YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 793–804 of 835 resultsSorted by latest
Ramayana Vishavruksham – రామాయణ విషవృక్షం
₹250.00రామాయణ విషవృక్షం – ఏడు ముద్రణలు పొందిన పుస్తకం – రంగనాయకమ్మ
రామాయణ విషవృక్షం మూడుభాగాలుగా వెలువడిన రచన. మొదటి భాగంలో – ఇదీ రామాయణం, చెప్పులు పాలైన సింహాసనం, ఇలాగే జరిగింది అనే మూడు కథలూ, కొనసాగింపుగా రాసిన రెండో భాగంలో అతనికంటె ఘనుడు ! రావొద్దంటే విన్నదా ?, కామశాస్త్రులు, తోడు దొంగలు (రాముడు – సుగ్రీవుడూ), స్నేహబండారం, సీతారావణులు, కాణీఖర్చులేని బహుమానం అనే ఏడు కథలూ, ఐదు లింకులూ – మూడోభాగంలో ఎంతో ఉత్తముణ్ణి! ఎన్ని కష్టాలో నాకు ! మూడో దొంగ (విభీషణుడు), రాముడు పోయాడా ?, పంచాయితీ, చెప్పుల చోట్లో రాముడు, రామరాజ్యం సొగసు అనే ఆరు కథలూ, అట్లాగే రామాయణం చదివితే లాభమేమిటి ? కవిగా వాల్మీకి, కొందరు రామయణ విమర్శకులు, రామాయణ సంస్కృతిని ఎందుకు తిరస్కరించాలి ? అన్న వ్యాసాలూ – ఉన్నాయి.
ఈ పుస్తకంలో మార్క్సిజాన్నీ, ఆంత్రపాలజీని పదునైన శైలిలో తేలికైన మాటలతో పరిచయం చేసారు రచయిత్రి రంగనాయకమ్మ. శాస్త్రీయ దృక్పధం అంటే ఏమిటి ? కల్పనలో స్ఫురించే వాస్తవికత, ప్రక్షిప్తాల ఘోష, పవిత్ర రామాయణం (చిన్నకథ) కొన్ని ప్రశ్నలూ కొన్ని సందేహాలూ, కొన్ని వ్యతిరేక విమర్శలూ, కొన్ని అనుకూల విమర్శలూ శీర్షికల కింద రామాయణానికి సంబంధించిన అంశాలను చర్చిస్తారు రంగనాయకమ్మ, అంతేకాదు –
”ఈ పుస్తకం మొహం చూసిన తర్వాతో, నాలుగు ముక్కలు చదివింతర్వాతో, ఒక అగ్గిపుల్ల గీసి అంటించాలని బుద్ధి పుట్టవచ్చు ధర్మాత్ములకు, అంటిస్తే తగలబడేవి కాగితాలే కాని ఆలోచనలు కావు” అంటున్న రంగనాయకమ్మగారి ఈ పుస్తకం, తెలుగు నాట అనేక వాద వివాదాలకు కేంద్రమైంది. రామాయణాన్ని కొత్తకోణం నుంచి చూపించే సంచలనాత్మక రచన రామాయణవిషవృక్షం.
Vismrutha Yatrikudu
₹280.00రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సంవత్సరాలు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్ర్య యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిందూ సన్యాసిగా, ఆర్యసమాజకునిగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్ధబిక్షువుగా ఈయన పేరు పొందారు. వీరు చేసిన భాషాసేవకు కాశీ పండితులు వీరిని “మహాపండిత్” బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదములు మూడింటిలోను ఈయన నిధి.
అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు “త్రిపీఠకాచార్య” బిరుదుని ఇచ్చారు. రాహుల్ జీ సాగించిన పరిశోధనలు భారత సంస్కృతిని 600 సంవత్సరాలు చరిత్రలో సుసంపన్నం చేశాయి. వీరి రచనలు హిందీ భాషకు 400 సంవత్సరాల చరిత్రను చేర్చాయి. వాటిలో హెచ్చువాటిని జైళ్ళలోను లేక నేపాల్. టిబెట్, సిలోన్ లలో రచించారు. వివిధ భాషలలో వీరి గ్రంథాలు 60కి పైగా ఉంటాయి. తెలుగు పాఠకులకు సుపరిచితమైన “విస్మృత యాత్రికుడు” రచనను 1953 సంవత్సరంలో రాశారు.
Ciprali
₹120.00తలకాయలు తమ తమ జే
బుల లోపల దాచుకొనుచు పోలింగ్ కు పో
వలసిన రోజు వస్తే
సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా
పోలీసుల రాజ్యమిది
పోలింగోక భూటకం
ఫాసిజమై మారుతోంది
ప్రజాస్వామ్య నాటకం
విచిత్ర వీరులు నక్సలైట్లు
అన్యాయాలకి డైనమైట్లు
అంధకారంలో టార్చిలైట్లు
నవయువ జీవన కాస్మోనాట్లు
వాళ్ళంటే హడలిపోతారు నిక్సనైట్లు
విప్లవకారుల విధ్వంస
భీభత్సకాండకు నా ప్రశంస
అదేన్నడూ కానేరదు హింస
అది నూతన చేతనారిరంస
మానవ మానస మానససరోవర హంస
Abhayaranyam – అభయారణ్యo
₹120.00అతుకు
”ఎంతైనా అతుకు అతుకే” మనసులో అనుకోబోయి పైకే అనేసింది సుమతి.
హిందూ పేపర్ని దీక్షగా చదువుతున్న భాస్కర్‌రావు తలెత్తి సుమతి వంక చూస్తూ ”ఏంటి అన్నావ్” అన్నాడు.
”ఏం లేదండీ. కాంపౌండ్‌వాల్ ఆ మూల మళ్ళీ బీటలిచ్చింది. ఇప్పటికే రెండుసార్లు సిమెంటు చేయించాం. ఎందుకు బీటలిచ్చింది అంటే ‘అబ్బే ఏం లేదండి ఏదో గాలి పగులు’ అంటారు. మళ్ళీ చూడండి అదే చోట ఎట్లా బీటలిచ్చిందో” సుమతి గోడ వంకే పరీక్షగా చూస్తూ అంది.
‘నువ్వన్నది గోడ గురించా’ మనసులో అనుకుని ”ఇంకోసారి సిమెంటు చేయిస్తే సరిపోతుంది. మేస్త్రీకి ఒకసారి రమ్మని కబురు చేద్దాం. అనిక్కి ఓసారి గుర్తుచెయ్” మళ్ళీ పేపర్లో తల దూరుస్తూ అన్నాడు భాస్కర్‌రావు.
అంతలో అతనికి ఆదివారం ప్రొద్దున్నే అంతసేపు పేపరు చదవటం సుమతికి ఇష్టం ఉండదని గుర్తొచ్చింది. వెంటనే పేపరు మడిచి టీపాయ్ మీద పెట్టి ”ఇవాళేంటి ప్రోగ్రాం? ఎటన్నా వెళ్దామా?” అన్నాడు. ఆదివారం పొద్దున్నే కాఫీ తాగుతూ వరండాలో కూర్చునో, మొక్కల్లో తిరుగుతూనో పిచ్చాపాటీ మాట్లాడడం అంటే సుమతికి ఇష్టం. భాస్కర్రావుకి పేపర్ల పిచ్చి. రోజూ వచ్చే రెండు పేపర్లు కాక ఆదివారం అదనంగా ఇంకో రెండు పేపర్లు కొంటాడు. మొత్తం నాలుగు పేపర్లు ఆదివారం అనుబంధంతో సహా అయిపోయే వరకూ వరండాలో అరుగుమీద బాసింపట్టు వేసుకూర్చుని కదలడు. మధ్యలో రెండు టీలు….
”అభయారణ్యం” కథల సంపుటిలో అతుకు, తోడు, అలక, జీవన చిత్రం, భయం, థర్డ్ ఆప్షన్, డిలీట్, అభయారణ్యం, పెళ్ళంటే, ఓ సిల్లీ కథ, దు:ఖావరణం, హోమం, అద్దం, అదృశ్యం, కళాకారుడు, నాలుగో తరం, పరుసవేది, అమ్మా వాళ్ళ ఇల్లు, సుమిత్ర, రూట్ కెనాల్ అనే 20 కథలు వున్నాయి.
పేజీలు : 140
Krishna Sastry Sahityam – 5 Vyasaavali – Vyasaalu – కృష్ణశాస్త్రి సాహిత్యం – 5 వ్యాసావళి – వ్యాసాలు
₹225.00‘ఆధునికాంధ్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిభావంతుడైన రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. అట్టివారి రచనలు లోకానికి త్వరగా సమగ్రంగా అందాలి. ఆ ప్రయత్నంలో సంకీర్ణ వ్యాసాలు, సాహిత్య ప్రసంగాలు, యక్షగానాలు, శ్రవ్యనాటికలు, గేయాలు, ఖండకావ్యాలు క్రమంగా ప్రకటితం కావడం ఆంధ్ర సాహిత్య ప్రియులకు ఎంతైనా హర్షదాయకమనుకుంటాను” అన్నారు శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 1-10-65న విశ్వోదయ ప్రచురణలకు ‘రెండుమాటలు’ వ్రాస్తూ. ఆనాటి ఆయన ఆశయం నేడు కార్యరూపం ధరిస్తున్నది. అందులో భాగంగా విడుదలయింది కృష్ణశాస్త్రి సాహిత్యం – 5 వ్యాసావళి – వ్యాసాలు. ఇందులో – కవిపరంపర – కవితా ప్రశస్తి – మహా వ్యక్తులు – అప్పుడు పుట్టి ఉంటే – పుష్పలాలికలు – బహుకాల దర్శనం – అమూల్యాభిప్రాయాలు ప్రకరణలున్నాయి. ఇందులో మొదటి ప్రకరణం ‘కవిపరంపర’ విడివిడికవుల కవితా విశిష్ట లక్షణాలను వివరించేది.
తొలిచి చూసి, లోపల దాగి ఉన్న సౌందర్యాన్ని పెల్లగించి చూచే కృష్ణశాస్త్రి గారి కవిచూపు సునిశితమైన సాహిత్య విమర్శకుని చూపు కూడా అని ఈ ‘కవిపరంపర’లోని దిగువ ఉదాహరించిన వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.
”నన్నయ వైకుంఠాన్ని భూలోకంలో అవతరింపజేస్తాడు, తిక్కన్న భూలోకాన్ని స్వర్గం దగ్గరకు ఎత్తడానికి ప్రయత్నిస్తాడు.”
”శబ్ధం పలకడమే కాదు, పాడుతుంది”.
”ఏడెనెమిది వందల ఏళ్ళ నుండి పల్లెల్లో, పట్టణాల్లో, ఇళ్ళల్లో, రచ్చ చావళ్ళలో ఈ భారతం చదువుకుని పురాణంగా చెప్పి తెనుగు వారు తమ జీవితంలో కలిపేసుకున్నారు. తిక్కన్న రచనలో అంత జీవచ్ఛక్తి, చైతన్యం ఉన్నాయి”.
”వారు (తిరుపతి వేంకట కవులు) గొప్ప కవులు, అయితే పద్యకవిత్వం కన్నా వారి వచనం గొప్పదని నా నమ్మకం”.
కవిగా, వక్తగా, భావకవిత్వోద్యమ జయస్తంభంగా, భక్త కవిగా, సినీ కవిగా శ్రీ కృష్ణశాస్త్రిని గుర్తించినంతగా సాహిత్య విమర్శకుడిగా ఆయన్ను లోకం గుర్తించినట్టు లేదు. దేశంలో నవ్య సాహిత్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లోనే ఆయన చేసిన రేడియో ప్రసంగాలు ఇంతవరకూ గ్రంథరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణం. ఇదిగో – ఇపుడీ సంపుటం ఆ లోపాన్ని పూరిస్తుంది.
Jeevanayanam – జీవనయానం
₹250.00నది జీవితం వంటిది. నది బిందువుగా మొదలవుతంది. జీవితం కూడా బిందువులా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. అది విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. ఇది విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. జీవితం ప్రశాంతంగా ఉన్నంత కాలం ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. కొండలు కోనలు ఎదురవుతాయి. నది జలపాతం అవుతుంది. హోరును సృష్టిస్తుంది. జీవితంలో ఆపదలు ఎదురవుతాయి. అప్పుడే జీవితనాదం వినిపిస్తుంది. జీవితం వికసిస్తుంది. ఇంద్రధనుస్సులు సృష్టిస్తుంది. చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు! ఆపదల్లోనే ఉన్నతుడు అవుతాడు. మనిషి అయినా జాతి అయినా అంతే. ఇది చరిత్ర చెప్పిన సత్యం!
Amrutham Kurisina Ratri
₹200.00తిలక్ కవిత అభ్యుదయ కవిత్వ కొన్ని పాళ్ళు, భావకవిత్వం కొన్ని పాళ్ళు, కలసిన మిశ్రమరూపం. “నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు; నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అని తిలక్ చెప్పుకున్నాడు. ఇందులో అతని భావమేదైనా, మొదటిది తన వస్తువును గురించీ, రెండవది తన శైలిని గురించీ చెప్పుకున్నట్లు నేనర్థం చేసుకున్నాను. తిలక్ అభ్యుదయ భావనకు అందమైన శైలిని సమకూర్చి; అభ్యుదయ కవితా కాలంలో ఉన్న దోషాన్ని తొలగించడానికి ప్రయత్నించాడని చెప్పుకోవచ్చు.
భావకవులు శబ్ద సౌందర్యానికి, శైలీ రమ్యతకూ ప్రాధాన్యం ఇచ్చారు. అభ్యుదయ కవులు ప్రగతి కారకమయిన వస్తువుకు ఈ రెండింటిలో మంచిని ఒకచోట చేర్చుకునే ప్రయత్నంలో తప్పేమీలేదు. భావన ఎంత అభ్యుదయకరమయినదయినా సుందరంగా వ్యంగ్య విలసితంగా చెప్పలేకపోతే రాణించాడు. అభ్యుదయ కవిత్వాన్ని కూడా పేలవంగా కాకుండా అందంగా చెప్పుదాం అన్నదే – తిలక్, ఆచరణ ద్వారా చేసిన సూచన.
– కుందుర్తి
Andhra Pradesh Prajatheerpu
₹300.00ఎన్నికలకు సంబంధించి పుస్తకాలు రాయడం అన్నది అంత తేలికైన విషయం కాదు. 1952 లో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికలు మొదలు 2019 వరకు జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాల వివరాలు, గెలిచినవారికి సంబందించిన విశేషాలు, వారికీ ఉండే రాజకీయ నేపథ్యం, పూర్వాపరాలు, గెలిచినవారి విశిష్టతలు మొదలైనవాటిని క్రోడీకరించి పుస్తకం తయారు చేయడం అంటే ఎంతో క్లిష్టమైన పని. అయినా రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితో పాతికేళ్ల క్రితం ఈ పుస్తక రచనకు శ్రీకారం చుట్టడం జరిగింది.
– కొమ్మినేని శ్రీనివాసరావు
Gulabi Meghaalu – గులాబి మేఘాలు
₹200.00అంతరిక్షంలో ఎక్కడినుంచో, ఇంకొక గాలక్సీ నుంచో ఏమో, అత్యంత ఆశ్చర్యకరమైన గులాబి రంగు మేఘాలు మన భూమి మీదకు వస్తాయి. వాటి అన్వేషణ కోసం భారతీయ శాస్త్రజ్ఞుల బృందం అంటార్కిటికా వెళ్లి వారితో రకరకాల సంఘటనలలో తలపడుతుంది. ‘మేఘాలు’ అంటార్కిటికాలో ఉన్న మంచును అతి పెద్ద మొత్లాలలో కోసి అంతరిక్షంలోకి తీసుకొనిపోవడం శాస్త్రజ్ఞులు గమనిస్తారు. ‘మేఘాలు’ ఎటువంటి పరమాణు నిర్మాణాన్ని అయినా సరే, మానవ శరీరాలైనా సరే, పున:సృస్టించగలవు. నవలలోని పాత్రలు వారి వారి ప్రతిరూపాలతో తారస పడతారు. కాపీ చేయబడిన ఒక విమానాన్ని, కాపీ చేయబడిన ఒక ఊరిని చూస్తారు. మానవ మెడదులలోని ఆలోచనలకు (భూత, భవిష్యత్ కాలానికి చెందిన ఆలోచనలకూ) కూడా ‘మేఘాలు’ భౌతిక రూపకల్పన చేయగలరని మానవులు గ్రహిస్తారు. అటువంటి ప్రపంచంలోకి మన కథా పాత్రలు చొచ్చుకొని పోతారు. భూమి మీద జీవనాన్ని ఎందుకు మోడలీకరిస్తున్నారో శాఏజ్ఞులకి అర్థం కాదు. అంతరిక్షవాసులతో సంపర్కం ఏర్పరచుకోవడానికి (అంటే సంభాషించడానికి) చేసిన కొన్ని ప్రయోగాలు విఫలం అవుతాయి. అంతర్జాతీయ సదస్సులలో శాస్త్రజ్ఞులూ, రచయితలూ చర్చలు జరుపుతారు. ఎట్టకేలకు ఏమవుతుంది? శౄస్త్రజ్ఞులు చిక్కుముడి విప్పగలుగుతారా? ఇంకోక గాలక్సీకి చెందిన ఉత్కృష్ట నాగరికతతో సంబాషించగలుగుతారా? నవల చదివి తెలుసుకోండి…..
పేజీలు : 245
Ghantaaravam – ఘంటారావం
₹290.00హెమింగ్వే రచనల్లో సుదీర్ఘమైన నవల ”ఫర్ హూమ్ ది బెల్ టోల్స్”. స్పెయిన్‌లో ఫాసిస్టులకూ, కమ్యూనిస్టులకూ జరిగిన సంఘర్షణ ఇందులోని వృత్తాంతం. నాలుగు దినాలలో నడిచిన ఘటనలు నాలుగువందల ముప్ఫైఅయిదు పుటలలో చిత్రించాడు. ఒక గుహలో కొద్దిమంది స్త్రీ పురుషులతో కథ నడిచినప్పటికీ మొత్తం ఉద్యమమంతా మన కళ్ళముందు కదులుతున్నట్లనిపిస్తుంది. ఫాసిస్టుల కిరాతక చర్యలతోపాటుగా, విప్లవకారుల అమానుష కృత్యాలు వర్ణించటంలో హెమింగ్వే ప్రదర్శించిన నిష్పాక్షిక నిర్లిప్తదృష్టి ఉత్తమ రచయితలకే సాధ్యమౌతుంది.
Vijayam Vaipu Payanam – విజయం వైపు పయనం
₹60.00ఒక శుక్రవారం సాయంత్రం – లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాయులీనం లీలగా వినిపించసాగింది. స్పష్టంగా వినడం కోసం, బయటికొచ్చాను. నాలాంటి మరికొంతమంది లైబ్రరీ బయట కనిపించారు. అందరమూ నిశ్శబ్దంగా ఆ ఫిడేలు మీద గమకాల్ని ఆస్వాదిస్తూ తాదాత్క్యంతో వింటున్నాం.
ఆ సమయంలో ఒక ముఫ్పై ఏళ్ళ వ్యక్తి ఇద్దరు పిల్లల్తో వచ్చి కూర్చున్నాడు. ఆ పిల్లలిద్దరూ ఒకర్నొకరు కొట్టుకుంటూ, అల్లరిచేస్తూ మా మధ్య తిరుగుతూ అల్లరి చెయ్యసాగారు.
అందరికీ అది చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇక సహించలేక ‘ఇది లైబ్రరీ, మీ పిల్లల్ని గోల చెయ్యవద్దనండి’ అన్నాను కరుగ్గా. అతడు తన నిస్తేజమైన కళ్ళతో నావంక చూసాడు. ‘గోల చేస్తున్నారు కదూ, అవును. పిల్లలు… వాళ్ళ అమ్మ ఇప్పుడే చనిపోయింది. అరగంట తర్వాత ఇస్తామన్నారు. ఆస్పత్రిలో గొడవ చేస్తున్నారని ఇలా తీసుకు వచ్చాను’ అన్నాడు.
అతడి మీద అప్పటివరకూ ఉన్న కోపం జాలిగా మారింది. కోపం జాలిగా, అసూయ ప్రేమగా, ద్వేషం స్నేహంగా, పగ ప్రేమగా, అసమర్ధత సమర్ధతగా, ఆవేశం ఆలోచనగా మారవచ్చు.ఇవన్నీ మన బలహీనతల స్థాయి భావాలు.
కావలసినదల్లా పరిస్థితిని పై స్థాయిలోంచి పరిశీలించగల్గడమే. సమస్యని అవతలి కోణంలోంచి చూడగల్గడమే.
అప్పుడు మనకెవరూ శత్రువులుండరు. మనకి సమస్యలుండవు. ఉన్నా, వాటిని నవ్వుతూనే పరిష్కరించుకోగల స్థిరత్వం మనకి అలవడుతుంది. అదే యండమూరి వీరేంద్రనాథ్ చెపుతున్న ‘విజయం వైపు పయనం’