YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 229–240 of 860 resultsSorted by latest
Barrister Parvateesam
₹828.00ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే రచన ”బారిష్టర్ పార్వతీశం”. ఇది హాస్య రచన. ఎప్పుడూ దూరప్రయాణం చేసి ఎరుగని పార్వతీశం ఒక్కసారిగా 1913వ సంవత్సరంలో నరసింహ శాస్త్రి ఇంట్లో అమ్మ నాన్నలకు చెప్పకుండా స్నేహితుల ప్రేరణతో ఇంగ్లండ్ వెళ్ళాడు. నిడదవోలులో రైలు ఎక్కడం మొదలుకొని స్టీమర్ లో ఇంగ్లండ్ చేరేవరకు పార్వతీశం చేసిన ప్రయాణాన్ని ఉత్తమ పురుష కధనంలో రకరకాల అనుభవాల్ని రచయత మొక్కపాటి నరసింహ శాస్త్రి ఈ నవలలో చిత్రించాడు.
ఎప్పుడూ పట్టణాలు,నగరాల మొహం ఎరుగని పార్వతీశం ప్రవర్తన, వేషధారణ హస్యస్పోరకంగా ఉంటాయి.ఇందులో చాల విషయాలు ఇప్పటివారికి చాలా మాములుగా అనిపించవచ్చు. కానీ ఆ కాలంలో అదొక వింత.
Vamsi Evo Konni Gurtukostunnayi
₹600.00‘ఏవరినన్నా పెళ్లి చేసుకోవాలి ఈ నెలలో…
అనుకుంటా బజార్లో నడుస్తా వస్తున్న నాకు ఒంట్లో నలతగా ఉన్నట్టనిపించడంతో, హాస్పిటల్కెళ్తే తెలిసింది గర్భవతినని…’ అంటా రాయడం మొదలెట్టానో లేదో ఒక్క కుదుపుతో ఆగి మళ్లీ కదిలింది మేమెక్కినా రైలు.
“నా పేరు కళ… పూర్తి పేరు జీవకళ…’
“నీ పేరేంటీ?”
“రూప.”
“పూర్తి పేరు చెప్పు?”
“సాధురూప.”…………
Features
Katha 2021
₹140.00కల్లోల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయా?
వాసిరెడ్డి నవీన్
కథారచనకు స్వేచ్ఛావ్యవస్థ తప్పనిసరి.
ఆమాటకొస్తే ఏ రచనకైనా అది అవసరమే. ఇప్పుడు ఆ వ్యవస్థ బలహీన పడుతోంది. అంటే రచయితలకు స్వేచ్ఛ లేదని కాదు. (అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఆ స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అది వేరు.) కానీ కనపడని ఇనుపతెరలు దానికి అడ్డుగా వేలాడుతున్నాయి. రచయిత తన అభిప్రాయాలను, భావావేశాలను, దృక్పథాన్ని, తనకు తెలిసిన జ్ఞానాన్ని, తెలివిడిని తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పంచుకోవాలని తపన పడతాడు. రచనకున్న ఈ ప్రాథమిక ఉద్దేశానికి ఆటంకాలు ఏర్పడుతున్న దశ ఇది. మరీ ముఖ్యంగా సృజనాత్మక రచనలకు.
కథలకు కానికాలం వచ్చేసింది.
ఇటీవల కాలంలో కథల నిడివి రానురాను కుంచించుకుపోతోంది. ఎంచు కున్న కథావస్తువుకు అవసరమనిపించినంత, రాయవలసిన అవసరం ఉండి, రాయగలిగి కూడా రచయిత రాయలేకపోవడం విషాదం కదా! పత్రికల్లో సాహిత్యానికి జాగా తగ్గిపోవడము, కథలను ప్రచురించే పత్రికలు కనుమరుగైపోవడము, తెలుగు సాహిత్యాన్ని వారసత్వ సంపదగా
Enduku Tho Modalu
₹399.00ఉపోద్ఘాతం
‘ఎందుకు’ లో దాగి ఉన్న శక్తి
నా జీవితంలో అవసరమైన సమయంలో సరిగ్గా ఈ ‘ఎందుకు’ ఎదురయింది. అది అధ్యయనంలోనో మానసిక క్షేత్రంలోనో జరిగిన పరిశోధన కాదు. నేను చేస్తున్న పనిమీద నాకు ఆసక్తి నశించింది. నా చుట్టూ చీకటి అలుముకున్నది. నేను చేసే పనిలోనూ, నా ఉద్యోగంలోనూ ఏ లోపమూ లేదు. ఆ పనిచేయటంలో ఆనందాన్ని కోల్పోయాను. బయటికి కనిపించే పరిస్థితులు చూస్తే నేను ఆనందంగానే ఉన్నానని చెప్పాలి. నా జీతం బాగున్నది. నా ఖాతాదారులందరూ చాలా మంచివాళ్ళు. కానీ అందులో నాకు ఆనందము. తృప్తి కలగటంలేదు. ఒక మంచి ఉద్యోగం చేస్తున్న సంతృప్తి, అనుభూతి నాకు కలగటం లేదు. పనిపట్ల అనురక్తి, పాశము నాలో మరొకసారి కళ్ళు తెరవాలి.
ఈ ఎందుకు కనుక్కున్న తర్వాత ఈ ప్రపంచం పట్ల నా దృక్పధం పూర్తిగా మారిపోయింది. ‘ఎందుకు’ కనుక్కున్న తర్వాత నా అనురక్తి. పాశము ఎప్పటికంటే ఎన్నోరెట్లు పెరిగాయి. అది అతి సరళం, శక్తివంతం, ఆచరణాత్మకం కూడా. కనుకనే వెంటనే నా స్నేహితులందరికీ చెప్పేశాను. అంతేగదా మరి! విలువైన విషయం ఏదైనా తెలియగానే మన సన్నిహితులతో చెప్పుకుంటాం. ఆ ఉత్తేజంతో నా మిత్రుల జీవితాలే మారిపోసాగాయి, ఆ కారణంగా నా మిత్రులందరూ వచ్చి ఆ రహస్యాన్ని తమ సన్నిహితులందరికీ చెప్పమని అడిగారు. అలా ఆ భావన విస్తరించసాగింది………….
Vivahallo Vichitra Hatyalu
₹300.00వివాహాల్లో విచిత్ర హత్యలు
రాత్రి పదీ ముప్ఫై రెండు అయింది. కమలా కళ్యాణ మండపం వందలాది అతిథులతో క్రిక్కిరిసి వుంది. ముందువరసలో వున్న సోఫాలో నేనూ పార్వతీ కూర్చున్నాం. ఎలక్ట్రిట్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. పురోహితుడు మంగళసూత్రాన్ని నా దగ్గరకు తీసుకొచ్చాడు. నేనూ పార్వతీ ముట్టుకుని రాజేశ్వరి దాంపత్య జీవితం నాలుగు కాలాలపాటు సుఖంగా సాగాలని దీవించాం. రాజేశ్వరి బి.ఎస్.సి. పాసయింది. నా మిత్రుడు కమలాకర్‌రావు కూతురు, పురోహితుడు మంగళసూత్రాన్ని తతిమ్మా పెద్దల వద్దకు తీసుకు వెళ్ళాడు.
నిముషాలు గడుస్తున్నాయి. పెద్దల అరుపులు, పిల్లల కేకలు, బయట రోడ్డుమీద కారు హారన్లు వినిపిస్తున్నాయి. వుడ్బైన్ సిగరెట్ వెలిగించాను. పురోహితుడు మా ముందున్న పెళ్ళి పీటవద్దకు వెళ్ళాడు. మంగళసూత్రాన్ని పెళ్ళికొడుక్కి అందించాడు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. పెళ్ళికొడుకు లేచాడు. కాస్సేపట్లో బాజా భజంత్రీలు రణగొణధ్వనులు చెయ్యసాగాయి. పెళ్ళికొడుకు మంగళసూత్రాన్ని కట్టడానికి ముందుకి వంగాడు. ఢాం అని పిస్టల్ పేలింది!
మరుక్షణంలో ఎందరో పరుగెడుతూన్న బూట్ల చప్పుడు వినిపించాయి. సోఫాలోంచి లేచాను. నలువైపులా చూశాను. చటుక్కున లైట్లు ఆరిపోయాయి. కమలా కళ్యాణమండపాన్ని చీకటి తెరలు కప్పేశాయి.
ఏవో అరుపులు, ఏడ్పులు, పరుగెడుతూన్న బూట్ల చప్పుళ్ళు, పార్వతిని దగ్గరగా లాక్కున్నాను. జేబులోంచి టార్చితీశాను. టార్చికాంతిలో పెళ్ళి పీటవైపు చూశాను. అక్కడ అనేకమంది గుంపులుగా నిలబడ్డారు. గబగబా అటు నడిచాను. బలంగా అతిథులను తోసుకుంటూ లోపలకు జరిగాను.
టారి కాంతిలో పెళ్ళిపీట మీద వెల్లకిలా వెనక్కి పడిపోయిన రాజేశ్వరి కనిపించింది. గొంతు ప్రాంతంలో రక్తం విశేషంగా చిమ్ముతోంది. ముందుకు వంగి ఆమె నాడిని పరిశీలించాను. రాజేశ్వరి చనిపోయిందని వెంటనే గ్రహించాను. లేచి నిలబడ్డాను. చుట్టూ చీకటి. ఆ అంధకారంలో నా కంఠం గంభీరంగా మ్రోగింది. “ఎవ్వరూ కదలకండి! మండపం గేట్లు మూసివేయండి!”…………………..
Doshiki Nidra Pattadu
₹300.00దోషికి నిద్ర పట్టదు!
రాత్రి తొమ్మిది అవస్తోంది. సముద్రానికి దగ్గరగా వున్న సమ్మర్ విల్లా భవనంలోకి రాజారావు అడుగుపెట్టాడు. ఫ్లోరసెంటు దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. తన భార్య మనోరమకోసం నలువైపులా చూశాడు. ఎక్కడా ఆమె కనిపించలేదు. లోలోపల విసుక్కున్నాడు.
కాశ్మీర్లో మూడు నెలలుండి మళ్ళా అతను తిరిగొచ్చాడు. మద్రాసులో వున్న మామగారిల్లు చేరుకున్నాడు. మనోరమ ఇంట్లో లేదు. మహాబలిపురంలో కట్టించిన సమ్మర్విల్లాలో ఆమె విశ్రాంతి తీసుకుంటోందని మామ చెప్పడం మూలంగా తిన్నగా అతనిక్కడికి వచ్చాడు.
తన భార్య ఏరోడ్రోమ్కి వచ్చి స్వాగతం చెపుతుందనుకున్నాడు. తనొస్తున్నట్లు ముందు టెలిగ్రామ్కడా ఇచ్చాడు. ధనవంతుల కూతుళ్ళను పెళ్ళాడితే ఇలాగే ఉంటుందేమో! రాజారావు హాల్లోకి ప్రవేశిస్తూంటే కనకరాజు ఎదురయ్యాడు.
“హల్లోవ్, ఎప్పుడొచ్చారు?” అడిగాడు కనకరాజు.
“ఇప్పుడే. మనోరమని ఎక్కడేనా చూశారా?” అడిగాడు రాజారావు. “ఇందాకా చూశాను. ఆమె చాలా బిజీగా వుంది. మీకు తెలిసిన అతిథులు హాల్లో ఉన్నారు. వెళ్ళి వాళ్ళను కలుసుకోండి.”
ఏదో అర్జెంటు పని వున్నట్లు కనకరాజు పోర్టికోలోంచి ఎడంవైపుకి తిరిగి తోటలోకి దూసుకుపోయాడు.
రాజారావు హాల్లో నడవసాగాడు. హాలు ప్రకాశవంతంగా వుంది. పెద్దహాలు, దీపాల కాంతిలో మొజాయిక్ ఫ్లోరు మెరుస్తోంది. కొంచం దూరంలో కొందరు కౌంటరు ముందు నిలబడి కోకోకోలా తాగుతున్నారు. మాట్లాడుతూ నవ్వుతున్నారు. రాజారావు వాళ్ళవైపు నడిచాడు. కౌంటరు ముందుకి వెళ్ళాడు. తెల్లటి యూనిఫారమ్ ధరించిన పుల్లయ్య రాజారావుకి నమస్కరించి ఒక కోకోకోలా బుద్దిని తెరిచి వేసి అందించాడు………….