Showing 217–228 of 860 resultsSorted by latest

Mana Telugu Peddalu

400.00

 డాక్టర్ మల్లాది కృష్ణానంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖలో అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. శ్రీ కృష్ణానంద్ జిల్లా పౌరసంబంధాల అధికారిగా గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలలో పనిచేసారు. అనంతరం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేషీలో ప్రజా సంబంధాల అధికారిగా, ప్రెస్ సెక్రటరీ టు గవర్నర్ గా, గ్రామీణాభివృద్ధి సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్ అఫ్ హైదరాబాద్. రాష్ట్ర పర్యాటక శాఖ, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లలో ప్రధాన పౌరసంబంధాల అధికారిగా పనిచేశారు.

         పలు రంగాలలో విశిష్ఠ సేవలందించిన కీర్తిశేషులైన తెలుగు పెద్దల జీవన చిత్రాలపై శ్రీ మల్లాది రాసిన తెలుగు పెద్దలు, చరితార్థులు మన తెలుగు పెద్దలు గ్రంథాలు విశేష ఆదరణ పొందాయి.

                                                                               – డా. మల్లాది కృష్ణానంద్

Nikasham

70.00

ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు

నిన్నటి ప్రత్యూషం నేడు లేదు

ఈ రోజుటి ప్రదోషసంధ్య, రేపటికి పాతది….మాసినది…..

ఓ గంట క్రితం చుట్టేసిన దు:ఖం యిప్పుడు శూన్యం

ఈ చిటికెడు విషాదాలు

క్షణకాలప్పాటు మెరిసే ఆనందాలు….. సుఖాలు……

వీటిని మోస్తూ యిన్ని కోట్ల ప్రాణాలు….

అన్నీ… అందరూ కల్సి ఎక్కడికి?

ఎటువేపుకి ప్రస్థానం?

ఒక అనుభూతి నింకో అనుభూతిని కబళిస్తూ….

అంతం లేని దారిలో

అక్కడక్కడా ఆగిపోతూ……చివరికి?

అంతా…..అన్నీ……అందరూ…. ఒకే గాహ్వారంలోకి ……

కాంతిని కూడా స్వాహా చేసే మహా బిలంలోకి….

భావాతిత……అనుభూతి రాహిత్య

మహా శూ……..న్యం………లో……కి

Asangatham

175.00

అసంగతం

నెలమీదంతా చినిగిపోయి, మసకబారి, విరిగిపోయి మాసిపోయిన పూలు… ఎప్పుడు పరిచారో లినోలియం… అరిగిపోయిన ప్యాచ్… అమసక బారిన చీకటో… ఒకప్పటి తాజా సౌందర్యం. మాసిపోయిన దిండ్లేసున్న పేము చెయిరో కూచునుంది, ఆమె జుట్టు రెండు పాయలుగా విడిపోయి ఒక పాయ ముందు భాగాన ఆమె వాలిన చన్నుమీంచి

జాలువార్తోంది. రెండు పండ్లూడి పోయిన్దువ్వెన్తో దువ్వుకుంటూ దువ్వెన్ని జుత్తు మధ్యలోనే చిక్కిచ్చి

“ఎన్ని రోజులిలా?” అడిగింది షమీమా

పెదవి విరిచి… “అలాంటి ఆలోచన్లే వుండుంటే ఈ దినమిలా వుండేది కాదేమో” అన్నా…

“కభీసోచానహీ కభీఘబ్ రాయా నహీ… బస్ యూ హీ చలే జానా హై” వెంటనే హమ్ చేసా…

“మీరు సరే అరవైల్లో కొచ్చేస్తున్నారు…. నా విషయమేంటి? నిన్ననే నాకు ముప్పై రెండొచ్చాయి….” కళ్లని జుత్తు చివరనున్న చిక్కుల్లో చేర్చి ముడి వేసి అంది షమీమా…..

“ఆలోచించుమరి… మనిద్దరం ఆలోచించీ ప్లాన్టేసుకుని కాన్సిక్వెన్సెస్ ఎలా వుంటాయని పూర్తి స్పృహతో కల్చుండడం లేదు కదా?” జేబులోంచీ అంచులు కుట్లూడిన పర్స్ తీసి లోపలి డబ్బు లెక్క పెడ్తూ అన్నా…

Yudha Kala

150.00

యుద్ధ కళ అనేది రాజ్యానికి చాలా కీలకమైన విషయం. ఇది చావు, బతుకుల సమస్య . ఇది సురక్షిత మార్గం వైపు లేదా పూర్తిగా వినాశనంవైపు తీసుకెళ్లే మార్గం. ఇది విచారణకు సంబంధించిన విషయం కావడంతో , దీన్ని పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు.”
తూర్పు ఆసియా దేశాల సంస్కృతి, చరిత్రల్లో ప్రత్యేక స్థానం కలిగిన అద్భుత దృశ్యకావ్యం… యుద్ధకళ . ఈ పుస్తకం రాణానితి , సైనిక వ్యూహాలలోని రాజకీయాలు, సిద్ధాంతాలకు సంబంధించిన ప్రాచీన చైనా పాఠం. ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్దుడైన యోధుడు. తత్వవేత్త అయిన సన్ ట్జు క్రుస్తుపూర్వం 6 వ శతాబ్దంలో రాశారు.

The Happiest Man On Earth

299.00

నేను 1920లో తూర్పు జర్మనీలోని లీపిగ్ పట్టణంలో జన్మించాను. నా పేరు అబ్రహం

ఇంగ్లీషులో ఈ పేరును ఎడ్డీ అని పలుకుతారు. కాబట్టి దయచేసి నన్ను ఎడ్డీ అని పిలు

మిత్రమా.

మాది ప్రేమానుబంధాలుగల చాలా పెద్ద కుటుంబం. నా తండ్రి ఇసిడోర్కి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్లు. నా తల్లి లీనా పదమూడు మంది సంతానంలో ఒకరు. ఇంతమంది పిల్లల్ని పెంచిన మా అమ్మమ్మ శక్తిని ఊహించుకోండి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె తన కుమారుడిని కోల్పోయింది. జర్మనీ కోసం ఒక యూదుడు తన జీవితాన్ని త్యాగం చేశాడు. అలాగే భర్తనీ కోల్పోయింది. మా తాతయ్య సైనిక పూజారి. ఆయన యుద్ధం నుండి తిరిగి రాలేదు. మా నాన్న పోలాండ్ నుండి వలస వచ్చి జర్మనీలో స్థిరపడ్డారు. ఆయన జర్మనీ పౌరుడిగా గర్వపడేవారు. ఆయన రెమింగ్టన్ టైప్ రైటర్ సంస్థలో మెకానికల్ ఇంజినీరింగ్లో అప్రెంటిస్ గా, చేరడం కోసం మొదట పోలాండ్ని విడిచిపెట్టారు.

ఆయన చక్కటి జర్మనీ భాష మాట్లాడేవారు. జర్మనీ వర్తక నౌకలో పనిచేస్తూ అమెరికా వెళ్లారు. అమెరికాలో తన వ్యాపారంలో బాగా రాణించారు గానీ తన కుటుంబానికి దూరమైయ్యారు. యూరప్ లోకి తిరిగి వచ్చి మరో జర్మన్ వ్యాపార నౌకలో పని చూసుకుందా మనుకున్నారు. సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వస్తూ చిక్కుకుపోయారు. ఎందుకంటే ఆయన పోలిష్ పాస్పోర్టుపై ప్రయాణిస్తుండడంతో జర్మనీవారు ఆయనను అక్రమ చొరబాటు దారుగా భావించారు. అయితే జర్మనీ ప్రభుత్వం ఆయన్ని నైపుణ్యం గల మెకానిక్ గా గుర్తించి యుద్ధ ప్రయత్నాల కోసం భారీ ఆయుధాలు తయారుచేసే లీగ్లోని కర్మాగారంలో నిర్బంధంలో ఉండి పనిచేయడానికి అంగీకరించింది………………..

Oke Okkati

299.00

1 ఒకే ఒకటి

1991 జూన్ 7 వ తేదీన భూమి 112 నిమిషాలపాటు అదిరింది. నిజంగా కాదు, అలా అనిపించింది అంతే.

నేను ప్రఖ్యాత హాస్య చిత్రం ‘సిటీ స్లిక్కర్స్’ చూస్తున్నాను. ప్రేక్షకుల నవ్వులతో హాలు దద్దరిల్లి పోయింది. ఇంతవరకు వచ్చిన వాటిలో అది అత్యంత హాస్యచిత్రంగా పేరు పొందింది. అందులో అనూహ్యమైన జ్ఞానగుళికలు, అంతర్ దృష్టి డోసులు

కూడా ఉన్నాయి. మరుపురాని ఒక దృశ్యంలో పట్టువదలని కౌ బాయ్ కర్లీ (కీర్తిశేషులు జాక్ పాలన్స్ నటించారు), సిటీ స్లిక్కర్ మిచ్ (బిల్లీ క్రిస్టల్ ఆ పాత్రలో) తప్పిపోయిన పశువులను వెతకటానికి బయలుదేరుతారు. ఆ సినిమాలో ఆద్యంతమూ దాదాపు వారు ఇద్దరూ పోట్లాడుకుంటూనే ఉంటారు. పక్కపక్కనే సవారి చేస్తూ చివరికి ఇద్దరూ జీవితాన్ని గురించి ఒక సంభాషణలో కలుస్తారు. ఉన్నట్టుండి కర్లీ తన గుర్రాన్ని ఆపి మిచ్ వైపు తిరుగుతాడు.

కర్రీ : నీకు జీవిత రహస్యం తెలుసా?

మిచ్ : తెలీదు. ఏమిటి?

కరీ : ఇది. [ఒక వేలు పైకి ఎత్తుతాడు]

మిచ్ : నీ వేలా?