Showing 733–744 of 835 resultsSorted by latest

Kasanova 99 – కాసనోవా 99

100.00

  1970లో భారతసైన్యం పాకిస్తాన్‌పై దండెత్తి బంగ్లాదేశ్‌ని విడగొట్టినప్పుడు, కాశ్మీర్‌ని భారత్‌ నుంచి కూడా అదేవిధంగా విడగొట్టటానికి, ఫాక్స్‌ అనే అంతర్జాతీయ గూఢచారి భారతదేశం ప్రవేశించి, తగిన సమయం కోసం ముప్ఫై సంవత్సరాలు వేచి వున్నాడు. అతడి వ్యూహం ఫలించటానికి సరిగ్గా నెల రోజులు టైముంది.

    1990 మధువని అనే అమాయక డెంటిస్టు, స్వప్నమిత్ర అనే కాసనోవాని ప్రేమించి పెళ్ళాడబోతూ ప్రమాదవశాత్తు ఈ అంతర్జాతీయ గూఢచార్ల విషవలయంలో ఇరుక్కుపోయింది. తరువాత…? 

పాపులర్‌ తెలుగు నవలా చరిత్రలోనే ఇంత వరకూ లేనటువంటి, రానటువంటి ప్రయోగంగా పాఠకుల చేత విమర్శకుల చేత కొని యాడబడిన నవల ‘కాసనోవా 99’.

Kshaminchu Supriya – క్షమించు సుప్రియా

40.00

‘చూడవోయ్‌ నీలాంటి వాళ్ళను చాలా మందిని స్టడీ చేశాన్నేను. కస్టమర్‌ రాగానే మామూలు ధరకన్నా దాదాపు రెట్టింపు ధర చెప్పేసి, ఆ కొనేవాడి మనసులో అసంతృప్తి కలిగించటం, ఆ పైన ధరను కొద్దిగా తగ్గించి, ఆ కొనే వాడిని ఒక రకమైన ‘ట్రాన్స్‌’లో పెట్టేసి, ఆ పుస్తకాన్ని అమ్మేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య అయితే అయివుండచ్చు కానీ, ఈ ప్రయోగం నా మీద చెయ్యలేవు. కాబట్టి నా అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా ఒక ధర చెప్పు” ఇలా సాగింది ప్రొఫెసర్‌ గౌరీనాథ్‌ సంభాషణ. ఆ షాపు వాడి మనసులో ఆయన చెప్పిన మాటలు చాలా సూటిగా నాటుకున్నాయి. అతని కళ్ళకు ఆయనో ఋషిలా కనపడ్డాడు. చాలా భక్తితో ఆ పుస్తకాన్ని అందిస్తూ ”రెండు రూపాయలు తగ్గించుకోండి సార్‌. కానీ దయచేసి ఈ విషయాన్ని ఎక్కడా చెప్పద్దు” బ్రతిమాలేడు. ఆ షాపు వాడి కళ్ళలో కనబడే నమ్రతా భావాన్ని గౌరీనాధ్‌ తీక్షణమైన కళ్ళు పసిగట్టేశాయి. ఆయన కళ్లు గర్వంగా నవ్వేయి. అనూహ్యమూ, అభేద్యమూ అయిన ఆ షాపువాడి అంచనాల్ని పటాపంచలు చేస్తూ ఆ పుస్తకాన్ని రెండు రూపాయలకి తక్కువకి కొన్న సంతృప్తి ఆయన కళ్ళలో ప్రతిబింబించింది.

తను విపులీకరించిన పద్ధతిలోనే షాపువాడు తనని మోసం చేసేడని గుర్తించని గౌరీనాథ్‌, కార్లో పుస్తకాన్ని పెట్టుకొని ఇంటి కొచ్చేశాడు. యండమూరి వీరేంద్రనాథ్‌ కథల సంపుటి ‘క్షమించు సుప్రియా’ కథలోని సన్నివేశమిది. దీనితో పాటు ఇంకా ఇలాంటి రసవత్తర సన్నివేశాలున్న కథలు మరో పదకొండు ఉన్నాయి.

అంతే కాదండోయ్‌. మీ జీవిత భాగస్వామికి మీరు మానసికంగా ఎంత దగ్గరగా ఉన్నారోకూడా ఈ పుస్తకం చెబుతుంది. అయినా సంతృప్తి కలగటం లేదా మీకు. అయితే రచయిత మిమ్మల్ని తనతో పాటు ప్రపంచ పర్యటన చేయిస్తాడు. దేశదేశాల సంస్కృతులూ – వాళ్ళ సమస్యలూ – యండమూరి వీరేంద్రనాథ్‌ కథల సంపుటి – ‘క్షమించు సుప్రియా’.

Ladies Hostel – లేడీస్‌ హాస్టల్‌

90.00

అతడు లైటార్పి, బెడ్‌లైట్‌ వేసే లోపులో ఆమె దగ్గరగా చేరి బుగ్గని పంటితో నొక్కిపెట్టాడు. ఎంత గింజుకున్నా నిమిషం పాటు వదల్లేదు.

తరువాత బెడ్‌లైట్‌ వేసి ‘చాలా’ అన్నాడు. ఆమె చేత్తో చెంప రాసుకుంది …. దంతక్షతం – ఇంద్రధనుస్సులా మెరిసింది. శివుడి తపోభంగం కోసం ఇంద్రుడు పంపిన మన్మధుడు ఆ ధనుస్సు అందుకున్నాడు….

-ఇరవై నాలుగు సంవత్సరాలుగా పర్వతశ్రేణుల మధ్య ఘనీభవించిన నీటి చుక్క, కోర్కె స్పర్శకి కరిగి ఆవిరి కాబోతున్న వేళ…

-పదహారు సంవత్సరాల ప్రాయం నుంచీ పరువాన్ని నిలుపుకుంటూ వస్తున్న పౌరుషం-పురుషత్వం ముందు ఓడి గెల్చి-గెలుపు సిగ్గుతో తల వంచుకునే సమయాన … తలుపు మీద టక్‌టకా లాఠీ కర్రతో కొట్టిన చప్పుడు…

ఆమె బిత్తరపోయింది. అతడు అయోమయంలో చిత్తరువు అయ్యాడు. రెండు నిమిషాల తర్వాత తలుపు తీశాడు. ఎదురుగా పోలీసు ఇన్‌స్పెక్టర్‌ నిలబడి వున్నాడు.

”మిస్టర్‌ రాయన్నా! లేడీస్‌ హాస్టల్‌ రూమ్‌ నెంబర్‌ పదమూడులో అపురూపలక్ష్మి అనే అమ్మాయిని హత్య చేసిన కారణంగా మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను.”

ఆ సమయంలో ఆ వార్తకి రాయన్న విభ్రాంతి చెందాడు.

రాయన్న ఒక మంచి క్రికెటర్‌. శోభనంనాటి రాత్రి ఓ హత్యానేరం మీద అరెస్టు అవుతాడు. హత్య చేయబడింది అపురూప లక్ష్మి అనే హాస్టల్‌ అమ్మాయి. ఒక యధార్ద సంఘటన ఆధారంగా లేడీస్‌ హాస్టళ్ల స్థితిగతులపై వెలుగు ప్రసరిస్తూ … సంచలన రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ వెలువరించిన ఇన్‌వెస్టిగేటివ్‌ నవల.

Manchu Parvatam – మంచుపర్వతం

90.00

‘తరచి చూస్తే ప్రతి మనిషి జీవితం ఒక కథే అవుతుంది. కేవలం సినిమాల్లో, కథల్లో జరుగుతాయనుకున్న సంఘటనలు మరింత మెలో డ్రమెటిక్‌గా జీవితంలోనూ ఎదురుపడవచ్చు. దాదాపు పదిహేనేళ్ల క్రితం నాటి స్నేహితురాలు ‘విశాల’ భర్త తన జీవితంలోకి అలా ప్రవేశిస్తాడని అనూరాధ కలలో కూడా ఊహించలేదు. అదలా జరిగిపోయిందంతే……”

ఆ నలుగురూ క్లాస్‌మేట్స్‌. జీవితం పొలిమేరల నాలుగురోడ్ల కూడలిలో ఆ నలుగురు పరికిణీ అమ్మాయిలు నిలబడి వీడ్కోలు తీసుకున్నారు. జీవితంలో మరికొన్నేళ్ల తర్వాత తమ అనుభవాలను పంచుకోవటానికి మరోసారి కలుసుకోవాలని నిర్ణయించుకుని విడిపోయారు. జీవితం అంటే పూలపాన్పని కలలు కనే వయసులోని ఆ టీనేజీ అమ్మాయిలకు వాస్తవలోకం తెలిసివచ్చింది. అనుకున్న టైమ్‌కి వాళ్లు ఏ పరిస్థితుల్లో కలుసుకున్నారు ? వాళ్ళకి ఎదురైన అనుభవాలేమిటి ? వాటిల్లో తీపెంత ? చేదెంత ? పురుషాధిక్యతని తన శైలికి భిన్నంగా – గుండెల్లోతుల్ని స్పృశిస్తూ యండమూరి వీరేంద్రనాథ్‌ వెలువరించిన సస్పెన్స్‌ లెస్‌ థ్రిల్లర్‌ మంచు పర్వతం. ఇది ‘జ్యోతి’ మంత్లీ సీరియల్‌.

Divyaa – దివ్యా

200.00

”ఇది చరిత్ర కాదు, చారిత్రక కల్పన మాత్రమే. వ్యష్టి, సమిష్టి ప్రవృత్తుల పురోగమనం చారిత్రక భూమికపై చిత్రించబడిన చిత్రం. చారిత్రక వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని కళానురాగంతో రూపొందించిన కాల్పనిక చిత్రం. అందులోనే యథార్ధాన్ని ప్రతిబింబింప జేయడానికి చేసిన ప్రయత్నం.

మానవుని కంటే గొప్పది – అతని ఆత్మవిశ్వాసమే: అతడు నిర్మించుకున్న విధానమే. తన విశ్వాసానికీ, విధానానికీ పరతంత్రుడవుతాడు మానవుడు. అతడే స్వయంగా వాటిని మార్చివేస్తాడు కూడా. ఇదే సత్యాన్ని కళానురాగంతో, కాల్పనిక చిత్రంలో, చారిత్రక వాతావరణంలో చిత్రించడానికి చేసిన ప్రయత్నం దివ్యా.

పేజీలు : 247

Marana Mrudangam – మరణ మృదంగం

100.00

‘ఎక్కడికి వెళ్తున్నాం ?” అని అడిగింది అటూఇటూ చూస్తూ. జవాబుగా సలీం జేబులోంచి ఆసిడ్‌ సీసా తీసాడు.

ఆమెకి మొదట అర్ధం కాలేదు. అంతలో శంకర్‌ మొహం మీద వికృతమైన నవ్వు కనబడింది.

”నువ్వు చాలా తెలివైన దానివటగా ! మీ ఆఫీసులో అంతా అలాగే చెప్పుకుంటారుట” అన్నాడు.

”ఎవర్నువ్వు” అంది.

ఆ ప్రశ్నకి అతడు సమాధానం ఇవ్వలేదు. ”తెలివైనవాళ్ళు పడక మీద మంచి సుఖం ఇస్తారని నాకో గొప్ప నమ్మకం” అన్నాడు.

అప్పుడు అర్ధమయింది ఆమెకి అతడు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కాదని. జీపు వేగంగా వెడుతోంది.

”నా పేరు శంకర్‌… సలీం శంకర్‌” అన్నాడు అతడు. ఆమె గుండె ఆగిపోయిందో క్షణం. స… లీం.. శం… క… ర్‌ . రేపు కోర్టులో నేరం నిరూపణ అయితే శిక్ష పడవలసిన బోస్టన్‌ స్ట్రాంగ్లర్‌!! తన పక్కన.

”ఇదేమిటో తెలుసా ? ఆసిడ్‌ సీసా” అన్నాడు ఒక చేత్తో మూత తీస్తూ. ”చుక్క పడితే చాలు, చర్మం సలసలా కాలిపోతుంది”.

ఆమె మెదడు ఆలోచించే శక్తి కోల్పోయింది…

వెరైటీ కోసం రకరకాల స్థలాల్లో రేప్‌ చేయటానికి ఉవ్విళ్ళూరే నరరూప ర్షాసుడు సలీంశంకర్‌. చీకటి ప్రపంచాన్ని తన చూపుడు వేలితో శాసించగల మాఫియా లీడర్‌ వసంత్‌దాదా.

తమ ఉనికికి ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా మారణహోమం సృష్టించే ఆ రక్తదాహపు క్రూరారణ్యంలోకి పొరపాటున అడుగుపెట్టింది లేడికూనలాంటి అనూష. అనుకోకుండా ఆ బేలకి భయంకరమైన రహస్యం ఒకటి తెలిసింది. అది గనక బయటికి పొక్కిందా వసంతదాదా చీకటి సామ్రాజ్యమే కుప్పకూలిపోతుంది. దాన్ని నివారించడానికి సలీంశంకర్‌ రంగంలోకి దిగాడు. మరణమృదంగ ధ్వని ప్రళయకాల ప్రభంజనంలా అనూషని వెంటాడింది…

మొదటి పేరా నుండి చివరి అక్షరం దాకా ఉక్కిరిబిక్కిరి చేసే సస్పెన్స్‌తో పాఠకుల్ని మెస్మరైజ్‌ చేసే యండమూరి వీరేంద్రనాథ్‌ థ్రిల్లర్‌.

Maro Hiroshima – మరో హిరోషిమా

90.00

డాకూ మంగళ్‌సింగ్‌ పునర్జన్మే మీరని అంటున్నారు కదా. గత జన్మలోని ప్రతి విషయం మీకు గుర్తుందా?” వైట్‌హెడ్‌ అడిగాడు.

”ఈ జన్మలోని ప్రతి విషయమే మనకి గుర్తుండకపోవచ్చు”

”పోనీ కొన్ని ముఖ్య విషయాలు?”

”ఉన్నాయి”

”గత జన్మలో మీ భార్య రత్నాబాయి… ఆమెని చూడాలనిపించడం లేదా? ముఖ్యంగా మీ కొడుకుని?”

”గత జన్మలోని నా అరాచకాల్ని, అకృత్యాల్ని ప్రక్షాళన చేసుకుకోవడానికి ఈ జన్మ ఎత్తాను. అందుకని సాధ్యమైనంత వరకూ గతజన్మ తాలూకు విషయాల్ని మరచిపోవాలనే అనుకుంటున్నాను.”

”దేవుడి అదేశానుసారం మీరు నాయకుడిగా మారాలనుకుంటున్నారని చెప్పారు. ఆ ఒక్కకారణమూ మీ గత పాపాల్ని హరించి వేస్తుందా? అర్హతనిస్తుందా?”

”గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో నన్నెలా అనర్హుడ్ని చేస్తాయి? ఆ మాటకొస్తే ఈ జన్మలో చేసిన పాపాలే ఒక వ్యక్తి నాయకుడు అవడానికి అనర్హం కావు. ఆ విషయం పూలన్‌దేవికి ఓటేసి జనమే నిరూపించారు కదా!… ఆమె వ్యక్తిగత జీవితం గురించి కాదు నేను మాట్లాడేది! జాతీయ విధాన అవగాహన గురించి. పూలన్‌దేవి ప్రధానమంత్రి, హర్షద్‌మెహతా ఆర్ధికమంత్రి. ఆటో శంకర్‌ రవాణాశాఖామాత్యులు. చార్లెస్‌ శోభరాజ్‌ ¬మ్‌ మినిస్టరు అవడా                                     నికి సౌలభ్యం వున్న ఈ ప్రజాస్వామ్యంలో నాదో పెద్ద అనర్హత అనుకోను…”

బృహస్పతి అనే అపూర్వమైన తెలివితేటలున్న ఓ యువకుడిని అతడి తల్లిదండ్రులు (ఆ తెలివితేటలను భరించలేక) ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అడవిలో హఠాత్తుగా అతడికి తన పూర్వజన్మ గుర్తొస్తుంది. క్రితం జన్మలో తాను బందిపోటు దొంగైన మంగళ్‌సింగ్‌నని తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో తనతోపాటు దోపిడీలు చేసిన ముగ్గురు దొంగలూ ఇప్పుడు కేంద్రమంత్రులుగా ఉన్నారని తెలుసుకున్నాడు. అప్పుడు అతడు ఏం చేశాడు? సెటైర్‌ని జోడించి వర్తమాన రాజకీయాలపై యండమూరి వీరేంద్రనాథ్‌ ఎక్కుపెట్టిన నవలాస్త్రం – ”మరోహిరోషిమా”

Mimmalni Me Pillalu Preminchalante – మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే

50.00

తిరస్కారపు పీడకలల్తో పెరిగిన చిన్నారి నేర్చుకొనేది పరనింద. ద్వేషపు ఆవేదనలో పెరిగిన చిన్నారి నేర్చుకునేది కొట్లాట. అవహేళన అనే గుంజిళ్ళు తీసిన చిన్నారి నేర్చుకునేది సిగ్గు. అవమానం అనే గోడ కుర్చీ వేసిన చిన్నారి నేర్చుకునేది అపరాధ భావం.

సహనంలో ఊయలలూగిన చిన్నారి నేర్చుకునేది శాంతం. ప్రోత్సాహపు గోరు ముద్దలు తిన్న చిన్నారి నేర్చుకునేది ఆత్మవిశ్వాసం. నిజాయితీ మూడు చక్రాల బండి నడిపిన చిన్నారి నేర్చుకునేది న్యాయం. సద్భావపు జన్మదినాలు జరుపుకున్న చిన్నారి నేర్చుకునేది నమ్మకం. అనురాగపు జోలపాటలు విన్న చిన్నారి నేర్చుకునేది సంతృప్తి. స్నేహపొత్తిళ్ళలో పెరిగిన చిన్నారి నేర్చుకునేది ప్రపంచం మీద ప్రేమ.

మన పిల్లలని మనం గౌరవించడమనేది ఎంతో ముఖ్యం. ఇక్కడ గౌరవించడం అంటే వారి అభిరుచుల్ని ప్రోత్సహించడం, వారికీ వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడమని అర్థం. పిల్లల పెంపకంలో గౌరవం, ప్రేమ పునాదిరాళ్ళుగా వుంటే వాటిమీదే పిల్లల ఉన్నత వ్యక్తిత్వం నిర్మించబడుతుంది. అది అద్దాలమేడా, అందమైన మేడా అనేది మీ చేతిలో ఉంది.

మీరు చదవబోయే పేజీల్లో – మనిషిని మనిషి ఎందుకు గౌరవించాలి? పిల్లలు తమ తండ్రులకు ఎంత విలువ ఇవ్వాలి? తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎంత విలువ, గౌరవం ఇవ్వచ్చు, ఒకే ఇంటో వ్యక్తుల మధ్య బంధాలు సరిగ్గా లేకపోతే మానసిక పరమైన అనారోగ్యాలు, వ్యక్తులు, వ్యక్తిత్వ పతనం ఎలా ఉంటుంది?

మీ పిల్లలకు మీరిచ్చే బహుమతి వాళ్ళకూ ఒక మనసుంటుందని గుర్తించడం, ఆ మనసుకు ఆలోచించే జ్ఞానం ఇప్పుడిప్పుడే వస్తుందని గ్రహించడం అంటున్నారు ‘మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే’ పుస్తక రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌.

Mimmalni Meeru Gelavagalaru – మిమ్మల్ని మీరు గెలవగలరు

80.00

పదహారేళ్ళ వయసులో ప్రేమలో పడి, ఆ అమ్మాయితో తన ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని బుర్ర పాడుచేసుకునే అబ్బాయిల గురించీ, పద్దెనిమిదేళ్ళ వయసులో పెళ్ళి చేసుకుని – ఇరవై ఏళ్ళకే భర్త నిరాసక్తతకు గురైన యువతుల సమస్యలను గురించీ –

పాతికేళ్ళ వయసులో పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని ఆ విషయంగా అర్థాంగితో ఎలా రాజీకి రావాలా అని మధనపడే యువకుల గురించీ, ముఫై ఏళ్లొచ్చినా అత్తపోరుతో సతమతమయ్యే గృహిణుల సమస్యల గురించీ, నలభై ఏళ్లొచ్చినా ఒక వ్యక్తిత్వం – గుర్తింపు కోసం తాపత్రయపడే అనామకుల గురించీ –

నలభైఅయిదేళ్ళ వయసులో భర్తకి తనకన్నా ముందే మరో స్త్రీతో వివాహం జరిగిందని తెలిసిన అభాగ్యుల కన్నీళ్ళ గురించీ –

యాభై ఏళ్ళ వయసులో తన జీవితం అయిపోయిందే అంటూ ఏర్పడే దిగులు గురించీ –

యాభైఏళ్ళ వయసులో తమ పిల్లలు తమని దూరం చేస్తున్నారన్న ఫీలింగ్‌ వల్ల ఏర్పడే భయాల గురించీ –

ఇంకా … దర్శకత్వం నేర్చుకోవటం గురించీ, టి.వి.ల్లో నటన గురించీ, మోసం చేసేవాళ్ళ గురించీ, మోసగింపబడే వాళ్ళ గురించీ – మరెన్నో మానసిక సమస్యల గురించీ –

యక్షప్రశ్నలకు – లక్ష సమాధానాలుగా – ‘మిమ్మల్ని మీరు గెలవగలరు’ ఈ పుస్తకంలో యండమూరి వీరేంద్రనాథ్‌ వివరిస్తున్నారు

Meeru Manchi Ammai Kadu – మీరు మంచి అమ్మాయి కాదు

50.00

మీరు మంచి అమ్మాయి

– చదివిన చదువు చాల్లే అని తల్లి దండ్రులంటే బుద్దిగా చదువు మానేసి ఇంట్లో కూర్చున్నారు.

-పెళ్ళి చూపుల్లో తలెత్తి చూడకుండా తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకున్నారు.

– ‘ఆడపిల్లలం’టే అలా ఉండాలి అని ఇరుగు పొరుగుపొగుడుతుండగా అత్తవారింటికి వెళ్ళారు.

– అత్త పెట్టే ఆరళ్ళన్నీ సహనంతో భరించారు.

– భర్త సిగరెట్‌నీ, తాగుడినీ, పేకాటనీ ఓర్పుతో సహించారు. భర్తకి సినిమాలిష్టం లేదని మీరూ మానేసారు. భర్తకోసం కట్టూబొట్టుతో పాటు మీ అభిరుచుల్నీ మార్చుకున్నారు.

– నీకేం తెలియదమ్మా, నువ్వూరుకో అని కొడుకూ, కూతుళ్లూ కసురుకుంటుంటే అదో బిరుదులా మీ అమాయత్వాన్ని మురిసిపోయారు.

– మా బామ్మా పాతకాలపు మనిషని మనవడు పరిచయం చేస్తుంటే అదో క్వాలిఫికేషన్‌ అనుకున్నారు.

ఇంతమందితో మంచి అనిపించుకోవటం కోసం మీరెంత కోల్పోయారు? ఇంతకీ మీరెవరితో మంచి అనిపించుకోవాలనుకుంటున్నారు, దానికోసం మీరు చెల్లించాల్సిన మూల్యం ఏమిటి?

మీరు మంచి అనిపించుకోవలసినది మీ మనసుతో. ఇంత ఆనందాన్ని జీవితకాలం పాటు నాకిచ్చిన ఈ అమ్మాయిలో నేనుండటం నా అదృష్టం అని మీ మనసు నిరంతరం అనుకోవాలి. అంతేగానీ మీ తల్లిదండ్రులూ, భర్తా, పిల్లలూ, అత్తా మామలు, మరుదులూ, మనవళ్లూ కాదు. అలాంటి ఆరోగ్యకరమైన ఆనందాన్ని వ్యక్తిత్వము అంటారు. దాన్ని ఎలా సాధించాలో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. నేనిప్పుడు బాగా’నే’ వున్నాను అనుకుంటే మీరీ పుస్తకాన్ని చదవద్దు అంటున్నారు యండమూరి వీరేంద్రనాథ్‌.

Nallanchu – Tella Cheera – నల్లంచు – తెల్లచీర

90.00

‘. ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నావు?”

”వాయిదాల పద్ధతి మీద చీరెలమ్ముతున్నాను…. గవర్నమెంటు ఆఫీసుల్లో”.

”నీ చేతిలో గొప్ప ఆర్టుంది. మా కంపెనీలో చేరకూడదూ ?” రవి నవ్వి, ”జీతం ఎంతిస్తారు?” అని అడిగాడు.

”అయిదొందలు. ఓ.కె….”

”ప్రస్తుతం నాకు డిజైన్స్‌ కత్తిరించేవాడికి అంతే ఇస్తున్నాను. క్షమించండి. మిమ్మల్ని హర్ట్‌ చేయటం నా వుద్దేశ్యం కాదు. ఇప్పుడు నేను చేస్తున్న ఆప్లిక్‌ పని బాగానే వుంది. దాన్ని వదిలి రాలేను”.

”ఎంతుంటాయి నీ అమ్మకాలు?”

”క్రితం నెల దాదాపు లక్ష…”

శర్మ విస్తుబోయి అతడివైపు చూశాడు. తేజ టెక్స్‌టైల్స్‌ హైదరాబాద్‌ విభాగం అమ్మకాలకన్నా అది ఎక్కువ…

చీరలు… చీరలు…. పిఠాపురం, ధర్మవరం చీరలు. నారాయణపేట నేత చీరలు… అంటూ వీధుల వెంట తిరుగుతూ చీరలమ్ముకునే ఆ కుర్రవాడు బడా వస్త్రవ్యాపారుల వెన్నులో చలిపుట్టించాడు. వస్త్రవ్యాపార ప్రపంచంలో ఎదురులేకుండా దూసుకుపోయాడు. కానీ రవంత జీవన మాధుర్యం కోసం అర్రులు సాచి ప్రత్యర్ధుల వలలో చిక్కుకుపోయాడు.

అతివల అందాన్ని ఇనుమడింపజేసే పట్టు – సిల్కు, జార్జెట్‌ – షిఫాన్‌ – కాటన్‌ చీరల వస్త్ర ప్రపంచంలో విహరింపజేసే యండమూరి వీరేంద్రనాథ్‌ శారీ థ్రిల్లర్‌ ‘నల్లంచు తెల్లచీర’ 106 రోజుల పాటు ఆంధ్రజ్యోతి డైలీ సీరియల్‌గా వచ్చి హిట్‌ అయిన నవల ఇది.

Nissabdam Neeku Naaku Madhya – నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య

50.00

జీవితం ఆ కుర్రాడికి వడ్డించిన విస్తరే- కాని అదొక్కటే అబ్బాయిలూ, అమ్మాయిలూ, ఎలా కలుస్తారు- ఏం మాట్లాడుకుంటారు- ఆ తరువాత్తర్వాత యింకేం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలనే కోరిక, ఉబలాటం, తపన, సరదా-

ఎన్ని రకాలుగానో ప్రయత్నించి ఆ అసలు రహస్యం తెలుసుకోవాలని కుస్తీలు పట్టగా పట్టగా తనో సైకో అయిపోతాననే భయంతో-

ఓసారి పట్నవాసం నుంచి పల్లెటూరికి ప్రయాణం కాగా, అక్కడో గోదారి గట్టు, అక్కడో మావయ్య, అక్కడే ఓ ముద్ద మందారం-

ఆ నిశ్శబ్ధంలోనే ఆ ప్రశాంత వాతావరణంలోనే అంతా తెలిసిపోయినట్లు మనసు తేలికయిపోయింది-

అదే ఆనందభైరవి రాగంలా యువతరానికి అటూయిటూ వున్న సంగతుల్ని ముగ్ధమనోహరంగా అరటి పండొలిచినట్లు చెప్పిన నవలా రత్నమాల- నిశ్శబ్దం నీకు నాకూ మధ్య