Additional information
| Author | Yandamuri Veerendranath |
|---|---|
| Format | Paperback |
₹150.00
ఈ పుస్తకం ‘స్నేహం-ఆప్యాయత-ప్రేమ-మోహం-దాంపత్యం-రొమాన్స్-అనుబంధం’ అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది.
అమ్మ నుంచి ప్రేమతో తొలిముద్దు, నాన్నతో పొరపాటుల దిద్దుబాటు, స్నేహితుల్లోని నచ్చిన గుణాల్ని ప్రేమించటం, వారి మైనస్-పాయింట్స్ మనస్ఫూర్తిగా ఒప్పుకోవటం… ఆ విధంగా మనిషి తన ప్రేమ పరిధిని పెంచుకుంటాడు. (అయితే కొన్నిసార్లు నమ్మిన సిద్ధాంతం కోసం విభేధించటానికి వెనుకాడడు కూడా. కానీ విభేధం వేరు, శత్రుత్వం వేరు).
ఈ పుస్తకంలో….
స్నేహం : స్నేహంలోంచి ప్రేమలోకి…స్నేహితుల్లో రకాలు…అకస్మాత్తుగా గుడ్‌బై చెప్పే స్నేహితులు…ఖరీదైన స్నేహాలు…మంచి స్నేహితుడి పది లక్షణాలు… స్నేహం స్వార్థమా?… ఎటువంటి స్నేహితుల్ని వదిలిపెట్టాలి?
ప్రేమ : తూపు తొలి చూపు… తొలి స్పర్శ… పప్పీ లవ్… పెళ్ళికి ముందు ప్రేమ… ప్రేమ వివాహాలు… పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు… ప్రేమలో ఎమోషన్స్… ప్రేమ – ఈర్ష్య.
దాంపత్యం : ఈ నాటి ఈ బంధం ఈ నాటిదే… లివ్-ఇన్-రిలేషన్… సెకండ్ సెటప్… సర్దుబాటు.
శృంగారం : వద్దనకు ఈ ముద్దు … రొమాన్స్… వాత్సాయన… విరహ వర్ణన… శృంగారానికి ఆరు మెట్లు
అనుబంధం : మూడు రకాల అనుబంధాలు ఉన్నాయి.
| Author | Yandamuri Veerendranath |
|---|---|
| Format | Paperback |