YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 337–348 of 860 resultsSorted by latest
Anaganagaa Ok Cinema
₹200.00జననం – ప్రాధమిక విద్యాభ్యాసం మచ్చబొల్లారం.ఇంటర్ వరకు బొల్లారంలో చదివి, సికిందరాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో బి.కాం. చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీ, ఆంధ్రసారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో గ్రంధాలయ సమాచార శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాను. సాంకేతిక విశ్యాసఖలో గ్రంథపాలకుడిగా పంపికయి హైదరాబాద్ లోని పాలిటెక్నీకల్ లో ఇరవయుదేళ్ళుగా పని చేసి, 2014 లో పదవి విరమణ పొందారు.
ప్రాస్తుతం పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాహిత్యం, సినిమాలు, అభిమాన వ్యాపకాలు. హాలీవుడ్ సినిమా, కథావలోకనం, తెలుగులో మారుపేరు రచయితలు, కథావిష్కరం పుస్తకాలను వెలువరించారు. అయుదు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. తెలంగాణ తొలితరం – మలితరం కథకులు: కథనరీతులు, నాటక విమర్శ, సాహిత్య వ్యాసాలు పుస్తకాలుగా రానున్నాయి.
Sai Geethamritha Sa(Ga) Ram
₹230.00కె. వివేకానంద రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, అలాగే “సాయి కీర్తన” గారు కూడా ఫోన్ ద్వారా పరిచయం .
వివేకానంద రెడ్డి గారు చాలాకాలంగా వేలాది ఆధ్యాత్మిక గ్రంధాలని చదువుతున్న వ్యక్తి. నా ఆధ్యాత్మిక నవల “జయం” చదవం ద్వారా వారు నాకు పరిచయమయ్యారు. అయన తరచూ షిర్డీ వెళ్తూ, దారిలో హైద్రాబాద్ లోని మా ఇంటికి వస్తుంటారు. ఆయనది భక్తి మార్గం.
పుట్టుకతో అన్యమతస్తురాలైన కుమారి సాయి కీర్తన వారి మతాన్నే కాక హిందూమతాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసారు. వీరిద్దరూ సాయి భక్తులే. కుమారి “సాయి కీర్తన”, “సాయి సచ్చరిత్ర” ని చదివి దాని గూడార్ధాన్ని గురించి వివేకానంద రెడ్డి గారితో చర్చించాక, ఈ పుస్తకానికి అంకురార్పణ జరిగింది. వీరు పరస్పర సహాకారంతో ఈ పుస్తకాన్ని రాసారు.
ఈ పుస్తకం షిర్డీ సాయి భక్తులకే కాక , ఆధ్యాత్మిక ఆసక్తి గల అందరికి నచ్చుతుందని ఆశిస్తూ.
Thirumala Divyakshetram
₹450.00శ్రీనివాసుడి అవతరణ ఎలా ఎందుకు జరిగింది?
తిరుమల దేవుడి రూపు విష్ణువుదా? శివుడిదా ? శక్తిదా ?
కాళీ మాయల్నుండి శ్రీనివాసుడు భక్తుల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడు?
ఆలయ తలుపులు మూసేసే ముందు గర్భగుడిలో పూజాద్రవ్యాలు ఎందుకు ఉంచుతారు.
స్వామివారి హస్త విన్యాసాలు బోధించే తత్వం ఏమిటి?
ఆనంద నిలయంలో కొలువైన ఇతర దేవత మూర్తులేవారు?
అది మానవుడు తిరుమల పరిసరాల్లో తిరుగాడాడా?
ఏడుకొండల కి ఆ పేర్లు ఎలా ఎందుకు వచ్చాయి.
మెట్ల దారిలో అడుగడుగునా మైమరిపించే విశేషాలేమిటి?
మరెన్నో…
సింహప్రసాద్
Sri Purnima
₹430.00సృజియిస్తూ, అఖండ జెండాగా ఎగురుతూ, భక్త పాఠకులపై ఆనందరస వర్షాన్ని
కురిపిస్తున్న మనోహర రచనల రచయిత, సర్వాంతర్యామిత్వాల సంకలనకర్త పురాణపండ
శ్రీనివాస్ లోకకళ్యాణకారకంగా అందించిన మంగళ గ్రంధం ‘ శ్రీపూర్ణిమ’ గ్రంధం .
తెలుగునాట వండర్ ఫుల్ వర్కోహాలిక్ గా పేరుపొందిన శ్రీనివాస్ రమణీయ
సౌందర్యాల రచనాశైలికి, పుస్తక నిర్మాణ చాతుర్యానికి, సంకలనాల
నైపుణ్యానికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.
కె.వి.రమణాచారి సమర్పణలో ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ
ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పరమ రమణీయ శోభలతో ,
సుసంపన్నంగా అందించిన ఈ మంచి పవిత్ర గ్రంధాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం
కళ్యాణమండపంలో మహాపండితోత్తములు చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి
మంగళాశాసనాలు చెయ్యడం ఒక అపూర్వ సన్నివేశమైతే … ఇప్పటికి ఈ శ్రీపూర్ణిమ
సుమారు ఇరవై ఐదు ప్రచురణలు నోచుకోవడం ఒక పవిత్ర సంచలనమని చెప్పక తప్పదు.సుమారు ఏడువందల యాభైపేజీలలో , వేదవిహితమైన మంత్ర భాగాలతో , స్తోత్ర
వైభవాలతో, వాటికి పురాణపండ శ్రీనివాస్ ప్రామాణికమైన వ్యాఖ్యానాలతో ఈ
శ్రీపూర్ణిమ గ్రంధం రూపుదిద్దుకోవడంతో చాలామందితో కూడుకున్న భక్త సమాజం
తమ పూజాపీఠాలలో ఈ శ్రీపూర్ణిమను ఒక అఖండ శక్తిగా ఉంచుతున్నారు.
ఒక భౌతిక సాధనంతో కొలవలేని అప్రమేయ అంశాలెన్నో ఈ ‘ శ్రీపూర్ణిమ’ లో చోటు
చేసుకోవడం వల్లనే , ధర్మభావన వాళ్ళ ప్రేరేపితమైన పారమార్ధిక శక్తులుండటం
వల్లనే, వేంకటాచల క్షేత్ర అతీంద్రియ మహనీయతల్ని అద్భుతంగా వర్ణించడం
వల్లనే, సమస్త బ్ర హ్మాండం లోని ప్రతి అణువూ నారసింహుని విరాట్రూపంలోని
అభిన్నరూపమని చక్కని కథతో నిరూపించడం వల్లనే … తేజస్వుల వర్చస్సుగా ఈ
బుక్ సంచలనమై విశేషంగా ఆకర్షిస్తోంది. కేవలం స్తోత్ర భాగాలే కాకుండా
పురాణపండ శ్రీనివాస్ మధ్యలో ఇఛ్చిన స్క్రిప్ట్ సూపర్బ్.
ముఖపత్రంపై తిరుచానూరు అలమేలుమంగమ్మ దివ్యతేజస్సుల శోభతో ఈ పుస్తకం నిస్సందేహంగా ఒక అఖండ ప్రకాశంగా భక్త పాఠకులకు షోడశకళాప్రపూర్ణంగా అందిందనేది సత్యం.
బాహ్య ఆవరణలనుండి మనల్ని భగవంతుని వైపు నడిపించిన శ్రీపూర్ణిమ
పుస్తకాన్ని అందుకున్న వారెంత ధన్యులో. మహా మహా తలలు తిరిగిన,
నోరుతిరిగిన వేద పండితులు, పీఠాధిపతులు సైతం శ్రీనివాస్ కృషిని
అభినందించి ఆశీర్బలాలు అందించడం ఒక మంచి మంగళ పరిణామం.
శ్రీపూర్ణిమ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మంగళకరమైన ఐశ్వర్యమే !
ఈరోజుల్లో ఒక పుస్తకం రెండేళ్లలో ఇరవైఐదు ప్రచురణలకు నోచుకోవడమంటే ఆ
రచయిత తాలూకు తపస్సు ఫలించినట్లే.
అందువల్లనే ఈ రచయిత మరొక అమోఘ రచనా సంకలనం ‘ నన్నేలు నాస్వామి ‘ ఆంజనేయ
ఉపాస్య గ్రంధాన్ని అమిత్ షా వంటి రాజకీయ దిగ్గజం, ఈ దేశహోమ్ శాఖామంత్రి
ఆవిష్కరించారంటే ఇదేమీ మామూలు విషయం కాదు.
Maha Vishnu Puranam
₹400.00బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్టుని పుత్రుడు శక్తీ. శక్తీ భార్య గర్భవతిగా వుండగా అతడిని, అతడి నూర్గురు సోదరులని బ్రహ్మ రాక్షసుడి చేత చంపించాడు విశ్వామిత్రుడు.
తల్లి గర్భాన్నించి పుడుతూనే ‘ఓం నమో నారాయణాయ…’ నామ స్మరణతో జన్మించాడు శక్తీ కుమారుడు పరాశరుడు. పుట్టిన నాటినించి నిరంతర నారాయణ తపోదీక్షలో మునిగిపోయిన కన్నకొడుకుని చూసి ఆ తల్లి ఆవేశంతో రగిలిపోయింది. నీ తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకో…” అంటూ కొడుకుని రెచ్చగొట్టింది తల్లి. ప్రతీకారేచ్చతో రగిలిపోయిన పరాశరుడు అధర్వణ మంత్ర ప్రయోగంతో సుదీర్ఘ సత్రయాగం ఆరంభించాడు. ఆ యాగ ప్రభావం చేత మహామహులైన దానవులేందరో శలభాల్లా ఎగిరివచ్చి యాగాకుండలంలో పది మలమల మాడిపోయారు.
‘దానవజాతిని సమూలంగా నాశనం చెయ్యవద్దు’ అన్న తాత వశిష్టుడు కోరిక మన్నించి యాగాన్ని విరమించాడు పరాశరుడు. దానవజాతికి మూలపురుషుడైన పులస్త్య బ్రహ్మ సంతసించి “నా జాతి నాశనం కాకుండా కాపాడావు. నీకేం కావాలో కోరుకో…”అన్నాడు.
” మహావిష్ణు పురాణమును సంస్మరణ మాత్రానే గ్రహించవలసిన భవ్య జ్ఞానాన్ని అనుగ్రహించండి.” అని వరం కోరుకున్నాడు పరాశరుడు. అలా భూలోకానికి చేరువైంది ‘మహావిష్ణు పురాణము’. యుగయుగాలుగా మానవజాతిని మాధవ భక్తి పరులుగా, మర్చి మోక్ష మార్గాన్ని చూపుతోంది ‘మహావిష్ణు పురాణము’ ఇంటింటా ఉండదగ్గ పురాణగ్రంధ రాజం ‘మహావిష్ణు పురాణము’.
Telugu Sahitya Samiksha- 1, 2
₹680.00సుమారు దశాబ్దంన్నర కాలంలో ఆంధ్ర సాహిత్య చరిత్రను సవిమర్మకంగా సప్రమాణంగా అధ్యయనం చేసి స్నాతకోత్తరస్థాయిలోకి అధ్యేతలకు భోదిస్తున్న తెలుగు సాహిత్య చరిత్ర నిపుణులు డాక్టర్ జి। నాగయ్య గారు। ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రకు , కవి జీవితాలకు సంబంధించి గ్రంధరూపంగాను, పత్రికా వ్యాసాలుగాను వెలువడిన రచనల నన్నింటిని ఔపోశనం పట్టిన ఆదర్శ అధ్యాపకులు డా।। జి। నాగయ్య గారు। ఏది వ్రాసినా , సవిమర్శకంగా , సప్రమాణంగా స్పష్టంగా సరళశైలిలో వ్రాయడం డా।। నాగయ్య గారి ప్రాత్యేకత
Munniti Gitalu
₹200.00మున్నీటి గీతలు
సందెకాడ సూరీడు అందగాడినన్నాడు….. కొండచాటు నుంచి కొంగుచాటుదాక వచ్చాడోయమ్మా… వెలుగుతోటలో అగ్గిపూలనే పూయించాడమ్మా…..
మెత్తని ఎదలో పచ్చని ఆశలు రగిలించాడమ్మా…. పారవశ్యంతో కళ్లు మూసుకుని పాడుతున్నాడు జముకుల గరటయ్య. రాగం కూడా తీస్తున్నాడు.
డురుడుక్కు.. డురుడుక్కు.. డురుడుక్కు…
డ్రు డ్రు డ్రు డ్రు….
చేతుల్లోని జముకు వాద్యాన్ని చిత్రమైన శబ్దాలు వెల్లువెత్తేలా మోగిస్తున్నాడు.
అయితే అక్కడున్న పుంజీడుమందికీ ఆ పాట ఆ మోత అస్సలు నచ్చడం లేదు. మాడిపోయిన అరిసెల్లా కనిపిస్తున్న వాళ్ల మొహాలనుబట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు.
గరటయ్యకి ఇదేం బోధపడలేదు. నేత్రాలు మూతలేసుకుని రాగప్రస్తారాలు చేస్తూనే ఉన్నాడు.
కాబట్టే, అసహనం ముంచుకొస్తుండగా నిలుచున్న కిళ్లీ బడ్డీచోటు వదిలి పెట్టి పుక్కళ్ల ఎల్లారావు కదిలాడు. గరటయ్య దగ్గరసా నాలుగు అడుగులు విసవిసా వేశాడు. సరం తీగ చుట్టుకున్న మువ్వల కోలమీద చెయ్యివేశాడు. అదిమి పట్టేశాడు. జముకు ఆగిపోయింది. గీతం మలిగిపోయింది. ధ్వని నిలిచిపోయింది.
కంగారుపడి రెప్పలు తెరిచాడు గరటయ్య. ఎల్లడివైపు తీక్షణంగా చూశాడు.
“అదేంటి తండ్రీ! అడసుడిగా ఆపీసేవు, వీలయినంత మృదువుగానే అడిగాడు.
వెర్రెక్కిపోయినట్టయ్యాడు ఎల్ల. ………….
Katha Sravanthi (Set of Ten books)
₹670.00కనపర్తి వరలక్ష్మమ్మ కథలు, తల్లూరి నాగేశ్వరరావు కథలు, కరుణ కుమర కతలు, బలివాడ కాంతరావు కథలు, – శశిశ్రీ కాఠ్ఠలు, సంతి నారాయణ కథలు, – సతీశ్ చంద్ర కాఠ్ఠలు, పెద్దింటి అశోక్ కుమార్ కథలు, వి. ఆర్. రసాని కథలు, సన్నాపురెడ్డీ వేంకటరామిరెడ్డి కథలు,
Ardha Nari
₹320.00పితృస్వామ్య దృక్పధం పై యుద్ధం ఈ అర్ధనారి
జి. లక్ష్మీనరసయ్య
బండి నారాయణస్వామి రాసిన ఐదో నవల అర్ధనారి. గత నాలుగు నవలల్లో నాలుగు విభిన్న ఇతివృత్తాలను డీల్ చేశాడు. గద్దలాడతండాయి నవలలో దళిత బహుజన సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని పునాది దృష్టి నుంచి చూపాడు. మీరాజ్యం మీరేలండి దళిత బహుజన రాజకీయ చూపుతో వచ్చిన నవల. రెండు కలల దేశం పీడితకుల ప్రజల తాత్వికతను వెల్లడించింది. శృభూమి 18వ శతాబ్దపు రాయలసీమ చరిత్రలోని దళిత బహుజన ఘట్టాల్ని ముందుకు తెచ్చింది. ప్రస్తుతం మన ముందున్న అర్ధనారిలో ట్రాన్స్ జెండర్ వాస్తవికత గురించి బహుముఖ చిత్రణ ఉంది. తెలుగు నవలలో ఈ వస్తువును ఇంత వివరంగా లోతుగా డీల్ చేయడం ఇంతకుముందు జరగ లేదు. ఈ వస్తువుకు సమాంతరంగా పడుపువృత్తిని గురించిన మరో కథనం కూడా ఇందులో నడిచింది. రెండు సమస్యల వెనకా ఉన్న పితృస్వామిక సమాజాన్ని విస్తార విశ్లేషణకు గురిచేయడం ఉంది. ట్రాన్స్ జెండర్ ప్రపంచాన్ని రమణి ఉరఫ్ చంద్రన్న జీవితం ద్వారా నిర్మించుతూ పడుపు వృత్తి వాస్తవికతను రామలక్ష్మి పాత్ర ద్వారా చూపాడు. దిగువ మధ్యతరగతి బహుజన వ్యవసాయ కుటుంబానికి చెందిన చంద్రన్న అనే యువకుడు రమణిగా పరిణమించిన క్రమంలో కుటుంబం నుంచి, సమాజం నుంచీ, ప్రభుత్వం నుంచి నిరాదరణకు గురై అవమానాల్నీ, హింసనీ, వివక్షనీ, వంచననీ అనుభవించిన తీరు సమంజసంగా చిత్రించాడు రచయిత. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్ వ్యవస్థ నిర్మాణాన్ని అందులోని ఖాదాన్ లనూ, గురువులనూ, నానీలనూ, చేలాలను వారి జీవన విధానాన్ని రోజువారీ…………