YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 553–564 of 835 resultsSorted by latest
Antam Chusina Asuya
₹80.00రచయిత గురించి
మాదిరెడ్డి సులోచన శంషాబాదు గ్రామంలో 1935 లో జన్మించారు. వీరిది సాంప్రదాయక వ్యవసాయక కుటుంబం. ఈమె ఎం.ఎ, ఎం.ఇడి చేసి 1971 వరకు సుమారు 10సంవత్సరాలు ఉపాధ్యాయినిగా పని చేశారు. భర్తతో బాటు ఇధియోపియా,జాంబియా దేశాలకు వెళ్లి అక్కడ కూడా ఉపాధ్యాయినిగా పనిచేసారు ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల రాసారు. ఈమె దాదాపు 150 కధలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాసారు. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కధా రచయిత్రి అవార్డులు పొందారు.
Annamalaiku Ardhamaindi Mari Manakemaindi?
₹70.00అరుణాచల శ్రీ రమణులు – అన్నామలైస్వామి గురుశిష్య సంబంధం విశిష్టమైనది. గురువు, శిష్యనకు నేర్పవలసింది నేర్పాడు. ఇక తనని అంటి పెట్టుకొని ఉండవద్దు అని పంపించి వేశాడు. పక్షికి రెక్కలొచ్చేంత వరకే తల్లి కాపాడుతుంది. పసి పిల్లవాడు తల్లి వొళ్లో ఆడుకోవడం కొంతకాలం వరకే. ఆ తర్వాత ప్రతి ఒక్కరు, ఎదగాలి. ముందుకు సాగాలి.
పదేళ్ల తర్వాత ఆశ్రమం బయటకి వచ్చిన అన్నామలై స్వామి , ఏకాంత జీవనం గడుపుతూ, తనకు తెలిసింది పదిమందికి భోదిస్తూ సుమారు ఎనభైతొమ్మిదేళ్లు బ్రతికాడు.
శ్రీ రమణులు అన్నామలైని అడుగడుగునా మలిచిన తీరు, సాధకులకు ముచ్చట గొల్పుతుంది. అన్నామలై స్థానంలో మనల్ని మనం ఊహించుకుంటే, ఈ ఆత్మ విద్యను ఎంత సుళువుగా నేర్వగలమో తెలుస్తుంది.
-నీలంరాజు లక్ష్మీప్రసాద్.
Andhrapradesh Dharmika Mariyu Hindumatha Samsthala Mariyu Dharmadaya Chattamu, 1987
₹270.00ధార్మిక, మత సంస్థలు తృప్తికరముగా నిర్వహింపబడక పోవుచుండుట వలనను, వాటి ఆస్తుల నిర్వహణకు ప్రస్తుత మత లౌకిక ఆచారములను సంతృప్తిగా పాటింపబడుటకు, ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయముల చట్టము, 1966లోను, తిరుమల తిరుపతి దేవస్థానముల చట్టము, 1979లో నున్న నిబంధనలు అందుకు సరిపోవునంత మేరకు లేకపోవుటవలన, ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానములతో సహా అన్ని సంస్థల ధర్మాదాయముల ఆస్తులను సమర్ధవంతముగా నిర్వహింపబడుటకు, నిధులను అర్ధవంతముగా వినియోగింప బడుటకు, ట్రస్టీలు తమకు వంశపారంపర్యానున్న ఆధారముతో చేయుచున్న క్లెయింలను, ట్రస్టీల ఎంపికకు వారి నియామకమునకు మరియు, వారు ప్రవర్తనా నియమావళిలో పాటించవలసిన విధానములను, దేవాలయములలో వంశపారంపర్యానున్న అర్చకుల మిరాసీదారుల మరియు యితర అధికార సిబ్బంది పొందుచున్న హక్కుల స్వభావము, ఆగమ శాస్త్రానుసారము, సాంప్రదాయానుసారము అట్టి సిబ్బంది పూజలు, పునస్కారములను నిర్వహించుటకు వారికి ముట్ట చెప్పవలసిన ప్రతిఫలము, మరియు ధర్మాదాయశాఖ సాధారణ పనితీరుపై తగిన మార్గదర్శక సూత్రములను సూచించుటకు ప్రభుత్వము న్యాయమూర్తి చల్లా కొండయ్య కమీషన్ ను యేర్పాటు చేసింది. కమీషను తన రిపోర్టును 28.2.1986నాడు ప్రభుత్వమునకు అందచేయగా ప్రభుత్వము దానిని పరిశీలించి కొన్ని మార్పులతో ఆ రిపోర్టును ఆమోదించింది.
Andani Pilupu
₹80.00“చిన్నా!” నన్ను ఆ పేరుతో పిలిచి ప్రలోభపెట్టకు, చెప్పు – నా తండ్రెవరు? నిజం చెప్పు. అనుకోని ఈ ప్రశ్నకు అంజనీదేవి తెల్లబోయింది. ముఖం పాలిపోయింది. తనను సంబాలించుకుంది. ఏమిట్రా పిచ్చిపట్టిందా? నీ తండ్రెవరో నీకు తెలియదా? పిచ్చి భ్రమలో పెంచావు. ఇప్పుడైనా నిజం చెప్పకపోతే పిచ్చిపడుతుంది. “మీ తండ్రి శ్రీహరిగారు.” కాదు అబద్దం అతను రామస్వామిగారి ఇల్లరికపు అల్లుడు. నీ అందానికి దాసుడై భార్యబిడ్డలను అనాధలను చేసి వచ్చిన ఘనుడు. కన్న కొడుకుకు సంజాయిషీగా ఆ తల్లి చెప్పిన కన్నీటికథే “అందని పిలుపు.”
Andagadu
₹120.00ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. మాదిరెడ్డి సులోచన సమగ్ర సాహిత్యం ఈ తరం పాఠకులకు అందచేయ్యాలనీ, ఈ నవలల్ని పాఠకులు ఆదరిస్తారనీ మా ఆలోచనలకు మిత్రులనుండి, పాఠకుల నుండి సోదర ప్రచురణ కర్తల నుండి ఎంతో ప్రోత్సాహం వచ్చింది. వారికి మా ధన్యవాదాలు.
– నవోదయ రామమోహనరావు
Antharardha Sridevi Bhagavatamu Antarardha Mahavishnu Puranamu
₹90.00లక్ష్మీదేవిని చూసి విష్ణుమూర్తి నవ్వేడు. లక్ష్మి విష్ణుని నీ తల తెగిపడిపోవుగాక అంది. అంటే, విష్ణుని తల తెగపడింది. బ్రహ్మ విష్ణువు యొక్క మొండేనికి గుర్రం తలతెచ్చి అతికించేడు. ఇది లక్ష్మి హయగ్రీవావతార కథ. కరంభుడు అనేవాడు బ్రహ్మ చెప్పిన ప్రకారం తన ఎదుటనున్న గేదెతో రమించెను. ఆ గేదెకూ, కరంభునకు పుట్టినవాడు మహిషాసురుడు. వాడు శ్రీదేవిని తన్ను పెండ్లాడవలసిందిగా ఆర్గురు తన రాయబారుల ద్వారా కోరేడు. శ్రీదేవి వారి ఆర్గురనూ, మహిషాసురుణ్ణి కూడా చంపివేసింది. ఇది మహిషాసురమర్దినీ అవతార కథ. ఇలాంటి తలాతోకా లేని కథలెన్నో! ఇవి ముక్తినిస్తాయిట! ఇవి అవతారకథలు. ఎలాగు అవి ముక్తినివ్వడానికి సమర్ధంగా ఉన్నాయో వ్యుత్పత్యార్ధాలతో నిరూపించి శ్రీ శర్మగారు ముక్తి సౌధానికి మెట్లు కట్టి చూపించేరు. వీరు ఇంతకు పూర్వం రామాయణ, భారత, భాగవతాలకు కూడా అంతరార్ధాలు వ్రాసేరు, చదివి తరించండి.