Vidhi

150.00

Vidhi

రోజులాంటి ఒక ఉదయం, చీకట్లని తరిమే వెలుగు, తేజో ప్రకాశవంతమైన సూర్యుడు, అప్పుడే నిద్ర లేస్తున్నాడు, సూర్యుని వంశ ప్రతిష్టని పెంచిన రాముడు, ప్రపంచానికి పరిచయమున్న రాముడు, ప్రపంచంలో చాలామందికి దేవుడు. ఆ దేవుడిని స్తుతించే పాటలు, ఆ పాటల ప్రయాణం మొదలయ్యే గుడి ఆవరణం, ఆ ఆవరణం ఉన్న ఒక కాలనీ, ఆ కాలనీలోని ఒక ఇంట్లో, మరో రాముడు, పేరు రామ్. ప్రతి మనిషిలో దేవుడుంటే ఈ రామ్ కూడా రాముడేనేమో.

తండ్రికిచ్చిన మాట కోసం అడవులకు వెళ్లాడు రాముడు. మరి ఈ కథలో రామ్ ఎక్కడికెళ్తాడో చూడాలి! ఏం తెలుసుకుంటాడో, ఏం గెలుచుకుంటాడో, ఎలా మలుచుకుంటాడో చూడాలి.

రామ్, ఇరవై ఆరేళ్లు వయసు దాటిన యువకుడు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. పుట్టడానికి పది రోజుల ముందే తండ్రిని పొగుట్టుకున్నాడు. తల్లి లక్ష్మమ్మే కష్టపడి పెంచింది. పెళ్ళి చేసింది. రామ్ భార్య భువితో జీవితం హాయిగా గడుపుతున్నాడు.

ఉదయం ఆరు గంటలయింది. జాగింగ్కి, షూ లేస్ కట్టుకుంటున్నాడు రామ్. నిద్ర మత్తుతో అప్పుడే మేల్కొంది భువి. అందరికంటే ముందే లేచి కాఫీ కలుపుకుని సోఫాలో హాయిగా కూర్చొని కాఫీ తాగుతోంది లక్ష్మమ్మ.

“గుడ్ మార్నింగ్ అమ్మ,” అని రామ్ పలకరించాడు.

“గుడ్ మార్నింగ్ నాన్న,” అంది లక్ష్మమ్మ.

“గుడ్ మార్నింగ్ రామ్, గుడ్ మార్నింగ్ అత్తమ్మ,” అంటూ భువి, నిద్ర ముత్తుతో లేచి కూర్చుంది……………………

2 in stock (can be backordered)

Categories: , Tag:
Additional information
select-formatPaperback
Book AuthorRajesh Kumar Bochu