YOU MAY ALSO LIKE…
-
Prema Lekhalu|ప్రేమ లేఖలు-చలం
₹275.00
-
Robin Hood
₹200.00
-
Palapitta Katha-2025-Vilakshana Kathala Sankalanam
₹200.00
-
Odyssey ( Homer)
₹250.00
Showing 1–12 of 23 resultsSorted by latest
Prema Lekhalu|ప్రేమ లేఖలు-చలం
₹275.00PREMALEKHALU
1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు.
“ఉత్త సమాచారాలనే అందించేవి ఉత్తరాలు. ప్రేమలేకపోతే అది లేఖ కాదు. ఉత్తి ఉత్తరం. గుడిసె అన్నా, పర్ణశాల అన్నా అర్థం ఒకటే. మాట చుట్టూ ఉండే వాతావరణంలోనే భేదం అంతా.
చలంగారు ప్రేమలేఖలు వ్రాసేటప్పుడు మనసులో ఎవరున్నారో లేరోగాని ఎవరో ఉన్నంత వాస్తవంగా ఉంటుంది లేఖ. వాటిని పోస్టులో ఎవరూ అందుకోలేరు, పుస్తక రూపంలో పాఠకులు తప్ప. లేఖలు వ్రాయడం నేర్చుకోదలచిన వారికి ఇవ్వి ఒరవడులు.
ప్రేమలేఖలలో ఉన్న చలం మనసు, జీవిత ఘట్టాలు, ప్రేమలు, విరహాలు, సౌందర్య చర్చలు, తాత్విక ప్రశ్నలు, ఇంకా అనేకానేకం చలం జీవితంలోని వాస్తవాలే!
ఈ లేఖలు 1922 నుండి 1947 వరకు వీణ మొదలయిన పత్రికలలో ధారావాహికగా వచ్చాయి. మొత్తం లేఖలు 49
Robin Hood
₹200.00Robin Hood
చిలిపి చిన్నరి చికిలి పిట్టల
పలుకు జిలిబిలి పాటలో
అడవి గాలులు సుడిసి వచ్చే
వడులలో సవ్వడులలో
వినిపించు వీనులవిందుగా – రా
బినుల పాట పసందుగా
చోరుడైనా-వీరుడూ నగ
ధీరుడూ సముదారుడూ –
అయిన రాబిన్ అమరగాథలు
కదుపుల గిట్ట కుదుపుల
దుసికిలిన కెంధూళులూ………
Palapitta Katha-2025-Vilakshana Kathala Sankalanam
₹200.00Palapitta Katha-2025-Vilakshana Kathala Sankalanam
Odyssey ( Homer)
₹250.00Odyssey ( Homer)
ఆకాశపు అంచుల్లో, మనుషుల ఊహలకు కూడా అందనంత ఎత్తులో ఉండే ఒలింపస్ పర్వతం మీద అప్పుడే సూర్యోదయం అవుతోంది. అది దేవతల నివాసం. అక్కడ మేఘాలు తెల్లటి దూది పింజాల్లా భవనాల చుట్టూ తిరుగుతుంటాయి. అక్కడ నక్షత్రాలు రాత్రిపూటే కాదు, పగలు కూడా అక్కడి బంగారు. వీధుల్లో మెరుస్తూనే ఉంటాయి. ఆ పర్వతం మీద ఉన్న అత్యంత ఎత్తైన భవనంలో, దేవతలందరికీ రాజు అయిన జ్యూస్ తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. జ్యూస్ అంటే సామాన్యుడు కాదు. ఆకాశంలోని ఉరుములకు అధిపతి. ఒక్కసారి కోపంతో ఆయన కనుబొమ్మ ముడిపడితే చాలు, కింద భూలోకంలో సముద్రాలు అల్లకల్లోలం అవుతాయి, ఆకాశం నుండి పిడుగులు విరుచుకుపడతాయి.
ఆ రోజు జ్యూస్ మనసు ప్రశాంతంగా ఉన్నా, భూలోకంలో మనుషులు చేసే పనులను చూస్తుంటే ఆయనకు వింతగా అనిపిస్తోంది. ఆయన తన ముందున్న బంగారు పాత్రలోని అమృతాన్ని నెమ్మదిగా తాగుతూ, అక్కడే ఉన్న దేవతలందరికీ వినిపించేలా గంభీరంగా ఇలా అన్నాడు.
“చూడండి! ఈ మనుషులు ఎంత వింతైన వారు! వాళ్ళు చేసే ప్రతి తప్పుకు, ప్రతి మూర్ఖత్వానికి దేవతలైన మనల్నే నిందిస్తారు. నిజానికి వాళ్ళ తలరాతను మనమేదో రాస్తున్నామని, మనమే వాళ్ళను కష్టాల్లోకి నెడుతున్నామని వాళ్ళు భ్రమపడుతుంటారు. కానీ అసలు విషయం అది కాదు. వాళ్ళ తెలివితక్కువ పనులే వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడతాయి. ఉదాహరణకు ఈ ఏగిన్నే తీసుకోండి. ట్రాయ్ యుద్ధం ముగిసి అగమెమ్నన్ తన ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఈ ఏగిస్టస్ అతని భార్య క్లైటెమ్నెస్ట్రాను లోబరుచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో కలిసి అగమెమ్నన్ని దారుణంగా చంపేశాడు. అది తప్పు అని, దానికి శిక్ష తప్పదని మేము మా దూత ద్వారా ముందే హెచ్చరించాం. ‘ఒరేయ్! అగమెమ్నన్ జోలికి వెళ్ళకు, అతని భార్యను…………………..
Nee Premalo Munigaka
అహంకారం . ఈ ఒక్క ఎక్కడి అహంకారం మనిషిని ఎక్కడి వరకైనా తెసుకువెళ్ళగలదు. ఎదుటి వాడి మీద గెలవాలి అనే అహంకారం, మనిషిని విచక్షణ కోల్పోయేలా చేసి, పిచ్చోడిలా మార్చగలదు. నేను చేసేదే కరెక్ట్, నేను మాత్రమే తెలివిగలవాడిని, అందరి మీదా నేనే గెలవాలి అనే అహంకారం ఉన్న మనిషి ఎప్పటికి గెలవలేడు, ప్రశాంతంగా బ్రతకలేడు.
వర్షాకాలం కనుక ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉంది. సమయం ఉదయం ఆరవుతున్నా చలి వలన కలిగిన బద్దకంతో అనుకుంట హైదరాబాద్ నగరం అంతా నిద్ర మత్తులోనే ఉంది. కొందరు ఆఫీస్కి టైమ్ అవుతుందని తప్పక దుప్పటి తీసి బలవంతంగా లేస్తున్నారు. కొందరు ఇంకాసేపు ఆగి గుద్దాంలే అని, తమకి తామే సర్దిచెప్పుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్నారు. శుక్రవారం అందునా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా కావడంతో, కొందరు ఆడవాళ్ళు మాత్రం ఈ వర్షం, చలిని లెక్కచేయకుండా పూజలు చేసి, లక్ష్మీదేవిని ఇంప్రెస్ చేయాల్సిందే, అని పట్టు వదలకుండా లేచి తల స్నానాలు మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
జూబ్లీహిల్స్ పక్కన ఉన్న బస్తీలో ఒక చిన్న మూడు అంతస్తుల భవనం ఉంది. చెప్పుకోవడానికి మూడంతస్తుల భవనమే, కాని ఒక్కో అంతస్తులో ఇరికించి కట్టిన సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. దాని గోడలు పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షం వలన ఆ మూడవ అంతస్తు పైన ఉన్న స్లాబ్ మధ్యలో ఉన్న సన్నని రంధ్రం గుండా కారుతున్న వర్షం నీరు, ఇంటి హాల్ నడి మధ్యలో పెట్టి ఉన్న పాత గిన్నెలో పడుతూ ఉంది. ఆ గిన్నెలో కారే ఒకో చినుకు టక్టాక్ మంటూ……………..
Nee Premalo Munigaka
₹210.00
Nee Premalo Munigaka
అహంకారం . ఈ ఒక్క ఎక్కడి అహంకారం మనిషిని ఎక్కడి వరకైనా తెసుకువెళ్ళగలదు. ఎదుటి వాడి మీద గెలవాలి అనే అహంకారం, మనిషిని విచక్షణ కోల్పోయేలా చేసి, పిచ్చోడిలా మార్చగలదు. నేను చేసేదే కరెక్ట్, నేను మాత్రమే తెలివిగలవాడిని, అందరి మీదా నేనే గెలవాలి అనే అహంకారం ఉన్న మనిషి ఎప్పటికి గెలవలేడు, ప్రశాంతంగా బ్రతకలేడు.
వర్షాకాలం కనుక ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉంది. సమయం ఉదయం ఆరవుతున్నా చలి వలన కలిగిన బద్దకంతో అనుకుంట హైదరాబాద్ నగరం అంతా నిద్ర మత్తులోనే ఉంది. కొందరు ఆఫీస్కి టైమ్ అవుతుందని తప్పక దుప్పటి తీసి బలవంతంగా లేస్తున్నారు. కొందరు ఇంకాసేపు ఆగి గుద్దాంలే అని, తమకి తామే సర్దిచెప్పుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్నారు. శుక్రవారం అందునా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా కావడంతో, కొందరు ఆడవాళ్ళు మాత్రం ఈ వర్షం, చలిని లెక్కచేయకుండా పూజలు చేసి, లక్ష్మీదేవిని ఇంప్రెస్ చేయాల్సిందే, అని పట్టు వదలకుండా లేచి తల స్నానాలు మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
జూబ్లీహిల్స్ పక్కన ఉన్న బస్తీలో ఒక చిన్న మూడు అంతస్తుల భవనం ఉంది. చెప్పుకోవడానికి మూడంతస్తుల భవనమే, కాని ఒక్కో అంతస్తులో ఇరికించి కట్టిన సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. దాని గోడలు పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షం వలన ఆ మూడవ అంతస్తు పైన ఉన్న స్లాబ్ మధ్యలో ఉన్న సన్నని రంధ్రం గుండా కారుతున్న వర్షం నీరు, ఇంటి హాల్ నడి మధ్యలో పెట్టి ఉన్న పాత గిన్నెలో పడుతూ ఉంది. ఆ గిన్నెలో కారే ఒకో చినుకు టక్టాక్ మంటూ……………..
Nannaku Prema Kopam Maryadatho
₹250.00నాన్నకు ప్రేమ కోపం మర్యాదతో — మణికాంత్ గెల్లి
తండ్రి-కొడుకు అనుబంధంలోని సంక్లిష్టతలను, ప్రేమను, కోపాన్ని మరియు మర్యాదను అద్భుతంగా ఆవిష్కరించే ఈ రచన మణికాంత్ గెల్లి కలం నుండి జాలువారిన భావోద్వేగ కావ్యం. నాన్న అంటే కేవలం ఒక వ్యక్తి కాదు — ఆయన ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక జీవన పాఠం.
ఈ పుస్తకంలో రచయిత తన నాన్నతో గడిపిన క్షణాలను, వారి మధ్య జరిగిన మాటల యుద్ధాలను, మౌన సంభాషణలను, మరియు అనుచ్చరితమైన ప్రేమను అత్యంత సహజంగా మరియు హృదయస్పర్శిగా చిత్రిస్తారు. తండ్రి కోపం వెనక దాగిన అపారమైన ప్రేమను, మర్యాద వెనక ఉన్న ఆత్మీయతను పాఠకులు తమ స్వంత జీవితాలలో అనుభవించినట్లు అనిపిస్తుంది.
తెలుగు కుటుంబ విలువలను, తరాల మధ్య అంతరాలను, మరియు తండ్రి-పిల్లల బంధపు లోతును అర్థం చేసుకోవాలనుకునే ప్రతి పాఠకుడూ తప్పక చదవాల్సిన పుస్తకం.
Nanna Gurthimpu leni Sainikudu
₹375.00Nanna Gurthimpu leni Sainikudu
ఏప్రిల్ 24. కాశ్మీర్లో అప్పుడప్పుడే శీతల వాతావరణం పోయి
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అప్పటివరకు చలికి గడ్డకట్టి, మంచుతో కప్పబడిన ప్రాంతాలు.., ఇప్పుడు ఆ ఉష్ణోగ్రత వేడికి కరిగి పచ్చదనాన్ని అల్లుకుంటున్నాయి. ఎటు చూసినా.. కాశ్మీరు అందాలు వర్ణించలేనంత అద్భుతంగా, ఆహ్లాదంగా ఉన్నాయి.
కుటుంబాన్ని దూరంగా విడిచిపెట్టి, దేశ రక్షణ బాధ్యతగా భావించే సైనికులతో కాశ్మీరంతా సురక్షితంగా, సుభిక్షంగా ఉంది. నిత్యం అల్లర్లను, ఉగ్రదాడులను ఎదుర్కొంటూ సైనికులు దృఢంగా నిలబడి కాశ్మీర్ను రక్షిస్తూ ఉన్నారు.
అలాంటి సైనికులలో ఒకరు, శ్రీనగర్ క్యాంపు నుండి ఏప్రిల్ 19న, తన ఉద్యోగం ముగించుకొని, సెలవు మీద సొంత ఊరైన విశాఖపట్నం బయలుదేరాలి. కానీ, అక్కడ జరిగిన కొన్ని అనివార్య కారణాల వలన తన ప్రయాణం 5 రోజులు ఆలస్యమై, ఏప్రిల్ 24న శ్రీనగర్ నుంచి మొదలైంది.
Cinema Oka Alchemy
₹300.00అత్యంత ఆధునిక కళాప్రక్రియగా రూపొందిన సినిమా తన సంస్కరణవాడ, గ్రామీణ మూలాల నుంచి వేరుపడి ఇవాళ అది పూర్తి వ్యాపారాత్మకమైంది. నాటకరంగం విషాదంగా నిష్క్రమిస్తున్న వేళ, సినిమా వేయిపడగలు విప్పి హోరెత్తుతోంది. ఆధునిక వ్యాపారవేత్తలు, మాఫియా కలాపోశాకులుగా తల ఎత్తాక.. ఈ రంగం నుంచి ఇంకా ఏమైనా ఆశించగలమా? హరిపురుషోత్తమ రావు అన్నట్లు ‘యథాపాలకవర్గం, తథాసాంస్కృతిక రంగం.’
ఈ ప్రధాన స్రవంతికి భిన్నంగా ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమా కొత్త ఆశలతో చిగురిస్తోంది. మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాల సమాహారమే వెంకట్ సిద్దారెడ్డి వెలువరించిన దృశ్యమాలిక ‘సినిమా ఒక ఆల్కెమీ.’
With Your Permission
₹200.00వెన్నెల చల్లగానూ లేదు, వేడిగానూ లేదు. వెన్నెల జలదరింపుగా ఉంది. నొప్పిగా ఉంది. గాయంగా ఉంది… దుఃఖం దుఃఖంగా ఉంది. కన్నీళ్లు కూడా నొప్పిగా ఉన్నాయి. మెదడంతా పచ్చి పుండై నొప్పిని నరనరంలో పాకిస్తుంటే కన్నీరు హృదయంలోకి, చర్మం మీద ఇంకిపోతూ దేహం నొప్పితో ముడుచుకు పోతున్నది…
కన్నీరెందుకు… ఈ నొప్పీ ఎందుకు మరి? నీ కోసమా బిపిన్… తెలీదు. ఈ అవమానం జరిగినందుకా… ఆడదాన్నైనందుకు… లేదా ఆడదాని దేహం నాకున్నందుకా ఇలాంటి గాయం? నాకేనా… ఒక్క నాకేనా. అందరికీనా… ఆడవాళ్ళందరికీనా లేదా కొందరు ఆడవాళ్లకేనా? నువ్వెందుకో బాగా గుర్తుకు వస్తున్నావు. నదికి సముద్రం జ్ఞాపకం వచ్చినట్లు, పూలకు తనని పట్టించుకోకుండా తన పక్కనించే వెళ్లిపోయిన చిరుగాలి జ్ఞాపకం వచ్చినట్లు, మండే ఎడారికి వానజల్లు జ్ఞాపకం వచ్చినట్లు, ఆకలేసిన పాపాయికి తల్లి పాల పరిమళం జ్ఞాపకానికి వచ్చినట్లు, నాకు… నా బిపిన్ చంద్రా నువ్వే జ్ఞాపకం వస్తున్నావెందుకు? నా గాయం మాన్పే మందువనా నువ్వు. ఎందుకు మరి? నిన్ను కోల్పోయినందుకా… లేక నా జీవితం ఇలా అగాధంలో పడిపోతున్నందుకా… ఎందుకు…? నేను తీసుకున్న నిర్ణయం సరైంది కానందుకా? ఎంత నమ్మకమో కదా నీకు నా మీద. అది పూర్తిగా ధ్వంసం…………….
Soonyam
₹275.00పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో “ఎగిరిపో! నీకు స్వేచ్ఛనిస్తున్నాను” అన్నాడట ఒక యువకుడు. “ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా?” అని అడిగిందట పక్షి. 83లో అదీ పరిస్థితి. ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా ప్రతిరూపాలే. – ముక్తవరం పార్థసారథి తనకు విలువలున్నాయంటే అది ధిక్కారంలాగా కనిపిస్తుంది. తనకూ వాళ్ళకూ మధ్య యింత ఎడం ఎందుకు? ఈ నిత్య జీవితపు రొచ్చులో ఎవరూ తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా రాసేటప్పటి తన నిజాయితీనయినా నమ్ముతారా? ఈ వూహలూ, ఈ అనుభవం మరపుతెరల మరుగున మాయం కాకముందే – రొటీన్ జీవితపు అడుగున పడిపోకముందే అక్షరరూపంలో వ్యక్తమయ్యే నిజాయితీయే సాహిత్యం. అటువంటి సాహిత్యం అది శూన్యంకాదు – జీవితం. అర్థవంతమైన జీవితం. – – వరవరరావు