YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 649–660 of 835 resultsSorted by latest
Aalochinchandi Iswaryavanthulu Kandi
₹199.00సంపదకు సంసిద్ధులుకండి
డబ్బును సంపాదించే మార్గాన్ని మీకు భోదించడం ద్వారా ఈ పుస్తకం మీ జీవితాన్ని ఆసాంతం మార్చేస్తుంది. ‘ఆలోచించండి, ఐశ్వర్య వంతులు కండి’ అనే పుస్తకం, రచయిత సాగించిన పరిశోదన, విశ్లేషణ ల తాలుకు ‘విజయ రహస్యాల ‘ ఫై ఆధారపడింది. ఇది గొప్ప గొప్ప ఐశ్వర్య వంతులు, విజేతల స్వానుభవ, మేధోమధన ప్రతి ఫలాల్ని ప్రతిబింబిస్తుంది.
Homo Deyus Repati Sankshiptha Charitra
₹345.00హోమో సేపియన్స్ హోమో డేయుస్ గా మారుతుంటే మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం?
పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తీ – స్వాభావిక ఎంపిక – తెలివైన రూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది?
గూగుల్ ఇంకా ఫేస్ బుక్ లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకు తెలిసినదానికన్నా ఏక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?
పేలుసయినా భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వoత విధ్వంసక శక్తుల నుండి ఏ రకంగా కాపాడుకుంటాము?
ఈ పుస్తకంలో ప్రొఫెసర్ పరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు. వాటికీ వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్దతిలో వెతుకుతారు.
Kathalu Ilaa Kooda Rastaru)
₹345.00చాలామంది ఏం చేస్తారంటే ‘నాడా’ దొరికిందని గుర్రాన్ని వెతుకుతారు. కొందరు ‘గుర్రం’ ఉందని నాడాను వెతుకుతారు. ఈ రెండూ ఉన్నా సరే కథ కాదు. ఈ రెండూ కలిసి ‘నాడా ఉన్న గుర్రం’ కావాలి. దానికో రౌతు కావాలి. ప్రయాణించడానికి గమ్యం కావాలి. ప్రయాణానికి ఉద్దేశం ఉండాలి. ప్రయాణంలో సంఘర్షణ ఉండాలి. ప్రయాణానికి ఫలితం ఉండాలి. అప్పుడు కథ.
ఈ పుస్తకంలో…
– కథలేవారు రాస్తారు?, కథలు దేంతో రాస్తారు?, కథలకు ముందు ఏం రాస్తారు?
– కథలెందుకు రాస్తారు?, కథలేప్పుడు రాస్తారు?, థీమ్ అంటే… ఫ్లాట్ అంటే…
– మంచి ప్రారంభాలూ… గొప్ప ముగింపులూ….
– పుస్తకం ఎప్పుడు వేయాలి?, పుస్తకం ఎలా వేయాలి?, పరిచయాలు కోరే ప్రాణత్యాగం…. మొదలగు విషయాలు కలవు……
Milinda
₹200.00ప్రతి మనిషికీ బతికే హక్కున్నట్టే ప్రేమించే హక్కు కూడా ఉంటుంది. అది స్త్రీ పురుషులకన్నా కాస్త భిన్నంగా ఉన్నవారికి దక్కడం లేదు. వారిని అర్ధం చేసుకోకపోగా చిత్రమైన కారణాలతో వారిని మానసిక శారీరక హింసలకు గురి చేస్తున్నారు. వారి గోడును వినిపించుకోవడానికి వారి దగ్గర భాష కూడా లేని వైనాన్ని మనం గమనించాలి. నా కథల ద్వారా స్వలింగులకు, ట్రాన్స్ జెండర్స్ కీ సంఘీభావం తెలుపుతాను.
మారే కాలాన్ని బట్టి నేను స్త్రీ వాదిని మాత్రమేనా బలమైన మానవవాదినా అని ఆలోచించుకునే అవసరం కనబడుతోంది. స్త్రీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నాయంటే మగవారి ఆలోచనా విధానం మారుతోందనే చెప్పాలి. పిల్లల్ని చూపులతోనే బెదిరించే తండ్రులు ఈ తరంలో అరుదే. వంటగదిలో ప్రధాన పాత్ర కాకపోయినా సహాయ పాత్ర పోషిస్తున్నారు నేటి పురుషులు. ఒక పక్క స్త్రీల మీద దాడులు పెరుగుతున్నా స్త్రీలని గౌరవించి సమానత్వంతో చూసే పురుషులు, యువకులు కూడా ఎక్కువే ఉన్నారు. కుటుంబ పోషణ వల్ల తీవ్రమైన మానసిక వత్తిడికి లోనై, కుటుంబం చేత నిర్లక్ష్యానికి గురయ్యే మగవారూ లేకపోలేదు. అటువంటి ఉదంతాలకి నా కథలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రతీ స్త్రీ దేవతా కాదు ప్రతీ పురుషుడూ రాక్షసుడు కాదు కాబట్టి పురుషులకి నా కథల్లో గౌరవ ప్రదమైన స్థానం ఉంటుంది.
Parusavedi – పరుసవేది
₹299.00రోజువారీ జీవితంలోని సమస్యల పరిష్కారం కోసమో, జ్ఞాన సముపార్జన కోసమో, నిరంతరం పేరుకుపోయే విసుగుని బద్దలు కొట్టడం కోసమో సాహిత్యాన్ని ఆశ్రయించే పాఠకులకు తనదైన తత్వదర్శనం చేయించి విశ్వతత్వాన్ని అర్ధం చేయిస్తూ సమాజ స్వభావాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఇస్తూ స్వీయ పరిణామానికి కావలసిన మార్గాన్ని సుగమం చేయడమే సాహిత్య ప్రధాన ప్రయోజనం.
మన బలహీనతలను రెచ్చగొడుతూ, భ్రమలలో జోకొడుతూ, భద్రతా రాహిత్యాల విముక్తి కోసం అవిటి ట్రిక్కులనీ, నిర్జీవమైన మార్గాంతరాలనీ అందించే సాహిత్యంలో పుస్తకాల సంత విలవిలలాడుతుంది. ఈ విషాద సందర్భాన మానవ తత్వాన్నీ, విశ్వతత్వాన్నీ సరళంగా, సహజంగా అర్ధం చేయిస్తూ, వాటి మధ్య ఉన్న అనుసంధానతని విపులంగా విశదీకరిస్తూ తెలుగు సాహిత్య రంగంలోకి ‘పరుసవేది’ ప్రవేశించడం ముదావహం.
తర్కాలకీ, హేతుబద్దతకీ, ఇంద్రియాల గ్రహింపుకీ కుదరని-అందని, నిశిత నిగూఢ స్ధాయిలో అసలైన మౌలిక ప్రజ్ఞలన్నీ గుప్త నిర్మాణంగా నెలకొని ఉంటాయని, ఈ ప్రజ్ఞలు సందర్భోచితంగా వ్యక్త నిర్మాణాలుగా నైపుణ్యాలుగా ప్రకటితమౌతాయనీ అర్ధం చేసుకోకపోతే నిండైన పరిణామానికి దూరమై, మన సంకల్ప వాస్తవాలను సృష్టించుకోవడంలో విఫలమౌతామని మనకి అర్ధం అయ్యేలా చేయడమే ఈ రచన యొక్క ప్రధాన గమ్యం. పాలో కొయిలో – ది ఆల్కెమిస్ట్ ఇంగ్లీషు పుస్తకాన్ని తెనిగించినది శ్రీ కె.సురేష్. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలలో 66 భాషలలోకి అనువాదమయ్యింది.
Rahasyam (The Secret) – రహస్యం (ది సీక్రేట్)
₹499.00మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకుని ఉన్నారు
ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగివున్నది, చేజారినది, అపహరించబడినది, లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చేయబడినది, తరువాతి తరాల వారికి అందించబడుతూ వస్తున్నది. శతాబ్ధాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలా మంది అర్థం చేసుకున్నారు. : ప్లేటో, గెలీలియో, బిథోవెన్, ఎడిసన్, కార్నేగి, ఐనస్టీన్ వంటి వారు. వీరితో పాటు మరికొందరు ఆవిష్కర్తలూ, వేదాంతులు, శాస్త్రవేత్తలు, గొప్ప తాత్త్వికులు కూడా దీన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ రహస్యం లోకానికి వెళ్ళడి చేయబడుతోంది.
”ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో, మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవరుచుకోగలరో, మీ మనస్సుకు నచ్చే పని ఎలా చేయగలరో, మీరు ఇష్టపడే వస్తువును ఎలా పొందగలరో తెలుసుకుంటారు. నిజంగా మీరెవరో మీకు తెలియవస్తుంది. జీవితంలో మీకోసం వేచివున్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు”.
పేజీలు : 198
Sadhuvu Alochana
₹399.00Sapiens
₹399.00నిప్పు
మనకి శక్తినిచ్చింది
పోచికోలు కబుర్లు
సహకరించేందుకు సాయపడ్డాయి
వ్యవసాయం
ఇంకా కావాలన్న కోరికని పెంచింది
పురాణాలు
చట్టాన్ని న్యాయాన్ని నిలిపి ఉంచాయి
డబ్బు
మనం నిజంగా నమ్మదగిన దాన్ని ఇచ్చింది
వైరుధ్యాలు
సంస్కృతిని సృష్టించాయి
విజ్ఞానశాస్త్రం
మనని ప్రాణాంతకంగా తయారుచేసింది
ఇవి మన అసాధారణమైన చరిత్ర తాలూకు సంచలనాత్మకమైన వివరాలు – ఏ ప్రత్యేకతా లేని వానరులనుంచి ప్రపంచానికి ఏలికలుగా తయారు చేసిన చరిత్ర ఇది.
-ఆర్.శాంతసుందరి.
Uttama Telugu Vaana Kadhalu
₹250.00విత్తనం బొజ్జలో నుంచి మొక్క పాపాయిని నేల పొత్తిళ్ళలోకి తెచ్చి, పెంచి పెద్ద చేసే దేవతే కదా వానంటే. మేఘాలు వెండి దారాలతో భూమికి ఆకుపచ్చని జీవాన్ని నేయడమే కదా వానంటే. ప్రకృతి పసి పాపాయై చేసే అల్లరి చప్పుళ్ళే కాదు, కోపంతో ముఖం చాటేసి నిర్దాక్షిణ్యంగా జీవితాల్ని చిదిమి పారేసే మృత్యువు కూడా వానే. ఆనందం, ఆశ్చర్యం, భయం, బీభత్సం, విషాదం, దుఃఖం వానకున్న అనేక ముఖాలు. కళ్ళకు కనిపించే ప్రాణులతో పాటు, కనిపించని కోట్లాది జీవరాశుల బతుకులు శాసించేదే వాన. అలాంటి వాన నేపథ్యంలో తెలుగులో అనేకానేక కథలు వచ్చాయి. అందులో గుండెలు తడి చేసి, ఆలోచనలను తడిమే కథలన్నీ ఒక దరికి చేరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ పుస్తకం.
– కృష్ణ మోహన్ బాబు