YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 37–48 of 860 resultsSorted by latest
SHANKARABHARANM By Vamsi
₹200.00
SHANKARABHARANM By Vamsi
ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ చిరస్మరణీయ చిత్రం ‘శంకరాభరణం’ వెండితెర నవల (Novelization) రూపంలో పుస్తకంగా అందుబాటులో ఉంది. వంశీ రచించిన ఈ అపురూప గ్రంథాన్ని విశ్వనాథ్ తనయుడు కె. నాగేంద్రనాథ్ ఇటీవల పునర్ముద్రించారు. ఈ పుస్తకం శంకరాభరణం సినిమాలోని భావోద్వేగాలు, సంగీత, సాహిత్య విశేషాలను అక్షర రూపంలో అందిస్తుంది.
SAMPADSRUSTIKI SATAKOTIMAARGALU
₹600.00SAMPADSRUSTIKI SATAKOTIMAARGALU
విషయ సూచిక
ఆర్థిక ప్రస్థానంలో… కరదీపిక: శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పొదుపు – పెట్టుబడులకు మార్గదర్శి డా. దువ్వూరి సుబ్బారావు ఆర్థిక భద్రతకు మార్గదర్శక గ్రంథం: శ్రీ మానుకొండ నాగేశ్వరరావు
ధన్యవాదాలు
తొలిమాట
పొదుపు – అప్పుడు… ఇప్పుడు…
భిన్న లక్ష్యాలు – విభిన్న పెట్టుబడి వ్యూహాలు
మీకంటూ ఓ బడ్జెట్ ఉండాలి
పిల్లలకు పొదుపు పాఠాలు
పోస్టాఫీసు పొదుపు పథకాలు
బ్యాంకుల్లో పొదుపు పథకాలు మీ అరచేతిలోనే…
మ్యూచువల్ ఫండ్ల ఆవిర్భావం
మ్యూచువల్ ఫండ్లు – సంపద సృష్టికి సోపానాలు
మ్యూచువల్ ఫండ్ పథకాలు ఎన్నెన్నో…
పథకాల ఎంపికలో కొన్ని మెలకువలు
సిప్ – సంపద సృష్టికి ఓ మంత్రదండం!
దేశ స్టాక్ మార్కెట్ల ప్రస్థానం
మారుతున్న మార్కెట్ల ముఖచిత్రం
సంపద సృష్టికి శతకోటి మార్గాలు…………………..
Na Jeevita Katha Maxim Gorky
₹600.00Na Jeevita Katha Maxim Gorky
ఇరుకుగా వున్న చీకటిగదిలో కిటికీకి దగ్గరగా నేలమీద మా నాన్న పడుకున్నాడు. తెల్లని దుస్తులు తొడుక్కుని అలా పడుకుని వుంటే యెంతో పొడుగరిలాగ కనబడ్డాడాయన. కాలివేళ్ళు, అదొక మోస్తరుగా ఒకదాని కొకటి యెడమ యెడమగా వున్నాయి. ప్రశాంతంగా గుండెలమీద పెట్టుకున్న మృదువైన చేతివేళ్ళు కూడా కొంకర్లుపోయున్నాయి. కళ్ళమీద వుంచిన నల్లని రాగి నాణేలు ఆయన ఉల్లాసపు కళ్ళను కప్పుతున్నాయి. దయతో ఉట్టిపడుతూండే ఆయన ముఖం నల్లబారిపోయింది, బిర్రబిగుసుకు పోయిన ఆయన పళ్ళు మెరుస్తూండడం చూచి నాకు భయం వేసింది.
అమ్మ ఆయన దగ్గర మోకాళ్ళమీద కూచుంది. అమ్మ వంటిమీద ఎర్ర గాగరా వొక్కటే వుంది, ఆమె అలా కూచుని పట్టులాంటి ఆయన జుట్టును నల్లని దువ్వెనతో నుదుటి మీద నుండి వెనక్కి దువ్వుతూంది. నేనా దువ్వెనతోనే పుచ్చకాయ తొక్కలను రంపంతో కోసినట్టు కోసేవాణ్ణి. మంద్రమైన గొంతుకతో ఏమిటేమిటో ఆమె అలా గొణుగుతూనే వుంది. ఆమె బూడిదరంగు కళ్ళు వాచిపోయి పెద్ద కన్నీటి బొట్టుల కింద కరిగిపోతూన్నట్టని పించింది నాకు.
మా అమ్మమ్మ నా చేయి పట్టుకుంది. అమ్మమ్మ స్థూలంగా గుండ్రంగా వుంది. పెద్ద తల, పెద్ద పెద్ద కళ్ళు, మాంసపు ముక్కలా ముక్కు, ఆ ముక్కు చూస్తేనే నాకు నవ్వొచ్చేది. ఆమె అంత నల్లగా వుండికూడా మృదువుగా అద్భుతంగా కనబడుతోంది. ఆమె కూడా యేడుస్తూనే వుంది. ఆమె యేడుపు అదొక విధంగా వుండి అమ్మ యేడుపుకి వెనక పాటలా వినడానికి ఇంపుగానే వుంది. ఆమె వొళ్ళు అంతా వణికిపోతూనే నన్ను నాన్న దగ్గరకి నెట్టుతూంది. నేను మాత్రం ముందుకు రాకుండా ఆమె గాగ వెనక దాగుకున్నాను. నాకు భయంవేసి యేమిటోలా వుంది……………………….
Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)
విభాగం-1
వదిలించుకోవలసినవి
“ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
(శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)
భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది…………
Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)
₹200.00
Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)
విభాగం-1
వదిలించుకోవలసినవి
“ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
(శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)
భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది…………
SRIKANAKADURGAMMA CHARITAMU
₹252.00SRIKANAKADURGAMMA CHARITAMU
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.
రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు
Sri Varaha Maha Puranam
₹700.00Sri Varaha Maha Puranam
భారతీయ వాజ్మయంలో పురాణాలు అత్యంత విశిష్టమైనవి. అవి లోకానికి మిత్రులవలె హితాన్ని ఉపదేశిస్తాయి. కాబట్టి “మిత్రసమ్మితములు” గా ప్రఖ్యాతి వహించాయి. పురాణాలు ప్రాచీనమైనవైనా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అవి మన పురాతన విజ్ఞాన సర్వస్వాలు ( Encyclopaedias ) అటువంటి పదునెనిమిది పురాణాల్లో అగ్రగణ్యమైనది “శ్రీ వరాహ మహాపురణం”.
శ్రీ మహావిష్ణువు వరాహరూపమును ధరించి పాతాళ లోకము నుంచి భూమిని ఉద్దరించిన వృత్తాంతము ముఖ్య సంబంధము కలది, అయినందున ఈ పురాణమునకు వరాహపురాణము అనే పేరు వచ్చింది.
వరాహ పురాణానికి సౌకర పురాణం అని, ఆదివరాహ పురాణం అని పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణు అవతారపు పేర్లతో ఉన్న మత్స్య, కూర్మ, వరాహ, వామన పురాణాలలో ఇది మూడవది. పురాణపురుషుడగు శ్రీ మహా విష్ణువు యొక్క ‘ఎడమ చీలమండలం’ గా ఈ పురాణం తెలుపబడినది. ఈ పురాణంలో విష్ణు సంబంధమైన అనేక వ్రతాలు, వాని మహత్యం, వివరణ కూడా లభ్యమవుతున్నది.