YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 625–636 of 835 resultsSorted by latest
Paakudu Rallu – పాకుడు రాళ్ళు
₹500.00చిత్ర పరిశ్రమలోని అనేక కోణాల్ని అద్భుతంగా అవిష్కరించిన ‘పాకుడురాళ్లు ‘నవలకు ఈ పురస్కారం దక్కింది.
‘పాకుడురాళ్ళు’ నవలలోని కొన్ని సంఘటనలు, సన్నివేశాలు, సామాన్య పాఠకునికి చాలా కొత్తగా కనిపిస్తాయి. వాటిని అభివ్యక్తం చేయడంలో రచయిత ప్రదర్శించిన చొరవ, తెగువ అభినందనీయమైనవి. ’దారుణా ఖండల శస్త్రతుల్యము’ లైన వాక్యాలతో శ్రీ భరద్వాజ ఆయా ఘట్టాలను చిత్రించిన విధానం అపూర్వంగా ఉన్నది. తను చెప్పదలచుకున్నదేదో బలంగా చెప్పగల బహుకొద్దిమంది రచయితలలో భరద్వాజ వొకరు. ఆయన విమర్శ, వ్యక్తిగతంగా ఉండదు. ఆ వ్యక్తుల తాలూకు సమాజమూ, అందులోని వాతావరణమూ, ఆయన విమర్శకు గురి అవుతాయి.
అట్టడుగునుండి జీవితం ప్రారంభించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రతిభాశాలిని మంజరి. నీగ్రో బానిసగా జన్మించి, అమెరికా చరిత్రనే మార్చివేసిన ‘జార్జి వాషింగ్‌టన్ కార్వర్’, మామూలు కార్మికుడుగా బ్రతుకు ప్రారంభించి, కార్ల సామ్రాజ్యాధిపతిగా పేరు సంపాదించిన ’వాల్టన్ పెర్సీ క్రిజ్లర్’, మట్టిలో పుట్టి, మణిమందిరాలలో నివసించిన ’మార్లిన్ మాన్రో’- వీరందరూ అనుసరించిన మార్గాలనే మంజరికూడా అవలంబించి తమ ధ్యేయాన్ని సాధించుకోవడానికి నిరంతర కృషి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమూ, వారి విజయాలకు కారణాలు. మంజరికూడా ఈ రెండు సూత్రాలనూ అక్షరాలా పాటించింది. గుంటూరు గుడిసెల్లో తిరిగి, బొంబాయిలోని చలువరాతి మందిరం చేరిన ఈ మధ్య కాలంలో- మనకొక విచిత్రమైన చలనచిత్ర ప్రపంచాన్ని చూపించింది.
సినిమారంగం ఆధారంగా, తెలుగులో చాలా చిన్న కథలొచ్చాయి గానీ, పెద్ద నవలారూపంలో రావడం మాత్రం ఇదే ప్రథమం.
……. ఆలపాటి వెంకట్రామయ్య
మద్రాసులో ముడున్నరేళ్ళు ‘చిత్రసీమ’ సినిమా పత్రికలో పనిచేస్తూ సినిమా తారల భేటీలెన్నో దిద్దాను. రిపోర్టర్లతో ఉన్న సాహిత్యంతో వారి ద్వారా తెలుసుకున్న వివరాలు నేను స్వయంగా తెలుసుకున్నవి గుదిగుచ్చి ఒక కధ రాశాను. మంచి స్పందన రావడంతో ‘మాయాజలతారు’ నవలను రాశాను. దీనికే పాకుడు రాళ్లు పేరు మార్చారు శీలా వీర్రాజు. నాకు ఇష్టమైన నవల ఇది. రాజకీయం,సినిమా మహా సముద్రం లాంటివి. ఎంతరాసిన తక్కువే.
…… రావూరి భరద్వాజ
Maha Prasthanam – మహా ప్రస్థానం
”మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగ వెళ్ళిపోయే అరచుకుంటు వెళ్ళిపోయే జగన్నాధుని రథచక్రాల్, భూ మార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను ….” అని ప్రకటించినవాడు శ్రీశ్రీ. ఓ వ్యధావశిస్టులారా ! ఏడవకండి, ఏడవకండి, వస్తున్నాయొస్తున్నాయి, జగన్నాధుని రథచక్రాల్ వస్తున్నాయని ఆశ్వాసమందించినవాడు శ్రీశ్రీ. 40 కవితలతో వెలువడిన ‘మహాప్రస్థానం’ తెలుగు సాహిత్యంలో ఓ మైలు రాయి. ఓ మలుపు. ఓ డైనమేటు. ఇప్పటికి 26 ముద్రణలు పూర్తి చేసుకోవటమే దీని విశేష ఆదరణకు నిదర్శనం. 98 పుటల ఈ పేపర్‌బ్యాక్ పుస్తకానికి ‘మా గోఖలే’ కవర్ డిజైన్ అందించారు.
Kovvali Navalalu Konni
₹280.00సామాన్య జనాన్ని రంజింప చేసిన 1000 నవలలను రూపొందించిన ప్రముఖ రచయిత, కర్మయోగి, నిరాడంబరుడు, సాహితీ తపస్వి శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1912లో పశ్చమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి కాంతమ్మ, తండ్రి ప్లీడరు గుమాస్తా వృతిని అవలంబించి రాజమహేంద్రవరానికి నివాసం మార్చుకున్నందున లక్ష్మీనరసింహారావుకు కూడా అదే స్వస్థలం అయింది. తల్లి చిన్నప్పుడే గతించడంవల్ల తండ్రే తక్కిన సోదరులతో పాటుగా ఆయనను పెంచి పోషించారు. 14 సంవత్సరాలు నిండేసరికి స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు. స్థానిక గ్రంధాలయంలోని పుస్తకాలన్నింటినీ చదివారు. కొంతకాలం దేశ సంచారం చేశారు.
ఆనాటి సామాజిక, సాహిత్య పరిస్థితులను తీసుకొని శృంగారము, ప్రేమ మొదలగు వానిని జోడించి వ్యావహారిక భాషలో 2, 3 గంటల్లో చదవడానికి అనువైన నవలలను ముఖ్యంగా ‘కాలక్షేపపు నవలలు’ 1000 రాసి ‘వేయి నవలల కొవ్వలి’ అయ్యారు.
కొవ్వలి రచనలలో పైకి ప్రేమ, శృంగారం ఎక్కువగా కనబడినా సాంఘిక దురాచారాల నిర్మూలన, వితంతు వివాహోద్యమం, బాల్య వివాహ నిరసన, వృద్ధ వివాహాల అవహేళన, స్త్త్రి విద్య, కులమత విభేద నిర్మూలన ఇతివృత్తాలుగా వుండి సముచిత ఆదరణ పొందగలిగాయి. అంతేకాక అందరినీ ఆకట్టుకునే రీతిలో రసవత్తరంగా ముఖ్యంగా మధ్య తరగతి స్త్రీలకు ఆమోదకరంగా తన రచనలను రూపొందించారు. ఆ రోజుల్లో (1940 లలో) ఆంద్ర సాహిత్య చదువరులకు చలువ పందిళ్లు కప్పించిన మహా రచయిత శ్రీ కొవ్వలి.
1940లలో శ్రీ కొవ్వలి పేరు ఊరూరా, వాడవాడలా చదువరులున్న ప్రతి ఇంటా జపించబడింది. ఆబాలగోపాలాన్ని ఆనంద డోలికల్లో ముంచి తేల్చింది.
యావత్ ప్రపంచంలోనూ 1000 నవలలు రచించిన ఖ్యాతి శ్రీ కొవ్వలికే దక్కింది.ఆయన రచనలను ఆదరించినంతగా ఆనాడు మరొకరి నవలలను ప్రజలు ఆదరించలేదు. చదువులను ఎగ్గొట్టి వారి నవలలు విస్తారంగా చదివిన ఆనాటి పసివాళ్ళల్లో ఈనాటి పెద్దలెందరో ఉన్నారు.
కొవ్వలికి మద్రాసు, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలు మాన్యతా పత్రాలు (సర్టిఫికెట్స్ ఆఫ్ ఆనర్ ) ఇచ్చి గౌరవించింది.భారత ప్రభుత్వ విద్యాశాఖ కూడా వీరిని సముచితంగా గౌరవించింది.
“తెలుగు నవలా రచనా పధశోధకులు
తెలుగు ప్రజల పట్టనాభిలాష పోషకులు
వెయ్యి నవలలు వేవేగ వ్రాయసములు” ఐన
శ్రీ కొవ్వలి 1975 జూన్ 8న మహాప్రస్థానమొందారు.
– కొవ్వలి లక్ష్మీనరసింహారావు
Gorky Kathalu
₹60.00గోర్కీ దృష్టిలో సర్వప్రపంచమంటే మానవ సంబంధాల ప్రపంచం. మనిషితనం నిండుకున్న ప్రపంచం. మానవీయ శక్తుల్ని అడ్డుకునే ప్రతిశక్తుల మీద విజయం సాధించగలిగే అచ్చమైన మానవుల ప్రపంచం. పరస్పర అవగాహనకు అడ్డు తగిలే వాటిని, వివిధ జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, అలముకునే కుసంస్కారాన్నీ తెగగొట్టగల ప్రపంచం. మొరట పితృస్వామిక భావాలకూ, పైపై నాగరిక పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తులున్న వాళ్ళ ప్రపంచం, సంప్రదాయక నీతి స్థానంలో అపేక్షలను పెంచే ప్రపంచం. సమాజంతో సంబంధాలు లేని వాళ్ళ బతుకుల్ని ఈసడించుకునే ప్రపంచం, బాధలూ, భయాలూ, కరువులూ, కాటకాలు లేని ప్రపంచం. ఈ ప్రపంచాన్ని చాటేవే ఈ సంపుటిలోని కథలు కూడా.
– మాక్సిం గోర్కీ
Manishi Lopali Mahasamudralu
₹80.00నా చిన్న మాట….
పదిహేడేళ్ళ అమ్మాయి తన ప్రాణాన్ని థానే తీసేసుకుంది. కలకలం రేపింది. చిన్నాపెద్దా “అయ్యో” అన్నారు. గాలి కూడా సానుభూతి చూపింది. ఆకాశం కన్నీళ్ళు కార్చింది. “జీవితాన్ని ఎం చూసిందని” అన్నారు. నిజమే! కలలకు చోటులేని ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. “అంత బరువెం మౌసిందని” అన్నారు మరికొందరు. పరీక్షలో ఫెయిలవడం కూడా ఒక కారణమేనా అన్నారు. ఏమో! ఎం తెలుసు. ఆ పరీక్ష చుట్టూ ఎన్ని కలల సాలిగూళ్లు అల్లుకున్నాయో. సమాజం తనకై నిర్మించిన ఎన్ని సౌధాలను ఆ వైఫల్యం కూల్చివేసిందో. మొత్తనికి ఆ ఘటన నన్ను కుదిపేసింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-కిల్లాడ సత్యనారాయణ.
Manishi Roopalu – మనిషి రూపాలు
₹280.00కొండప్రాంతాలలో నివసించే ఒక వితంతు యువతి కథ ఇది. ఇందులో మనిషి యొక్క అనేక రూపాలను ఎంతో నైపుణ్యంతో చిత్రించాడు రచయిత. మన సంఘంలో ప్రబలివున్న వైరుధ్యాలనూ, తారతమ్యాలనూ వేలెత్తి చూపించాడు. మనిషి పరిస్థితులకు కేవలం బానిస అనీ, పరిస్థితులే అతని జీవితాన్ని నడిపిస్తాయనీ నమ్ముతాడు రచయిత.
యశ్‌పాల్ విప్లవవాది. అతను తన జీవితంలో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. అతని రచనల్లో సాంఘిక, రాజకీయ భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. నిరుపేదలపై జరుగుతున్న దౌర్జన్యాన్ని ఎదుర్కొనేందుకు, సాంఘిక చైతన్యం కలగజేసేందుకు అతను తన కలాన్ని శక్తివంతంగా ఉపయోగించారు.
పేజీలు : 314
Matruthvam
₹200.00డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి వైద్య సాహిత్య రంగాలలో సుప్రసిద్ధులు. గైనకాలజీ మరియు ఆబెట్రిక్స్ నిపుణులైన వీరు కాకినాడలో “విజయలక్ష్మి నర్సింగ్ హోమ్” ప్రారంభించి గత 38 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్నారు. వైద్య రంగంలోనే కాక, సాహిత్య రంగంలో కూడా ప్రసిద్ధి గాంచిన వీరి రచనలు – “మీరు ప్రేమించలేరు”, “మాకీ భర్త వద్దు”, “పేషంట్ చెప్పే కధలు”, “జ్వలిత” – కధానికా సంపుటాలు : ‘సజీవ స్వప్నాలు’, ‘చైతన్య దీపాలూ’, ‘ప్రత్యూష పవనం’, ‘వెలుతురు పువ్వులు’ – నవలలు : ‘మన దేహం కధ’, ‘కౌమార బాలికల ఆరోగ్యం’ – వైద్య పరిజ్ఞానానికి సంబంధించిన రచనలు : ‘వైద్యడు లేని చోట’, ‘మనకు డాక్టరు లేని చోట’, ‘రక్తం కధ’ – అనువాదాలు ఉన్నాయి.
‘డా. ఆలూరి విజయలక్ష్మి రచనలు’ అను అంశంపై నాగార్జున యూనివర్సిటీ తెలుగు విభాగం విద్యార్ధిని పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎమ్.ఫిల్. డిగ్రీ పొందారు.
డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి అనేక సుప్రసిద్ధ సాహితీ సంస్థల నుండి, సామాజిక సంస్థలనుండి ఎన్నో సాహితీ పురస్కారాల్ని, సామాజిక సేవా పురస్కారాల్ని పొందారు.
తెలుగు పాఠకులకు డాక్టర్ విజయలక్ష్మిగారు ఇచ్చిన మరో వినూత్న కానుక – ‘మాతృత్వం : ప్రసూతి సమస్యలు – సలహాలు’. ఈ పుస్తకం గతంలో అశేష పాఠకుల ఆదరణపొంది పలు ముద్రణలు పొందింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మరెన్నో మార్పులు, చేర్పులతో కూడిన పరిస్కృత ముద్రణ.
– ఆలూరి విజయలక్ష్మి
Navala Prajalu – నవల ప్రజలు
₹100.00మానవజాతి చరిత్రలో ఎన్నో కొత్తకళలు (ఉదాహరణకు సినిమా) పుట్టాయి. కానీ ఇంతవరకూ ఏ కళకూడా పూర్తిగా నశించిపోలేదు. తన చైతన్యాన్నీ వాస్తవిక ప్రపంచంపట్ల తన సంవేదననూ అభివృద్ధి చేసే ఏ అంశాన్ని కూడా మానవుడు జారవిడుచుకోడు. నవల కొత్తకళేకావచ్చు. కానీ దాని వేళ్ళు సూదూరగతంలో ఉన్నాయి. ప్రాచీనగ్రంథాలైన ”టిమాల్కియోస్ బాంక్వెట్,” ”డాఫ్నీ అండ్ ఓలీ” వద్దనో, మరింత వెనక్కువెళ్ళితే సుప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్ (క్రీ.పూ.5వ శతాబ్దం) వద్దనో నవల చరిత్ర ప్రారంభమౌతుంది. కానీ స్వతంత్ర ఆధునిక సాహిత్య ప్రక్రియగా నవల మన నాగరికతకు సంబంధించింది మాత్రమే. సొంత నిర్మాణ సూత్రాలను కలిగి, అందరిమెప్పునూ, ఆమోదాన్ని పొందిన సాహిత్య ప్రక్రియ అయిన నవల మన నాగరికతకు – మరీ ముఖ్యంగా ముద్రణా యంత్రయుగానికి చెందిన వస్తువే.
సాహిత్యంలో కొద్దిభాగం మాత్రమే వాస్తవికత. ఈ సూత్రం నాటకానికి కూడా వర్తిస్తుంది. అంతమాత్రంచేత కళగా నాటకానికున్న ప్రత్యేక గాంభీర్యాన్ని కాదంటున్నామని భావించకూడదు. నవల కేవలం కల్పనాత్మకమైన వచనం మాత్రమేకాదు. అది మానవ జీవితానికి సంబంధించిన వచనం. మానవుణ్ణి మొత్తంగా తన పరిధిలోకి తీసుకొని, అతణ్ణి సంపూర్ణంగా చిత్రించటానికి ప్రయత్నించిన మొట్టమొదటి కళారూపం నవల. మానవుడి రహస్య జీవితాన్ని దృశ్యమానం చేయగలిగిన శక్తి నవలకు ఉంది…..
Noone Sukka Inkinni Kathalu – నూనె సుక్క ఇంకిన్ని కథలు
₹120.00సమూహంలోంచి వెలివేయబడితే అది ఒంటరితనం. ఆ సమూహాన్నే వెలివేస్తే అది ఏకాంతం. ఒంటరితనం భయపెడుతుంది, ఏకాంతం పునరుజ్జీవింపచేస్తుంది. – ఒంటరి ఏకాంతం
జిందగీ అంటేనే ఊర్లు, పట్నాలల్ల బత్కేటివన్ని పానమున్న పీనిగెలు. పానంతోటి బత్కాలంటే ఊర్లల్లనే బత్కాలె. – రెండో ఉత్తరం
మాత కైకేయి కోరిక అయోధ్యావాసుల పాలిట దు:ఖహేతువైనది, అదే మా పాలిట వరమైనది. – కాకి రామం
మనం అడిగినవన్నీ ఇచ్చేవాడే దేవుడు అయితే, మరి మనకు కావలసినవన్నీ మనం అడగకుండానే, మనల్ని అడగకుండానే ఇచ్చే ఈ ప్రకృతిని ఏమనాలి? దేవుడే ప్రకృతి-ప్రకృతే దేవుడు. – 3456 జిబి
”ఆడపుట్క’ పుట్టుంటే సల్లగ బతుకుతుంటివి కొడకా,” అన్నది అమ్మ – బలిపసువు
పేజీలు : 143
Okka Vana Chalu
₹110.00ఈ నవల రాయటంలో రెండు ఉద్దేశ్యాలున్నాయి. రాయలసీమ రైతు, రైతు కూలీల బతుకులు ఇప్పుడు వలస బతుకులయ్యాయని చెప్పటం ఒకటైతే. రెండవ విషయం ఏమిటంటే – ఎన్ని కష్టాలు వెంటాడుతూ వున్నా ఏడుస్తూ కూచోవటం ఇక్కడి మనుషుల లక్షణం కాదు. ఎంత ఆకలేసినా చేతులు చాచి అడుక్కోవటం ఇక్కడి రైతులకు అలవాటు లేదు. నిరంతరం బతికేందుకే పోరాడుతుంటారు. బండరాతి మీద అయినా సరే పిడికెడు అన్నం పుట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు.
చెతుర్లాడుకోవటంలో ఆకలిని మరుస్తారు. బూతు పదాలు కలిసిన మాటలతో హాస్య సంఘటనలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కష్టాలు మరవటానికి ప్రయత్నిస్తారు. సద్ది సేరవలో పుల్లనీళ్ళ మీద తేలే పచ్చిమిరపకాయ మీద కూడా జోకులేసుకుంటూ దుర్భరమైన ఆ తిండినే కడుపారా తిని పనికి పోగలరు. బీడీకట్టకు లెక్కలేనంత దరిద్రంలో ఉందికూడా ఒకే బీడీని నలుగురు పంచుకు తాగుతూ తమ దరిద్రం మీద తామే జోకులేసుకోగలరు. ఇక్కడి రైతు కరువుకు అలవాటు పడ్డాడు – ఆకలికి లాగే నాయకుల వాగ్దానాలకు అలవాటు పడ్డాడు – వట్టి మేఘాల ఉరుములకు లాగే.
– సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి