Showing 397–408 of 860 resultsSorted by latest

Maharani Rudramadevi

125.00

గణపతి

ఏ జాతి వర్తనమ్మీ విశ్వవసుధైక

కల్యాణ లబ్ధికి కల్పవల్లి ఏ జాతి శేముషి యెల్ల తంత్రజ్ఞుల

పల్లటీల్ గొట్టించు పని న జేయ ఏ జాతి కీర్తివాహిని కవేరసుతా సు రాపగాదులకు సఖ్యప్రదాయి ఏ జాతి దుర్వార తేజమ్ము శాత్రవ రాజన్యకోటి కారటముగూర్చు ఆ మహాజాతి స్తవనీయ మనుపమాన మప్రతి ద్వంద్వ మకలంక మాంధ్రజాతి అట్టి తెల్గుల కాణాచి యగుచు వెలసె ప్రాజ్యకాకతి పూజ్య సామ్రాజ్యలక్ష్మి

జినదాసాచ్ఛదనాగ్రగణ్యు డొగి శాసించెన్ త్రిలింగమ్ము పెం పునకై కట్టగ పత్తన; మ్మెఱుక దేవుండాన పాలించి పు ‘ణ్యనిధుల్ పుత్రుల పేరుపై ననుమ కొండన్ గట్టి, వారాహ కే తన మెత్తించెను భావి కాకతి ప్రభుత్వ స్థాపనా రంభుడై.

Mega Cooking Book (Vegetarian)

180.00

దీనిలో ఉదయపు బ్రేక్ ఫాస్ట్ మొదలు…. అంటే ఇడ్లీ, దోసె, ఉప్మా, పురీ వెరైటీల దగ్గర్నుంచి స్వీట్స్ – హాట్స్ – చాట్స్ – స్నాక్స్ – పిండివంటలు; భోజనంలోని అన్ని రుచులు కూరలు – పచ్చళ్ళు – పులుసులూ – పులిహోరలు – పాయసాలూ – కిచిడీలూ – బాత్ లూ – పులావ్ లు ; రకరకాల ఉరగాయలు; ఇవి గాక పరోటాలు, వాటికీ కూరలు, కొత్తరకం అల్పాహారాలు… ఇలా ఒకటేమిటి? – మనకు ఎన్ని రకాల ఆహారాలున్నాయో అవన్నీ దీనిలో దర్శించవచ్చు! అందుకే ఇదీ భారీ వంటల పుస్తకం.

ఇది ఉంటే చాలు! వంటింటికి శోభ – మీ వంటికి ఆరోగ్యం.

Palavu Kurma

180.00

మాంసాహార వంటకాల్ని వెరైటీగా చేసుకుంటే చల్లని వాతావరణంలో ఆనందంగా నోరూరిస్తుంటాయి. మాంసాహారులకు కొత్తరకం పదార్ధాల తయారీ అంటే పసందుగా వుంటుంది. ఎప్పుడూ చేసుకునే వాటికి భిన్నంగా తయారు చేసుకుంటే ఘుమఘుమలాడే మసాలా వంటకాలు మాంసాహరులను నోరూరిస్తుంటాయి. అలాంటివి కొన్ని మీ కోసం….

Puranam Srinivasa Sastry Kathalu

150.00

కీర్తిశేషుని మాసిపోని కథాక్షరాలు

-విహారి

పురాణం శ్రీనివాసశాస్త్రి నాకు 1970ల నుంచీ మిత్రుడు. మొదట అతని కరలంటే ఇష్టం. ఆ తర్వాతి సాన్నిహిత్యంతో అతనూ ఇష్టమైనాడు. మృదువుగా మాటాడేవాడు. అసలు లోకం తెలీనివాడిలా ఉండేవాడు. కానీ, అతను లోకాన్ని చాలా దగ్గరగా చదివి తెలుసుకున్నవాడు. జీవికలోనూ, జీవితంలోనూ చాలా మునుగీతలూ, నిలువీతలూ వేసినవాడు. ఆంధ్రభూమిలోనూ ఆంధ్రప్రభలోనూ వారలోనూ పనిచేశాడు. ‘కోకిలమ్’ సాహిత్య సాంస్కృతిక వేదిక అతని మానస పత్రిక దాని గురించి ఎన్నో కలలుండేవి అతనికి. నేనూ, మునిపల్లెరాజు గారూ, పులిగడ్డ విశ్వనాథరావు గారి లాంటి వాళ్ళం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. శాస్త్రికి వాళ్ళ నాన్నగారు పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి సాహిత్యమంటే అమిత గౌరవం. ఎప్పుడూ వాటి గురించి చెబుతూ, అడపాదడపా ఏదో చేయాలని అంటూ వుండేవాడు. తాను చనిపోవటానికి ముందు తన కథాసంపుటి రావాలనే కోరికని వ్యక్తం చేశాడు. కథలన్నింటినీ బయటికి తీస్తున్నానన్నాడు. అతని కలల్ని (మరణానంతరం) వాస్తవం చేస్తూ వస్తున్న సంపుటి ఇది. దీనికి కారకులైన అందరికీ అభినందనలు.

శ్రీశా. కథల్ని పాఠకులు మెచ్చుకున్నారు. పత్రికా సంపాదకులు ఆనందించి బహుమతులిచ్చారు. (జ్యోతి, ఆంధ్రప్రభ (ప్రథమ బహుమతులు) యువచక్రపాణి నాలుగో అవార్డు, మళ్ళీ జ్యోతిలో బహుమతి… ఇలా), విమర్శకులూ, విశ్లేషకులు | ఎక్కువమంది చదవలేదు. చదివినవారు ఒకరిద్దరు ఉటంకించారు. నాకు నచ్చిన 400 తెలుగు కథల్ని విశ్లేషిస్తూ నేను ఐదేళ్ళు వివిధ పత్రికల్లో ధారావాహిక శీర్షికల్లో వాటిని పరిచయం చేశాను. వాటిలో శ్రీ. శ. ‘గూడు చాలని సుఖం |………..

Taratarala Telugu Visheshamshalu & Sahityamshalu 1&2

320.00

అందరికీ నచ్చే సుందర రచన

ముప్పై వసంతాల నాటి ముచ్చట్లతో ముందుమాటను ఆరంభిస్తాను. నాడు నేను ఉస్మానియా యూనివర్సిటి తెలుగు విభాగంలో పరిశోధక (పిహెచ్.డి) విద్యార్థిని. భాగ్యనగరంలో అది సాయంత్రం. నాలుగైదు కార్యక్రమాలైనా జరుగుతున్న బంగారపు రోజులవి. చిక్కడపల్లి ఈ సభల కీలక వేదిక. నావంటి నలుగురైదుగురు నవయువకులు దాదాపు ప్రతిరోజూ ఈ కార్యక్రమాలకు హాజరు కావడం రివాజు.

అప్పట్లో చీకోలు సుందరయ్య గారు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో “రంగ తరంగం” పేరుతో నగరంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల సమీక్షా కథనాలు వ్రాసేవారు. అంత స్పష్టంగా చెప్పలేను కానీ, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కృష్ణశాస్త్రి గారిమీద సిద్ధాంత గ్రంథం ఏదో ఆవిష్కరణసభ. ఆవిష్కరణ | కర్త సి.నా.రె. దిగ్గజాల వంటి కవులు, అనేకమంది సాహిత్యా భిమానులైన శ్రోతలు. సభ కిటకిటలాడుతున్నది. కొంతమంది చోటు దొరకక నిలబడ్డ పరిస్థితి. సి.నా.రె. ప్రసంగం సహజ సిద్ధమైన సభారంజకంగా సాగిపోతున్నది. మధ్యలో తన | ప్రసంగానికి కొంచెం విరామం ఇచ్చి “చూశారా ! ఈ కార్యక్రమం దిగ్విజయం | అయినట్టే లెక్క. మా మిత్రుడూ ప్రతిభావంతుడైన పాత్రికేయుడు చీకోలు | సుందరయ్య సైతం నిలబడే వార్త రాస్తున్నాడు” అన్నారు సి.నా.రె. అందరి దృష్టి సుందరయ్య గారి వైపు దిరిగితే సుందరయ్య గారి చూపు మాత్రం సి.నా.రె. ప్రసంగాన్ని సునిశితంగా వీక్షిస్తున్నది. ఆ రోజుల్లో సుందరయ్య ‘రంగ తరంగం ……..

Allam Seshagiri Kathalu

275.00

శ్రీపురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు “నీలి” కథతో దేశంలోనూ శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు “గాలివాన” కథతో ఇతర దేశాల్లోనూ తెలుగు కథకి మంచి పేరు సంపాదించిన తరవాత తెలుగు సాహిత్యంలో కథానిక ముందడుగు వేసిందని నేను తలుస్తున్నాను. కొత్త కొత్త రచయితలు కొత్త కొత్త దార్లంట వెళ్ళి, కొత్త సంగతులు కనుక్కున్నారు. అంతే కాదు చాలా మందికి తెలియని పాత సంగతుల్ని కూడా బైటికి తీసుకు వచ్పేరు. తెలుగు కథ విస్తరించింది. మధ్య తరగతి వారి గురించి కథలు వస్తున్నప్పటికీ ఇతర వర్గాల వారి గురించి కూడా కథలు వస్తూనే వున్నాయి. జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించడానికి తెలుగు కథ ప్రయత్నిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే, జీవితంలో ముఖ్యమైన అధర్మం ఒకటుంది. అదేమిటంటే ఒక జీవిని మరొక జీవి చంపుకు తినడం. చంపి తినడం అనేది జీవితంలో ముఖ్య విశేషం. ఈ లోకాన్ని భగవంతుడలా సృష్టించేడు కాబట్టి, ఒకరు మరొకర్ని చంపుకు తినడంలో తప్పు లేదని వాదించేవారిని కదిలించి చూస్తే చాలా మంది ఉంటారు. –

ఇతర ప్రాణుల్ని పూర్వపు మానవులు వేటాడి చంపి తినే వారు. ఇప్పుడు వాటిని పెంచి చంపి తింటున్నాం . తేడా పెద్దగా ఏమీ లేదు. అయితే ఇతర ప్రాణుల్ని మనం చంపి తింటున్నప్పటికీ కూడా మనల్ని మనం చంపుకోకూడదు తినుకోకూడదు అనే ఆలోచనలోకి మానవులం కొంత వరకూ వచ్చేమని చెప్పుకోవచ్చును. కాని అందులో కూడా నిజాయితీ లేదు. బలహీనుల్ని బలవంతులు చంపుతూనే ఉన్నారు. చంపకపోతే, దోచుకుంటూనే ఉన్నారు.

Desam Emaindhi

300.00

కరుణారసపూరితమైన ఈ ప్రఖ్యాత నవల ఆంగ్లమూలకర్త ఎలన్పేటన్ 1903లో దక్షిణాఫ్రికా లోని పీటర్ మారిట్జ్‌బర్గ్  లో జన్మించారు. నేటాల్ విశ్వ విద్యాలయంలో పట్టా పుచ్చుకొని, ఇక్స్ హోపో పట్టణంలో కొంతకాలం ఉపాధ్యాయులుగా పని చేసారు. ఈ నవలలో ఆ పట్టణాన్ని కన్నులకు కట్టినట్లుగా వర్ణించారు.
తరువాత కాలంలో పదేళ్లు జోహెన్స్ బర్గ్ లో ఆఫ్రికా బాలాపరాద శిక్షణా సంస్థ డిప్లూఫ్ కళాశాల ప్రధానాచార్యులుగా చేస్తూ, ఆ కళాశాల లోనే కాక దేశమంతటా కూడా ఆధునిక బోధనా శిక్షణ విధానాలను ప్రవేశ పెట్టడానికి కృషి చేసాడు.
ఈ అనుభవాన్ని పురస్కరించుకుని మనోహరమైన ఈ నవల వ్రాసారు. ఇది ఈయన మొదటి ప్రయత్నమే కానీ, ఈ నవల ప్రచురించిన వెంటనే అందరి ప్రశంసలు పొంది ఈయనకు విశేష కృషినార్జించి పెట్టడం వలన అనతి కాలంలోనే ఉద్యోగ విరమణ చేసి, శేషజీవితమంతా రచయితగా, ప్రజా సేవకుడిగా జీవితం గడిపారు. ఈ నవల 1949లో ‘సండే టైమ్’ ప్రత్యేక బహుమానం సంపాదించుకుంది.

Katha Sravanthi

65.00

ఈతరం కోసం అరసం కథానికా ఉద్యమం సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ పాఠకుడి హృదయానికి సన్నిహితమైన సాహితీ ప్రక్రియ తెలుగు కథానిక. వాస్తవికత పునాదిగా, గాఢత, క్లుప్తత, సౌందర్యాలే ప్రధాన లక్షణాలుగా జీవద్భాషలో పాఠకునితో సంభాషి స్తున్న ఉదాత్త సాహిత్య ప్రక్రియ మన కథానిక.

యవ్వనతేజంతో పురుడు పోసుకున్న తెలుగు కథానిక ఎందరో విశిష్ట కథకుల చేతుల్లో సహజ సుందర

మైన రూపురేఖలు దిద్దుకుంది. నూటపది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మన కథానికది. నాలుగు తరాల కథా రచయితలు తమ కలాలతో కలల్ని పంచారు, కన్నీళ్లను తుడిచారు. ఆశలను పెంచారు, ఆశయాలను అందిం చారు. జాతికి గొప్ప భవిష్యత్తును వాగ్దానం చేశారు. ఆ

దీపధారులను ప్రతి తరానికి పరిచయం చేయాలి. ఆ కథా కాంతులను ప్రసరింప జేయాలనే నిర్మాణాత్మక బాధ్యతను అరసం – గుంటూరు జిల్లా శాఖ చేపట్టింది.

1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో గుంటూరు జిల్లా తెనాలిలో ఆవిర్భవించిన అభ్యుదయ రచయితల సంఘం సకల సాహిత్య ప్రక్రియలను ప్రభావితం చేసి సాహిత్యాన్ని ప్రజాపక్షం చేసింది. మహోన్నతమైన ఆ సాంస్కృతిక వార సత్వాన్ని స్వీకరించిన అరసం గుంటూరు జిల్లా శాఖ సాహిత్యం ద్వారా సామాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తూ నిరంతర కృషిని కొనసాగిస్తూనే వుంది. కథా ప్రస్థానంలో గుంటూరు సీమది, అరసం గుంటూరు జిల్లా శాఖది ప్రత్యేకపాత్ర.

చిరస్మరణీయ కథలతో ‘కథాస్రవంతి’ శీర్షికన 80వ దశకంలో నాలుగు కథా సంకలనాలను వెలు వరించి కథా సంకలనాల ప్రచురణకు కొత్త ఊపునిచ్చింది…………..

KGH Kathalu

150.00

మనసులో మాట

మనసులోంచి తన్నుకొచ్చే ఆలోచనలన్నీ బిగబట్టి భద్రంగా దాచి ముప్ఫై ఏళ్ళ పైగా చదువులో మునిగి తేలి, ఇన్నాళ్లకు ఈ చదువిక అవ్వదని తెలుసుకుని, ఆ ఆలోచనలకి ఒక స్వేచ్ఛనిచ్చి మళ్ళీ పుస్తక రూపంలో బంధిస్తే వచ్చినవే ఈ కథలు.

మనసు మాతృభాషలోనే ఆలోచిస్తుంది. అందుకని తెలుగులో కాకుండా మరే భాషలోనూ నా ఆలోచనలని నిజాయితీగా రాయడం కుదరని పని. నిరంతర పోటీ పరిశ్రమలో బట్టీలు పట్టి వైద్యుడినైపోయిన నేను, ఎక్కడో ఏ మూలో నేను విన్న కథలు నాలో నన్ను అనే ఒకడ్ని సృష్టించి, ఆ భావం నిద్రాణమైపోకుండా నన్నెప్పుడూ మేల్కొల్పుతూ ఉండి చివరికి ఒక సృజనగా ఈ కథాసంపుటంగా ఇన్నాళ్లకు బయటకు వచ్చింది. – నేనొక మానసిక వైద్యుడిని. ఎందరివో బాధలు, గాధలు వింటాను; అయినప్పటికీ ఈ కథల్లో వారెవరి వివరాలు గానీ, అనుభవాలు గానీ లేకుండా జాగ్రత్త తీసుకుని కేవలం నా అనుభవాలు లేదా పరిశీలనలు మాత్రమే రాశాను. ఈ కథలన్నీ కూర్చొని ఆలోచించి పథకం ప్రకారం రాసినవి కావు, అన్నీ ఆశువుగా ఒక సాయంత్రం సోఫాలో కూర్చునో, ఏ రైలు ప్రయాణంలో తూర్పుకనుమలు చూస్తూనో రాసేసినవి. కాబట్టి నిడివి, లోతు, కథావస్తువు మొదలైన వాటిల్లో తారతమ్యం ఉంటుంది…………..