Showing 517–528 of 835 resultsSorted by latest

Enni Metlekkina

150.00

అతను పత్రికా సంపాదకుడు, రచయిత వ్యక్తిగత జీవితంలో సుఖం లేనివాడు. మొగుడు వదిలేసిన పెద్ద కూతురు, పోలియోతో కాళ్ళు చచ్చుబడ్డ చిన్నకూతురు. నాలుగు రోడ్ల కూడలిలో మరణించిన కొడుకు, కాలేజీ రోజుల నెచ్చెలి లీల… ఫ్రెంచ్ క్లాసులో పరిచయమైన శకుంతల… అతని తృప్తి నియ్యలేని భార్య సుభద్ర… వీరందరి మధ్య అతనికి జీవితంమీద అసంతృప్తి. ఏమిటి అతనిలోని లోపం? ఏమిటి అతని వ్యామోహం…

మాలతీ చందూర్ వ్రాసిన ప్రతి కధా, నవల, వ్యాసం, అన్నీ ఇంటింటికీ మామిడి తోరణాలై, మణిదిపాలై ప్రకాశిస్తుంటాయి, ఆమె కలం నుండి వెలువడిన మరో మణిపూస, “ఎన్ని మెట్లెక్కినా”.

 

– మాలతీ చందూర్ 

English Keekaranyamloki Pravesinchandi – ఇంగ్లీష్ కీకారణ్యంలోకి ప్రవేశించండి

150.00

ఇంగ్లీషు కీకారణ్యంలోకి….

ప్రతీ పరాయిభాషా ఒక కీకారణ్యమే, చిన్నదో పెద్దదో! ఆ కీకారణ్యంలోకి ప్రవేశించే ఏకైక మార్గం, దాని నియమాల్ని నేర్చుకుంటూ వెళ్ళడమే. ఆ నియమాల్ని, మాతృభాషలో వుండే నియమాలతో పోల్చుకుంటూ కూడా వెళ్ళాలి. భాషని నేర్చుకోవటానికి దాని వ్యాకరణంతో సంబంధం లేని సులువైన మార్గాలేవి వుండవు. అలాంటి ‘కిటుకు’లేవో వుంటాయని ఎన్నడూ భ్రమ పడకూడదు. భాషని నేర్చుకోవాలని నిజంగా కోరిక వుంటే, దాని వ్యాకరణం మీద కూడా ఇష్టం కలుగుతుంది. అయితే, వ్యాకరణ నియమాలు తెలుసుకోగానే ఆ భాషని అనర్గళంగా మాట్లాడగలమని అర్థం కాదు. వ్యాకరణం అనేది భాషలోకి ప్రవేశించడానికి సాధనం మాత్రమే. ఇక మిగిలినదంతా తర్వాత జరిగే కృషిమీదే ఆధారపడి ఉంటుంది.

కానీ, వ్యాకరణ నియమాలు తెలియడంవల్ల వెంటనే జరిగే మేలు ఏమిటంటే, ఇంగ్లీషు పుస్తకాలు చదివితే అర్థమవుతూ వుంటాయి. ‘ఇంగ్లీషు పుస్తకాలు’ అంటే, విద్యార్థుల స్థాయికి తగిన పుస్తకాలు. అంటే, విద్యార్థులు చదివే ఇంగ్లీషు పాఠాలు. అంతకుముందు అర్థంకాని వాక్యాలు, అక్కడవున్న నియమాలు తెలిసినప్పుడు ఎంతో తేలికగా అర్థమవుతాయి. అప్పుడు, ఆ భాష అంటే భయం పోతుంది. పైగా, కొత్త భాషని అర్థం చేసుకోగలుగుతున్నామనే ధైర్యం, సంతోషం ప్రారంభమవుతాయి. క్రమంగా అ భాషలోకి ప్రవేశం జరిగిపోతుంది.

ఒక పరాయిభాష పట్టుపడిందంటే, ఆ భాషలో నియమాలు నేర్చుకుంటేనే అది జరుగుతుంది. లేకపోతే, అది ఎవ్వరికీ, ఎప్పటికీ, సాధ్యం కాదు. కాబట్టి, ఒక భాష నేర్చుకోదల్చినవాళ్ళు మొట్టమొదట తెలుసుకోవలసింది ‘దాని వ్యాకరణం జోలికి పోకుండా అది సాధ్యం కాదు’ అని. ఈ సంగతి సరిగా అర్థం చేసుకుంటేనే భాషలు నేర్చుకోడం గురించి పొరపాటు అభిప్రాయాలన్నీ వదులుకుంటారు. ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నారో దాని వ్యాకరణం నేర్చుకోవటానికి తమని తాము సిధ్ధం చేసుకుంటారు.

Ee Desam Maakemichhindi – ఈ దేశం మాకేమిచ్చింది

80.00

ప్రభు సబ్‌ఇన్‌స్పెక్టర్‌, బిందు అతని భార్య, రచయిత్రి. వారికి నలుగురు పిల్లలు. విధి నిర్వహణలో అనికాతనే సాటి. తన పర భేదం లేదు. ఎవరు చెప్పినా వినడు. వేటికీ లొంగడు. యిలాంటి వారివల్లనే ప్రభుత్వ యంత్రాంగానికి తుష్టి పుష్టి వచ్చేది. న్యాయం, ధర్మం సక్రమంగా పాలింపబేది. అయితే ఒక్కోసారి తన ధర్మమే తన న్యాయమే ఆ ఉద్యోగికి, అతని కుటుంబానికి ప్రాణాంతకమైతుంది. చట్టాలు, న్యాయస్థానాలు అతనిని రక్షించలేవు. అతని సేవకు గుర్తింపేమిఇ? ఏ దేశ సౌభాగ్యం కోసం అతను అహరహం శ్రమించాడో ఆ దేశం వారికేమిచ్చింది?
నిశిత సూక్ష్మ పరిశీలనలో తనకుతానే సాటియైన శ్రీమతి సులోచకనా రాణిగారి మరో ప్రయజనాత్మక, ప్రయోగాత్మక నవల.
మనోహరమైన ఆమె శైలి నందనవనంలో విహరిస్తున్నట్లు కమనీయమైన సంగీతం వింటున్నట్లు, వేదనాభరిత హృదయాలకు స్వాంతన వచనాలు పలుకుతున్నట్లు వుంటుంది. ఈ ఏటి నవలలో దీనికి సాటి, పోటీ లేదు అని ఇప్పటికే వేలాది పాఠకులు మెచ్చిన నవల.

Yedi Gamyam Yedi Maargam – ఏది గమ్యం? ఏది మార్గం?

50.00

మేరీని పెళ్ళి చేసుకుంటానని విశ్వనాథం తల్లిదండ్రులకు చెప్పేసరికి వాళ్ళెంత దెబ్బలాడారో – యీ నిశ్చయం విన్నాక అంతకు పదిరెట్టు పేచీపెట్టారు మేరీ తరపు వాళ్ళు. విశ్వనాథం – మేరీ యీద్దరూ థర్డ్‌ యమ్‌.జి.లో వుండగా – తమ స్నేహం మామూలు స్నేహం కాదని, ఇది ప్రేమ భావమనీ గ్రహించుకున్నారు. అయితే వీరి కుటుంబాలు రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాలు. అవి కలవడమన్నది కలలోని వార్త అని తెలుసుకుని రెండు వైపులవారినీ ఎదరించి పెళ్ళి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
విశ్వనాథం ఆంధ్ర శ్రోతియ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. తెల్లగా, బక్కపలచగా, ఆకర్షణీయంగా ఉంటాడు. నలుగురు అన్నదమ్ముల్లో రెండో వాడు. పెళ్ళిగావలసిన యిద్దరు చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ వున్నారు. బస్తీగాక, పల్లెటూరూ గాక మధ్యస్తమైన ఊరు వాళ్ళది. అది ఒక జమీందారిలోది. ఆ ఊళ్ళో నాలుగైదు భవంతులు జమీందారులవి వున్నాయి. కోట గుమ్మాలూ, విశాలమైన లోగిళ్ళూను. జమీందారీపై ఆధారపడ్డ కుటుంబాలూ, ఆ ఎస్టేట్లలో పనిచేస్తున్నవారి కుటుంబాలూ ఎక్కువ. ఆ ఊళ్ళో, విశ్వనాథం పూర్వీకులంతా ప్రభువు ప్రాపకంలో గడిపారు. తేనె తుట్టెలాగా తల్లివైపు – తండ్రివైపు బంధులవి పది పదిహేను కుటుంబాలున్నాయి స్వంత వూళ్ళోనే. అతని బంధువులందరిలోకి – వీళ్ళే కొంచెం సంపన్నులూ, చదువుకొన్నవారూను. విశ్వనాథం అన్నగారు రామ్మూర్తి హైస్కూల్లో హిస్టరీ టీచరు. ఆయనకి ఇద్దరు పిల్లలు. పెద్ద చదువులు చదివిన విశ్వనాథం – తమ వంశానికి గౌరవం, ఇంటికి ధనం తెస్తాడని ఆశపడ్డ తండ్రి కలలు కల్లలయాయి……

Idi Manava Samajamena

50.00

   మానవులు ఉన్నది, ‘మానవ సమాజమే’ అవుతుంది. అయితే, ఆ సమాజంలో ఉన్న తీరు తెన్నుల్ని చూస్తే, అడుగడుగునా, ‘ఇది మానవ సమాజమేనా?’ అనే ప్రశ్న రావలసి ఉంటుంది. సమాజంలో ఉన్న మొత్తం సమస్యల్లో, తక్షణం మొట్టమొదట పరిష్కారం కావలసిన కౄర సమస్య ఒకటి ఉంది. మానవుల మనస్సుల్నీ, మేధస్సుల్నీ, అతి కౄరత్వంలోకి ఈడ్చిన ఈ సమస్య, అట్టడుగు కులపు హిందూ స్త్రీ పురుషుల్నీ, అతి బీద స్థితిలో ఉన్న ముస్లిం స్త్రీ పురుషుల్నీ, కొన్ని తెగల ఆదివాసీ స్త్రీ పురుషుల్నీ, యజమానుల ఇళ్ళల్లో ఉండే పాయిఖానా దొడ్లలోని మలమూత్రాల్నీ తమ స్వంత చేతులతో ఎత్తివేస్తూ శుభ్రాలు చేసే ‘పాకీ చాకిరీ’కి కట్టిపడేస్తుంది!

              ‘పాకీ చాకిరీ’ అనే దాన్ని, రోడ్లని ఊడ్చే పని లాగానో, చచ్చిన జంతువుల్ని పాతిపెట్టే పని లాగానో, జమ కడితే, పాకీ పనిలో ఉండే బాధల్నీ, అవమానాల్నీ, దుఃఖాల్నీ, అర్ధం చేసుకునేదేమీ ఉండదు. ధనిక మానవుల ఇళ్ళల్లో కుక్కులూ పిల్లులూ ఉంటే, వాటి మల మూత్రాల్ని ఎత్తడం కూడా ఆ ఇంటి సేవకులైన బీద మానవుల పనే కదా?

          మానవులు నివసించే సమాజాన్ని గురించి, ‘ఇది, మానవ సమాజమేనా?’ అని ప్రశ్నించుకోవచ్చునా? అటువంటి ప్రశ్న ఎందుకు వచ్చిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోండి..

– రంగనాయకమ్మ

 

Edagani Manasulu

60.00

‘బిందూ! ఇంకా నీ ముస్తాబు పూర్తి కాలేదా?

మమ్మీ నేను నలుపు. ఈ పింక్ కలర్ చీర కట్టుకుంటే ఇంకా నల్లగా కనిపిస్తాను కదూ!

హేమలత పద్దెనిమిదేళ్ళ కూతురు పసిపిల్లలా కనిపించింది.

ఎవరన్నారు నువ్వు నలుపని! పిచ్చితల్లీ అందం అంటే ఒక రంగేనేమిటే?

కాదా మరి!

నీ ఫీచర్స్ ఎంతో బావుంటాయంటారమ్మా. రంగు చూడగానే కొట్టవచ్చినట్టు కనిపించేమాట నిజమే. కాని మనిషి అందం మనసు, ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది.

పోమ్మా, నన్ను మరిపించాలని చూస్తావు.

ఎదగని మనసులు విచిత్ర పరిస్థితుల మధ్య జరిపే ఆరాట పోరాటాల, తబ్బిబ్బులను హృద్యంగా చిత్రీకరించే స్వభావ పరిశీలనాత్మక నవల. తప్పక చదవండి.

Dooram

230.00

రచయితది హైద్రాబాద్. అభిమాన పాఠకురాలిది వైజాగ్.
వ్యక్తిగత సమాచార మార్పిడికి ఉత్తరాలే ప్రధాన ఆధారమైన సంవత్సరం అది. 1976.

అభిమాని, రచయితల మధ్య ఆరంభమైన ఉత్తరాలు చివరికి వారి పెళ్ళికి ఎలా దారి తీసాయి? ఆ ఉత్తరాల్లో ఏం రాసుకున్నారు?

ఒకరితో మరొకరికి ముఖపరిచయం కూడా లేని వారి సంబంధం పెళ్ళి దాకా ఎలా వెళ్ళింది?.

ఈ ప్రేమ నవలంతా కేవలం ఉత్తరాల ద్వారానే నడవడం విశేషం.

ఆంధ్రభూమి వీక్లీకి మీ అభిమాన రచయిత మల్లాది తొలుత రాసిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ సీరియల్ ద్వారా పాఠకులని ఆకట్టుకుని తర్వాత ధర్మయుద్ధం, ఈ గంట గడిస్తే చాలు లాంటి ఎన్నో నవలలని అందించారు.

షరా : ఇతరుల ఉత్తరాలు చదవడంలోని ఆనందం, వాటికి సమాధానాలు ఇవ్వనవసరం లేదు.

ఈ నవలతో పాటు మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఒకటి ఒంటరి అంకె అనే నవల కూడా ఉంది.

చదవండి! చదివించండి!!

Donga Tallidandruluntaaru Jaagrattha

150.00

  దొంగ తల్లిదండ్రులూ, దొంగ అత్త మామలూ, పాత కాలం నుంచీవున్నారు. “సతీ సహగమనాల” ముచ్చట్లు నిర్వహించిన వాళ్ళందరూ తల్లిదండ్రులూ, అత్తామామలూ, కారూ? ఈనాడు కూడా ‘పరువు హత్యల’ పేరుతో ఆడ పిల్లల్ని నరికివేసేది తల్లిదండ్రులు కారూ? పిల్లలు, హిమాలయ పర్వ్ఫతాలేక్కే ఘన కార్యాలు చేసి డబ్బు సంపాదించాలనీ పిల్లలు అక్కడ కొండల మధ్య రాలిపడి చచ్చినా, కొంత డబ్బు వస్తే చాలనీ చూసే తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రులు కారూ? కొండ ఎక్కడంలో బోలెడు మంది పడిపోతున్నారానీ, చస్తున్నారానీ, తెలీదు? – తెలుసు! కానీ డబ్బు రావాలి. పిల్లలు పొతే పోతారు! వాళ్ళే మరి తల్లిదండ్రులు.

ప్రతీ తల్లీ, ప్రతీ తండ్రి, దొంగలు గానే ప్రవర్తిస్తారని చెప్పడమూ ఇది? – కాదు. అలా చెప్పడం అయితే, నేనూ ఒక ‘దొంగ తల్లి’ నే అవుతాను. ప్రతీ ఒక్కరి గురించి అదే అర్ధంతో చెప్పడం కాదు ఇది. దొంగ తల్లిదండ్రుల పిల్లలు, తమ అవమానాలన్నీ ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. పెద్ద వాళ్ళయాక, దేన్నీ సాహించాలో, దేన్నీ తిరస్కరించాలో, ఆ రకంగా నడవాలి. తమ ప్రవర్తనలోకి క్రూర లక్షణాలు చేరనివ్వకుండా తమని తాము ధృఢ పరచుకోవాలి. ఇదే, కొత్త తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్త!.