YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 685–696 of 835 resultsSorted by latest
Teens Pillala Pempakam Oka Kala – టీన్స్ పిల్లల పెంపకం ఒక కళ
₹180.00టీన్స్ పెంపకంపై తెలుగులో తొలి పుస్తకం.
వీడియో గేమ్స్, ఛాటింగ్, సెట్, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా?
అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి?
పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి?
టీన్స్ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు?
కొందరు టీన్స్ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల్లరిగా తయారవుతారు?
తాము అనుకన్నట్టే ఉండాలని పెద్దలు పిల్లల్ని ఎందుకు బలవంత పెడతారు?
పదవ తరగతి పాస్ అవ్వాలన్నా, చివరికి చిన్న బండి నడపాలన్నా, పరీక్ష/లైసెన్స్ ఉంటుంది గానీ, పేరెంట్ అవటానికీ, పిల్లల్ని పెంచటానికీ ఏ లైసెన్సూ అవసరం లేదు. ‘పిల్లలు న్యాచురల్ గానే పెరుగుతారు. దానికి పుస్తకాలూ, పరీక్షలూ ఎందుకు? గతంలో పెద్దలు ఏ గైడ్ చదివి పెంచారు?’ అనేది ఒకప్పటి వాదన. అయితే, ఇప్పుడున్న పోటీతత్వం అప్పట్లో లేదు. ఇంట్లో తాతయ్యలూ మావయ్యలూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో, ”ఆకర్షించే అనారోగ్య అభిరుచులూ, అయిస్కాతించే టెక్నాలజీ” నుంచి టీన్స్‌ని, వ్యక్తిత్వంతో పెంటచలానికి కావలసిన గైడ్-లైన్స్‌పై సంపూర్ణమైన పుస్తకం.
పేజీలు : 240
Tappu Cheddam Randi – తప్పు చేద్దాం రండి
₹225.00వ్యక్తిత్వ వికాసాన్ని మొదటిసారిగా సస్పెన్స్ కథా రూపంలో చెపుతున్న సరికొత్త సంచలన ప్రయోగం ఈ పుస్తకం. ఆ ప్రయోగాన్ని చేసింది ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. తెలుగులోనే ఇది అపూర్వం. ఛేంజ్ మేనేజ్మెంట్ పై తొలి పుస్తకమిది.
ఈ పుస్తకం రాజకీయాల గురించి కాదు. ఎత్తులు పై ఎత్తులు గురించి అసలే కాదు. మనిషి గురించి. తాను మరింత బాగా బ్రతకటం కోసం. వ్యక్తిగతంగానూ, సమాజాన్ని మార్చటం కోసమూ ఏం చెయ్యాలో ఆలోచించవలసిన కర్తవ్యం ప్రతి మనిషి మీదా ఉన్నది. తాను మరింత బావుండాలంటే తన విలువల్ని ఏ విధంగా మార్చుకోవాలన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి కదా! అయితే.. కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. కొంతైనా ఆచరించాలి.
ఈ పుస్తకం చివర్లో మంత్రి కొడుకు కథ ఒకటున్నది. మంచినీతి వున్న జానపద కథ. ”సూక్తులు వినటమే కాదు. ఆచరించాలి కూడా’ అని చెప్పే అద్భుతమైన నీతి ఉన్న కథ.
అయితే ప్రతి మార్పు మంచికి దోహదం చేయకపోవచ్చు. అంతెందుకు? ఈ పుస్తకంలో కొన్ని భావాలు మీకు నచ్చకపోవచ్చు. అంత మాత్రాన అసలు మార్పే వద్దనలేం కదా! అదే ఛేంజ్ మేనేజ్మెంట్.
ఏ మార్పైనా ముందు హేళన చేయబడుతుంది. తరువాత ప్రశ్నింపబడుతుంది. ఆపైన విమర్శించబడుతుంది. వేగంగా తిరస్కరింపబడుతుంది. చివరగా – ఒప్పుకోబడుతుంది. మార్పు అంటే కొత్తని నిర్భీతిగా ఆహ్వానించగలగటం! మంచి మార్పుకి భయపడని అలాంటివారికి ఈ పుస్తకం అంకితం అంటున్నారు రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్.
The 5 Steps to Success
₹250.00The world ‘Satagopam’ emereged from the original Sanskrit phrase ‘shat (six) gopyam (secrets). The devotees are blessed on their head with the silver crown twice, once to pull ;out 6 evils : Kama (lust), Krodha, Lobha, Moha, Mada (pride), Matsarya (jealousy). The second touch is to infuse six riches : health, wisdom, prosperity, love, fame, and the ultimate satisfaction.
Five steps to success envisages exactly the same principle. It helps to identify and fish out your weaknesses, and to instil the six Aiswaryas. Unlike other foreign P.D.Books, this motivational book exemplifies the Indian traditions and culture based on self-experiences. It emphasises victory at personal level as a basis for the rest to be built upon. Ascend these five steps to experience the real bliss of success ….!
Yandamoori Veerendranath is a rare come-together of an acomplieshed Charted Accountant, a popular writer, a successful film technician, a motivatonal speaker, and a motivating conlumnist for The Hindu.
Avadhana Sathakam- 1
₹500.00ప్ర: పెళ్ళయిన ఆడవాళ్ళకు తాళిబొట్టు గుర్తు మరి పెళ్ళయిన మగవాళ్ళకు?
జ. ఏడుపుగొట్టు మొహం. హాయిగా నవ్వలేక పోవడం.
ప్ర: దయ్యాలు రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయి?
జ. పగలు మనం తిరుగుతామనే భయంతో
ప్ర: పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకను పెట్టుకుని వెళ్ళడం అంటే…
జ. అవధానానికి వెళ్తూ అప్రస్తుతం వారిని చంకన బెట్టుకుపోవడం.
ప్ర: కరిచే కుక్క మంచిదా? మొరిగే కుక్క మంచిదా?
జ. మా యింట్లో కరిచే కుక్క మంచిది. మీ యింట్లో మొరిగే కుక్క మంచిది.
ప్ర: పిల్ల ముందా? గుడ్డు ముందా?
జ. పిల్లే ముందు. పిల్ల పుట్టి బడిలో చేరి పరీక్ష రాశాక కదా మార్కుల్లో గుడ్డు పెట్టేది.
ప్ర: పద్యా నికీ, శ్లోకానికీ తేడా ఏమిటి?
జ. పద్యం వేగంగా వస్తుంది, శ్లోకం నెమ్మదిగా వస్తుంది.
ఎందుకంటే అది slow ……… come
ప్ర: ‘మండే’ని ఆ పేరుతో ఎందుకు పిలుస్తారు?
జ. సండే సెలవు అనుభవించిన వారికి మర్నాడు పనిచేయాలంటే
ఒళ్లు “మండే” – అందుకే
ప్ర: అంటరానితనం మహాపాపం. మరి వంటరాని తనం?
జ. మొగుడు పాపం
ప్ర: ఎక్స్ ప్రెస్ బస్ ను నాన్ స్టాప్ అంటారు. ప్యాసింజరు బస్ ను ఏమనాలి?
జ. నానాస్టాప్ అనాలి.
The Best Of Yandamuri Veerendranath – ది బెస్ట్
₹120.00అత్యుత్తమమైన పాతిక కథల సంకలనం – యండమూరి వీరేంద్రనాథ్
జడివానలో ఓ రాత్రి ఇరవై రెండేళ్ల అమ్మాయి అతడి అరుగు మీద నిలబడింది. అతడు యువకుడు. లోపలికి రమ్మన్నాడు. ఆ రాత్రి ఆ అమ్మాయి అతడింట్లోనే ఉండిపోయింది. వాళ్లిద్దరి మధ్యా ఏమీ జరగలేదు. అతడి స్నేహితుడొకడు అతడ్ని వెక్కిరించాడు. ఆ అమ్మాయి కచ్చితంగా నిన్ను ఇంపోటెంట్ అనుకుని వుంటుందన్నాడు. మళ్లీ ఒకసారి ఆ అమ్మయి తారస పడింది. అతడు ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. ప్లాను వేసి మరీ కరెంటు పోగొట్టాడు. ఒక్క ఉదుటన ఆ అమ్మాయిని తన బిగి కౌగిలిలో బిగించాడు. అప్పుడే జరిగింది ?
1969లో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘అబద్ధం లాంటి నిజం’ మానవ మనస్తత్వంలోని ఓ అట్టడుగు కోణాన్ని చిత్రిస్తుంది. ఈ కథతో పాటు యండమూరి వీరేంద్రనాథ్వారి పాతికేళ్ళ రచనా వ్యాసంగంలో అత్యుత్తమమైన 25 కథలను ఎంపిక చేసి ”ది బెస్ట్” ఆఫ్ యండమూరి వీరేంద్రనాథ్ సంకలనాన్ని వెలువరించారు. 1969-94 సం||ల నడుమ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన మంచి కథలు ఇందులో ఉన్నాయి.
ఫేర్వెల్ రాజేశ్వరి, ఆ ఒక్కటి అడక్కు, పురుషోత్తముడి ఫోటో, పట్నం బస్సు, అమ్మాయిలకి మాత్రమే, స్త్రీ / స్త్రీ, చదరంగంలో చచ్చేది, టాన్, వరండా కుర్రాడు, నవ్వే కన్నీళ్ళు, ఉల్లిపాయ, బ్రహ్మర్షి అన్నవి ఈ సంకలనంలో చోటు చేసుకున్న కొన్ని కథల పేర్లు.
Velugu Vennela Deepalu – వెలుగు వెన్నెల దీపాలు
₹150.00”విజయానికి అయిదు మెట్లు” నుంచీ ”టీన్స్ పిల్లల పెంపకం” దాకా నా వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో, …. పాటూ నా అనుభవాలూ, కథలూ కూడా వ్రాస్తూ వచ్చాను. మిగతా రచయితల పుస్తకాలకీ, వీటికీ తేడా బహుశా ఇదే అనుకుంటాను.
దురదృష్టవశాత్తూ, ఇటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు పిల్లలు చదవరు. కానీ ఈ పుస్తకాల్లో కొన్ని కథలు పిల్లలకి ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఇస్తాయి. అన్నిటినీ క్రోడీకరించి ఒక చోట చేరిస్తే, వాటిని పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనే ఈ పుస్తకం.
నా వివిధ వ్యక్తిత్వ పుస్తకాల్లో నుంచి ఏరి కూర్చిన కథల సమాహారం ఇది. ఇందులో కొన్ని విదేశాలకి సంబంధించిన పురాతన గాధలు, మరి కొన్ని బౌద్ధానికి సంబంధించిన పుస్తకాల్లోంచి, ఇంకా కొన్ని ఇంటర్నెట్ నుంచీ స్వీకరించినవి. చాలా వరకూ నావి.
పెద్దలు పిల్లలకి బెడ్రూం కథలు చెప్పటం తగ్గిపోయింది. ‘అసలు మాకు తెలిస్తే కదా చెప్పటానికి’ అంటున్నారు కొందరు. ఈ పుస్తకం ఆ లోటు తీరుస్తుంది. – యండమూరి వీరేంద్రనాథ్
పేజీలు : 232
Arabian Nights Kadhalu – అరేబియన్ నైట్స్ కథలు
₹800.00అధ్బుత శక్తులు, భూతాలు, రాజుల సహసగాధాలు, వ్యాపారస్తుల నౌకయనాలు – ప్రమాదాలు – శృంగార గాధలు ఒకటేమిటి ఈ అరేబియన్ నైట్స్ కథలు ఎన్నెన్నో అద్భుత, విచిత్ర కదల సమాహారం. అరబిక్ భాష నుండి ఫ్రెంచ్, ఇంగ్లీష్ తదితర పాశ్చాత్య భాషల్లోకి ఎన్నో అనువాదాలు వచ్చిన రిచర్డ్ బర్టన్ ఆంగ్ల అనువాదంగా ఎంచబడింది. ఈ తెలుగు అనువాదం రిచర్డ్ బర్టన్ ఇంగ్లీష్ అనువాదానికి ములంకగా కొన్ని సందర్భాలలో శృంగారం శ్రుతిమించిన చోట రేఖామాత్రంగ మాత్రమే చిత్రించబడిన దానికి సాటిరాగల తెలుగు అనువాదమిది. సహసగాధాలు, మంత్రగాట్టేల తంత్రాలు, ఆలీబాబా 40 దొంగలు, సింద్బాద్ సాహసయాత్రలు, కీలుగుర్రం, బాగ్దాద్ కాలిఫ్ రాత్రివేళ చుసిన విచిత్ర కథలు తెలుసుకోవాలంటే ఈ అనువాదం మీకో బహుమతి. శాహ్రజాద్ కళాత్మకంగా చెప్పగా స్త్రీలపై పెంచుకున్న పగను వదలిన సహ్రియర్ సుల్తాన్ వేయినోక్క రాత్రులు విని ఆనందించి ఆమెనే వివాహమాడిన కథ స్రవంతి ఈ అరేబియా ప్రాంత కథలు.
The Art of Studying – The Art of Studying
₹75.00Why some students feel ‘studying’ as the most boring thing in their life?
Why some pupils cannot concentrate in their studies in spite of their intelligence?
Why some candidates get less marks in examinations in spite of their good efforts?
This book is first of its king to enable the students understand in simple language: ‘How to study and why study’ analyzing the difference between education and wisdom (knowledge and performance).
This book is one of the best gifts, a parent can give to the child. After meticulously going through this book a student gets the feeling that ‘Studying my class book is not a difficult propostion, but a recreation!’
Vijayamlo Bhagaswamyam – విజయంలో భాగస్వామ్యం
₹150.00భార్యా భర్తలు అన్యోన్యంగా వుంటూ పొరపొచ్చాలు లేకుండా కాపురం చేయాలంటే, దాంపత్య విజయంలో సమాన భాగస్వామ్యం పొందాలంటే ఎలా ప్రవర్తించాలో, పరస్పరం ఎలా సహకరించుకోవాలో ఆ విషయాలన్నింటినీ వివరంగా చర్చించారు రచయిత.
దాంపత్యాన్ని ఒక అందమైన కలగా మలచుకోవటానికి, సంసార సహజీవనం సజావుగా సాగటానికి వ్యక్తులు ముందుగా తమను తాము అర్థం చేసుకుని, ఒక అంచనా వేసుకుని పరస్పర సహకారంతో ముందుకు సాగాలంటే ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, శాస్త్రీయ దృక్పథంతో చక్కగా వివరించారు రచయిత.
పూర్వపు సమాజానికి ప్రస్తుత సమాజానికి చాలా తేడా ఉంది. వ్యక్తుల అభిప్రాయాలలో ఆలోచనలలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆధునిక యోచనల ప్రభావం వల్ల మనుషులలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకుని ముందుకు సాగిపోవటానికి ఉపయుక్తమైన సమాచారం యీ పుస్తకంలో వుంది. భార్యా భర్తలు ఒకరి ఆలోచనా విధానాన్ని మరొకరు గౌరవిస్తూ, ఇద్దరికీ నష్టం కలగనంతవరకు ఒకరినొకరు అభిమానిస్తూ, గౌరవించుకుంటూ ప్రేమ ద్వారా ఒకరి ఆలోచనను మరొకరి వైపు తిప్పుకుంటూ దాంపత్యాన్ని కొనసాగించినప్పుడే ఆ సంసారం విజయవంతమవుతుంది అంటారు రచయిత. ”ప్రేమంటే రెండు గుండెలు ఒకే ట్యూన్లో శబ్దించటం కాదు. రెండు ఆలోచనలు భిన్నంగా శబ్దించి ఒకే ఆలోచనగా రూపుదిద్దుకోవడం, వంటి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి.
రచయిత తన విశిష్ట వచనశైలిలో జీవితంలో మానవ సంబంధాల ప్రాముఖ్యతను బాగా వివరించారు. ప్రేమ తత్వానికి, ప్రేమైక జీవన సౌందర్య నిర్వచనానికి, అవినాభావ సంబంధ అనుబంధ బాంధవ్యాల విశ్లేషణకి, అనితర సాధ్యమైన భాష్యాన్ని చెప్పిన విలువైన పుస్తకం ”విజయంలో భాగస్వామ్యం’.
Vijayaniki Aidu Metlu – విజయానికి అయిదు మెట్లు
₹300.00మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ మానసిక బలహీనతల్నీ, సమస్యల్నీ అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులను పఠిష్టం చేసుకోవడం కోసం, మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవడం కోసం టెన్షన్, బోర్, నిరాసక్తత పారద్రోలటం కోసం, ఆర్ధికంగా నిలదొక్కుకోవటం కోసం, అంతిమ విజయం సాధించటం కోసం, అందరికీ అర్ధమయ్యే రీతిలో రూపొందించబడిన వ్యక్తిత్వ వికాస పుస్తకం – యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘విజయానికి అయిదు మెట్లు’.
ఏదైనా సమస్య మనతోపాటే ఉంటుంది. అది మన హృదయపు గదిలోనే ఉంటుంది. ఆ గదికి తాళం వేసుంటుంది. దాన్ని పారద్రోలటానికి తాళం చెవి మాత్రం దొరకదు. అలాంటి తాళం చెవి ఎలా సంపాదించాలన్నదే ఈ పుస్తకం ముఖ్యోద్దేశం. మనసుగదిలోంచి సమస్యను పారదోలటమే ఈ పుస్తకపు ఆశయం.
మనోవిజ్ఞానానికి సంబంధించిన రచనలు తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి. ఆలోటును తీరుస్తూ, చక్కగా అందరికీ అర్ధమయ్యే భాషలోనే కాక ఒకసారి చదవడం ప్రారంభిస్తే మరి వదలకుండా పాఠకునిచేత చివరంటా చదివించే ఆకర్షణీయమైన శైలిలో, విషయం వివరించిన తీరు బాగుంది.
ప్రపంచం అంతా నిన్ను వదిలిపెట్టినప్పుడు నీతో వుండేవాడే మంచి స్నేహితుడు. పుస్తకం మంచి స్నేహితుడు. అది చెప్పేది వినగల్గితే ఆ స్నేహితుడి కన్నా గొప్ప తెలివైన వాడు ఇంకెవరూ వుండరు. ఎంతో మంది రచయితలు తమ జీవితపుటనుభవాల్నీ, విజ్ఞానాన్నీ కలబోసి అవతలివాళ్ళకు చెప్పటం కోసం అహోరాత్రులూ శ్రమించిన తపనా రూపమే పుస్తకమంటే. అదిగో అలాంటి మంచి స్నేహితుడిని మీకు పరిచయం చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం.
Vijayaniki Aro Mettu – విజయానికి ఆరో మెట్టు
₹195.00మనిషి మంచిమనుగడకి, మరింత సుఖంగా బ్రతకడానికి, గెలుపుకి, తనను తాను తెలుసుకోవడానికి ముఖ్యమయిన ఆయుధం భారతదేశంలోనే ఉద్భవించింది. దాని పేరు ‘భగవద్గీత’. ”వారు నీ భార్య వలువలు విప్పారు. నీ ఇల్లు తగులబెట్టారు. రాజ్యం నుంచి నిన్ను తరిమికొట్టారు… లే… పిడికిలి బిగించు. కత్తి తీసుకో. వారిని హతమార్చి నీ పగ తీర్చుకో” అంటూ కృష్ణుడు అర్జునుడి ఆవేశం మీద ఆడుకోవచ్చు. కానీ అలా చెయ్యలేదు. మనిషి యుద్ధం ఎందుకు చెయ్యాలో తార్కికంగా చెప్పాడు. ఎన్నో జీవిత సత్యాల్ని విప్పాడు. కష్టాలకి దు:ఖ కారణాలు వివరించాడు. మనసు అశాంతికి, సంఘర్షణకు గురయినపుడు మానసిక వైద్యులు చేసేది. సైకోథెరపీ (టాక్ థెరపీ). ఈ నాటి మానసిక వైద్యుల కంటె ఎన్నో వేల సంవత్సరాలకు ముందే మానసిక ఆందోళనకు గురయిన అర్జునుడికి సైకోథెరపీ చేసిన మొట్టమొదటి సైకియాట్రిస్ట్ చరిత్రలో శ్రీకృష్ణుడే.
మనిషి తన జీవితకాలంలో సంపాదించుకోవలసిన ధైర్యం, సంపద, ఆరోగ్యం, కీర్తి, జ్ఞానం, శాంతి అనే ఆరు ఆస్తులను సముపార్జించటానికి భగవద్గీత ఏ విధంగా తోడ్పడుతుందో వివరించే పుస్తకమే ‘విజయానికి ఆరోమెట్టు’. త్యాగం, తత్వజ్ఞానాలను బోధించే భగవద్గీత ఉద్దేశ్యం కర్మఫలత్యాగం. ఫలితాన్ని ఆశించకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుంది ? సమస్య ఎందుకు వస్తుంది ? ఎదురైన సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి ? అంతిమంగా సాధించే ప్రయోజనాలేమిటి ? అనే విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా గీతలోని శ్లోకాలసాయంతో సోదాహరణంగా వివరించిన యండమూరి వీరేంద్రనాథ్ ప్రతి అక్షరం ప్రతివాక్యం చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. ”భగవద్గీతా ? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే” అన్న స్థితినుంచి వచ్చేతరాన్ని పరిరక్షించుకోవటం కోసం రాసిన పుస్తకమిది.
అలనాటి అర్జునుడికి సైకోథెరపీ చేసిన కృష్ణుడిలాగే ఈ విజయానికి ఆరోమెట్టు ద్వారా వీరేంద్రనాథ్ తెలుగు సాహితీ ప్రపంచంలో మోడరన్ కృష్ణుడిగా నిలిచిపోతాడని, ఈ పుస్తకం చదివిన తర్వాత మీరనుకుంటే మే మేమీ ఆశ్చర్యపోము.