Showing 193–204 of 860 resultsSorted by latest

With Your Permission

200.00

వెన్నెల చల్లగానూ లేదు, వేడిగానూ లేదు. వెన్నెల జలదరింపుగా ఉంది. నొప్పిగా ఉంది. గాయంగా ఉంది… దుఃఖం దుఃఖంగా ఉంది. కన్నీళ్లు కూడా నొప్పిగా ఉన్నాయి. మెదడంతా పచ్చి పుండై నొప్పిని నరనరంలో పాకిస్తుంటే కన్నీరు హృదయంలోకి, చర్మం మీద ఇంకిపోతూ దేహం నొప్పితో ముడుచుకు పోతున్నది…

కన్నీరెందుకు… ఈ నొప్పీ ఎందుకు మరి? నీ కోసమా బిపిన్… తెలీదు. ఈ అవమానం జరిగినందుకా… ఆడదాన్నైనందుకు… లేదా ఆడదాని దేహం నాకున్నందుకా ఇలాంటి గాయం? నాకేనా… ఒక్క నాకేనా. అందరికీనా… ఆడవాళ్ళందరికీనా లేదా కొందరు ఆడవాళ్లకేనా? నువ్వెందుకో బాగా గుర్తుకు వస్తున్నావు. నదికి సముద్రం జ్ఞాపకం వచ్చినట్లు, పూలకు తనని పట్టించుకోకుండా తన పక్కనించే వెళ్లిపోయిన చిరుగాలి జ్ఞాపకం వచ్చినట్లు, మండే ఎడారికి వానజల్లు జ్ఞాపకం వచ్చినట్లు, ఆకలేసిన పాపాయికి తల్లి పాల పరిమళం జ్ఞాపకానికి వచ్చినట్లు, నాకు… నా బిపిన్ చంద్రా నువ్వే జ్ఞాపకం వస్తున్నావెందుకు? నా గాయం మాన్పే మందువనా నువ్వు. ఎందుకు మరి? నిన్ను కోల్పోయినందుకా… లేక నా జీవితం ఇలా అగాధంలో పడిపోతున్నందుకా… ఎందుకు…? నేను తీసుకున్న నిర్ణయం సరైంది కానందుకా? ఎంత నమ్మకమో కదా నీకు నా మీద. అది పూర్తిగా ధ్వంసం…………….

Soonyam

275.00

పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో “ఎగిరిపో! నీకు స్వేచ్ఛనిస్తున్నాను” అన్నాడట ఒక యువకుడు. “ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా?” అని అడిగిందట పక్షి. 83లో అదీ పరిస్థితి. ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా ప్రతిరూపాలే. – ముక్తవరం పార్థసారథి తనకు విలువలున్నాయంటే అది ధిక్కారంలాగా కనిపిస్తుంది. తనకూ వాళ్ళకూ మధ్య యింత ఎడం ఎందుకు? ఈ నిత్య జీవితపు రొచ్చులో ఎవరూ తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా రాసేటప్పటి తన నిజాయితీనయినా నమ్ముతారా? ఈ వూహలూ, ఈ అనుభవం మరపుతెరల మరుగున మాయం కాకముందే – రొటీన్ జీవితపు అడుగున పడిపోకముందే అక్షరరూపంలో వ్యక్తమయ్యే నిజాయితీయే సాహిత్యం. అటువంటి సాహిత్యం అది శూన్యంకాదు – జీవితం. అర్థవంతమైన జీవితం. – – వరవరరావు

Anaganaga oka cinema

200.00

జననం – ప్రాధమిక విద్యాభ్యాసం మచ్చబొల్లారం.ఇంటర్ వరకు బొల్లారంలో చదివి, సికిందరాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో బి.కాం. చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీ, ఆంధ్రసారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో గ్రంధాలయ సమాచార శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాను. సాంకేతిక విశ్యాసఖలో గ్రంథపాలకుడిగా పంపికయి హైదరాబాద్ లోని పాలిటెక్నీకల్ లో ఇరవయుదేళ్ళుగా పని చేసి, 2014 లో పదవి విరమణ పొందారు.

                        ప్రాస్తుతం పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాహిత్యం, సినిమాలు, అభిమాన వ్యాపకాలు. హాలీవుడ్ సినిమా, కథావలోకనం, తెలుగులో మారుపేరు రచయితలు, కథావిష్కరం పుస్తకాలను వెలువరించారు. అయుదు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. తెలంగాణ తొలితరం – మలితరం కథకులు: కథనరీతులు, నాటక విమర్శ, సాహిత్య వ్యాసాలు పుస్తకాలుగా రానున్నాయి.

Vallu Padina Bhupala Ragam

225.00

డా.పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీత కథ’ వాళ్ళు పాడిన భూపాలరాగం

– శీలా సుభద్రాదేవి

డా.పి. శ్రీదేవి పేరు చెప్పగానే ‘కాలాతీత వ్యక్తులు’ నవల గుర్తుకు రానివారు అరుదు. అయితే ఆమె కథలు కూడా రాసినట్లు తెలిసినా ఆ కథల్ని తెలిసినవారు తక్కువే. పి.శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాటిలో ‘కాలాతీత వ్యక్తులు’కు దీటుగా ఉన్న కథలు ఉన్నాయి. నవలలో పాత్రల లాగే మరపురాని పాత్రలతో ఉన్న కథగా చటుక్కున చెప్పదగినది – ‘వాళ్ళు పాడిన భూపాలరాగం’. ఇది 1959లో జయంతి (జులై) సంచికలో ప్రచురితం. 1966లో ‘ఏరినపూలు’ సంకలనంలో చేర్చబడింది. అనేక భిన్న మనస్తత్వాలు గల పాత్రలలో, అనేక సంఘటనలతో, ఆనాటి సమజానికి ప్రతిబింబంగా ఉండి, కథావిస్తృతి కలిగి ఉండటం చేత దీనిని నవలికగా కూడా చెప్పుకోవచ్చు. కాలాతీత వ్యక్తులు నవల రాసిన తర్వాత రాసిన కథ కావటాన కథాసంవిధానంలో, పాత్రల చిత్రణలో ఈ కథపై కూడా దాని ప్రభావం ఉంటుంది.

ఇందులోని కథంతా చెప్పకుండా పాత్రల్ని, పాత్రల స్వభావాల్నీ, మాత్రమే చెపుతాను. ఎందుకంటే ఇందులోని పాత్రలు కూడా సమాజంలో ఎప్పటికీ ఉండే పాత్రలే. పాత్రని సృష్టించేటప్పుడు పాత్రల యొక్క మూలస్వభావాన్ని కూడా పాఠకులకు అవగాహన అయ్యేలా సంఘటనల్నీ, సంభాషణల్నీ కూర్చే శైలి శ్రీదేవికే స్వంతం. అందుకనే వీరి పాత్రలు ఎప్పటికీ సజీవంగా వుంటాయి.

రామచంద్రయ్య: శుద్ధ మాష్టరీ ఉద్యోగం. లేమికి గానీ, అశుచికిగానీ బాధపడడు. అనారోగ్యం ఎరగడు. జీవితావసరాలు సమపాళ్ళలో వుండే కుదురైన సంసారం. రేడియోలూ, సినిమాలూ, గ్రామఫోన్ల వంటి అధునాతనమైన వాటిని నమ్మడు. ఇంట్లో ఏ కార్యం చేసినా పొదుపుగా, శాస్త్రోక్తంగా చేస్తాడు. ఒకరి మీద ఆధారపడకుండా బతకాలనే మధ్యతరగతి సగటు మనిషి మనస్తత్వం, జీవన విధానం కలవాడు. తిండి, బట్ట బతకటానికి చాలనేది అతని ఉద్దేశ్యం. అందుకే…………………

Lopali Daari

250.00

Lopali Dari Short Stories by Sowbhagya సౌభాగ్య అనబడే పాలెళ్ల విజయకుమార్ ఒక బహుముఖీన ప్రజ్ఞగల సాహిత్యవేత్త. ఏదో ఒక సాహిత్య ప్రక్రియలో మాత్రమే కాకుండా కవిత్వం, కథ, నవల, విమర్శ, అధ్యయనాత్మక సాహిత్యం, వ్యక్తిత్వ వికాస ఉద్దీపక సాహిత్యం ఇలాంటి వివిధ విభిన్న రంగాల్లో విశేషమైన కృషిచేసిన ప్రతిభాశాలి. కవిగా, దాదాపు తొమ్మిది సంపుటాలను వెలువరించారు. ముప్పది తొమ్మిది సాహిత్య విమర్శ గ్రంథాలను అందించి నాణ్యమైన విమర్శకునిగా పేరుపొందారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొథె, ఐన్స్టీన్, జాన్ కీట్స్, రస్సెల్, ఖలీల్ జిబ్రాన్, తావో తెచాంగ్, సిసిరో వంటి వ్యక్తుల ఆసక్తికర గ్రంథాలను సరళంగా పాఠకులకు అందించిన పరిశోధకుడు. ప్రధానంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఓషో భావజాలాన్నీ, చింతననూ అనేక గ్రంథాలుగా అందించారు. సాభాగ్య అనేక దశాబ్దాలుగా అనితర సాధ్యమైన ఈ రచనా కార్యక్రమాన్ని నిష్ఠతో కొనసాగించి దాదాపు 195 గ్రంథాలను యిప్పటివరకు వెలువరించారు. ఒక సాహిత్య కారుడు ‘సాహిత్య సాధన’ను తపస్సుగా స్వీకరించి, నిరంతర యజ్ఞంగా కొనసాగిస్తే తప్ప ఇంత నాణ్యమైన, ప్రామాణికమైన అక్షర సంపదను సృష్టించడం సాధ్యం కాదు. ఏ.గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా మోతె గ్రామానికి చెందినవారు. 2006లో UK లోని బెడ్ ఫోర్డ్ యూనివర్సిటీ నుండి MBA పూర్తి చేశారు. కొంత కాలం అక్కడే జాబ్ చేసి, తిరిగి ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ లో e-tutors world పేరుతో, మొట్టమొదటి online tuitions అకాడమిని ప్రారంభించారు. 2010 లో ఓ ఫిల్మ్ స్కూల్ నుండి డైరెక్షన్ కోర్స్ చేసి, రెండు తెలుగు సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్గా, సహ రచయితగా పనిచేశారు. 2016 నుండి మాయాజూమ్ ఫిలిమ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి, యాడ్ ఫిలిమ్స్న, డాక్యుమెంటరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. సాహిత్యం అంటే ఆసక్తి,

Shunyamlo Poolu

150.00

అమరావ్రతం

దీపశిఖపై మృత్యువు నర్తిస్తోందా అన్నట్టు గదిలో దీప గాలికి  టపటపా కొట్టుకుంటోంది. మంచం మీద రంగాచారి చరమ దశలో ఉన్నాడు. భార్య సత్యవతి, కొడుకు రామాచారి కన్నీళ్ళతో చూస్తున్నారు. శాస్త్రులు గారు నాడి చూసి “ఇక లాభం లేదమ్మా సత్యవతీ” అని లేచారు. ఒక వైపు దేహాన్ని మృత్యువు కబళించివేస్తున్నా, రంగాచారి మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. వాళ్ళ రాజ్యంలోనే కాదు చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా రంగాచారి పేరు తెలియని వారు అరుదు. అంతటి గొప్ప శిల్పి ఆయన. రామాచారిని మాత్రం ఉండమని సత్యవతిని కూడా బయటకి వెళ్ళమని సైగ చేసారు. కన్నీళ్ళు పెట్టుకుంటున్న కొడుకువైపు చూసి “శిల్పికి మరణం లేదు. అసలు ఏ మనిషికీ మరణం ఉండదు. కళ్ళు తుడుచుకుని చెప్పేది విను” అన్నారు. ఆ దశలోనూ ఖంగున పలికింది ఆయన కంఠం………………………

Yuva

375.00

కొత్త స్వరాల అన్వేషణలో

(an appeal)

ఇదంతా వొక ఆందోళన జీవి గోల. వద్దనుకునే పాఠకులు యీ పేజీలు తప్పించి నేరుగా లోపలి కథల్లోకి వెళ్లిపోవచ్చు.

܀ ܀ ܀

చుట్టూ చీకటి. దారి అగమ్యం. చేతిలో దిక్సూచి లేదు. ఎక్కడ యెలా మొదలు కావాలో తెలీదు. అంతా యెగుడు దిగుళ్ళు. నడక ప్రతి అడుగులోనూ సంశయం. వెతుకులాట దేనికోసమో యేర్పడదు. కాళ్ళకి చుట్టుకునే తీగపై ఆశ. అది పామేమోనని భయం. కొన్నిటిని గుర్తించి నిర్వచించుకోవడం దగ్గరే మొదటి గండం యెదురవుతుంది. కొన్ని లేవని బెంగ. దూరంగా వొక వొంటరి చుక్క మెరుస్తుంది. అది వేకువ రాకడని తెలుపుతుంది. చూపు తేటబడుతుంది. దారి గోచరిస్తుంది.

అకస్మాత్తుగా ఆగిన కథో జీవితమో వొక ఆసరాతో మళ్ళీ మొదలౌతుంది. ఇదొక నిరంతర

ప్రయాణం.

܀

కొత్త తరం పాత తరం భుజాల మీద కూర్చుని చూస్తుంది కనకనే యెక్కువ దూరం చూడగలుగుతుంది – ఇవే మాటలు కాదు గానీ తన జీవితానుభవం నుంచి యిటువంటి అర్థం వచ్చే మాటలే అంటాడు ఐజాక్ న్యూటన్. మన యెదుగుదలకూ పురో గమనానికీ మనకంటే పెద్దవాళ్ళు అంతకుముందే నిర్మించిన దారి వొకటి వుంది కాబట్టి ఆ దారిలో నడవడం తేలిక అని ఆయన వుద్దేశ్యం. అయితే పాత దారుల్లో నడవడమో వాటిని పొడిగించుకోవడమో మాత్రమే చేస్తే కొత్త దారులు యెప్పుడు యెలా పరుచుకుంటాయి అన్నది పెద్ద ప్రశ్న. శాస్త్ర సాంకేతిక రంగాల్లో న్యూటన్ మాటల్ని కొంతవరకు అంగీకరించవచ్చేమో గానీ సృజనాత్మకతకి నెలవైన………………

Cinima Musings

225.00

The Great Beauty

ఈ చిత్రంలో అరవై ఐదేళ్ల Jep Gambardella ఒక రాత్రి తనకు బాగా పరిచయం ఉన్న అమ్మాయితో casual sex అనంతరం బెడ్ మీదే కూర్చొని తీరిగ్గా సిగరెట్ తాగుతుంటాడు. “You didn’t seem to enjoy it much. You didn’t seem to care” అంటుంది ఆమె. “It was okay” లాంటి కామెంట్ ఏదో చేసి పెద్దగా ఆమెను పట్టించుకోడు Jep. వెంటనే ఆమె మీద బోర్ కొట్టి అక్కడి నుంచి వచ్చేస్తాడు కూడా. సినిమాలో తర్వాత తనకు బాగా నచ్చిన అమ్మాయి Ramona పక్కనే ఒక రాత్రంతా కబుర్లు చెబుతూ పడుకుని, ఉదయం “It feels good to not make love” అంటాడు. అతను impotent కాదు, శృంగారం మీద ఏవగింపూ లేదు. నిజానికి దశాబ్దాల పాటు రోమ్ లోనే ఉంటూ నైట్ పార్టీల్లోనే సగం జీవితం గడిపి ఎందరో అందగత్తెలతో రసవత్తరమైన జీవితాన్ని పూర్తిగా అనుభవించిన రసప్రియుడే ఇతను. కానీ ప్రస్తుతం అతనికి ఏమీ రుచించడం లేదు. ఉన్నపళంగా చప్పగా కనిపిస్తున్న జీవితంలో అతనికి నిరాసక్తతే తప్ప అందం కనబడ్డం లేదు.

చుట్టూతా చూస్తే అందం ఎక్కడ లేదు? రోమ్ నగరాన్ని పల్చటి పొరలో చుట్టేసిన వెన్నెల రాత్రిలో లేదా ? ఆ ఖరీదైన గుండ్రటి విద్యుద్దీపాల మసక వెలుతురులో transparent డ్రెస్సులో మంద్ర సంగీతానికి మత్తుగా ఊగుతున్న ఆ super model శరీర లయలో లేదా? ఆ రద్దీ నగరపు గుండె గదుల్లో నిద్రపోతున్న మధ్యయుగాల…………….

Ontari Sikharalu

200.00

తుంటరి లోయలు

ఆకాశాన్ని అందుకున్నట్టుగా కనిపించే పర్వత శిఖరాలెంత గంభీరమైనవో, వాటినానుకుని కిందికి సాగే లోయలంత తుంటరివి..

యేరెండు శిఖరాలూ వొకలా సాధించవు. యేరెండు లోయలూ వొకలా వేదించవు. జాగ్రత్తగా గమనిస్తే యే యిద్దరు మనుషులు వొకలా వుండరని తెలుసుకో గలుగుతాం.

యెవరి ఆంతర్యం వాళ్ళదే అయిన యీ లోకంలో, ప్రతి మనిషీ వొంటరి శిఖరంలాగే బతక్క తప్పదు. అనివార్యంగా శిఖరాల నంటిపెట్టుకునే లోయలా జారిపోకా తప్పదు.

శిఖరాలు, లోయల బలాలు, బలహీనతలు కలగలసిన మానవ అస్తిత్వ ప్రవృత్తులు యెప్పటికప్పుడు కలిగించే విభ్రమాల్నీ, విస్మయాల్నీ చిత్రించే కథల సంపుటం యిది.

1977లో ‘గుర్రమూ కళ్ళెమూ’ అనే కథ రాసినప్పుడు నేనిలాంటి కథలు మరికొన్ని రాస్తాననీ, వాటినిలా వొక సంపుటంగా తీసుకురాగలననీ అనుకోలేదు. మొదటి నుంచీ సాహిత్యం నాకు ప్రపంచాన్ని అవగాహన చేసుకునే వేదికగానూ, సత్యాన్వేషణకొక వాహికగానూ, వ్యక్తిగత శోధనకొక మాధ్యమంగానూ కూడా తోడ్పడుతూ వస్తోంది.

వీటికి తాత్విక కథలనే పెద్ద పేరు పెట్టలేను గానీ యివన్నీ జీవితాన్ని మనస్సునూ ప్రశ్నించే కథలని మాత్రం చెప్పగలను – భౌతిక పార భౌతిక ప్రపంచాల మధ్య ఊగిసలాడే మానవుడి వెంపర్లాటలను అర్థం చేసుకోడానికి ప్రయత్నించే కథలివి. ప్రతిక్షణమూ | పరిణామాలకు గురవుతూ, అనుక్షణమూ సంక్లిష్టంగా మారిపోయే ప్రపంచంలో…………..

Dabbu Oka Shakthi Pravaham Part 1 & 2

900.00

డబ్బు అంటే ఏమిటి?

‘డబ్బు’ ఇది ఏమాత్రం పరిచయం అవసరంలేని పదం. ప్రపంచంలోని ప్రతిఒక్కరూ (ఆత్మజ్ఞానులు తప్ప మిగిలిన అందరూ కొంచెం ఎక్కువగానో, తక్కువగానో అందరూ డబ్బుకోసం పరుగులు పెట్టేవారే, ప్రయత్నం చేసేవారే, చింతించేవారే.

మరి అందర్నీ ఇంతగా ప్రభావితం చేస్తున్న ఈ డబ్బు గురించి మనకు తెలుసా? అసలు ‘డబ్బు’ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏమిటో

“ఇది కూడా ఒక ప్రశ్నేనా… డబ్బంటే ఏంటో తెలీదా” అని అనుకుంటున్నారా? అయితే చెప్పండి.

దీనికి వివిధ రకాల సమాధానాలు రావచ్చు. ఎవరి జవాబు ఎలా ఉన్నా, మనలో చాలామందికి ‘డబ్బు’ అంటే ఏమిటో స్పష్టంగా తెలీదు. విచిత్రమేమిటంటే, మనకు తెలియదని కూడా మనకు తెలీదు! ‘డబ్బు’ అంటే ఏమిటో మనకు సరిగా అర్థంకాకపోయినా, మనకు తెలుసుననే భ్రమలో దానివెనక దానికోసం పరుగులు పెడుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఇన్ని తంటాలు!

సరే, మళ్ళీ మన ప్రశ్న దగ్గరకొద్దాం. డబ్బు అంటే ఏమిటి? సాధారణంగా చాలామంది అనుకునేది, డబ్బంటే మనం రోజూ చూసే (లేదా) ఖర్చుపెట్టే కాగితపు డబ్బు లేదా నాణేలు అని. కానీ అది డబ్బు కాదు! దానిని “కరెన్సీ (Currency)” అంటారు. లేదా ద్రవ్యము, నగదు అని అంటారు. అయితే మరి డబ్బు అంటే ఏమిటి?

వివిధ స్థాయిలలో డబ్బు యొక్క అసలైన అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ఊహాత్మక కథ సహాయంతో మన ప్రయత్నం మొదలు పెడదాం.

బాగా ధనవంతుడైన ఒక కోటీశ్వరుడున్నాడనుకుందాం. అతను ఒకసారి వ్యాపారరీత్యా ఏ అండమాన్ నికోబర్ దీవులకో వెళ్ళాడు అక్కడ ఒక హోటల్లో బస చేశాడు. తిరిగి బయలుదేరేటప్పుడు హోటల్ బిల్ కట్టడానికి తన క్రెడిట్ కార్డును ఉపయోగించాడు. అయితే ఏదో సాంకేతిక లోపం వల్ల (because of some technical problem) అక్కడ అప్పుడు ఎలాంటి లావాదేవీ యంత్రాలు…………

Vallu Padina Bhupala Ragam

225.00

డా.పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీత కథ’ వాళ్ళు పాడిన భూపాలరాగం

– శీలా సుభద్రాదేవి

డా.పి. శ్రీదేవి పేరు చెప్పగానే ‘కాలాతీత వ్యక్తులు’ నవల గుర్తుకు రానివారు అరుదు. అయితే ఆమె కథలు కూడా రాసినట్లు తెలిసినా ఆ కథల్ని తెలిసినవారు తక్కువే. పి.శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాటిలో ‘కాలాతీత వ్యక్తులు’కు దీటుగా ఉన్న కథలు ఉన్నాయి. నవలలో పాత్రల లాగే మరపురాని పాత్రలతో ఉన్న కథగా చటుక్కున చెప్పదగినది – ‘వాళ్ళు పాడిన భూపాలరాగం’. ఇది 1959లో జయంతి (జులై) సంచికలో ప్రచురితం. 1966లో ‘ఏరినపూలు’ సంకలనంలో చేర్చబడింది. అనేక భిన్న మనస్తత్వాలు గల పాత్రలలో, అనేక సంఘటనలతో, ఆనాటి సమజానికి ప్రతిబింబంగా ఉండి, కథావిస్తృతి కలిగి ఉండటం చేత దీనిని నవలికగా కూడా చెప్పుకోవచ్చు. కాలాతీత వ్యక్తులు నవల రాసిన తర్వాత రాసిన కథ కావటాన కథాసంవిధానంలో, పాత్రల చిత్రణలో ఈ కథపై కూడా దాని ప్రభావం ఉంటుంది.

ఇందులోని కథంతా చెప్పకుండా పాత్రల్ని, పాత్రల స్వభావాల్నీ, మాత్రమే చెపుతాను. ఎందుకంటే ఇందులోని పాత్రలు కూడా సమాజంలో ఎప్పటికీ ఉండే పాత్రలే. పాత్రని సృష్టించేటప్పుడు పాత్రల యొక్క మూలస్వభావాన్ని కూడా పాఠకులకు అవగాహన అయ్యేలా సంఘటనల్నీ, సంభాషణల్నీ కూర్చే శైలి శ్రీదేవికే స్వంతం. అందుకనే వీరి పాత్రలు ఎప్పటికీ సజీవంగా వుంటాయి.

రామచంద్రయ్య: శుద్ధ మాష్టరీ ఉద్యోగం. లేమికి గానీ, అశుచికిగానీ బాధపడడు. అనారోగ్యం ఎరగడు. జీవితావసరాలు సమపాళ్ళలో వుండే కుదురైన సంసారం. రేడియోలూ, సినిమాలూ, గ్రామఫోన్ల వంటి అధునాతనమైన వాటిని నమ్మడు. ఇంట్లో ఏ కార్యం చేసినా పొదుపుగా, శాస్త్రోక్తంగా చేస్తాడు. ఒకరి మీద ఆధారపడకుండా బతకాలనే మధ్యతరగతి సగటు మనిషి మనస్తత్వం, జీవన విధానం కలవాడు. తిండి, బట్ట బతకటానికి చాలనేది అతని ఉద్దేశ్యం. అందుకే…………………