YOU MAY ALSO LIKE…
-
Bharateeya Naastikavaadam - భారతీయ నాస్తికవాదం
₹300.00
-
Mein_Kampf -మెయిన్ కాంఫ్ (అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ)
₹620.00Original price was: ₹620.00.₹558.00Current price is: ₹558.00. -
BHARATEEYA DARSANAM
₹350.00
-
BHAVADGEETA OKA AVALOHANA
₹180.00
Showing all 7 resultsSorted by latest
Oke Okkati
₹299.001 ఒకే ఒకటి
1991 జూన్ 7 వ తేదీన భూమి 112 నిమిషాలపాటు అదిరింది. నిజంగా కాదు, అలా అనిపించింది అంతే.
నేను ప్రఖ్యాత హాస్య చిత్రం ‘సిటీ స్లిక్కర్స్’ చూస్తున్నాను. ప్రేక్షకుల నవ్వులతో హాలు దద్దరిల్లి పోయింది. ఇంతవరకు వచ్చిన వాటిలో అది అత్యంత హాస్యచిత్రంగా పేరు పొందింది. అందులో అనూహ్యమైన జ్ఞానగుళికలు, అంతర్ దృష్టి డోసులు
కూడా ఉన్నాయి. మరుపురాని ఒక దృశ్యంలో పట్టువదలని కౌ బాయ్ కర్లీ (కీర్తిశేషులు జాక్ పాలన్స్ నటించారు), సిటీ స్లిక్కర్ మిచ్ (బిల్లీ క్రిస్టల్ ఆ పాత్రలో) తప్పిపోయిన పశువులను వెతకటానికి బయలుదేరుతారు. ఆ సినిమాలో ఆద్యంతమూ దాదాపు వారు ఇద్దరూ పోట్లాడుకుంటూనే ఉంటారు. పక్కపక్కనే సవారి చేస్తూ చివరికి ఇద్దరూ జీవితాన్ని గురించి ఒక సంభాషణలో కలుస్తారు. ఉన్నట్టుండి కర్లీ తన గుర్రాన్ని ఆపి మిచ్ వైపు తిరుగుతాడు.
కర్రీ : నీకు జీవిత రహస్యం తెలుసా?
మిచ్ : తెలీదు. ఏమిటి?
కరీ : ఇది. [ఒక వేలు పైకి ఎత్తుతాడు]
మిచ్ : నీ వేలా?
Enduku Tho Modalu
₹399.00ఉపోద్ఘాతం
‘ఎందుకు’ లో దాగి ఉన్న శక్తి
నా జీవితంలో అవసరమైన సమయంలో సరిగ్గా ఈ ‘ఎందుకు’ ఎదురయింది. అది అధ్యయనంలోనో మానసిక క్షేత్రంలోనో జరిగిన పరిశోధన కాదు. నేను చేస్తున్న పనిమీద నాకు ఆసక్తి నశించింది. నా చుట్టూ చీకటి అలుముకున్నది. నేను చేసే పనిలోనూ, నా ఉద్యోగంలోనూ ఏ లోపమూ లేదు. ఆ పనిచేయటంలో ఆనందాన్ని కోల్పోయాను. బయటికి కనిపించే పరిస్థితులు చూస్తే నేను ఆనందంగానే ఉన్నానని చెప్పాలి. నా జీతం బాగున్నది. నా ఖాతాదారులందరూ చాలా మంచివాళ్ళు. కానీ అందులో నాకు ఆనందము. తృప్తి కలగటంలేదు. ఒక మంచి ఉద్యోగం చేస్తున్న సంతృప్తి, అనుభూతి నాకు కలగటం లేదు. పనిపట్ల అనురక్తి, పాశము నాలో మరొకసారి కళ్ళు తెరవాలి.
ఈ ఎందుకు కనుక్కున్న తర్వాత ఈ ప్రపంచం పట్ల నా దృక్పధం పూర్తిగా మారిపోయింది. ‘ఎందుకు’ కనుక్కున్న తర్వాత నా అనురక్తి. పాశము ఎప్పటికంటే ఎన్నోరెట్లు పెరిగాయి. అది అతి సరళం, శక్తివంతం, ఆచరణాత్మకం కూడా. కనుకనే వెంటనే నా స్నేహితులందరికీ చెప్పేశాను. అంతేగదా మరి! విలువైన విషయం ఏదైనా తెలియగానే మన సన్నిహితులతో చెప్పుకుంటాం. ఆ ఉత్తేజంతో నా మిత్రుల జీవితాలే మారిపోసాగాయి, ఆ కారణంగా నా మిత్రులందరూ వచ్చి ఆ రహస్యాన్ని తమ సన్నిహితులందరికీ చెప్పమని అడిగారు. అలా ఆ భావన విస్తరించసాగింది………….
Rich Dad’s Retire Young Retire Rich
₹499.00శూన్యం నుండి ప్రారంభించి పది సంవత్సరాల కంటే తక్కువ సమయంలో ఎలా ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలో చెప్పే పుస్తకం ఇది.
మీరు కూడా ఎలా చేయగలరో తెలుసుకోండి.
మీరు జీవితంలో అధిక శ్రమ చేయలేరనుకుంటే
ఈ పుస్తకం మీకోసమే!
యౌవనంలోనే ధనవంతులుగా ఎందుకు రిటైర్ కాకూడదు?
రాబర్ట్ కియోసాకి ప్రపంచంలో కోట్లాది మందికి ధనం పట్ల ఉన్న సాంప్రదాయక ఆలోచనా విధానాన్ని ప్రశ్నించారు. అందులో మార్పు తెచ్చారు. పెర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ ఎడ్యుకేషన్ రంగాల్లో పుస్తకాలు, వీడియోల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా శిక్షణ అందిస్తున్నారు. ఆయన రూపొందించిన క్యాష్ ఫ్లో బోర్డ్ గేమ్, సాఫ్ట్ వేర్ గేమ్స్ ఆర్థిక నైపుణ్యాలు పెంపొందించడంలో సరికొత్త దృష్టికోణాన్ని అందిస్తున్నాయి.
Atma Darshanam
₹200.00నీ నిజతత్వాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఇదే ఆధ్యాత్మిక సారం. లౌకిక జీవితాన్ని జీవిస్తూనే ఆత్మపథంలో ఎలా ప్రయాణించాలో, దుఃఖం నుండి, అజ్ఞానం నుండి, జనన మరణ చక్రం నుండి మరియు కర్మబంధం నుండి విముక్తిని ఎలా పొందాలో ఆచరణాత్మకంగా బోధించే మార్గదర్శి ఈ గ్రంథం. ధ్యానం మరియు ఆత్మజ్ఞానాలతో మోక్షాన్ని, ఆత్మదర్శనాన్ని ఎలా పొందాలో విడమరచి చెప్తుంది. ఈ గ్రంథం. ముక్తి, మోక్షం, నిర్వాణం, ఆత్మసాక్షాత్కారం, సచ్చిదానందం, బ్రహ్మవిద్య, దైవం వంటి ఎన్నో క్లిష్టమైన ఆధ్యాత్మిక అంశాలను సులభరీతిలో బోధపరిచే అద్భుతమైన పుస్తకమిది. దేశ, మత, ప్రాంతాలకు అతీతమైనది ఆత్మదర్శనం. ఎటువంటి సమస్యనైనా అధిగమింపజేయగలిగేది ఆత్మదర్శనమే. బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను అధిగమించడం ఆత్మదర్శనంతోనే సాధ్యం. ఆత్మస్థితిని పొందిన ఒక ఆత్మజ్ఞాని యొక్క అనుభవపూర్వక జ్ఞానప్రవాహమే ఈ సంకలనం. ఈ మార్గదర్శకత్వంలో ప్రతి సాధకుడు ఆత్మదర్శనాన్ని పొందుగాక!
Nanu Nadipinchina Charitra
₹150.00ఒక్కమాటలో చెప్పాలంటే లలిత కిచ్చిన మాటకోసం. లలిత “నా జ్ఞాపజాలు’ పేరుతో తన జీవిత విశేషాలురాసింది. “మీరురాయాలండి, మీ జ్ఞాపకాలు విస్తృతమైనవి, విభిన్నమైనవి” అని అంటుండేది. నా పై తనకున్న ప్రేమాభిమానాలు మాత్రమే కాదుఅలా అనడానికి,నా అనుభవాలు అనేకానేక విషయాలను ప్రస్తావిస్తాయనీ, అవి ఆయా సందర్భాల్లో జరిగిన విశేషాలను తెలియచేస్తాయనికూడా కావచ్చు.
జీవితంలోనేను సంపాదించుకొన్నవెలకట్టలేని సంపద అనేకులైననా మిత్రులు,శ్రేయోభిలాషులు,పరిచయస్తులూను. వీరిపరిచయంతోపాటు వారిచ్చిన ప్రోద్బలం నాకు ఊతమిచ్చి నన్ను నడిపించింది. నన్ను నేను సమర్థించుకోవడానికి,ఇదిచెపుతున్నానని అనుకొన్నా,ప్రతి వ్యక్తికీ తన్ను గూర్చి చెప్పుకోవాలన్న ఆసక్తి వుండడం సహజం. ఇది బలహీనతా? కాదనను.మినహాయింపులుండవచ్చు.
వ్యక్తిగతజీవిత చరిత్రల పొరల్లో దాగి, పరిసరాల, ప్రాంతీయ, దేశ చరిత్రల ఆనవాళ్లువుండ స్వీయజీవితచరిత్రకారుడు వీటినితన ‘కథ’లో స్పృశించడా?
జీవితచరిత్రలు,ఆయావ్యక్తుల,వారి,వారిజీవితాలనువాస్తవంగా, అరమరికలు, దాపరికాలులేకుండాప్రతిబింబిస్తాయా? అందరూ’మహాత్ములు’ కారు,కాలేరు.అలాంటప్పుడుఅవినికార్సయిన రచనలు అవుతాయా? ప్రతి జీవితచరిత్రకారుడునిజాయితీగాఎదుర్కొనే ప్రశ్నలుయివి!