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అప్పటివరకు చలికి గడ్డకట్టి, మంచుతో కప్పబడిన ప్రాంతాలు.., ఇప్పుడు ఆ ఉష్ణోగ్రత వేడికి కరిగి పచ్చదనాన్ని అల్లుకుంటున్నాయి. ఎటు చూసినా.. కాశ్మీరు అందాలు వర్ణించలేనంత అద్భుతంగా, ఆహ్లాదంగా ఉన్నాయి.
కుటుంబాన్ని దూరంగా విడిచిపెట్టి, దేశ రక్షణ బాధ్యతగా భావించే సైనికులతో కాశ్మీరంతా సురక్షితంగా, సుభిక్షంగా ఉంది. నిత్యం అల్లర్లను, ఉగ్రదాడులను ఎదుర్కొంటూ సైనికులు దృఢంగా నిలబడి కాశ్మీర్‌ను రక్షిస్తూ ఉన్నారు.
అలాంటి సైనికులలో ఒకరు, శ్రీనగర్ క్యాంపు నుండి ఏప్రిల్ 19న, తన ఉద్యోగం ముగించుకొని, సెలవు మీద సొంత ఊరైన విశాఖపట్నం బయలుదేరాలి. కానీ, అక్కడ జరిగిన కొన్ని అనివార్య కారణాల వలన తన ప్రయాణం 5 రోజులు ఆలస్యమై, ఏప్రిల్ 24న శ్రీనగర్ నుంచి మొదలైంది.
Naa Vangadesa Yatra(Kala Katta)
₹150.00“నా వంగదేశ యాత్ర (కళ-కత్తా)“ పుస్తకాన్ని రమా శాండిల్య రచించారు. ఈ ప్రయాణ పుస్తకంలో రచయిత బెంగాల్ (వంగదేశం) విశేషాలను మరియు కలకత్తా సంస్కృతిని అందంగా వివరించారు.
Muthyala Muggu ( ముత్యాల ముగ్గు )
₹150.00రాజా రామదాసుగారి బంగళా ముంగిట ఉదయసూర్యుని బంగారు కిరణాలు రంగవల్లులు తీరుస్తున్నాయి. గార్డెన్లో వున్న పచ్చని ఆకులమీద కురిసిన మంచు ముత్యాల్లా మెరుస్తోంది. సూర్యుడికైనా సరే ఆ బంగళా మొత్తం చూడాలంటే తూర్చునించి పడమరకు తిరిగేటంత టైం పడుతుంది. బంగళా ఆవరణలో శ్రీరాముని కోవెలవుంది. పూజారిగారు ఎల్లవేళలా కోవెలనే కనిపెట్టుకుని వుంటూ స్వామివారికి నిత్యం ధూపదీపనైవేద్యాలు సమకూరుస్తుంటారు. శ్రీరామనవమికి స్వామివారికి సర్వాలంకరణ చేసి కల్యాణం జరపటం ఆ యింటి సంప్రదాయం.
Mukkonapu Premakatha
₹150.00‘మనుషుల మధ్య దూరం పెరిగితే, ప్రేమ తగ్గిపోతుందా’ అని మిమ్మల్నెవరైనా అడిగితే మీరేం చెప్తారు? అవుననా? కాదనా?
‘ప్రేమకీ దూరానికీ సంబంధం లేదు. అది మనసులతో ముడిపడి ఉండే విషయం’ అంటారు కదూ.
బహుశా కొన్నిరోజుల కిందట ఇదే ప్రశ్న నన్నెవరైనా అడిగితే, నేనూ మీలాగే సమాధానం చెప్పి ఉండేవాన్ని.
‘ప్రేమ అనేది శరీరాలతో, దగ్గర, దూరాలతో సంబంధం లేని విషయమే’ అని చెప్పేవాన్ని. ఆ ప్రశ్న అడిగిన వాళ్ళని ప్రేమంటే ఏమిటో తెలియని వాళ్ళుగా జమకట్టి ఉండేవాన్ని కూడా.
అయితే… ఇప్పుడు నా సమాధానం మారింది………………..
Minuguru Poolu
₹175.00అద్భుతమైన ఇటాలియన్ క్లాసిక్ నవల
‘అత్యంత సున్నితమైన… హృదయాన్ని కదిలించే కళాఖండం’ – ది గార్డియన్.
‘చార్లెట్స్ వెబ్ వంటి గొప్ప పుస్తకాల సరసన నిలవదగ్గ అద్భతం’ – ది న్యూయార్క్ టైమ్స్.
Kalateetha Vyakthulu
₹240.00చక్కని శైలి, భాషపై అపారమైన స్వాధీనం శ్రీదేవి సొత్తు. కథా రచయిత్రిగా, గేయ రచయిత్రిగా చక్కని సాహిత్య విమర్శకురాలిగా అచిరకాలంలోనే స్వయం వ్యక్తిత్వాన్ని స్థాపించుకున్న యువ రచయిత్రి. ఆధునిక సారస్వతాకాశంలో తారాజువ్వలా లేచి కళ్ళు జిగేలుమనిపించి “కాలాతీత వ్యక్తులు” నవల ద్వారా ధృవతారగా నిల్చిపోయింది. తన విశేషమైన శైలి, భాషాస్వామ్యం, అతి సాహసమైన భావ ప్రకటన, అపూర్వమైన పాత్ర సృష్టి, శిల్పచాతుర్యం వలన అశేష పాఠకలోకం, పత్రికల ప్రశంసలనందుకొన్నది.
ఈమె సంస్కారహృదయం సాహిత్య లోకానికి అందించిన రచనలు ఇంకా అనేకం. తెలుగు కలం బలం చాటే అనేకమైన ఆణిముత్యాల్లాంటి కథలు, గేయాలు ముఖ్యంగా ‘మధుకలశం’ కవితా సుమం, ఉరుములు – మెరుపులు, కల తెచ్చిన రూపాయిలు కథా సంకలనాలూ, అనేక దీర్ఘ కవితలూ రాశారు. ఈమె “కాలాతీత వ్యక్తులు” నవల కోసమే జన్మించిందా అనిపిస్తుంది. “కాలాతీత వ్యక్తులు” సంప్రదాయ ధీరత్వాన్ని ఎదిరించిన ఒక లోకం – ఆ లోకంలో కోరిక, ప్రేమ, బాధ, సంతోషం, నిజం, అబద్ధం అన్నీ ఉన్నాయి. అన్నింటికన్నా మిన్నగా – నిజంగా బతకటం ఏమిటో, ఎలాగో తెలిపే భావనుంది. ఆ లోకం మీ ముందుంది… ప్రవేశించండి – ప్రవేశించి జీవన ప్రతిస్పందనని స్వంతం చేసుకోండి. ఈ నవలే సాహితీ ప్రపంచంలో ఈమెకొక ఉజ్వల స్మృతి చిహ్నం. శ్రీదేవి చిర యశస్వి.