YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 805–816 of 835 resultsSorted by latest
Chivaraku Migiledi
₹300.00
చివరకు మిగిలేది – ఏమిటి? అన్నదానికి వెంటనే దేని చివరకు? అన్న ప్రశ్న పుడుతుంది. ఆ వెంటనే మిగిలేది ఎవరికి? – అన్న జిజ్ఞాసా రాక తప్పదు. వ్యక్తికా – జీవితానికా – వ్యక్తులతోనూ వాళ్ళ మధ్య అనేకానేక ఉత్పతి, పునరుత్పతి సంబంధాలతోనూ ఆవిష్కారమైన సమాజానికా – అన్నదే అది. ఈ ప్రశ్న భావనామాయమైంది. దీనికి సమాధానం భౌతిక రూపంలో వెదకడం సులువేనా? అసలీ “మిగలటం” – అన్న సమస్య గురించి విశ్వనాథ ‘వేయిపడగల’ లో చర్చించాడు. అలాగే చలం తన “మ్యూజింగ్స్” లో కొంత ఆలోచన చేశాడు.
ఒకానొక విశ్వాసం మిగులుతుందని విశ్వనాథ అంటే, మిగులుతుందనుకోవటం భ్రమగా తేల్చేశాడు చలం. వీరి తాత్త్విక విశ్వాసాలకు సృజనాత్మకరూపం కల్పించి నవలగా రూపొందించిన ఘనత బుచ్చిబాబుది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కొత్త విలువల రూపుకడ్తున్నాయి. నిరాశా నిస్పృహల్లో మునిగిన సమాజాన్ని “లోచూపు” లో చూడటం అన్న వాస్తవికతలకు నవలారూపమే ఈ రచన. పురుషస్వామ్య సామాజిక భావాజాలం – అది సృష్టించిన పాత్రలు – వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడుతుంది.
ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగు దేశంలోని ఆధునిక సాహిత్య – సామాజిక – తాత్విక ధోరణుల ప్రతిబింబాలనిపిస్తాయి. రాధాకృష్ణన్ – రసెల్ – జిడ్డు కృష్ణమూర్తుల సమాహార తాత్వికతే బుచ్చిబాబు దార్శనికత్వం అనిపిస్తుంది. ఆధునిక తెలుగు నవలల్లో మంచివేవి? అని ఏ సాహిత్య విద్యార్థిని ప్రశ్నించినా ముందుగా చెప్పేది; తెలుగు కల్పనా సాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ “చివరకు మిగిలేది”.
Satha Vasanthala Telugu Katha – శత వసంతాల తెలుగు కథ
₹450.00తెలుగు కథకు శ్రీకారం చుట్టిన శ్రీ గురజాడ అప్పారావుగారి కలం నుంచీ ఈనాటివరకూ వచ్చిన కొన్ని వేల కథలలో ఉత్తమ కథలను ఎన్నిక చేసి ప్రచురించాలనే సంకల్పం కలిగినా, ఆ కోరిక 1974 వ సంవత్సరానికి గాని తీరలేదు. ఆ నాటి ఆ కథా సంకలనాన్ని పునర్ముద్రించమని అనేకమంది రచయితల, పాఠకుల అభీష్టం మేరకు కొద్ది మార్పులు, చేర్పులతో తిరిగి ఆనాటి ఆణిముత్యాన్ని అందిస్తున్నాం. ఆంధ్రుల సామాజిక, ఆర్థిక, కుటుంబ జీవనంలో గత వంద సంవత్సరాల్లో వచ్చిన మార్పులకు ఈ కథాసంకలనం అద్దం పడుతుంది.
లాటిన్ అమెరికన్ కవి పాబ్లో నెరుడా అన్నట్లు – కవితలు, కథలు అభాగ్య సోదరుల కన్నీరు తుడిచే చేతిగుడ్డలు కావాలి. వారి పోరాటాలకు సాధనాలుగా కత్తులు లాంటి కథలు కావాలి. “రుమాళ్ళుగా, సవాళ్లుగా, ఎర్రెర్రటి జెండాలు” గా ఆ కథా సంకలనాన్ని స్వీకరించి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ శాత వసంతాల తెలుగు కథను పాఠకులకు సగర్వంగా అందిస్తుంది.
Annie Leibovitz: Wonderland
₹35.19Repellendus quis eius eum. Ipsum omnis est alias qui dicta ab doloribus. Et ut rem mollitia. Recusandae dolores molestias dignissimos enim qui eos.
Heartland Stars
₹664.55Quos aperiam at eum mollitia. Fugiat voluptas ullam voluptatem consequatur aut.
Yugantam – యుగాంతం
₹60.00‘భూమి మీద సకల చరాచరాలు నాశనం కాబోతున్నాయా? ప్రొఫెసర్ ఆనందమార్గం అంచనా నిజమయ్యే పక్షంలో ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాక్సిమా సెంక్చువరీ అనే నక్షత్రం భూమికి దగ్గరగా దూసుకు వస్తోంది. కొన్నివేల కోట్ల మైళ్ళ వేగంతో వస్తూన్న ఈ నక్షత్రం భూమి యొక్క పరిధిలోకి ఆగష్టు పదిహేడు ప్రొద్దున్న పదకొండు గంటలకి ప్రవేశించి, మూడు సెకన్ల కాలంపాటు ఉండి అనంత విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అయితే భూమిలో వుండే పదార్థాలన్నీ పోటీపడి ఆ నక్షత్రాన్ని చేరుకోవడానికి తొందర పడడంలో భూమి పేలిపోతుంది. కాగితంలో పకోడీలు దట్టంగా కూరి నొక్కితే పేలినట్లు భూమి పేలిపోతుందా? పదిహేడో తారీఖు వరకూ వేచి చూద్దాం. ప్రొఫెసర్ మాటలే గాని యధార్థమైతే చూడడానికి మనం ఎలానూ వుండముగా….”
ఇండియన్ టైమ్స్‌లో ప్రచురితమైన సంచలన వార్త అది. దాంతో అంతా గగ్గోలెత్తింది. మనిషి మనుగడ మీద జూదం మొదలయింది.
అష్టగ్రహ కూటమి ఏర్పడి ప్రపంచ వినాశనం జరగుతుందని ఒకనాడు గగ్గోలు…
స్కైలాబ్ విరుచుకుపడనుందని ఒకసారి చెలరేగిన గందరగోళం…
గ్రహాలూ గ్రహశకలాలూ తోకచుక్కలూ భూమిని ఢీ కొంటాయంటూ తరచు పేపర్ వార్తలు సృష్టించే కంగారు…
అలా ప్రపంచం నాశనమవుతుందంటే… ఆ క్షణాల్లో ప్రతి ఒక్కరికీ తెలిసే – రాజకీయ నాయకుల రంగులు. వ్యాపారస్తుల యావ. సైంటిస్టుల కీర్తి కాంక్ష. నిరుద్యోగుల నిస్సహాయత. కలుసుకోలేని ప్రేమికుల ఆవేదన. ముష్టివాళ్ళ అతిసాహస వైఖరి. మిడిల్‌క్లాస్ సంసారుల నైతిక క్షోభ… వీటన్నిటినీ చిత్రిస్తూ ఉత్కంఠభరితంగా సాగిపోయే యండమూరి వీరేంద్రనాథ్ ఫాంటసీ-
Ankena
₹100.00దేశ సామాజిక నిర్మాణంలో విముక్తిలేని చీకటి కోణం బడుగువర్గాలది. విషపరిణామాల బారినుండి వారిని కాపాడాలన్నదే ఈ నవల ఉద్దేశం.
“అంకేన ” అంటే ఒక ఫలవృక్షం. నీడనిచ్చి, ఆకలితీర్చి, సేదదీర్చేది. అదే ఇతివృత్తంతో నిగర్వి, అణుకువ, విజ్ఞానం, ఓర్పు, నేర్పులతో స్త్రీ తన చుట్టూవున్న సమాజాన్ని సేవాదృక్పధంతో ముందుకు నడిపించే తీరు ప్రశంసనీయం.
తాను అగ్రసరిగా, వినూత్నమైన భావాలుగా స్త్రీగా కథానాయిక ఈ నవల్లో కనిపిస్తారు. ఈ నవల ఒక నూతన దృకోణాన్ని ఆవిష్కరిస్తుంది.నేటి యువతీ యువకుల వ్యక్తిత్వానికి భిన్నంగా తన రచనలతో ఆలోచింప చేసి మార్పు, చైతన్యం తేవాలన్న రచయిత్రి కాంతి లిల్లీ పుష్పం గారి సంకల్పం ఎంతో ఆదర్శనీయమైనది.
Divodasu Lokasanchari
₹200.00“మానవజాతి ప్రగతి పథంవైపు సాగించిన ప్రతి అడుగూ రక్తతర్పణంతోనే సాగింది. నర రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మచార్యులే కారణం; వారే బాధ్యులు, ఏ ఒక్క మతము, ఏ ఒక్క మతాచార్యుడు గర్వించవల్సింది ఏమీలేదు” అని చారిత్రిక ఆధారాల రీత్యా తన రచనల ద్వారా ఆయన రుజువు చేశాడు. ప్రస్తుత రాజకీయ, సామాజిక వాతావరణంలో రాహుల్జీ పుస్తకాల పఠనం అత్యంత అవశకం. ఆ మహాపండితుని రచనలన్నింటినీ తిరిగి ముద్రించి తెలుగు పాఠకుల ముందుంచుతున్నందుకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గర్వపడుతున్నది.
– గడ్డం కోటేశ్వరరావు
The Bear of Byzantium
₹286.90Aliquam corrupti deserunt culpa eos. Nemo harum expedita quidem molestias perferendis praesentium aliquid. Adipisci non natus eligendi aut fugit ut accusantium.
The Girl and the Last Sleepover
₹125.00 – ₹450.00Price range: ₹125.00 through ₹450.00Nihil quo dolorum debitis velit qui et inventore. Delectus aut occaecati sunt mollitia illo. Odio velit mollitia ipsam explicabo nisi quisquam dolore non. Rem omnis consectetur et ea.
Mask of Death
₹906.29Odio magnam quam nesciunt temporibus. Aut rerum recusandae autem reiciendis numquam praesentium delectus. Rerum iusto saepe voluptas rerum et officiis.