-
-
-
-
-
-
Manchi Swiya Prema Dwara
₹399.00స్వీయప్రేమ అంటే ఏమిటి?
మానసిక ప్రశాంతత చేకూరాలంటే జీవితంలో తప్పనిసరిగా సంతులనం ఉండాలి. పనికి- విశ్రాంతికి, కార్యాచరణకి – సహనానికి, ఆదాయానికి -వ్యయానికి, హాస్యానికి-గాంభీర్యానికి, వదిలించుకోటానికి కొనసాగ టానికి మధ్య సమతుల్యత ఉండాలి. జీవితంలోని అన్ని పార్శ్యాలలోనూ మీరు సమతుల్యతను గనక సాధించకపోతే, మీరు తీవ్రంగా అలిసిపోతారు. విపరీతమైన భావోద్వేగాలు మిమ్మల్ని కుంగదీస్తాయి. అపరాధభావన మిమ్మల్ని వెంటాడుతుంది.
ఉదాహరణకు, కార్యాచరణకు- సహనానికి మధ్య సంతులనం గురించి చెప్పుకుందాం. మీరు చివరి సంవత్సరం యూనివర్సిటీ పరీక్షలకు
ప్రాజెక్టు లీడర్ గా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో మీరు అధికంగా అభిమానించే ఆటగాడొకరు తన బృందానికి సహకరించటం లేదన్న విషయాన్ని మీరు గుర్తించారు. అదే అనేక మార్లు కొనసాగినప్పుడు తప్పనిసరిగా మీరు సంబంధిత అధికారుల దృష్టికి ఆ విషయాన్ని తీసికెళ్లాలి. అప్పుడు కూడా వారు మీ సూచనలను నిర్లక్ష్యం చేస్తుంటే, ఏ చర్య తీసుకోలేకపోయానన్న అపరాధభావన మిమ్మల్ని వెంటాడుతుందా
‘మీరు దయ,
జాలి గల వ్యక్తులయితే, అనవసరంగా వారి మనసును గాయపరిచి, ఇబ్బందులోకి నెటానేమోనన్న భావనా మిమ్మల్ని ఇబ్బంది
-
Mi Kalalanu Kollagottindevaru? ?
₹225.00నేను ఈ పుస్తకాన్ని ఎందుకు రాసాను?
మిమ్మల్ని వేళాకోళం ఎవరైనా చేసారా…? మీరు తప్పు చేసారని నిరూపించడానికి ఎవరైనా ప్రయత్నించారా…? మిమ్మల్ని అపహాస్యం పాలు చేసారా…? మిమ్మల్ని అవమానించారా…? మిమ్మల్ని పడదోయడానికి ఎవరైనా ప్లాన్ చేశారా ? అయినా మీరు నిలదొక్కుకుని అరిచారా . . .
ఇక చాలు, మరీ ఎక్కువ అయింది… తస్మాత్ జాగ్రత్త………
నా జీవితంలో నేను ఒకప్పుడు ఇటువంటి పరిస్థితులలోనే చిక్కుకుపోయాను. ఇక సహించలేకపోయాను. చెలియలికట్ట తెగిపోయింది…. అందువలనే ఈ పుస్తకం రాసాను. మీకు అసలు సిసలైన నిజాలను చూపించాలి. నిజాలు తెలుసుకున్నాక మీ కళ్ళు తెరుచుకుంటాయని నా నమ్మకం….. తరతరాల నుండి వస్తున్న బిజినెస్లో మీరు ఎంత కాలం నిలదొక్కుకోగలుగుతారు. వాటిల్లో లాభాలు తక్కువ వస్తున్నాయి. జీతాన్ని చాలా వరకు తగ్గిస్తున్నారు. ఇక తమ ఆఫీసుల్లో పనిచేసే వర్కర్లను తీసేస్తున్నారు.
నేను తరతరాల నుండి వస్తున్న బిజినెస్ గురించి చెప్పాను. దీనికి వ్యతిరేకంగా మరో మార్గం కూడా ఉంది. ఈ మార్గంలో నడిస్తే మీరు బాస్ కూడా కాగలుగుతారు. దీనిని అపరంపరాగత బిజినెస్ అని కూడా అనవచ్చును. ఈ బిజినెస్ ఈనాడు ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ కొత్త పద్ధతి ప్రజల కార్యప్రణాళికలను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు వాళ్ళ లైఫ్ స్టైలే మార్చేస్తోంది.
నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీలెవల్ మార్కెటింగ్ (ఎమ్.ఎల్.ఎమ్) అన్న పేరున నడిచే ఈ వ్యాపారం. ఎంతో పై ఎత్తున మీరు మీ లక్ష్యం దాకా… పనిచేసే సమయం, ఎన్నిగంటల పని చేయాలి అన్న నిర్ణయం తీసుకోగలుగుతారు. పార్ట్ టైమ్ పనిచేస్తూ బోలెడంత సంపాదించవచ్చు. ఇదంతా ఉత్తి కల్పనేనా? లేకపోతే ఏదైనా స్కామా?
-
Naa Bharathadesam
₹150.00‘నా భారతదేశం: భవితకు సూచనలు’ అనే గ్రంథం డా ఎ పి జె కలాంగారి రాష్ట్రపతి పదవీవిరమణ తర్వాతి ఉపన్యాసాల నుండి గ్రహించిన సారాంశాల సంకలనం. డా కలాంగారు భారతదేశంలోనే కాక, విదేశాలలోనూ పలు పార్లమెంట్లు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలలో చేసిన ఉపన్యాసాల నుండి సంగ్రహించిన ఈ భాగాలలో, విజ్ఞానం, దేశ నిర్మాణం, పేదరికం, కనికరం, ఆత్మవిశ్వాసాలపై వారి అభిప్రాయాలు క్రోడీకరించబడ్డాయి.
స్థిరచిత్తం గల మహానుభావులైన మేరీ క్యూరీ, డా విక్రమ్ సారాభాయి వంటి వారి జీవితాలను, డా కలాం యువనాయకులను ప్రోత్సాహపరిచేందుకు, స్పూర్తినిచ్చేందుకు ఉదాహరించారు. ఈ ఉపన్యాసాలు ద్వారా చెప్పిన ఎన్నో విలువైన పాఠాలను వినమ్రత, ఎదురుతిరగడం, దృఢనిశ్చయం.. తదితర విషయాలపై చెప్పడం, పిల్లలు ఆలోచించడం, ఎదగడం, వికసించడానికి తోడ్పడతాయి.డా కలాంగారి ఆఖరి పుస్తకం వారి మనసుకు చాలా దగ్గరగా ఉండే ప్రాజెక్టు. అది ప్రతి పిల్లవాడికీ మార్గదర్శనం చేసి, వారి కలలను అన్వేషించేందుకు, ఉత్తమపౌరులుగా ఎదగడానికి, మరింత మేలైన భారతదేశాన్ని గుర్తించేందుకు సాయపడుతుంది.
-
-
Rich Dad Poor Dad
₹399.00రిచ్ డాడ్ పూర్ డాడ్….
* ధనికులు అవాలనుకునే వారు ఆదాయాన్ని అధికంగా సంపాదించాలి అనే కట్టుకధని పటాపంచలు చేస్తుంది.
* మీ ఇంటిని మీరొక ఆస్తి అనుకునే నమ్మకాన్ని సవాలు చేస్తుంది.
* తమ పిల్లలకి డబ్బు గురించి నేర్పించటానికి నేటి విద్యా విధానం మీద ఎందుకు ఆధారపడకూడదో తల్లిదండ్రులకు తెలియజేస్తుంది.
* ఆస్తి, అప్పులకు ఆర్ధికపరమైన శాశ్వత నిర్వచనాలను ఇస్తుంది.
* మీ పిల్లలు భవిష్యత్తులో ఆర్ధికంగా విజయం సాధించటానికి, వాళ్ళకు ఏం నేర్పాలో మీకు బోధిస్తుంది.
రాబర్ట్ కియోసాకీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది జనానికి డబ్బు గురించి ఎలా ఆలోచించాలో నేర్పి, వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చారు. సూటిగా మాట్లాడడం లోనూ, ధైర్యంగా మూసభావాలని ఎదుర్కోవడంలోనూ అతను పేరు పొందారు. తరచూ అతని వైఖరి సాంప్రదాయక వివేకాన్ని ధైర్యంగా ఖండిస్తూంటుంది. ఆర్దిక స్వాతంత్ర్యాన్ని ఆవేశపూరితంగా సమర్ధించే వ్యక్తీగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
రిచ్ డాడ్ పూర్ డాడ్ అత్యుత్తమ వ్యక్తిగత ఆర్ధిక గ్రంథం
“భవిష్యత్తులో భాగ్యవంతులవాలనుకునేవాళ్ళు రిచ్ డాడ్ పూర్ డాడ్ తోనే మొదలుపెట్టాలి.”
– యు.ఎస్.ఎ.టుడే
“జనం డబ్బు కోసం కష్టాలు పడటానికి ముఖ్యకారణం, వాళ్ళు ఎన్నో ఏళ్ళు విద్యాలయాల్లో చదువుకున్నప్పటికీ, డబ్బు గురించి అక్కడ ఏమీ నేర్చుకొకపోవటమే! దాని ఫలితం – వాళ్ళు డబ్బు కోసం పనిచేయటం నేర్చుకుంటారు…. కాని, డబ్బు చేత పనిచేయించటం వాళ్ళెన్నడూ నేర్చుకోరు.”
– రాబర్ట్ కియోసాకీ
-