Availability: In Stock

Na Jeevita Katha Maxim Gorky

600.00

Na Jeevita Katha Maxim Gorky

 

ఇరుకుగా వున్న చీకటిగదిలో కిటికీకి దగ్గరగా నేలమీద మా నాన్న పడుకున్నాడు. తెల్లని దుస్తులు తొడుక్కుని అలా పడుకుని వుంటే యెంతో పొడుగరిలాగ కనబడ్డాడాయన. కాలివేళ్ళు, అదొక మోస్తరుగా ఒకదాని కొకటి యెడమ యెడమగా వున్నాయి. ప్రశాంతంగా గుండెలమీద పెట్టుకున్న మృదువైన చేతివేళ్ళు కూడా కొంకర్లుపోయున్నాయి. కళ్ళమీద వుంచిన నల్లని రాగి నాణేలు ఆయన ఉల్లాసపు కళ్ళను కప్పుతున్నాయి. దయతో ఉట్టిపడుతూండే ఆయన ముఖం నల్లబారిపోయింది, బిర్రబిగుసుకు పోయిన ఆయన పళ్ళు మెరుస్తూండడం చూచి నాకు భయం వేసింది.
అమ్మ ఆయన దగ్గర మోకాళ్ళమీద కూచుంది. అమ్మ వంటిమీద ఎర్ర గాగరా వొక్కటే వుంది, ఆమె అలా కూచుని పట్టులాంటి ఆయన జుట్టును నల్లని దువ్వెనతో నుదుటి మీద నుండి వెనక్కి దువ్వుతూంది. నేనా దువ్వెనతోనే పుచ్చకాయ తొక్కలను రంపంతో కోసినట్టు కోసేవాణ్ణి. మంద్రమైన గొంతుకతో ఏమిటేమిటో ఆమె అలా గొణుగుతూనే వుంది. ఆమె బూడిదరంగు కళ్ళు వాచిపోయి పెద్ద కన్నీటి బొట్టుల కింద కరిగిపోతూన్నట్టని పించింది నాకు.
మా అమ్మమ్మ నా చేయి పట్టుకుంది. అమ్మమ్మ స్థూలంగా గుండ్రంగా వుంది. పెద్ద తల, పెద్ద పెద్ద కళ్ళు, మాంసపు ముక్కలా ముక్కు, ఆ ముక్కు చూస్తేనే నాకు నవ్వొచ్చేది. ఆమె అంత నల్లగా వుండికూడా మృదువుగా అద్భుతంగా కనబడుతోంది. ఆమె కూడా యేడుస్తూనే వుంది. ఆమె యేడుపు అదొక విధంగా వుండి అమ్మ యేడుపుకి వెనక పాటలా వినడానికి ఇంపుగానే వుంది. ఆమె వొళ్ళు అంతా వణికిపోతూనే నన్ను నాన్న దగ్గరకి నెట్టుతూంది. నేను మాత్రం ముందుకు రాకుండా ఆమె గాగ వెనక దాగుకున్నాను. నాకు భయంవేసి యేమిటోలా వుంది……………………….

 

 

   

 

Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

 

విభాగం-1

వదిలించుకోవలసినవి
“ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
(శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)

భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది…………

5 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

Author

Maxim Ghorky