Showing 73–84 of 133 resultsSorted by latest

Kathalela Rastaru? ?

300.00
కాబోయే కథకులకి పనికొచ్చే చిట్కాలు - ఆరుద్ర “మనం చదివే చాలా కథలకన్నా మనం రాసే కథలే మనకి బాగుంటున్నాయి, అయినా మనం పంపించే కథలు ఈ పత్రిక వాళ్ళు ప్రచురించరేం?” అని మీ రెప్పుడైనా బాధపడ్డారా? ఇప్పుడు పడుతున్నారా? పడకండి ధైర్యం చేతబట్టుకొని, కాళ్ళు నిలదొక్కుకోండి. మీరు పంపించే కథలు మీ కొక్కరికే బాగుంటే చాలదు. అందరికీ బాగుండాలి.. అప్పుడే సంపాదకులు వాటిని ప్రచురిస్తారు. బాగున్న కథల్ని పత్రికలవాళ్ళు కళ్ళకద్దుకుని మరీ ప్రచురిస్తారు. వేసినవాటికి తృణమో, పణమో పారితోషికం కూడా ఇస్తారు. (పూర్వం రమారమి తృణమే ఇచ్చేవారు, ఇప్పుడు పణం ఇస్తున్నారు.) బాగా వుండేటట్టు కథ రాయాలంటే దానికి అనుభవం కావాలి. “చాల్లేవయ్యా! ఆపాటి అనుభవం మాకూవుంది. ఊఁ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచి కథలు వింటున్నాం. కూడబలుక్కొని చదవడం మొదలెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కాంపోజిషన్లు రాయడం మొదలెట్టిన మర్నాటి నుంచి కథలూ రాస్తున్నాం, ఇంతకన్నా ఇంకేం కావాలి?” అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవ ముందని తప్పకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచి కథలు వినాలనీ, చదవాలనీ, వ్రాయాలని తహ తహ వున్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి. భాగవతం రాసిన బమ్మెర పోతరాజుగారు మాత్రం ఎలా రాశారు? విభుదవరుల ఎల్ల విన్నంత, కన్నంత తెలియవచ్చినంత తేటపరిచారు. ఆహా! దొరికింది కిలకం. ఇది మంచి కథలు రాయడానికి సూత్రం! కథ రాసేవాడు ముందు బోలెడంత వినాలి. లాకాయి,.........

Gonthu Vippina Guvva

150.00
బతికిన క్షణాల మోహరింపు శిలాలోలిత Singh Arijit Some - this week. in your leisure actie changes will take ఒక రోజు సాయంత్రం పుస్తకం తెరిచి “ఈ గువ్వ ఎలా గొంతు విప్పిందో అని గమనించాను. నిజాల నిప్పురవ్వల్ని మోస్తూ, తనలోని భావ సంచలనాలన్నింటినీ, స్వచ్ఛంగా ప్రకటించిన తీరు నన్నాకర్షించింది. ఇక, ఆ తర్వాత పుస్తకం నేనో, నేను పుస్తకమో అయిపోయాం . తన శైలితో పాఠకుల్ని తీసుకెళ్ళడం ఈ రచయిత్రికి అలవాటే. 'అనాచ్ఛాదిత కథ', 'విరోదాభాస'తో సాహిత్య లోకంలోకి ఎప్పుడో అడుగులు వేసింది. కానీ, వాటికీ ఈ రచనకు మధ్య బేధం వుంది. ఏ ఇనిబిషన్స్ లేకుండా తనను తాను ప్రకటించుకునే ధైర్యం, పెరిగిన దృష్టి కోణంతో విశ్లేషించిన తీరు చాలా ఆలోచనాత్మకంగా వుంది. బాగా కావాలనుకున్న తీవ్ర కాంక్షలు పొందిన తర్వాత ఇంతేనా అన్పిస్తుంది. మనకు ఇష్టమైనవి దూరమైపోయినప్పుడు నిర్లిప్తత ఆవహిస్తుంది. మనిషే శాశ్వతం కానప్పుడు, ఇళ్ళు, కుటుంబాలు కూలిపోతున్నప్పుడు నిరాసక్తత పెరిగిపోతుంది. వద్దనుకున్నా వైరాగ్యం వదిలిపోదు. శరీరం, పైకి మామూలుగా కన్పిస్తున్నా, లోపల కుప్పకూలిపోతుంది.. మనసంతా నీటిమయమైపోతుంది. ఈ 'గొంతు విప్పిన గువ్వ' ఝాన్సీలోని రకరకాల షేడ్స్ కి ప్రతిరూపం.

Gandla Mitta

160.00
పచ్లో వెళ్ళే ముందు.. “కాదేదీ కథకు అనర్హం” అన్నట్లుగా ఇటీవలి కాలంలో విస్తృతంగానూ, వస్తువైవిధ్యంతోనూ, మట్టి పరిమళాల మాధుర్యాన్ని పంచుతూనూ కథలు రాస్తున్న రచయిత ఆర్.సి.కృష్ణస్వామిరాజుగారు. జ్ఞాపకాల్లోనో, వ్యాపకాల్లోనో కదలాడే పల్లెల్ని ఆత్మతో దర్శించి, అక్షరాల్లోకి నింపి పాఠకులకు అందిస్తున్న కథారచయిత. వీరి కథల్ని ప్రచురించని పత్రిక లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. సామాజిక కథలైనా, బాలలకు నీతిని బోధించే కథలైనా, ఆధ్యాత్మిక కథలైనా, మరే ఇతర కథైనా వీరిలో నిబిడీకృతంగా దాగివున్న ప్రతిభని తేటతెల్లం చేస్తాయి. రాజుగారు కథలకు స్వీకరించే వస్తువులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా ఉండవు. అర్థంకాని విషయాలను ప్రతిపాదించవు. అనవసర సిద్ధాంతాలు, వాటి మీద జరిగిన రాద్దాంతాల జోలికి వెళ్లవు. మాండలికాన్ని మహామంత్రంలా జపిస్తూ కథనొక యజ్ఞంలా నడిపించే శ్రద్ధ వీరి కథల్లో కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజం, అందులోని మనుషులు, వాళ్ల చుట్టూ పెనవేసుకున్న అనుబంధాలు, వరసలతో పిలుచుకుంటూ పరవశించే వాళ్ల మలినం లేని మనసుల ఛాయల్ని వీరి కథలు చిత్రిక పడతాయి. పల్లీయుల స్వచ్ఛ మనస్తత్వానికి అద్దం పడతాయి. తాను చూసిన సంఘటనల్ని కథలో చొప్పించగల నేర్పు, చూసిన ప్రతి మనిషినీ కథలో పాత్రగా చేయగలిగిన కూర్పు రాజుగారి సొంతం. సాధారణ నడకతో మొదలైన కథ ముగింపుకి వచ్చేసరికి పాఠకుల చేత | కన్నీళ్ళు పెట్టిస్తాయి, ఆలోచింపజేస్తాయి. -0'గాండ్లమిట్ట” కథాసంపుటిలో ఇరవై కథలున్నాయి. వివిధ సాహిత్య సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథలను, ఆదివారం సంచికలలోనూ, అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితమైన కథలను 'గాండ్లమిట' సంపుటిగా మనకందించారు. ఈ కథలు చదువుతుంటే.. ఊపిరిపోసుకున్న ఊరి జ్ఞాపకాలేవో రా రమ్మని ఆహ్వానం పలికినట్లుంటాయి. పారేసుకున్న బాల్యమేదో పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకున్నట్లుగా ఉంటుంది. ఒకప్పుడు నడిచిన పొలం...........

Chandamama Kathalu- 8 (1969- 2012 Madhyalo Vachina Kathalu Sachitramgaa)

400.00
శేషపతి అనే ఆయన పనిమీద అడవి అవతల ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాడు. అతనికి అడవిదారి తెలియదు. కాని ఆ గ్రామానికి చెందిన ఒక మనిషి శేషపతిని వెంట తీసుకువెళ్ళి, అక్కడే దిగపడిపోయాడు. అందుచేత వెళ్ళిన పని పూర్తికాగానే శేషపతి ఒంటరిగా తన స్వగ్రామానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన అడవిలో దారి తప్పి, అదృష్టవశాన, చీకటిపడే వేళకు ఏదో గ్రామం చేరాడు. ఆ ఊరు కొండ కింద ఉన్న ఒక చిన్నగ్రామం ఊరి మొదట్లోనే ఒక పెద్ద పాతకాలపు భవనం ఉన్నది. సింహద్వారపు తలుపులకు నగిషీలున్నాయి. శ్లేషపతి తలుపుమీద బాదగానే, లోపలి నుంచి ఒక వృద్ధుడు వచ్చి తలుపు తీశాడు. “మా ఊరు పోతూ దారి తప్పాను. ఈరాత్రికి మీ ఇంట ఆశ్రయం ఇయ్యగలరా ?" అని ఆ వృద్ధుణ్ణి శేషపతి అడిగాడు. వృద్ధుడు శేషపతిని పరిశీలనగా చూసి, “నువు సాంబశివుడి కొడుకువు కాదూ ? మీది పలానా ఊరు కాదూ ?” అని అడిగాడు. శేషపతి నిర్ఘాంతపోయి, “అవును, మా విషయాలు మీకు ఎలా తెలుసు ?” అని వృద్ధుణ్ణి అడిగాడు. “నేనూ, మీ నాయనా బాల్యమిత్రులం. పెళ్ళికాగానే నేను ఈ ఊరు ఇల్లరికం వచ్చేశాను. అప్పట్లో సాంబశివుడు అచ్చగా నీలాగే ఉండేవాడు. నిన్ను చూస్తూంటే అతన్ని చూస్తున్నట్టే ఉన్నది. రేపు పండగ ! సరదాగా గడిపి మరీ వెళుదువు గాని!” అంటూ వృద్ధుడు శేషపతిని ఆదరంతో లోపలికి తీసుకుపోయి, తన భార్యకూ, పిల్లలకూ పరిచయం చేశాడు. తరవాత శేషపతి స్నానం చేసి, భోజనం చేసి, ప్రయాణపు బడలికవల్ల నిద్ర ముంచుకు వస్తూంటే తనకోసం వృద్ధుడు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో, పెద్ద పట్టెమంచం మీద పడుకుని, వెంటనే నిద్రపోయాడు. ఒక రా త్రివేళ ఏదో అలికిడి అయి శేషపతికి మెలకువ వచ్చింది. ఇంటినిండా మనుషులు మసులుతున్నట్టు తోచింది. పిండివంటల వాసన వస్తున్నది. శేషపతి ఆశ్చర్యపోతూ, తన గదిలో నుంచి ఇవతలికి వచ్చాడు. మరొకగదిలో వృద్ధుడూ, ఆయన భార్యా, పిల్లలూ గాఢనిద్రలో ఉన్నారు. మిగిలిన ఇల్లంతా హడావుడిగా ఉన్నది. ఇంటినిండా జనం ! కొందరు బూజు దులుపుతున్నారు. కొందరు ఊడుస్తున్నారు. కొందరు ఇల్లు కడుగుతూ పోతున్నారు. కొందరు ఎక్కడి నుంచో బరువైన

Bapu Cartoon Samputi- 2

260.00
-ముళ్లపూడి వెంకటరమణ "వర్సా/ వరం కోరుకో" "ఎందుకూ?" "బి.ఎల్ చదివి లాయడు పయ్యావు గదా" "అయితే?" "ప్రాక్టీసు పెట్టాలి గదా" "పెడితే “గొప్పలాయరువై కోట్లు గడిస్తానా - గొప్ప జడీపై కీర్తి గడిస్తావా - వరం కోరుకో "నా ప్రాక్టీసు అదికాదు" "మరి రాయెందుకు చదివిపట్టు? " "తండ్రి ఆజ్ఞ తలదాలిచి "ప్రాక్టీసు పెట్టకపోతే తండ్రి ఆజ్ఞ తప్పినట్టు కాదా ?" "తండ్రి ఆజ్ఞ లాయరు చదవడం వరకే - ప్రాక్టీసుకు ఇది వర్తించదు" "ఇంతకీ ఏం ప్రాక్టీసు చేస్తావు ?" 'ఇది' అని అట్టమీద వేసిన పరస్వతి బొమ్మని చూపించాడు బాపు. చదువుల తల్లి సంతోషించింది. "అరె - నాతో మాట్లాడుతూనే నా బొమ్మ గీశావే " "నాతో మాట్లాడుతూనే నువ్వు వీణ వాయిస్తున్నావు కదా" "చమత్కాంచే - పరేకాని - బొమ్మలు అని ఒక్క మాటలో చెప్పావు. చిత్రకళ సముద్రమంతటిది. అందులో ఎన్ని విధాలున్నాయో - ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పెప్ & బ్రష్ వాష్, పెయింటింగ్స్లో రవివర్మ, చామకూర్, దామెర్ల, భాగీరథి, మొక్కపాటి, పిలకా, వైకుంఠం, పైడిరాజు - ఇలా ఎందరో... రేఖా చిత్రాల్లో బాపిరాజు, తలపెట్టి, వపా- తెల్లదొరల్లో దానిన్నీ, మైకేలేంజలో, వార్మన్ రాక్వెల్, పోగార్ - కార్టూముల్లో పూల్ట్, చామ్ - శిల్పంలో రోగాన్ | (ROOM రాయ్ చౌధురి - ఇలా ఎన్నో శాఖలు - ఎందరో మహానుభావులు.....

Bali Kathalu

320.00
అప్పికట్ల వారి వీధికి ఆహ్వానం 1972లో వడ్డెర చండీదాస్ గారి నవల “ హిమజ్వాల” ఆంధ్రజ్యోతి భాగానికి వారపత్రికలో సీరియల్ గా వస్తున్నప్పుడు, ప్రతివారమూ ఆ నవలా వేసిన బొమ్మలు కూడా ఆ నవలంత కొత్తగా, అధునాతనంగా వుండేవి. ఆ బొమ్మలు వేసిన చిత్రకారుడి పేరు బాలి. అదీ బాలిగారితో తెలుగు సాహిత్యానికి తొలి పరిచయం. (అప్పటికే కొన్ని నవలలకు బొమ్మలు వేసి ఉంటారు). అప్పటి నుంచీ తెలుగు పత్రికలకో కొత్త చిత్రకారుడు దొరికాడు. అప్పటి పత్రికల చిత్రకారుల్లాగే ఆయన కూడా ఆ తరువాత కార్టూన్లూ గీసి నవ్వించారు. వాళ్లలో చాలా మందికి భిన్నంగా అప్పుడప్పుడు కథలూ రాశారు. బాపూగా రొకటి రెండు కథలు రాసినట్టు యెవరో చెబుతుంటే విన్న గుర్తు. చంద్రగారు చాలా కథలు రాశారు. అయితే యిలా కథల సంపుటాన్ని ప్రచురిస్తున్న తొలి పత్రికా చిత్రకారుడు నాకు తెలిసి బాలిగారొకరే! యీ సంపుటంలోని కథలన్నీ వొక ప్రముఖ చిత్రకారుడి కుంచెలోంచి వచ్చిన కథలు, అంతకంటే మౌలికంగా విశాఖపట్టణం దగ్గరి అనకాపల్లి అనే వూళ్లో వుంటే వొక మధ్యతరగతి వ్యక్తి బాల్య ప్రజ్ఞాపకాల దొంతరలు. పట్టుమని అయిదారు పేజీలకు మించని కథలే వున్న యీ సంపుటంలో చిత్రంగా, వూహించ రీతిలో, (238వ పేజీ నుంచి దాదాపు 57 పేజీల నిడివుండే) పెద్ద కథ వొకటుంది. దాని పేరు 'అప్పికట్ల వారి వీధి'. ఆ కథ చదువుతున్నంత సేపూ నాకు ముళ్లప్పూ వెంకటరమణ గారి 'జనతా ఎక్స్ ప్రెస్' కథే గుర్తుకొచ్చింది. ముళ్లపూడి గా బాపూగారనే గొప్ప స్నేహితుడుండేవారు. ఆయన తన స్నేహితుని కథలకు యిం ముబ్బడిగా బొమ్మలేసి పెట్టేవాడు. 'జనతా ఎక్స్ ప్రెస్' అనే ఆ పెద్ద కథ నా ండా............

Rendu Kommula Rushi

225.00
పరిచయం వివిధ ప్రాంతాలలో వివిధ భాషలలోని రామాయణ, మహాభారత, భాగవతాలను చదివి ఈ ఐదు భాగాల పుస్తకాలను రచించాను. అవి వేర్వేరుగా ఉన్నట్టు అనిపించినా వాటిని కలిపే మూలం ఒకే దారంగా అన్నింట్లోను కనబడుతుంది. పురాణాలలో పేర్కొన్న కొన్ని పాత్రలు వారి జీవిత కోణంలోంచి కథను చెబుతాయి. ఈ కథలలోని ప్రదేశాలు నేను దర్శించి అక్కడ చెప్పే కథల సారాంశాన్ని, సమాచారాన్ని అందించడం నా అదృష్టం, పురాణాల్లోని వివిధ అంశాలను సేకరించి వ్రాసిన ఐదు పుస్తకాలలో ఇది చివరిది. ప్రతి పుస్తకం మరో పుస్తకంతో సంబంధం లేనిదైనా దేనికదే వివరంగా ఉంటుంది. నేను వ్రాయలేక వదిలేసినవి అనేక కథలున్నాయి. ఈ పుస్తకం చదివి మీరు స్ఫూర్తిని పొంది మిగిలిన కథలు మీ అంతట మీరే చదువుతారని ఆశిస్తున్నాను. ఈ పుస్తకాలు రాసేటప్పుడు నా సంపాదకురాలు శృతకీర్తి ఖురానా నాకు సహకారం అందించింది. నేను పరిశోధన చేసేటప్పుడు జీవితం, ఆధ్యాత్మికత గురించి, పుస్తకాల గురించి అనేక లోతైన చర్చలు జరిపి మమ్మల్ని మేం తెలుసుకున్నాం. మా అనుబంధం సంపాదకురాలు - రచయిత కన్న ఎక్కువది. అనేక విధాలుగా ఆమె నాకు కూతురు, మరిన్ని రకాలుగా ఆమె నా విద్యార్థి, నేను చేపట్టే వితరణ కార్యక్రమాలలో చిరకాల సలహాదారు. మేం చేసే వినోదభరిత సంగీత సాహిత్య సాహసయాత్రలో నాతోబాటు ప్రయాణించిన యువనేస్తం. పెంగ్విన్ రాండంహౌస్ లోని సోహిని మిత్రా, షాలిని అగర్వాల్, ప్రియంకర్ గుపా బృందం ఐదు పుస్తకాలు అందించడానికి ఇచ్చిన తోడ్పాటుకు, తెలుగులో తీసుకువచ్చిన అలకనంద ప్రచురణలకు నేను కృతజ్ఞురాలిని.

Dostoevsky Kathalu

125.00
ఫెయోదార్ మిఖలోవిచ్ దొస్తాయేప్ స్కీ (11 నవంబర్ 1821 - 9 ఫిబ్రవరి 1881) పీటర్స్ బర్గ్ (అప్పటి రష్యా రాజధాని)లో ఓ మధ్యతరగతి డాక్టర్ కుటుంబంలో జన్మించాడు. యవ్వనంలో ఇంజినీరింగ్ చదువుతున్న సందర్భంలో విప్లవ భావాలతోప్రేరేపితమయ్యాడు. డిశంబరిష్ట తిరుబాటు (1825 - డిసెంబర్) ఆనాటి రష్యాలోని మధ్యతరగతి, యూనివర్శిటీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ స్ఫూర్తితో ఓ యువ తాత్విక చర్చా సంఘంలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. "పేద జనం” అతని మొదటి రచన. అది సాహిత్య ప్రపంచంలో మంచి పేరు తెచ్చింది. ఈ పుస్తకం జారిప్ట్ రష్యాలో పేదల పాట్లను వివరించింది. దీనితో ప్రభుత్వం ఇతని రచనలపై నిషేధం విధించి, తిరుగుబాట్ల సమర్థకుడనే అభియోగం మోపి ఉరిశిక్ష విధించింది. పీటర్స్ బర్గ్ జైలులో వుంచారు. తరువాత జరిగిన విచారణ వల్ల చివరి క్షణంలో, సైబీరియన్ ప్రవాసానికి పంపించారు. తిరిగి వచ్చిన తరువాత వ్రాసిన కరమజోవ్ సోదరులు, నేరము - శిక్ష, శ్వేత రాత్రులు, ఈడియట్ వంటి రచనలు ప్రజల మన్ననలు పొందాయి. మానసిక విశ్లేషణలతో కూడిన వాస్తవవాద దృక్పథాన్ని అనుసరించడం వల్ల ఆయన సాహిత్యం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.