YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 361–372 of 860 resultsSorted by latest
కరుణశ్రీ సాహిత్యం 2
₹225.00ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.
కరుణశ్రీ సాహిత్యం 1
₹225.00ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.
Telugu Navala Sahithyamlo Manovisleshana
₹200.00ఒక మహా వృక్షాన్ని విశ్లేషించేప్పుడు దాని మూలాల్ని తరచి చూసినట్టే తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణా విభాగాన్ని విశ్లేషించేప్పుడు తెలుగు నవలా పరిణామ విశ్లేషణ, మనోవైజ్ఞానికపరమైన ప్రపంచ సాహిత్యాల ప్రభావం, ప్రపంచ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల సిద్ధాంతాల పరిశీలన కూడా జరిగితేనే ఆ అధ్యయనం సమగ్రం అవుతుంది. అందుకు మనోవిజ్ఞాన శాస్త్రం పై పట్టు ఉండాలి.
– కోడూరి శ్రీరామమూర్తి
Meepai Nammakam Unchandi
₹95.00మీరు మీ కలలను నిజం చేసుకోవాలని ఆశిస్తున్నారా? మీరు మీ శక్తి సామర్థ్యాలను వాటి గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నారా? అవును, అయినట్టయితే ఈ పుస్తకం మీరు తప్పక చదవాలి!
‘మీపై నమ్మకం ఉంచండి’ పుస్తకంలో మానవ నిక్షిప్తశక్తి ఉద్యమ పురోగాముల్లో ఒకరైన డాక్టర్ జోసెఫ్ మర్ఫీ – మీ కలలను సాకారం చేసుకుని మీ జీవితంలో ఘనవిజయం సాధించడం ఎలాగో చూపిస్తారు. మనం ప్రతి ఒక్కరం పుట్టుకతోనే బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉన్నాం. సరైన మానసిక వైఖరితో – విజయవంతం కావడానికి కావలసినవన్నీ ఉన్నాయి. అందుకు మీ సుప్తచేతనాత్మక మనసుకు శక్తినిచ్చే ఇంజనులాంటి చేతనాత్మక మనసును ఉద్దీపనం చేయగలగాలి. అప్పుడు ఇది మీ ఆశలనూ, ఆశయాలనూ పూర్తిస్థాయిలో సాధించే మార్గంలో నడవడానికి మిమ్మల్ని ఆయత్తం చేసే అసలు పనిని చేస్తుంది.
కవులు, కళాకారులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు – ఇలావిభిన్న రంగాలలో విజయాలు సాధించినవారు – తమ సుప్తనాత్మక మనసును ప్రోగ్రామింగ్ చేసి క్రమబద్ధంగా ఉపయోగించుకోవడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడానికి తమ కలలను, భావాలను లాభదాయకమైన రీతిలో ఎలా అమలు చేసేవారో తెలుసుకుని, మీరు కూడా మీ జీవితాలను సుసంపన్నం చేసుకోవడానికి, అలాంటి మెళకువలను అమలు చేయడం సునాయాసంగా నేర్చుకోగలుగుతారు.
Suprasiddha Vyaktula Jeevitaallo Aprasiddha Gadhalu
₹70.00మహనీయుల జీవితాల్లో మనకు తెలిసింది ఒక భాగమైతే, మనకు తెలియకుండా ఉన్న భాగంకూడా సహజంగానే మరొకటి ఉంటుంది. దానిని కూడా తెలుసుకుంటే పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే వీటిని రాశాను. ఇందులో 11 మంది ప్రముఖుల జీవితాల్లోని రెండు వైపులనూ చూపడం జరిగింది. ఈ వ్యాసాలలో కొన్ని ఆంద్ర పత్రికవారు ఒకప్పుడు వెలువరించిన ‘కలువబాల’ పత్రికలో ‘అద్దానికి మరోవైపు’ పేరిట ప్రచురితమైన శీర్షికలో వచ్చాయి. ఆ పత్రిక ఆగిపోయింది. శీర్షిక కూడా ఆగిపోయింది. అందుచేత మరికొన్ని విడిగా రాసినవి వ్రాత ప్రతిలో ఉండి పోయాయి.
వీటిని పుస్తక రూపంలో ప్రచురిస్తే బాగుంటుందనిపించి, పల్లవీ పబ్లికేషన్స్ వారికి పంపిస్తే వారు వెంటనే ప్రచురించేందుకు అంగీకరించారు. అందుకు వారికి కృతఙ్ఞతలు. ఇందులో 11 మంది ప్రముఖుల గురించే రాశానుగాని, ఇలా ఎంతమంది గురించి అయినా రాయవచ్చును. ఈ పుస్తకానికి లభించిన ఆదరణను బట్టి, ఆ ప్రయత్నాన్ని జరుగుతుంది.
– కోడూరి శ్రీరామమూర్తి
Jeevitham mee Chetullone
₹225.00నన్ను కప్పివేసే నిశి రాత్రిలో
ఈ చివరి నుంచి ఆ చివరకు పరుచుకున్న అంధకారం
దేవుడు ఏదైనా, ఎవరైనా
అపరాజితమైన ఆత్మను ఇచ్చినందుకు కృతజ్ఞతలు
పరిస్థితుల గుపిటిలో చిక్కుకున్నప్పుడు
నేను రచ్చ చెయ్యలేదు, బిగ్గరగా ఏడవలేదు
విద్ధి విసిరే సవాళ్ళను, దెబ్బలకు
నా శిరస్సు రక్తసిక్తమైంది, కానీ బెసగలేదు
– ప్రీతీ షెనాయ్
Sri Datta Puranam
₹450.00ఇది శ్రీ దత్తపురాణమను మహాగ్రంథము, సంస్కృతమున పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామి రచించినది, తెలుగులో టీకతో సమర్పింపబడుచున్నది. ఇది ఎన్మిది అష్టకములుగను, ఒక్కొక్క అష్టకము ఎన్మిది అద్యాయముల గుచ్చముగను రూపము దాల్చినది. ఇందు మొత్తము 3500 శోకములున్నవి.
ఈ అష్టాష్టక అష్టాధ్యాయ విషయములు సూచికలో చూడవచ్చును. సంస్కృత వ్యాఖ్యతో కూడిన నాగరిలిపి ప్రతి నాకు లభించినది. దానిని పరిశీలించి తెలుగులో ప్రతిపదార్థతాత్పర్యములను కూర్చినాను. పాఠకమహోదారులకు ఇది ప్రయోజనకారి కాగలదని నమ్మిక.
సర్దము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశ్యానుచరితము అను ఈ అయిదు లక్షణములున్నది పురాణము, అని లక్షణము చెప్పబడినది. ఈ గ్రంథమునందు ఈ లక్షణములున్నవా? అను ప్రశ్నకు శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామి వారి సమాధానము : ఈ గ్రంథమున ప్రకరణవశాత్తు ప్రథమకాండమున సర్గము, అంతిమకాండమున ప్రతిసర్గము, మధ్యలో వంశము, మన్వంతరము, వంశ్యానుచరితము వర్ణింపబడినవి కావున దీనిని పురాణమనుట సార్థకమే.
ఇందు ఉపాసనాకర్మజ్ఞానకాండల విషయములను సమాచరించు భక్తుల అనుభవము ప్రతిపాదింపబడినది. తెలుగువారికీ గ్రంథవిషయము నందించుట కర్తవ్యముగా నెంచి మిత్రులు రావి మోహనరావుగారు ప్రోత్సహించగా నే నీ పనికి పూనుకొని యథాశక్తి శ్రమించినాను. నా శ్రమ ఫలవంతమైనదను నమ్మికతో దీనిని మీ ముందు ఉంచుచున్నాను. ఈ కృషిలో నా ప్రతిభావ్యుత్మతులు చాలినవో లేదఆశ్రీ దత్తునకే ఎఱుక. ఎఱుక గల పాఠకులు దతస్వరూపులై మన్నింప ప్రార్థన.