Showing 445–456 of 860 resultsSorted by latest

Cinema Kadhalu

225.00

ఈ భూమి మీద పుటిన ప్రతి జీవి తన పరిణామ క్రమంలో ముందుకు సాగుతూ తమ జాడలను వదిలివెళ్తుంది. కానీ మనిషి వేరు. సాహిత్యం, సంగీతం, చిత్రకళ, చలనచిత్రం, శిల్పకళ లాంటి ఎన్నో కళారూపాలతో ఈ భూమి మీద తన ఉనికిని ప్రత్యేకం చేసుకున్నాడు. కళలే లేని మానవ చరిత్రని ఉహించగలమా? అటువంటి కళల్లో అన్నింటికంటే సరికొత్తది చలనచిత్రకళ. ఎన్నో శతాబ్ధాలుగా ఏదుగుతూ వచ్చిన కళారూపాలను తనలో ఇముడ్చుకొన్న శక్తివంతమైన మాధ్యమం చలన చిత్రం. వందేళ్ల క్రితం మొదలై తనకై తనగా అభివృద్ధి చెందుతూ, మిగితా కళారూపాలనుంచి స్ఫూర్తి పొందుతూ కొత్తకొత్త రూపాలను సంతరించుకుంటూ వస్తున్న ఈ కళకు, సాహిత్యంలో ఏంతో అవినాభావ సంబంధం ఉంది. మొదట్నుంచి కూడా సాహిత్యమే సినిమాకు ముడిసరుకు. సాహిత్యంలో గొప్పవిగా బావించబడ్డ ఎన్నో కధలు, నవలలు చలనచిత్రాలుగా రూపొందాయి.

                                                                             -వెంకట్ శిద్ధారెడ్డి.

Cinema Oka Alchemy

230.00

     అత్యంత ఆధునిక కళాప్రక్రియగా రూపొందిన సినిమా తన సంస్కరణవాడ, గ్రామీణ మూలాల నుంచి వేరుపడి ఇవాళ అది పూర్తి వ్యాపారాత్మకమైంది. నాటకరంగం విషాదంగా నిష్క్రమిస్తున్న వేళ, సినిమా వేయిపడగలు విప్పి హోరెత్తుతోంది. ఆధునిక వ్యాపారవేత్తలు, మాఫియా కలాపోశాకులుగా తల ఎత్తాక.. ఈ రంగం నుంచి ఇంకా ఏమైనా ఆశించగలమా? హరిపురుషోత్తమ రావు అన్నట్లు ‘యథాపాలకవర్గం, తథాసాంస్కృతిక రంగం.’

              ఈ ప్రధాన స్రవంతికి భిన్నంగా ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమా కొత్త ఆశలతో చిగురిస్తోంది. మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాల సమాహారమే వెంకట్ సిద్దారెడ్డి వెలువరించిన దృశ్యమాలిక ‘సినిమా ఒక ఆల్కెమీ.’

Dhaavlo Gor Banjara Kathalu – ఢావ్లో గోర్‌ బంజార కతలు

160.00

ఢావ్లో అంటే విషాదగీతం. దీనికి బంజారా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆడపిల్లగా పుటిష్ట్ర్టన ప్రతీ ఒక్కరూ దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. తమ దు:ఖాన్ని ఢావ్లో రూపంలో వ్యక్తపరుస్తారు. ‘ఢావ్లో’లోని కథలు భిన్నంగా ఉన్నాయి. ఇవి చదివినప్పుడు జానపద కథలేమో అనిపిస్తాయి. కానీ బంజారాల సంస్కృతీ సంప్రదాయాల మార్మిక దృక్పథాన్ని ఈ కథల్లో ప్రతి చోట మనకు బోధిస్తాడు రమేశ్‌. ఇప్పటిదాకా బంజారాల గురించి వారు వీరు చెప్తే విన్నాం. ఇప్పుడు ఆ తెగ నుండి వస్తున్న తొలి కథా సంపుటి ‘ఢావ్లో’ ఇది బంజారా సాహిత్యానికి మంచి శుభ పరిణామం.

పేజీలు : 163

Gaddaladatandayi

200.00

 ఈ నవలను  చదవటం ఏ పాఠకుడికైనా తన సామజిక జీవితానుభవాన్ని విస్తృతపరుస్తుందని నా నమ్మకం. ఈ నవలకు  కేంద్రం ఒక చిన్నపల్లె అయినప్పటికీ, దాని పరిధి దేశమంత విస్తృతమైనట్టిది. కొన్ని నదుల నీళ్ళు ఒక జలాశయంలో ఇమిడినట్టుగా, ఎన్నో సాంఘిక , ఆర్ధిక రాజకీయ సవ్యాపసవ్య సందర్భాలు ఈ నవలలో ఎంతో చిక్కగా, కుదురుగా ఇమిడి వుండటం, రచయిత శిల్పప్రతిభకు పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. ఇందులోని ప్రతి వాక్యం వెనుకా, వెన్నాడుతున్నట్టుగా రచయిత గొంతుక ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. మన సామజిక జీవితం ఎంత భీభత్సంగా ఉందొ, మానవ సంబంధాలు గానుగలో పిప్పిలా ఎలా పిండీకృతం అవుతున్నాయో’ ఎంతో భయానకంగా, రౌద్రంగా, వర్ణించి చూపెడుతుంది ఈ నవల. మౌఖిక  సంప్రదాయాన్ని  రచయిత  పాటించడం ద్వారా పాఠకుడిని తల ప్రక్కకు తిప్పనివ్వకుండా నిమగ్నం చేయటం ఈ నవల రచనలో రచయిత సాధించిన అద్భుత శిల్ప ప్రయోజనం – పాత్రలూ, జీవితమూ, భాషా, యాసా, సన్నివేశ కల్పనా, విమర్శనాపూర్వక వాస్తవికత, రచయిత కంఠస్వరం, ప్రయోజన దృష్టి, యిలాంటివన్నీ ఒకే కూర్పులో కలిసిపోవటం ద్వారా, ఈ నవల సాధారణ పాఠకుడి నుండి నద్విమర్శకుని వరకూ హృదయగతమవుతుందని నేను గాఢంగా నమ్ముతున్నాను.

Gangs Of Bangalore Naa Dadagiri Rojulu

375.00

 నా బయటి ప్రపంచానికి లోపలి ప్రపంచానికి సముద్రమంత వెలితి ఉండేది. బయటి ప్రపంచంలోని నా కార్యలాపాలను నా లోపలి సున్నితత్వం అంగీకరించేది కాదు. అక్కడి క్రౌర్యం, భయం, హింసా, మోసం కుట్రలు నా ఆత్మసాక్షిని ప్రశ్నించేలా ఉండేవి, దాన్ని ఎలా మార్చాలి? మార్చటానికి సాధ్యమా? ఒంటరిగా , గాఢంగా జీవితాన్ని ఆ ప్రశ్నల కొలిమిలో మధించ సాగాను. అప్పుడు అర్ధమయ్యింది , మారవలసింది ప్రపంచం కాదు. నేనని . ప్రపంచం అద్భుతంగా ఉంది. అక్కడ అంత క్రమబద్ధంగా మేళవించి ఉంది. తేడా నాలోనే …

                                                                                                  – అగ్ని శ్రీధర్.

Kasibhatla Venugopal- 3 Novels (Nenu Chikati, Thapana, Digantham)

300.00

గత దశాబ్ద కాలంలో “నేను – చీకటి” తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రభంజనమైతే “తపన” ఒక ఘంఘా మారుతం అయింది. “రాళ్ళెత్తిన కూలి” కథ సాహిత్యంకి పచ్చ బొట్టయింది. స్వతహాగా కవి. వీరి రచనల్లో కవిత్వపు వాసనలు గుబాళిస్తుంటాయన్నది కాదనలేని సత్యం. అది ఆయా రచనలకు అలంకార ప్రాయమే అవుతోంది.

                “సర్టిఫికెట్స్ చదువుకి కొలబద్దలైతే నాకు చదువు రాదన్నమాటే! నా దగ్గర ఒక సర్టిఫికెట్ కూడా లేదు మరి! చదువంటే నలభై అయిదేళ్ళ జీవితమే నాకు. భుక్తికి ఇన్సూరెన్సమ్మాకల్తో పాటు ఒ రెండు చిన్న వ్యాపార లావాదేవీల్లో ఇంకింత చిన్న వాటాలు, అంతే!” అంటారు శ్రీ వేణు గోపాల్.

                         ఇంకా-

                  “బ్రహ్మచారిని. మంచి పద్యమూ, పద్యమూ – రెండు నాకు ప్రీతి . అమ్మ కి||శే|| మనుమాంబ చిన్నప్పుడే పల్లె వేయించిన “అమరకోశము” చదివించిన “రఘు వంశము” ఈ రోజుకి నాకు ఉపయోగపడుతున్నాయి” అని గురువుని స్మరిస్తుంటారు.

Mee Rajyam Meerelandi

200.00

బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప
హిందువు కాడంటే

                            నేను హిందువును కాను

నాస్తికుడైతే తప్ప

కమ్యూనిస్టు కానేరడు అంటే

                     నేను కమ్యూనిస్టును కాను

అవినీతిని తాత్వికరించుకున్న దొంగలరాజ్యమ్ లో

ఆ దోపిడీ స్వభావపు పాలనాధికారమ్ కోసమే

తమ దళిత రాజకీయాలూ ఉన్నాయంటే

                   నేను దళితవాదిని కాను.

భిన్న భిన్న ప్రాంతాల వివిధాత్మక జీవితాన్ని

గుర్తించి ఆమోదిస్తే తప్ప

                 నేను ప్రతియా తాత్వికుణ్ణి కాలేను.

Naku Nenu Rasukunna Premalekha

100.00

సొంత అజ్ఞానం

కొంత ఆత్మజ్ఞానం

సొంత పైత్యం

కొంత సాహిత్యం

సొంత ఆరోహణ

కొంత అవరోహణ

సొంత దుర్గంధం

కొంత సుగంధం

వెరసి

ఇది స్వగ్రంథం

Features

Nuvvellipoyaka

250.00

“బ్రేకప్ ఒక కెథార్సిస్. ఇది నిలిచే బంధం కాదేమో అన్న ఆలోచనతో మొదలై, మేము విడిపోయాము అన్న ప్రకటన దాకా పూర్తి స్పృహతోతీసుకోవాల్సిన నిర్ణయాలు వుంటాయి. వాటికి నిందలు, కొట్లాటలు, బాధలు, ఏడుపులు,

జ్ఞాపకాలు ఇవన్నీ అడ్డం పడతాయి. ఒకరు తోడుగా వుంటారన్న నమ్మకం నుంచి నాకు నేనే తోడు అన్న ధైర్యం దాకా సాగే ప్రయాణం ఇది.ఇదంతా ఒక మనిషిని ప్రక్షాళన చేస్తుంది.ఫీనిక్స్ పక్షిలా మళ్లీ బతికిస్తుంది.” |

                                                           this is how it ends

ఝాన్సీ పాపుదేశి • నాగేంద్ర కాశి .వి. మల్లికార్జున్ • ఉషాజ్యోతి బంధం – కడలి సత్యనారము మూడి • వెంకట్ ఇద్దారెడ్డి • మానస ఎండ్లూరి – రిషి శ్రీనివాస • అరుణ పప్పు • మహి బెజవ

Patna Oka Prema Katha

250.00

సమకాలీన సందర్భంలో ముస్లిం అస్తిత్వ వేదనకి సంబంధించిన దాదాపూ ప్రతి కోణం ఈ నవలలో కనిపిస్తుంది. – అఫ్సర్

మండల్ కమిషన్ నుంచి మోడీ ప్రమాణ స్వీకారం దాకా సాగిన 90 ల తరం ఆత్మ కథ అబ్దుల్లా ఖాన్ రాసిన నవల – పాట్నా ఒక ప్రేమ కథ. ఇది ఒక అనుభూతి. మనసుతోనే పలవరించు. బతుకును బతుకుగానే వుండనివ్వు, దానికి వేరే పేరెందుకు? – అనంతు చింతపల్లి

భారతీయ సాహిత్యంలో అరుదుగా కనిపించే సమకాలీన ముస్లిం జీవితాల గురించి చేసిన ఒక నివేదిక ఈ నవల.    – అమితవ్ కుమార్

ప్రేమ, దుఃఖం మరియు ఆకాంక్షల కథ ఇది. అంతే కాదు ఇది పాట్నా నగరపు భావగీతం కూడా!

ఈ కథ మన గుండెల్ని మెలిపెడుతుంది ఇంతలోనే మనల్ని మైమరిపిస్తోంది. ఈ విషాద వీరుని కథ చదివి కన్నీరు పెట్టకుండా ఉండడం కష్టం.