Aksharabhyasam
అక్షరాభ్యాసం
ఆ రోజు నేను స్కూల్లో పాఠం చెబుతున్నప్పుడు నా స్నేహితుడు పద్మనాభం ఫోన్ చేసి శనివారం నాడు తన కొడుక్కి అక్షరాభ్యాసం చేయిస్తున్నాననీ, నన్ను తప్పక రమ్మని చెప్పాడు.
నేను, పద్మనాభం చిన్నప్పట్నించీ ఒకే ఊరిలో పెరిగాం. ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇద్దరం బీఈడీ చేసాం. నేను పట్నంలో మున్సిపల్ టీచరుగా ఉద్యోగం చేస్తుంటే, వాడు మా ఊరి స్కూల్లోనే టీచర్ గా పని చేస్తున్నాడు. వాళ్ల నాన్న పాతికెకరాల భూస్వామి కావడంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించి మా ఊళ్లోనే పోస్టింగ్ వేయించుకున్నాడు.
- పద్మనాభం ఓ పక్క టీచరు ఉద్యోగం చేస్తూనే ఇంకో పక్క వ్యవసాయం కూడా చేస్తుంటాడు.
వాడికి ఆరేళ్ల క్రితం పెళ్ళైంది. వాడెందుకో ముప్పై ఏళ్ల తరువాత పెళ్ళి
చేసుకున్నాడు.
నేను మా నాన్నగారి దగ్గర స్మార్తం నేర్చుకున్నాను. మా నాన్న గారు మా ఊరి పురోహితుడు. ముందు నన్ను చదివించనన్నారు. నేను చదువుకుంటానని పట్టుపట్టడంతో తప్పక నన్ను చదివించారు.
కానీ కులవృత్తి అని స్మార్తం నేర్పించారు. రెండేళ్ల క్రితం నాన్నగారు చనిపోవడంతో ఊరికి పురోహితుడు లేకుండా పోయాడు. అందుకే ఈ రోజు పద్మనాభం నన్ను పిలిచాడు.. నేనైతే రెండు విధాలుగా ఉపయోగపడతాననీ వాడి ఆశ. |
ఈ విషయం నాకు చాలా రోజుల నుంచీ వాడు చెబుతున్నాడు. వాడి కొడుకు అక్షరాభ్యాసం నేనే చేయించాలనీ.
నేను శుక్రవారం రాత్రి బయలుదేరి ఆఖరి బస్సుకి మా ఊరు వెళ్లాను.
Aha Oho Ikigai
1. ప్రారంభం
అది అందాల మైసూరు నగరంలోని దాసప్రకాష్ హోటల్. ఆటోలోంచి దిగిన పూర్ణిమ చకచకా నడుస్తూ తన అన్నావదినలు బస చేసిన గదికి వెళ్లింది. ఆమె అన్నయ్య రత్నాకర్ ప్రముఖ వ్యాపారవేత్త, వదిన వనజ వైద్యురాలు. వాళ్లకు తొమ్మిదో తరగతి చదువుచున్న పదమూడేళ్ల బాబు అన్వేష్. వాళ్లు ఉండేది హైదరాబాద్లో. గదిలో అడుగు పెట్టిన పూర్ణిమను చూడగానే “చెల్లీ, వచ్చేశావా! పద పద. మాకు మంచి అల్పాహారం పెట్టిద్దువుగాని” అన్నాడు రత్నాకర్ సరదాగా నవ్వుతూ, “రాకరాక వచ్చారు. అల్పాహారంతో సరిపుచ్చుతానేంటి! మీరిక్కడ ఉన్నన్ని రోజులూ మా మైసూరు ప్రసిద్ధ వంటకాల రుచి చూపిస్తాలే, అన్నయ్యా” అంది పూర్ణిమ కొంటెగా. వనజ అందుకుని “మేముండేది ఈ రోజు సాయంత్రం వరకేనమ్మా. తరువాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం. వ్యాపారరీత్యా మీ అన్నయ్య విదేశాలకు వెళ్లాలట" అంది. “అవునా ? ఇంతకీ మీరు ఏ పనిమీదొచ్చారు, వదినా ?” అడిగింది పూర్ణిమ. "మీ అన్నయ్యకు ఇక్కడ ఏదో ముఖ్యమైన బిజినెస్ పని ఉంది. నాకేమో మా డాక్టర్ల సదస్సు ఉంది. అవును పూర్ణిమా, ఇక్కడ మైసూరు విశ్వవిద్యాలయంలో ఎంతో ఇష్టపడి సైకాలజీ కోర్సులో చేరావు కదా! ఎలా ఉంది ?" అడిగింది వనజ............Sagara Ghosha
ఇది విశ్వకావ్యం. భూమి చరిత్రే ఈ కావ్యంలోని ఇతివృత్తం. మానవుడే దీంట్లో నాయకుడు. ఇది మనిషి కథ. కోట్ల ఏళ్లనాటి భూమి పుట్టుక నుండి నిన్న మొన్నటి ఘట్టాల వరకు ఇంచుమించుగా మానవుని మహాప్రస్థానంలోని అన్ని సంఘటనలు ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇది పర్యావరణ పద్య కావ్యం. మనిషి భౌతిక పరిసరాలు అందంగానూ, ఆనందాయకంగాను ఆలోచించాలని తెలియజెప్పే కావ్యం ఇది. ఆదిశంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో అన్ని దేశాల సాంస్కృతిక చరిత్రని పరిశీలించి, విశ్లేషించిన కావ్యం.
ఇది 1116 పద్యాలతో నిండిన కావ్యం. ఒక ఆశ్వాసానికి 108 చొప్పున 10 ఆశ్వాసాలు ఉన్నాయి. అవతారికలో 36 పద్యాలు ఉన్నాయి. వృత్తాలు పాతవే అయితే ఇతివృత్తం కొత్తది. ఒకానొక ప్రౌడవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చొని, సముద్రాన్ని వర్ణిస్తూ, తన్మయస్థితిలో ఉంటాడు. ఇంతలో ఒక పిల్ల కెరటం ఒడ్డుకు వచ్చి, ఆ కవి ఒళ్ళో వాలుతుంది. ఒక పసిపాప తన ఒడిలోకి వచ్చినట్లుగా భావించి, ఆ కవి ఆ కెరటాన్ని ప్రేమగా చేరదీస్తాడు. లాలిస్తూ దాని ఒళ్ళంతా నిమురుతూ ఉంటే, దాని వీపంతా జిడ్డు జిడ్డుగా, మడ్డిగా కనబడుతుంది.
"స్వచ్చంగా ఉండవలసిన నీటికెరటానివి, ఇలా ఉన్నావేమిటి"? అని ప్రశ్నిస్తాడు. తాను ఇరాక్ తీరం నుంచి కొట్టుకు వస్తున్నానని, సద్దాం హుస్సేన్ సముద్రంలో ఆయిల్ పారబోసినప్పటి నుండి తన పరిస్థితి ఇలా అయిందని కెరటం వాపోతుంది. తాను కొద్ది రోజులు కవి ఒడిలోనే విశ్రాంతి తీసుకు వెళతానని ఆర్థిస్తుంది. గుండె కరిగిన కవి ఆ తరంగ బాలికకు కవిత్వంతోనే అతిథి మర్యాదలు చేసి, జోలపాడి నిద్రపుచ్చుతాడు. తరంగం మేల్కొన్న తరువాత అది తిరిగి వచ్చిన తీరాలలోని విశేషాలను చెప్పమని ఆర్థిస్తాడు. అప్పుడా కెరటం చెప్పిన మానవుని జీవిత కథే ఈ సాగరఘోష.
Suprasiddha Vyaktula Jeevitaallo Aprasiddha Gadhalu
మహనీయుల జీవితాల్లో మనకు తెలిసింది ఒక భాగమైతే, మనకు తెలియకుండా ఉన్న భాగంకూడా సహజంగానే మరొకటి ఉంటుంది. దానిని కూడా తెలుసుకుంటే పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే వీటిని రాశాను. ఇందులో 11 మంది ప్రముఖుల జీవితాల్లోని రెండు వైపులనూ చూపడం జరిగింది. ఈ వ్యాసాలలో కొన్ని ఆంద్ర పత్రికవారు ఒకప్పుడు వెలువరించిన 'కలువబాల' పత్రికలో 'అద్దానికి మరోవైపు' పేరిట ప్రచురితమైన శీర్షికలో వచ్చాయి. ఆ పత్రిక ఆగిపోయింది. శీర్షిక కూడా ఆగిపోయింది. అందుచేత మరికొన్ని విడిగా రాసినవి వ్రాత ప్రతిలో ఉండి పోయాయి.
వీటిని పుస్తక రూపంలో ప్రచురిస్తే బాగుంటుందనిపించి, పల్లవీ పబ్లికేషన్స్ వారికి పంపిస్తే వారు వెంటనే ప్రచురించేందుకు అంగీకరించారు. అందుకు వారికి కృతఙ్ఞతలు. ఇందులో 11 మంది ప్రముఖుల గురించే రాశానుగాని, ఇలా ఎంతమంది గురించి అయినా రాయవచ్చును. ఈ పుస్తకానికి లభించిన ఆదరణను బట్టి, ఆ ప్రయత్నాన్ని జరుగుతుంది.
- కోడూరి శ్రీరామమూర్తి
Jeevitham mee Chetullone
Youth and Truth: Unplug with Sadhguru
What happens when millennials meet a mystic? An avalanche of queries and an unflinching stream of answers. In this compilation of five talks from Youth and Truth events, Sadhguru fields questions that are quirky, personal, profound and shockingly bold from university students.
In a camaraderie bridging age, they adventure through a mind-boggling spectrum of subjects like romance and sexuality, loneliness and jealousy, parenting and education, career and business, politics and spirituality, artificial intelligence, racism, drugs, food, Yogic sciences, and god-making. Equally wide-ranging is the mood of the talks - from playfulness and hilarity to moments of gobsmacked speechlessness, dawning clarity and paradigm shifts, all infused with the fizzing energy of youth.
Here is a book not just for youth, but for the youthful in search of truth.
Veerakesari
అరుణకాంతులు శయ్యగారమాత ఆవరించి, చీకటిని పారద్రోలుచున్నవి. అలసటగా తన అందమైన అవయములను విరుచుకున్నది అరుణసుందరి. గత రాతిరి వెలిగించిన దివ్వె గొంపో వచ్చిన దాసి మృదువుగా మందహాసము చేసినది. "యెందులకే ఆ గడుసు నవ్వు?" చిరుకోపం ప్రకటించింది యువరాణి.
"ఇట్టి తరుణము తమ నాథులు గాంచిన కపొలములు కందిపోవా! పాపం! శ్రీవారు ఈ దేవి దర్శనము గానక, ఆ భవాని దర్శనార్ధమై ఆలయమును కేగినారు" కొంటె చూపులు విసిరినది దాసి చండి. అరుణసుందరి అదిరిపాటున లేచినది. "చండి! సత్యము వచింపుము. వారు యేటించి యుండిరా?"
"అసత్యము వచించుట ఎలా? తమరు శయ్యవిడి గవాక్షము ద్వారా తిలికించడు. ప్రభువులు, శ్రీవారు, పరివారము ఆలయమున కేగుచున్నారో లేదో తెలియును."
Zero to One: Notes on Start Ups, or How to Build the Future
What Valuable Company is Nobody Building? The next Bill Gates will not build an operating system. The next Larry Page or Sergey Brin won’t make a search engine. If you are copying these guys, you aren’t learning from them. It’s easier to copy a model than to make something new: doing what we already know how to do takes the world from 1 to n, adding more of something familiar. Every new creation goes from 0 to 1. This book is about how to get there.
Gnapaksakthiki Maargalu
ఆధునిక , శాస్త్రీయ పద్దతుల ద్వారా జ్ఞాపకశక్తిని అపారంగా పెంచుకొనే మెళకువలు అందిస్తుంది. అతి క్లిష్టమైన విషయాలను సైతం అవలీలగా జ్ఞాపకం వుంచుకోగల విధానాలు సూచిస్తుంది. అనేకానేక అంశాలన్నింటినీ మనస్సు పేటికలో అతిభద్రంగా దాచుకోగల అవసరం వచ్చినప్పుడు తక్షణమే గుర్తుతెచ్చుకోగల తీరును వివరిస్తుంది. మతి మరుపును చిటికెలో మటుమాయంచేసే సాధికారిక గ్రంధం.
Cartoonlalo Marx – కార్టూన్లలో మార్క్స్
కార్టూన్లలో మార్క్స్ రచనలను,
సిద్ధాంతాలను క్లుప్తంగా వివరించడం సాధ్యమేనా?
సాధ్యమేనని నిరూపించాడు 'ర్యూస్'!
ఈ పుస్తకం ఒక 'డైజస్ట్'!... మార్క్సిస్ట్ సిద్థాంతమూ,
దాని చరిత్రా; ఆర్థిక వ్యవస్థా, పెట్టుబడి, శ్రమ,
వర్గ వైరుధ్యం, వర్గపోరాటం, సోషలిజం మొదలైన
విషయాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థం అయ్యేట్టు
విడమరిచే మార్క్సిస్ట్ సిద్ధాంత సంగ్రహ దర్పణం!...
మార్క్స్ జీవిత చరిత్రను కూడా
విపులీకరించే బొమ్మల కథ...
'ర్యూస్' అంతర్జాతీయ కార్టూనిస్ట్
'ఎడువార్డో డెల్ రియో' కలం పేరు.
Pages : 148
Mee Medaduki Padunenta – మీ మెదడుకు పదునెంత
నేటి బాలసాహిత్య నిర్మాతలలో వాసాల నరసయ్యగారొకరు. వీరు కరీంనగర్ జిల్లా చౌలమద్దిలో 1942లో జన్మించారు. మెట్పల్లిలో చదివారు. స్కూలు మాస్టారుగా ఉద్యోగజీవితం ప్రారంభించి, పోస్టు మాస్టారుగా రిటైరయ్యారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే 1955లో ''సాగంధికాహరణము'' వీధి నాటకం రచించారు. 1958 - 1960 వరకు స్కూల్ మాగజైను 'అభ్యుదయవాణి'కి సంపాదకత్వం నెరిపారు.
పిల్లల మాసపత్రికల్లోనూ, దిన, వార పత్రికల్లోనూ బాలల కథలు, పొడుపు కథలు, గేయాలు, గ్రంథసమీక్షలు, చాలా వ్యాసాలతోపాటు అనేక గ్రంధాలు వెలువరించారు.
Developing Right Brain
Every student has two brains, left and right. Psychologists say, Right brain is for intelligence and shrewdness; and Left is for memory.
It does not matter whether you are a left-brain student (good at Medicine, Law, Literature) or right brain oriented (Maths, Engineering, Chartered accountancy), brain is the only organ that never wears out. It works more vigilantly the more you quiz it.
For students who are not able to perform well in interviews, the reasons may be... tension and lack of spontaneity. These mystifying and funny puzzles are designed to sharpen your imagination.
This book creates interest to those, who are averse to mathematics and reasoning. It is a fun-game when family members Sit together, solve puzzles, and tease each other, parents awarding children for correct answers.
Pages : 173