Showing 481–492 of 835 resultsSorted by latest

Nireekshana

70.00

మాదిరెడ్డి సులోచన గారు దాదాపు 150 కథలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాశారు. వీటిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపజేసే అలవాటు చేసిన రచయితలలో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలూ, పెళ్ళిళ్ళకంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథా రచయిత్రి అవార్డులు పొందారు.

ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో  మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. అందరు తప్పక ఈ నవలలు చదవాల్సిందిగా కోరుచున్నాము.

Nija Bhakthuni Kulamedi?

150.00

“తన దేశం సౌభాగ్యవంతంగా ఉంటానికి, లాల్ బహద్దూర్ తన ప్రాణమైనా ఇస్తాడని నాకు నమ్మకముంది.”

అన్నది ఆ ధీరమాత.

వృద్ధుడు నిట్టూర్చి “కానీ ఈ రకమైన ఫీలింగ్స్ కోల్పోయిన తర్వాతా , నేనిక ఆదిమ వాసి వాణ్ణి ఎలాగవుతాను ?” అన్నాడు.

“నీకెంత కష్టమొచ్చింది అమ్మ. కళ్ళు కనిపించకుండా చెవులు వినిపించకుండా నువ్వెలా బ్రతుకుతావే హెలెన్ తల్లి” అంటూ విలవిలలాడిపోయింది ఆ అభాగ్యురాలు.

నీలో ఎరుక ఏర్పడగానే రెండో జన్మ నపేక్షించి , అందుకై వెతకనారాంబిస్తావు. నికి రెండో జన్మా ధ్యానమే ప్రసాదిస్తుంది.

Nerajaanalu Magadheerulu

80.00

 ఆ రోజు ఆదివారం.

        అందరికి నిశ్చింత. హడావుడిగా నిదురలేవనక్కరలేదు. గడియారంతో  పాటు తిరుగనక్కరలేదు. వస్తువుల కోసం, పుస్తకాల కోసం ఒకరి కాళ్ళు ఒకరు తొక్కనక్కరలేదు. మిగతా రోజులాగే దినచర్య జరిగిన తరుముతున్నట్టు అటు, యిటు పరిగెత్తనక్కరలేదు. తాపీగా నింపాదిగా పనులు చేసుకోవచ్చు.

        సుశీలమ్మకు ఇరవై ఏండ్లుగా అయిదు గంటలక  లేవటం అలవాటుయింది. ఆమె కాలనీకి  వచ్చాక కొందరు పనిగట్టుకుని ఉదయము గడియారం చూడటము మానేశారు. సుశీలమ్మ వంటయింట్లో లైటు వెలిగిందంటే సమయము అయుదు గంటలన్నమాట. ఆమె కూడా ఆదివారం మరో అరగంట పడుకుందాము అనుకుంటుంది. కానీ అసంకల్పిత ప్రతీకారాచార్యలా ఆ సమయానికి లేచిపోతుంది. ఆ తరువాత గుర్తుకు వస్తుంది. అరే ఆ రోజు అరగంట సేపు పడకుందాo అనుకుంటుంది. తరువాత ఏం  జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

                                                                                     -మాదిరెడ్డి సులోచన.

Nelavanka

120.00

చంద్రునికి కళంకంలా క్రికెట్ చంద్రునికి క్రీడారంగంలో కీర్తి జీవిత రంగంలో అపకీర్తి. అలాంటి రౌడీ రవి చంద్రునికి మరో యువరాణి జతపడి డీ అంటే డీ అంది. తనపై హజంతో సాగించిన అమానుషానికి శిక్షపడే సమయంలో తాను మనసు మార్చుకుని మానవతియై ‘తప్పులు అందరు చేస్తారు, కొందరే మనుషుల్ని సంస్కారంతో’ తీర్చిదిద్దగలరని రుజువుచేసిన అమ్మాయి సాహస చరిత్ర నెలవంక.

              ద్వేషించినా ప్రేమించినా ఫలించక అక్క బిడ్డ కోసం బావగార్ని పెళ్ళాడి అనుమానాలకు అవమానాలకు గురై అక్కబిడ్డను పోగొట్టుకుని కుందేలై మతి తప్పినా మానవతి కథే నెలవంక! ఆ శృతి తప్పిన వీణను ఏ దేవతలు సవరించారో, అమావాస్య చీకట్లను పారద్రోలి పున్నమి వెన్నెల సరాగాలను ఎలా పలకరించారో ‘నెలవంక’ చదివి ఓహో ఆహా అనండి. ఈ నెలవంక మీ నెలవంకే.. అమావాస్య చీకట్లు ఎవరివీ? మీవికావు! మరి ఎవరివి?           

Bharatha Dharshanamu

400.00

జవహర్ లాల్ నెహ్రు రచన

భారత దర్శనము

The Discovery of India కి తెలుగు అనువాద గ్రంధం.

నేనీ పుస్తకాన్ని అహ్మమద్ నగర్ కోటలో ఉండగా 1944 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అయిదు నెలల్లో వ్రాసాను. నాతో పాటు ఖైదులో ఉన్న సహచరులలో కొందరు సహృదయత తో దీని వ్రాతప్రతిని చదివి, అనేక అమూల్య సుచానలిచ్చారు. దేనిని ఖైడులోనే సరి చేసేటప్పుడు ఆ సూచనల నుపయోగించికుని. కొన్ని చేర్పులు కూర్చాను. అయితే, నా ఈ రచనలోని భావాలకు ఏ ఒక్కరు భాధ్యులు కారని , లేక వారామోదిస్తారని బావించ నవసరం లేదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను. కానీ, వారితో కలసి, అనేక సమాలొచనలూ, చర్చలూ జరపడంవల్ల భారతీయ చరిత్ర, సంస్కృతుల వివిధ దృక్పధాలను గురించి నా మనసులో మసకగా ఉన్న భావాలూ విశిష్ట  రూపం దాల్చాయి.అందుకు వారికీ నా హృదయ పూర్వక కృతజ్ఞత తెలుపుకొకతప్పదు.

అహ్మమద్ నగర్ కోటలో నా సహచరులుగా ఉన్న పదకొండు మంది బారత దెస వైవిధ్యాన్ని ప్రదర్శించే ముచ్చటయిన వ్యక్తులు. వారనేక విధాలుగా భారత రాజకేయలకే గాక , అధునాతన పాండిత్యా లకు , వర్తమాన  భారతదేశ వివిధ ద్రుక్పధాలకు ప్రతినిధులు. భారత దేశ ప్రధాన సజీవ భాషల్లో దాదాపు అన్నిటికి భారత దేశాన్ని గతంలోనూ వర్తమానంలో కూడా గాడంగా ప్రభావితం చేసిన పరచెన భాషలకు ప్రాతినిధ్యం లభించింది.

నేను కొన్నాళ్ళ క్రితం వ్రాసినదాన్ని, కొంతకాలానికి మల్లి చదువుతూవుంటే, ఒకవిధమైన విచిత్రనుభూతి ఇబ్బడిముబ్బడి గా ఉంటుంది. నాకు సంహితుడైన బిన్నమైన మరో వ్యక్తి రచించిన గ్రంధాన్ని చదువుతున్నట్లు తోస్తుంది. ఇది బహుశా, నాలో జరిగిన మార్పు ఒక్క పరిమాణం కావచ్చు.

……………   జవహర్ లాల్ నెహ్రు

గొప్ప ప్రజాస్వామ్యవాది అయిన నెహ్రు ఆంగ్లం లో అనేక గ్రంధాలను రచించారు. తను రాసిన ‘స్వీయచరిత్ర’ కు కొనసాగింపుగా మరో రచనకు సంసిద్ధమైనారు . తనకు మహా ప్రేతిపాత్రమైన — తను ప్రగాడంగా ప్రేమించే భారత మాతను గురించి రాస్తే బాగుంటుందని ‘ ది డిస్కవరీ అఫ్ ఇండియా ” గ్రంధ రచనకు పూనుకున్నారు. ఈ గ్రంధ రచనలో అబ్దుల్ కలాం ఆజాద్,గోవింద వల్లబ్ పంత్ వంటి స్వాతంత్ర సమరయోధులు తమ తోడ్పాటు అందించారు. ఈ పుస్తకం తెలుగులో ‘భారత దర్శనం ‘ అన్న పేరుతో వెలువడింది. వీరి రచనలలో “సోవియట్ రష్యా”, గిమ్ప్లేస్ అఫ్ వరల్డ్ హిస్టరీ” ” ది డిస్కవరీ అఫ్  ఇండియా ” అన్నవి ప్రసిద్ధ రచనలు.

Natopatu Nalguram

70.00

  తిరిగి యిన్నేళ్ళ కు మాదిరెడ్డి సులోచన నవలలు మీ ముందుకు వచ్చాయి. దాదాపు ఏభై యేళ్ళ క్రితం అచ్చమైన తెలంగాణా వాతావరణం పొందికైన మానవ సంబంధాలూ కలగలిపి చక్కని యితివృత్తాలు ఆమె సాహిత్యంలో కనిపిస్తాయి. డెబ్భై పైగా నవలలు ఆమె రచించారు. వాసిలోనూ రాశిలోను కూడా సులోచన రచనలు ఎన్నతగినవే. ఆమె ప్రమాదవశాత్తు అకాలమరణం పాలు కాకుండావుంటే మరెన్ని మంచి నవలలు రాసి వుండేవారోననేది ఊహకు మాత్రమే మిగిల్చి వెళ్లిపోయారు.

        ఇప్పుడు అంటే నూతన సహస్రాబ్ది తొలిదశకంలో యీ నవలల్ని చదువుతున్నపుడు కొన్ని కొన్ని సందర్భాలలో పాఠకులకు అసహజంగా వున్నా భావన కలిగే అవకాశం వుంది. ఎందుకంటే గడచిన ఏభై సంవత్సరాలలో ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆనాటి రూపాయికి నేటి రూపాయికి పొంతన లేదు. కొన్ని వూళ్ళపేర్లు కొన్ని మాటల అర్దాలు సైతం మారిపోయాయి. వేషధారణ మారింది. దూరాలు తగ్గిపోయాయి. భూగోళం గుప్పెట్లో వొదిగిపోయింది. ఆనాడు వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. నేడు అది చిల్లర డబ్బు. కనుక ఇలాంటివి మాదిరెడ్డి నవలలో తారసపడినప్పుడు విజ్ఞలైన మా పాఠకులకు కాలంతో అన్వయించుకుని అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాము.

                                                                                                  – మాదిరెడ్డి సులోచన

Narakamlo Harishchandrudu

60.00

  పురాణగాథలపై నార్లవారి విమర్శలలో ముఖ్యమైన మూడవది “నరకంలో హరిశ్చంద్రుడు”. ఆయన అభిప్రాయంలో మనకు “సుపరిచితుడైన” సత్యహరిశ్చంద్రునితో పాటు మరో ఇద్దరు హరిశ్చంద్రులున్నారు. ఒకడు అసత్య హరిశ్చంద్రుడు కాగా, మరొకడు రాజర్షి హరిశ్చంద్రుడు. ఈ ముగ్గురు హరిశ్చంద్రులు మన ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తారంటారు నార్ల. ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, భారతం, మార్కండేయ పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం, శివ పురాణం, భాగవతం, దేవీభాగవతం మొదలైన పురాణ గ్రంథాల్లో ఈ ముగ్గురు హరిశ్చంద్రులు కనిపిస్తారు. 

మార్కండేయ పురాణంలోని గాథకే అధిక ప్రాధాన్యం లభించిందనీ, అందులోని హరిశ్చంద్రుడి గాథే మనకు సత్యహరిశ్చంద్రుడిగా దర్శనమిస్తున్నాడని నార్లగారంటారు. ఈ నాటకానికి ఆయన రాసిన పీఠిక కూడా దాదాపుగా సమగ్రమైన “పురాణ విమర్శే”. పదకొండవ శతాబ్దిలో క్షేమేంద్రుడు రాసిన “చండకౌశిక” నాటకం నుండి, పదిహేనవ శతాబ్దిలో గౌరవ రాసిన “హరిశ్చంద్రోపాఖ్యానం”, పదిహేడవ శతాబ్దికి చెందిన రామరాజభూషణుడు రాసిన “హరిశ్చంద్రనలోపాఖ్యానం”, కందుకూరి వీరేశలింగం రాసిన నాటకం, బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన నాటకం, విశ్వనాథ సత్యనారాయణ రాసిన “కావ్యవేదహరిశ్చంద్ర” నాటకాల వరకూ నార్లవారు పరిశీలించినట్లుగా ఆయన పీఠికలో రాశారు.

Mr Sampath M A

120.00

ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. మాదిరెడ్డి సులోచన సమగ్ర సాహిత్యం ఈ తరం పాఠకులకు అందచేయ్యాలని, ఈ నవలల్ని పాఠకులు ఆదరిస్తారనీ మా ఆలోచనలకు మిత్రులనుండి, పాఠకులనుండి సోదర ప్రచురణకర్తల నుండి ఎంతో ప్రోత్సాహం వచ్చింది. వారికి మా ధన్యవాదాలు.

సంపత్ హడావుడిగా లేచాడు. అతని అరచేతులు తడిగా ఉన్నాయి. ఎదో గాభరా! ఎదురుగా ఉన్న స్ప్రింగ్ తలుపును ఆనుకొని ఉన్నాడో వ్యక్తి. అతని చేతిలో ఫైలు లాంటి కార్డ్ బోర్డ్ ఉంది. దానివంకే పరీక్షగా చూస్తున్నాడు. అతని నోరు ఎండుకు పోతుంది. సంపత్ ముందుకు వెళ్ళాడు. నేనే ఆ సంపత్ ను అని చెప్పాలని ఉంది. నోట్లో నుండి మాట బయటికి రావటం లేదు. ఉద్యోగాల వేటలో మొదటి ప్రయత్నం ఇది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.