Showing 565–576 of 835 resultsSorted by latest

Ammaki Adivaram Leda – అమ్మకి ఆదివారం లేదా

180.00

అమ్మ’కి ఆదివారం లేదా? – రంగనాయకమ్మ (50 కథల సంపుటి)

ఇందులో యాభై కథలు ఉన్నాయి. ఈ సంపుటి ‘అమ్మ’కి ఆదివారం లేదా? అన్న టైటిల్‌తో వెలువడింది. గృహిణులు ఇంటి పనులకీ వంట పనులకీ వారంలో ఒకరోజు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకునేందుకు వీలు కల్పించాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యురాలు సరోజ్‌ కపర్దే లోగడ ఒక బిల్లును ప్రతిపాదించారు. ఇల్లాళ్లకు వారానికి ఒకనాడైనా విశ్రాంతి అవసరమన్నది సదరు బిల్లు ఉద్దేశ్యం. అయితే రంగనాయకమ్మగారి వాదన అందుకు భిన్నం. ఈ బిల్లుకు సంబంధించిన వార్తని చూశాక ఆమె ‘అమ్మకి ఆదివారం లేదా? అన్న కథ రాశారు. ఒకరోజు సెలవుతోనే అంతా చక్కబడిపోయి సమస్యలు తీరుతాయా? అని ఆమె ప్రశ్నిస్తారు.
”ఆడా మగా సమానం అవ్వాలంటే సరైన ఏకైక సూత్రం ఏమిటో తెలుసా? ఇద్దరికీ బైటిపనీ, ఇద్దరికీ – ఇంటిపనీ! అదీ సూత్రం. బైటిపనికే సెలవులు వుంటాయి. అవి ఇద్దరికీ వుంటాయి. ఇంటిపనికి సెలవులుండవు” – అంటూ వేణు పాత్ర ద్వారా చెబుతారు రంగనాయకమ్మ గారు. ఇక చిన్నపిల్లల్ని ముసలివాళ్లకి యిచ్చి పెళ్లిళ్లు చేయటాన్ని నిరసిస్తూ రాసిన కథ ‘సంస్కరణ’. ‘డబ్బు’ కథ కట్నం సమస్యని చర్చిస్తుంది. ”కట్నం సమస్యలాగా కనబడే సమస్యంతా ఆస్తి  సమస్యే”నంటుంది ఇందులో ఒక పాత్ర. ఇక సంకలనం మొత్తంలోకీ ఎన్నదగినదీ, చెప్పుకోదగినదీ అయిన కథ ‘కుట్ర’. భారతదేశంలో ఇంకా విప్లవం రాకపోవడానికి ఏకైక కారణం అర్థంకాని విప్లవకారుల తెలుగు రాతలేనని తీర్మానించి వారికి జడ్జిగారు పదేసేళ్ళు జైలుశిక్షలు వేసే కథ ఇది.
పెళ్లి చేసేశాం, కథా – జీవితం, మీటింగ్‌ పెళ్ళి, స్త్రీ, ఆర్తనాదం, ఆ రాత్రి, వానరాత్రి, అమ్మ, తల్లిమనసు, తృప్తి, క్షమ, దొంగ వొస్తే బాగుణ్ణు!, సుబ్బారావు ప్రేమకథ, ఆశ్చర్యం!, లంచం, బడిమానేశావేం? (చిన్న పిల్లల నాటిక), పార్వతమ్మ, కవిగారూ – కుర్రాళ్ళూ లాంటి మంచి కథలు ఈ సంపుటిలో వున్నాయి.
రాయల్‌ సైజు బాండ్‌.

Andamaina Jeevitam – అందమైన జీవితం

220.00

సృష్టిలోని అలౌకికమైన తీయదనాలలో ముఖ్యమైంది స్నేహం. దానిని అనుభవించ గలిగినవారికే దాని ప్రాముఖ్యత అర్ధమవుతుంది.

అది ఇద్దరు మగవాళ్ళ మధ్య కావచ్చు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కావచ్చు. లేక అరుదుగా ఓ మగ, ఓ ఆడ మధ్య కావచ్చు. అంతేకాదు వివాహితులైన ఆడ, మగ మధ్య కూడా కావచ్చు. స్నేహం విషయంలో వాళ్ళు ఆడ, మగ అవడం యాదృచ్ఛికం అవుతుంది.

శృంగారపరమయిన భావాలకి లోను కాకుండా స్నేహం చేయగలగడం ఆడ, మగలకి సాధ్యం కాదా ? ఆ స్నేహంలోని మాధుర్యాన్ని నిష్కల్మషంగా చవి చూడగలగడం అనుభవం లోకిరాకూడదా ?

పై బెర్త్‌లోంచి వినపడుతున్న భర్త గురక. రైలు ఏదో స్టేషనులో ఆగింది. బయట ఆరి వెలుగుతూ ఎగిరే మిణుగురు పురుగులు. శాంతి చేతిని బయటి పెట్టి ఎగురుతున్న మిణుగురు పురుగులను పట్టుకుని తన జుట్టు మీద ఉంచుకోసాగింది. చిన్నప్పుడు రాత్రిళ్ళు దొడ్లొకి వెళ్ళి మిణుగురు పురుగులని గ్లాసులో పట్టుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది శాంతికి.

సిగ్నల్‌ ఇవ్వడంతో రైలు మళ్ళీ బయలుదేరింది. శాంతి తన పెట్టె అందులోంచి తనడైరీ తీసి, అందులోంచి రెండు తెల్లకాగితాలని తీసి ఓ ఉత్తరం రాయడం మొదలుపెట్టింది.

‘డియర్‌ ప్రియతమ్‌,

మీరు ఉత్తరం రాసి నాకు మీ చిరునామా తెలియగానే దానికి జవాబు రాయబోయే ముందు ఈలెటర్‌ మీకు పోస్ట్‌ చేస్తాను……..

తన భర్త ‘ఇంక పడుకోరాదు’ అని పై బెర్త్‌లోంచి అరిచేదాకా శాంతి కిటికీకి ఆనుకుని కూర్చుని, కిటికిలోంచి పడే వెన్నెల వెలుగులో ప్రియతమ్‌కి తన మొదటి ఉత్తరం రాస్తూనే ఉంది – అంటూ ముగించారు శ్రీమల్లాది వెంకట కృష్ణమూర్తి గారు తమ అందమైన జీవితం నవలని.

స్త్రీ పురుషుల మధ్య సెక్స్‌కి దారితీయని సుగంధ స్నేహసుధ సాధ్యమని నిరూపించే నవల ‘అందమైన జీవితం’.

Amaravathi Kathalu – అమరావతి కథలు

300.00

Amaravathi Kathalu – అమరావతి కథలు

గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి నెల మూడవ తేదీన శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెద్దపున్నమ్మ గారలు సత్యంను పెంచీ పెద్ద చేశారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్నమూర్తి, పూర్ణానంద శాస్త్రి గార్లు ప్రోత్సహించారు.

‘అమరావతి కథలు’ వ్రాసినా, ‘కార్తీక దీపాలు’ వెలిగించినా నిజమైన న్యాయవాదమే మౌలికమైన సూత్రం ఆయనకు. పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది.

‘అమరావతి కథల’కు 1979వ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినది. శ్యామ్‌బెనెగల్‌ దర్శకత్వంలో అమరావతి కథలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి.

Aharam Manchi- Chedu

100.00

 నిత్య జీవితావసరాల కోసం రోజూ ఎంతో శ్రమిస్తూ మనం సంపాదించుకున్న విలువైన డబ్బును వెచ్చించి పౌష్టికాహారం  పేరుతో విషాన్ని తినాల్సి/ తాగాల్సి రావడం ఈ శతాబ్దపు గొప్ప విషాదం. ఏ ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుందో మనకు చెప్పాల్సిన బాధ్యతలున్న ప్రభుత్వ, ప్రజారోగ్య, వైద్య పత్రికా వ్యవస్థలన్నీ కేవలం తమ స్వార్ధం  కోసం ఆహార రంగంలోని బహుళ జాతి కంపెనీల ప్రలోభాలకు లొంగి తినకూడనిది తినమని ప్రచారం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయి. వీరందరూ కలిసి శాస్త్రీయత మాటున అశాస్త్రీయతను ప్రచారం చేస్తున్న ఫలితంగా సామాన్యులు రోగగ్రస్తం అవుతున్నారు. లాభార్జనే ధ్యేయంగా  నడుస్తున్న వైద్య , ఆరోగ్య శాఖలూ/వ్యక్తులూ/ప్రజల రోగాలను, మరణాలను కూడా సొమ్ము చేసుకునే ఒక క్రూరమైన వ్వవస్థను ఆవిష్కరించారు.

Agrarajyangaaa Bharathadesam

350.00

మన దేశ రాజకీయ , ఆర్ధిక సమస్యల మీద సమగ్ర అవగాహన కావాలనుకునే వారికి ఒక రిఫరెన్స్ గా పనికివస్తుంది .

                                                                                                     -జె.డి.శీలం.

మన దేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలబడడానికి కావలసిన ఆలోచనల క్రోడీకరణ ఈ గ్రంధం.

                                                                                                     – పద్మశ్రీ ప్రో|| కొలకలూరి ఇనాక్.

Agni Pareeksha – అగ్ని పరీక్ష

70.00

ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడిదినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి. మా సంస్థ 50 సంవత్సరాలలోకి అడుగుపెట్టిన తరుణంలో వుత్తమ విలువలను ప్రోది చేసిన మాదిరెడ్డి నవలలను పునర్ముద్రించడం మాకెంతో ఆనందంగా వుంది. – నవోదయ పబ్లిషర్స్‌,

Pages : 211

Aagamanam – ఆగమనం

70.00

మరింత శ్రద్దగా వింటే ఆ మూలుగు మూసివున్న ఆ గది తలుపుల వెనుక నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. అద్దాల తలుపుల వెనుక కర్టేన్స్ వున్నాయి.
లోపల ప్రసన్న కుర్చీని కట్టేసి వున్నాడు. చేతులు – పెడరెక్కలు విరిచి కట్టేసి వున్నాయి. నోటికి గుడ్డ బిగించి వుంది. ఆ మూలుగు వస్తున్నది అతని దగ్గి నుంచే అతడు కట్లు విదిపిమ్చ్కోవటానికి పెనుగులాడుతున్నాడు…
జమున గబ గబా గది తలుపులు తెరిచింది.
ప్రసన్నా ! ప్రసన్నా ! అంటూ పరుగెత్తుకెళ్ళి అతడి చేతులకి కట్టిన కట్లు విప్పింది. అతని నోటికి కట్టేసిన బట్ట లాగేసింది.
నేను రాకపోతే ఎంత ప్రమాదం జరిఎది ? ఆ పని కుర్రాడు, ఆ రాస్కెల్ – ఆవేశంగా అంటోంది.
కట్లు ఊడిపోగానే ప్రసన్న కుర్చీలో నుంచి లేచాడు. అతని శరీరం నిటారుగా అయింది.జమునని చూడగానే అతడు పళ్ళు బిగించాడు. అతని చేతులు వచ్చి జమున భుజాల్ని గట్టిగా పట్టుకున్నాయి….
ప్రసన్న గతం అతణ్ణి వెన్నాడింది. ఇష్టపడి చేసుకున్న శోభ తన అనైతిక ప్రవర్తనతో ప్రసన్నకు మనశాంతి లేకుండా చేసింది. అయితే జమున అతడికి చేరువ అవుతుంది. ఆమె అందరిలాంటిది కాదు ఆమె వ్యక్తిత్వం ప్రసన్నను  ఆకర్షిం చింది .
కొందరి ఆగమనం ఆనంద శిఖరాలకి చేరిస్తే, మరికొందరి ఆగమనం పతనపు లోయలలోకి తోసేస్తుంది. జమున ఆగమనం ప్రసన్న జీవితాన్ని ఏ మలుపు తిప్పింది? యద్దనపూడి సులోచనా రాణి అధ్బుత పరిశీలనాత్మక నవల.

Adhikarulu Asrita Janulu – అధికారులు ఆశ్రితజనులు

100.00

తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

అధికారులు ఆశ్రితజనులు

బ్రతక నేర్చిన వాడికి యీ లోకం పచ్చల పల్లకి. నోట్లో నాలుకలేని వాడికి యిదే లోకం గచ్చపొదలా కనిపిస్తుంది. నాగరాజుకు మేడలు, మిద్దెలు లేవు కాని, మేడలు, మిద్దెలు గల మోతుబరులతో పరిచయం వుంది.

నాగరాజుకి ఏ అధికారమూ లేదు, కాని అధికారులందరినీ అతను తన యింటికి ఆహ్వానిస్తాడు. కలెక్టర్లు మొదలుకుని, సాధారణ అధికారులవరకూ అతని చమత్కారాలకీ, చాకచక్యాలకీ లొంగని వారుండరు.

అధికారుల్ని అయిన విధానా, కాని విధానా, ఆశ్రయించి – తన యింట్లో చిల్లిగవ్వ లేకపోయినా, వారి హోదాలనే, అంగళ్ళలో ధనంగా పణం పెట్టి, తను కుహనా పరువు ప్రతిష్ఠలను మెట్టుమెట్టుగా పెంచుకో గలిగిన నాగరాజు వంటి పరాన్నభుక్కులు, నిత్యం ఏదో రూపంలో మీ చుట్టూ తిరుగుతూనే వుంటారు.

నాగరాజుల స్వభావాలలాగే, రోజులన్నీ ఇటువంటి వారి పాలిట ఒక్కలాగ వుండవు. జీవిత నాగుపాము కుచ్చిత అనుభవాల విషం కక్కినపుడు ఎంతమూలగా నక్కి వందామనుకున్నా, వారి బ్రతుకులు వికృతరూపాలలో బయటపడక తప్పదు.

అప్పుడు – వారి వ్యక్తిత్వాలలో, బ్రతుకు తెరువులో, బూలతనం మీయెదుట నిలుస్తుంది.

ఈ నాగరాజు లాంటివారే మీ దృష్టికి తగలకపోవచ్చు. కాని సంఘంలో ఇటువంటి వ్యక్తుల కార్యకలాపాల స్వభావం యీ నవల విప్పి చెపుతుంది. తస్మాత్‌ జాగ్రత్త!

పేజీలు : 251

Addala Meda – అద్దాల మేడ

80.00

ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

అద్దాల మేడ

”పద్మినీ… పద్మినీ…” ఎవరో తలుపులు బాదుతున్నారు. ఒళ్ళు విరుచుకుని లేచింది పద్మిని. గడియారం వంక చూచింది. అయిదు కావస్తూంది. పనిమనిషైనా టీ తెచ్చి లేపలేదు.

”పద్మినీ! అబ్బ కాలింగ్‌ బెల్‌ పెట్టించవమ్మా అంటే వినదుకదా.” బయట గొణుగుడు వినిపించింది. త్వరగా వెళ్ళి తలుపులు తీసింది. నిండుగా వేడిదుస్తులు వేసుకున్న స్త్రీతోపాటు చల్లని ఈదరగాలి లోపలికి వచ్చింది. వెంటనే తులుపులు మూసింది పద్మిని.

”మీరా కోమలగారూ! మీవారేరీ?”

”రామేశ్వరము వెళ్ళినా శనేశ్వరము తప్పదని, సముద్రాలు దాటివచ్చినా పేకాటరాయుళ్ళకు కరువులేదు. ఈ రోజు శనివారము బడి లేదుగా పారాయణము జరుగుతూంది. నువ్వు వస్తే అలా పోస్టాఫీసువైపు వెళ్ళి ఉత్తరాలు వచ్చాయేమో చూద్దామని వచ్చాను.”

”నేను పడుకోందే పిల్లలు పడుకోరని, అలా నడుము వాల్చాను. నిదుర పట్టేసింది. కూర్చోండి. ఆంచీ! (అమ్మాయీ)” అని పిలిచింది. ఓ పదహారేళ్ళ కన్య చక్కని సిల్కు పువ్వుల గౌను వేసుకుని, కాల్ళకు బోటు ఆకారములో నున్న బూట్లు ధరించి తలకు చుక్కల బట్ట కట్టుకుని వచ్చింది.

”తరాల్లే మెహెతే! (పిలిచారా అమ్మగారూ?)”

”ఉలత్‌యినా ఆంచి. (రెండు కాఫీలు తే)” అన్నది. అమ్మాయి వెళ్ళిపోయింది…..

పేజీలు : 187

Abhinetri – అభినేత్రి

70.00

ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

అభినేత్రి

”రాజేశ్వరీ ఆర్ట్స్‌” నాట్యమండలి వారు నిర్వహించే నాటకం చూడటానికి జనం తండోప తండాలుగా రాకపోయినా నాట్యమండలి నడవడానికి డబ్బు వస్తుంది.

దాని మేనేజర్‌ సభాపతి బయటికి వచ్చి ఒకసారి ఆదుర్దాగా జనాన్ని చూసి వెళ్ళబోయాడు. పరుగెత్తుకుంటూ వచ్చే తబలిస్టు సాయినాథ్‌ కనిపించాడు.

”రాణి బస్సుస్టాండులో లేదు గురూ!” ఒగరుస్తూ చెప్పాడు.

సభాపతికి ముచ్చెమటలు పోశాయి. ”కనకతార” ఆడతామని టిక్కట్లు అమ్మారు. మధ్యాహ్నం కథానాయికగా వేసే అమ్మాయి రాణి సభాపతితో పోట్లాడింది. అంతమాత్రానికే చెప్పకుండా పోతుందనుకోలేదు.

”ఇప్పుడెలా?”

”పోనీ, దమయంతిని వేషం వెయ్యమనండి.”

”నీకు బుర్రుందా సాయీ! ”కనకతార” కథ కోసం వస్తారటోయ్‌ జనం. ఆ రాణిది పిటపిటలాడే వయసు, మత్తెకించే అందం, దానికోసం వస్తారు.”

”పోనీ, అనివార్యకారణాల వల్ల నాటకం వెయ్యటం లేదని ప్రకటిద్దాం.”

”ఈ నాటకాల కోసం బంగారం లాంటి పొలం, మేడ అమ్మాను.  ఇక కాళ్ళు చేతులే మిగిలాయి. అవి విరగకొట్టుకోమంటావా?”

”మరేం చేద్దాం? అరగంటే వుంది సమయం.”

ఇద్దరూ ఆలోచనలో పడిపోయారు. సభాపతి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తలపంకించాడు….

పేజీలు :159

Aasayala Aakharimettu – ఆశయాల ఆఖరిమెట్టు

70.00

తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

ఆశయాల ఆఖరిమెట్టు

మనిషి ఆశాజీవి!

అడుగు అడుగుకీ ఓటమివున్నా – అడుగడుగునా ఆశని వెతుక్కోడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడో దూరాన తళుక్కుమని మెరిసే లక్ష్యాన్ని చేరుకోడానికి అతను ఆరాటపడుతున్నాడు. అతని లక్ష్యసిద్ధికి అనంత అవాంతరాలు.

అతని పేరు యాదగిరి. అందరూ గిరి అని పిలుస్తుంటారు. తక్కువకులంలో పుట్టడం అతని పాపం కాదు, కానీ, అతను కులమతాల ప్రసక్తిలో కొన్నేళ్ళు నలిగిపోయేడు. తక్కువ ఎక్కువలు కులాల్లో వుండవు. గుణాల్లో వుంటాయని అతని నమ్మిక. శ్రద్ధగా చదివేడు, తన లక్ష్యాన్ని డాక్టరై చేరుకున్నాడు. కానీ… ప్రేమలు పగలు, ఈర్ష్య అసూయలు, దగా మోసాలు, పచ్చి స్వార్థం అతని మీద విలయతాండవం చేసేయి. విసిగి పోయేడు. ఓడిపోయేడు. కట్టుకున్న భార్యనే హత్యచేసేడు.

అతని ఆశయాలకు ఆఖరిమెట్టు ఇదేనా?

మాదిరెడ్డి సులోచనగారు మీ ఆలోచనలకు వదిలిన విలువైన ప్రశ్న.

పేజీలు : 150