YOU MAY ALSO LIKE…
-
GADDIPARAKOTO VIPLAVAM
₹250.00
-
Sri Lalitha Sri Vishnu Sahasranama Stotralu
₹72.00
-
Bhakti Sudhamanjari
₹116.00
-
Premaki Pranam Unte
₹350.00
Showing 1–24 of 48 resultsSorted by latest
Raja Ravivarma
₹300.00రాజా రవివర్మ(1848-1906).. పరిచయం అక్కర్లేని చిత్రకారుడు. ఈ నవల అతని కళాజీవితాల కలనేత. అతని రంగుల సంరంభాన్ని, బతుకులోని తీపిచేదులను ఇది అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఆధునిక భారతీయ కళలో రవివర్మ స్థానం చెరిగిపోనిది. అతన్ని పొగిడే వాళ్లు ఉన్నారు. విమర్శించే వాళ్లూ ఉన్నారు. విస్మరించే వాళ్లు లేరు.
భారతీయ కథలను అపూర్వంగా దృశ్యీకరించి, దేవుళ్లను రక్తమాంసాలతో పునఃసృష్టించిన కళాజీవి సాహసగాథ ఈ నవల. కుగ్రామంలో పుట్టిన రవివర్మ స్వయంకృషితో భారతీయ చిత్రకళాభూమిలో అనితరసాధ్యంగా వేసిన కొత్త బాటలోకి ఇది మిమ్మల్ని తీసుకెళ్తుంది. అతని చిత్రాలు రాజసౌధాలనే కాక పూరిగుడిసెలనూ అలకరించిన వైనాన్ని కళ్లకు కడుతుంది.
ఇది విజయగానం మాత్రమే కాదు. ‘రాజభవనంలో తిని కూర్చోవడం గొప్ప కాద’న్న రవివర్మ తన లక్ష్యసాధన కోసం భరించిన కష్టనష్టాలను, అవమానాలను, అశాంతిని కూడా ఇది పరిచయం చేస్తుంది. ప్రాక్పశ్చిమ నాగరకతలు, కళాసంప్రదాయాలు తలపడిన సంధికాలంలో ఒక సృజనశీలి తన లోపలా, బయటా చేసిన అరుదైన యుద్ధమే ఈ కథ. ఇందులో అతని రంగుల దీపపు వెలుగుతో పాటు దాని క్రీడా కనిపిస్తుంది. .
ఈ నవల తెలుగు పాఠకులకు రవివర్మను సరికొత్తగా, అబ్బురంగా పరిచయం చేస్తుంది. విశాఖపట్నం, హైదరాబాద్లలో అతని బస విశేషాలూ ఇందులో ఉన్నాయి. అతని కవిత్వమూ పలకరిస్తుంది. రవివర్మకు నమ్మినబంటైన అతని తమ్ముడి కళాజీవితాలూ వెన్నంటి సాగుతాయి. కళాభిమానులకే కాక సాహిత్య ప్రియులకూ ఇది వసంతోత్సవం! –
రచయిత పి.మోహన్ పాత్రికేయుడు. పుట్టింది కడప జిల్లా ప్రొద్దుటూరులో, అచ్చయిన పుస్తకాలు.. కిటికీపిట్ట (కవిత్వం 2006), పికాసో (2010), డావిన్సీ కళ -జీవితం (2013).
Purushulu Kujagrahavasulu, Sthreelu Sukragrahavasulu
₹225.00అత్యంత ప్రసిద్దమైన అనుబంధాల కరదీపిక. పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు సుక్రగ్రహవాసులు అనే జాన్ గ్రే రచన కోట్లాది దంపతులకు తమ సంబంధాన్ని మరింత గాడతరం చేసుకోవడానికి ఉపకరించింది. దీనిని ఒక ఆధునిక శాస్త్రీయ గ్రంథంగా చెప్పుకోవచ్చు. స్త్రీ పురుషులకు తమ నిజ వ్యక్తిత్వాలు, ప్రత్యేకతల గురించి తెలియజెప్పడమే కాక, ఇద్దరి మధ్య వైరుధ్యాలు తలెత్తకుండా తమతమ అవసరాల్ని నెరవేర్చుకోవడం ఎలాగో ఈ పుస్తకం నేర్పింది. స్త్రీ పురుష మధ్య గాడానురాగం వృద్ధి చెందడానికి సంబంధించిన ప్రతి అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ పుస్తకం చెబుతుంది.
ఈ పుస్తకం కింద పేర్కొన్న విషయాల్లో సహాయపడుతుంది.
– ప్రేమాస్పదమైన, శాశ్వతమైన స్త్రీ, పురుష సంబంధాన్ని వృద్ధి చేసుకోవడం.
– ఎదుటివారి మనోభావనల్ని గ్రహించడం, తదనుగుణంగా ప్రతిస్పందిoచడాన్ని నేర్చుకోవడం.
– ఎలాంటి కపట్యo, విసిగించడం వంటివి లేకుండా మీ అవసరాల్ని తీర్చుకోవడం.
– సంక్లిష్టమైన అనుభూతుల్ని ఎదుటివారికి వ్యక్తం చేయడం.
– వాగ్వివాదాల వల్ల కలిగే బాధను నిరోధించడం.
– మీ జీవిత భాగస్వామిని, ఉద్యోగ వ్యాపార సహచరుల్ని లేదా స్నేహితుల్ని ఇదివరకటికంటే సమర్థవంతంగా అర్థం చేసుకోవడం.
– పసుపులేటి గీత
Pipe Line Kadha
₹195.00అనగనగా ఒకనాడు పాబ్లో, బ్రూనో అనే ఇద్దరు యువకులు ఇటలీలో ఒక గ్రామం లో పక్కపక్కనే నివసించేవారు. వారు వరసకు అన్నదమ్ములు అవుతారు. ఇద్దరూ మంచి స్నేహితులు.
వారు కనే కలలు కూడా చాల పెద్దవి.
ఎదో ఒకనాడు ఎలాగో ఒకలా ఆ గ్రామంలో అందరికంటే ధనవంతులు కావడం గురించి వారి నిర్విరామంగా మాట్లాడుకునేవారు. ఇద్దరు తెలివైనవారు, కష్టపడి పనిచేస్తారు. వాళ్లకు కావాల్సింది ఒక అవకాశం మాత్రమే.
ఒక నాడు ఆ అవకాశం వారిని వరించింది. దగ్గర్లో ఉన్న నదినుంచి గ్రామంలో ఉన్న ఒక పెద్దతొట్టికి నీరు చేరవేయటానికి ఇద్దరు మనుషులను వినియోగించాలని ఆ గ్రామం నిశ్చయించింది. ఉద్యోగం పాబ్లో, బ్రునోలను దొరికింది. తరువాత ఎం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.
-బర్కి వాడ్జెస్.
Prayanam By Malladi Venkata Krishna Mur
₹295.00‘రాజశుక. మంచి పేరు పెట్టారు.’ పూజారి మెచ్చుకున్నాడు.
‘నాకు కొడుకు పుట్టాడని మా నాన్నగారికి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన భాగవతం మొదటి స్కంధం చదువుతున్నారు. ఆయనే ఈ పేరు సూచించారు.’ రాజశుక తండ్రి సుబ్బరాజు వివరించాడు.
‘పాలు పితికినంత సేపు రాజశుక ఒక చోట ఉండడు.’ పెద్దయ్యాక రాజశుక విన్నాడు.
ఆర్నెలల్లో 11 జ్యోతిర్లింగాలని రాజకుశ ఏ లాభం కోరి సందర్శించాడు?
రాజశుక తన ఆథ్యాత్మిక ప్రయాణంలో, తీర్థ యాత్రల్లో ఏం నేర్చుకున్నాడు?
అతనికి అనేక చోట్ల కలిగిన వివిధ అనుభవాలు ఏమిటి?
హిందూ సంప్రదాయంలోని సన్న్యాసాశ్రమం నియమాలు ఏమిటి?
ఆసక్తి కలిగించేలా, హాయిగా చదివించేలా ఆథ్యాత్మికతని రాయగల మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ప్రయాణం.
జయం, పరంజ్యోతి, విధాత నవలల తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నాలుగో ఆధ్యాత్మిక నవల ప్రయాణం.
Padakondu Pannendu Padamoodu
₹230.00అదృష్టం అనేది ఉందా? అది మనిషిని కాపాడుతుందా? రక్షరేకు మనిషిని రక్షించగలదా? కోయదొర ఇచ్చే రక్షరేకులో నిజంగా మహత్తు ఉంటుందా?
ఈ నేపథ్యంలో ముప్పై ఆరు గంటల్లో జరిగే ‘పదకొండు పన్నెండు పదమూడు’ క్రైమ్ నవల, అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠంగా సాగుతుంది.
మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఈ సస్పెన్స్, మిస్టరీ డైరెక్ట్ నవలకి ‘పదకొండు పన్నెండు పదమూడు’ అనే పేరు ఎందుకు పెట్టారో ఊహించగలరా?
– మల్లాది వెంకట కృష్ణమూర్తి
Panigrahanam
₹295.00పాణి తల్లి రోడ్ ఏక్సిడెంట్ కి గురైంది. ఆ ప్రమాదం చేసిన సినిమా ప్రొడ్యూసర్ కమలాకరం ఆవిడ చికిత్స కోసం డబ్బు ఇవ్వడానికి తిరస్కరించాడు. పాణి, అతని మేనమామ రోహిత్ ఎం చేసారు? అది వాళ్ళకి ఎం చేసింది?
పోలీస్ వెంకటస్వామి, డేటిక్టివ్ సింహం, అతని అసిస్టెంట్ బ్రహ్మం, మృదుపాణిని ప్రేమించిన వరవిణ లాంటి పాత్రలతో, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో క్రైం, ప్రేమ, సస్పెన్స్ లతో సాగె కామెడీ థ్రిల్లర్ పాణిగ్రహణం.
Misrani
₹260.00ఇది సస్పెన్స్ నవల కాదు. క్రై0 నవల కాదు.
ఇది స్వతంత్రానికి పూర్వం జైపూర్ సంస్థానానికి చెందిన 84 ఏళ్ళ ఓ మహిళ కథ. కాబట్టి విభజనకి పూర్వం భారతీయ చరిత్ర ఇందులో చదవచు.
ఇంకా సినిమా అవుట్ డోర్ షూటింగ్ విశేషాలు , వివిధ భారతీయ వంటకాల గురించి, ఓ మహిళ జీవితంలోని అనేక మలుపు తిప్పిన సంఘటనల గురించి ఇందులో చదవచ్చు.
ఒకటి ఒంటరి అంకె , అందమైన జీవితం, మందాకినీ , జాబిలి మీద సంతకం నవలల్లా ఇది కూడా ఓ మహిళ జీవిత కథ.
మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి అందిస్తున్న 108 వ నవల మిస్రాణి
Katha Chanakya
₹195.00 రాజు , ఋషి ?
నృపతి, నృపతి నిర్మాత ?
మనిషి , మర్మయోగి ?
చంద్రగుప్త సార్వభౌముల ఆరాధ్య గురువు చాణక్యుల జీవితం నిగూఢము, వివేచనామయం. ఆయన మాటలు, చర్యలు అత్యంత అప్రమత్తతో యంత్రవతుగా కట్టుబడి, అమలు జరిగినవి. చాణక్యులు జీవితంలో పాఠాలను సోదాహరణంగా బోధించారు. చేయి తిరిగిన రచయిత రాధాకృష్ణన్ పిళ్లే ఈ అద్భుత పుస్తకంలో
అక్షరాలా అదే చేశారు.
‘కధ చాణక్య’ ఘనయశస్వి ఆచార్యుల జీవితంలో నించి కధలు చెప్పి, భారతావని మహోత్తమ వ్యూహాశీలి, స్వాప్నికుల సిద్ధాంతాలను, ఆచరణలను ఆధునిక సందర్భాలకు అన్వయింప జేస్తుంది. ఈ కధలలో కొన్ని యదార్థాలు, మిగతావి కల్పితాలు. అది ఒక నాయకుడి ఎన్నిక అయినా, అవినీతిని రూపుమాపటం అయినా, ఘనవిరోధిని ఓడించటం అయినా అన్నీ ప్రజాసంక్షేమం దృష్ట్యా జరిగినవే.
స్రుకు ఒక స్వప్నం, ఒక ధ్యేయం ఉంటే దానిని సాకారం
చేయటంలో కధ – చాణక్య తోడ్పడుతుంది
రాధాకృష్ణన్ పిళ్లే ప్రఖ్యాత రచయిత. ఆయన రచనలు ‘కార్పొరేట్ చాణక్య’, ‘చాణక్యాస్ 7 సీక్రెట్స్ టు లీడర్ షిప్’, ‘మీలోని చాణక్య’, ‘చాణక్య అలా చెప్పాడు’, ‘చాణక్య నీతి’ అత్యుత్తమ అమ్మకాలు సాధించాయి. సంస్కృతంలో ఆయన మాస్టర్ డిగ్రీ పొందారు. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో ఆయన పిహెచ్.డి సాధించారు. ఆయన పేరుపొందిన మేనేజ్ మెంట్ సలహాదారులు, వక్త. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో చాణక్య ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్ పిప్ స్టడీస్ (CIILS) విభాగానికి ఆయన డెప్యూటీ డైరెక్టర్. handle @rchanakyapillai ద్వారాఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు. ఇతర ముఖ్య సామాజిక మాధ్యమాలలో కూడా ఆయన చురుకుగా పాల్గొంటారు.
Kalnal Ekalingam Adventures
₹310.00జోక్ అతి చిన్నది. నవల అతి పెద్దది. చిన్న చిన్న జోకులని దండలా గుచ్చి ఓ వ్యక్తి జీవితగాధని అతి పెద్ద నవలగా రాయడం ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలిసారి. ప్రింట్ మీడియా ఎంటర్టైనర్ మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన ఈ సాహితీ సర్కస్ ఫీట్ లోని డర్టీ, పార్టీ, రొమాంటిక్, ప్లేబాయ్, కేంపస్ జోక్స్ అన్నీ పాఠకులని ఎంటర్ టైన్ చేసేవే. మధ్య నుంచి మొదటికీ, లేదా చివరి నుంచి మధ్యకి కూడా చదువుకో దగ్గ మల్లాది రాసిన మొదటి నవల ఇది. అసలు హాస్యం ఎలా పుడుతుంది? ఎక్కడ అవకతవక లేదా అసంపూర్ణం ఉంటే అక్కడ హాస్యం పుడుతుంది.
ఉదాహరణకి సుబ్బారావు రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అందులో హాస్యం ఉండదు. అదే సుబ్బారావు రోడ్డు మీద నడిచి వెళ్తూ, అరటి తొక్క మీద కాలు వేసి జారిపడితే, ఆ అవకతవక లోంచి హాస్యం పుడుతుంది. ఇలాగే అందాన్ని ఎవరూ ఆక్షేపించరు. అనాకారితనం లోనే హాస్యం ఉంటుంది. అనేక విదేశీ జోక్స్ పత్రికలు ఇచ్చి సహాయం చేసిన మిత్రులు, కార్టూనిస్టు మీనా గారికి నా కృతఙ్ఞతలు.
– మల్లాది వెంకట కృష్ణమూర్తి
Jeevana Laalasa
₹300.00విన్సెంట్ చనిపోలేదు. అతనికి మరణం లేదు. అతని ప్రేమా, ప్రజా, అతడు సృజించిన మహా
సౌందర్యమూ కలకాలం నిలిచిపోతాయి, ఈ ఈ లోకాన్ని సుసంపన్నం చేస్తాయి. అతని చిత్రాల్లో
నూత్న విశ్వాసం, బతుక్కి కొత్త అర్థం గోచరిస్తాయి. అతడు గొప్ప మానవుడు, గొప్ప వర్ణచిత్రకారుడు, గొప్ప తాత్వికుడు. ప్రేమించిన కళ కోసం ప్రాణాలు ధారపోసి అమరుడయ్యాడు.
విన్సెంట్ జీవితం, నిరాశలు వాస్తవమైనవాటికన్న ఎక్కువ కల్పనలా అనిపిస్తాయి. అతని మానవ సంబంధాలను, చిత్రలేఖనాలను, వర్ణసమ్మేళనాలను, ఆశనిరాశలను తన ఊహాశక్తితోనూ, కవితాత్మక సాంద్ర వ్యక్తీకరణలతోనూ అక్షరాల్లో పునర్జీవింపజేసే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకుని నవలగా మలిచాడు ఇర్వింగ్ స్టోన్.
ఈ అనువాదం కేవలం ఆసక్తి కొద్దీ సాగినది మాత్రమే కాక ఇర్వింగ్ స్టోన్ రచనలాగ అభిరుచితో హృదయమంతా రంగరించి సాగడం , తెలుగు పాఠకులకు దొరికిన గొప్ప రంగుల వెల్లువ….
ఎన్. వేణుగోపాల్
Divine Comedy
₹290.00ది హాస్య నవల. గతంలో వెలువడ్డ “కల్నల్ ఏకలింగం ఎడ్వెంచర్స్. మిస్టర్ వీరియం, సుందరి సుబ్రావ్” కామెడీ నవలల్లా ఇది జోక్స్ తో కూర్చబడ్డ నవల. అక్కడక్కడ చదివితే దేవుడు, మతాలు, ఆలయాలు, ప్రవాచనాలు, తీర్ధయాత్రలు లాంటి దేవుడికి సంబంధించిన జోక్స్ బుక్ చదివినట్లుంటుంది. వరసగా చదివితే మిస్టర్ శఠగోపం జీవిత కథని చదువుతారు.
“డివైన్ కామెడీ” నవల కోసం ఆంధ్రుల అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి వెయ్యికి పైగా ఇలాంటి జోక్స్ ని సేకరించి అందిస్తున్న నవల ఇది. మీరు నాస్తికులైనా లేదా ఆస్తికులైనా ఈ నవల మీకు తృప్తినిస్తుంది.
Dooram
₹230.00రచయితది హైద్రాబాద్. అభిమాన పాఠకురాలిది వైజాగ్.
వ్యక్తిగత సమాచార మార్పిడికి ఉత్తరాలే ప్రధాన ఆధారమైన సంవత్సరం అది. 1976.
అభిమాని, రచయితల మధ్య ఆరంభమైన ఉత్తరాలు చివరికి వారి పెళ్ళికి ఎలా దారి తీసాయి? ఆ ఉత్తరాల్లో ఏం రాసుకున్నారు?
ఒకరితో మరొకరికి ముఖపరిచయం కూడా లేని వారి సంబంధం పెళ్ళి దాకా ఎలా వెళ్ళింది?.
ఈ ప్రేమ నవలంతా కేవలం ఉత్తరాల ద్వారానే నడవడం విశేషం.
ఆంధ్రభూమి వీక్లీకి మీ అభిమాన రచయిత మల్లాది తొలుత రాసిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ సీరియల్ ద్వారా పాఠకులని ఆకట్టుకుని తర్వాత ధర్మయుద్ధం, ఈ గంట గడిస్తే చాలు లాంటి ఎన్నో నవలలని అందించారు.
షరా : ఇతరుల ఉత్తరాలు చదవడంలోని ఆనందం, వాటికి సమాధానాలు ఇవ్వనవసరం లేదు.
ఈ నవలతో పాటు మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఒకటి ఒంటరి అంకె అనే నవల కూడా ఉంది.
చదవండి! చదివించండి!!
Chantabbai
₹230.00తెనాలి రామకృష్ణ.
షెర్లాక్ హోమ్స్.
సాహిత్యంలో వీళ్ళద్దరి లక్షణాలని కలిపితే వచ్చే పాత్రే ఏకదంతం. డిటెక్టీవ్ యుగంధర్ ఏకలవ్య శిష్యుడైన ఏకదంతానికి, చాల ఏళ్ళ క్రితం దత్తత కెళ్ళిన చెంటబ్బాయ్ ని వెదికే పని అప్పగించబడింది.
ఆ అన్వేషణ చుట్టూ జరిగే అనేక సంఘటనలు, పాత్రలతో అల్లిన “చంటబ్బాయ్” నవల ఉత్కంఠంతో సాగుతుంది. హాయిగా నవ్విస్తుంది.
సస్పెన్స్. హాస్యం మిళితమైన “చంటబ్బాయ్” చిరంజీవి హీరోగా సినిమాగా కూడా వచ్చింది .
స్టోరీ టెల్ లో శ్రవణనవలగా కూడా రూపొందింది.
నలభై ఏళ్ళ క్రితం ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన “చెంటబ్బాయ్:” ఈ నాటికీ పాఠకులని అలరిస్తోంది.
Ahame Mee Satruvu
₹350.00పరిచయం
మీరు సులువుగా మోసపోగలుగుతారు. మొట్టమొదట మీరు చేయవలసిందల్లా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా ఉండటమే.
– రిచర్డు ఫెన్మెస్
మీరు యువకులుగా ఉండి ఏదో ఆశయం కోసం పట్టుదలతో పనిచేస్తున్న వారు కావచ్చు లేదా సమస్యలతో తెగ పోరాడుతున్నవారు కావచ్చు. తొలి మిలియన్ సంపాదించి, ఒక పెద్ద ఒప్పందం చేసుకుని పేరుపొందిన బృందంలో సభ్యత్వం పొందిన వారు కావచ్చు లేదా ఇప్పటికే మీరు జీవితాశయాన్ని సాధించిన వారు కావచ్చు. విజయశిఖరాలు చేరిన తర్వాత అక్కడ ఎంత శూన్యం ఆవరించిందో అన్న ఆలోచనలతో ఉన్న వ్యక్తయినా కావచ్చు. సంక్లిష్ట వాతావరణంలో ఓ పెద్ద బృందానికి నాయకత్వం వహిస్తున్నవారు కావచ్చు లేదా ఉద్యోగం నుంచి అకస్మాత్తుగా బయటకు నెట్టివేయబడిన వారు కావచ్చు. ఇవేమీ కాకపోతే ఒక్కసారిగా కుప్పకూలి జీవితంలో అథోగతి పాలయిన వారు కూడా కావచ్చు.
మీరేం చేస్తున్నా, మీరెక్కడ ఉన్నా, మీకు చేటు చేసే శత్రువు మీలోనే ఉంటుంది. దాన్నే ‘అహం’ అని పిలుస్తారు.
“నాకు అహం లేదు. నన్నెవరూ ఇంత వరకూ అహంకారి అని అనలేదు తెలుసా?” అని మీరు అనవచ్చు. చాలా సంయమనంతో నడుచుకునే వ్యక్తిగా మిమ్మల్ని మీరు భావించుకో వచ్చు. కానీ ఆశయాలు, నైపుణ్యాలు, సమర్థత, ప్రేరణ, శక్తితో ఏదయినా సాధించ దలుచుకున్నప్పుడు అక్కడ అహం రంగప్రవేశం చేస్తుంది. మనం ఆలోచనా పరులుగా, సృజనాత్మక జీవులుగా, క్రియాశీలురుగా, వ్యాపారవేత్తలుగా ఆయా రంగాల్లో ఉన్నతస్థాయికి చేరేందుకు సాగించే ప్రయత్నంలో మనస్సులో దాగి ఉంటే ఈ చీకటి కోణం మనల్ని దుర్బలులుగా మారుస్తుంది.
ఫ్రాయిడ్ పరిభాషలో అహాన్ని గురించి వివరించే పుస్తకం కాదిది. గుర్రంపై స్వచేసే వ్యక్తి లాంటిది అహం అని, జంతువు మాదిరిగా ఉపచేతన మనసు దానిని నడుపుతూ ఉంటుందని ఫ్రాయిడ్ ఒక పోలిక ద్వారా దాని గురించి చెప్పే మత్నం చేస్తారు. ఆధునిక మనస్తత్వవేత్తలు మాత్రం దీనికి కొత్త భాష్యం చెబుతారు.
ఆ పట్ల అలక్ష్యం చూపుతూ, ప్రమాదకరస్థాయిలో తమను గురించి తాము అప్పగా ఆలోచించుకునే వారిని అహంకారులు అని చెబుతారు. ఇవన్నీ నిర్వచనాలు వలన,కానీ వైద్యసంబంధమైన వ్యవహారాలకు వెలుపల మాత్రం వాటికంత వ్యాపారవేత్తలుగా ఆయా రంకటి కోణం మనల్ని మన పుస్తకం కాదిది. పరంగా సరైనవే,కానీ వైద్యసంబంధమైన విలువ లేదు………..
Akhari Athidhi
₹230.00ప్రతి మనిషి తప్పని సరిగా ఎదో రోజు ఆఖరి అతిథిని ఒక్కసారే కలుసుకుంటాడు. కాని డాక్టర్ శ్రీజిత్ మాత్రం అతన్ని అనేక సార్లు కలుసుకున్నాడు.
ఎందుకు? ఎప్పుడు? ఎలా?
మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన, అతింద్రియ నేపథ్యంతో సాగే ఈ సస్పెన్స్, ఫాంటసీ డైరెక్ట్ నవల వినూత్నమైన అంశాన్ని ఆవిష్కరించింది. మూడు రోజుల్లో డాక్టర్ శ్రీజిత్ కి ఎదురైన విచిత్ర అనుభవాలు ఉత్కంఠంగా సాగుతాయి.
– మల్లాది వెంకటకృష్ణ మూర్తి
Vidwan Viswam Panchatantram
₹150.00పంచతంత్రం
విను మహిలా రోప్య మను పట్టణమ్ము
వెనుక, దక్షిణభూమి వెలయుచు నుండె.
అమరేంద్ర వైభవుం డా యూరి రాజు;
అమరశక్తి యటందు రాతని జనులు.
మువ్వురు కొడుకులు మూర్ఖులై రంచు
చివ్వుమన్నది రాజు చిత్తమ్ములోన
చింతతో మంత్రుల చేరంగ బిలిచి
మంతన మ్మొనరించి మాట్లాడె నిట్లు:
తెలివిమాలిన కుమారుల పాడు నడత
తెలియుగదా మీకు తీర్పరులార: |
చదువుసాములు లేని చవటలై వీరు
పదుగుర నవ్వుల పాలయినారు.
అనగా అనగా దక్షిణాపథంలో మహిలా రోప్యం అనే పటణం కలదు. అంగ రంగ వైభవంతో ఆ నగరాన్ని అమరశక్తి అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు. వారు ముగురూ మూరులయినందువల్ల ఆ రాజు మనస్సు చివుక్కు మన్నది. విచారంతో ఆయన మంత్రులందరినీ పిలిపించి వారితో మంతనం సాగించినాడు.
ఆ నరపాలుడు ఇట్లన్నాడు – “ఈ తెలివిలేని నా కుమారుల
నడత మీకు తెలుసు గదా! మీరు న్యాయం చెప్పవలసిన వారు చదువూ, సామూ లేక చవటలె పోయి ఉన్నాడు. పాడు నడత మీకు తెలుసు గదా! మీరు న్యాయం చెప్పవలసిన వారు. చదువు, సాము లేక చావతలై పోయిన వీరు పడుగుర ముందు నవ్వుల పాలవుతారు . …..
Vallu Padina Bhupalaragam
₹250.00కాలాతీత కథల కథనశిల్పం
శీలా సుభద్రాదేవి, సంపాదకురాలు
డా|| పి.శ్రీదేవి పేరు చెప్పగానే సాహితీలోకంలో ‘కాలాతీత వ్యక్తులు’ నవల గుర్తుకు రానివారు అరుదు. ఆమె కథలు రాసినట్లు తెలిసినా, ఆ కథల గురించి తెలిసినవారూ తక్కువే. పి. శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాసిలో ‘కాలాతీత వ్యక్తులు’కు దీటుగా ఉన్న కథలూ వాటిలో ఉన్నాయి. 1955 నుండి 1960 వరకూ రాసిన కథలు సుమారుగా ఇరవై వరకూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె రచనా జీవితం ఆరు సంవత్సరాలు మాత్రమే. ఆ కొద్దికాలంలోనే నవల, కథలు, కవిత్వం, వ్యాసాలతో సాహిత్యరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని సాధించిందామె. అరవై ఏళ్ళకు పైగా ఆ ముద్ర చెరిగిపోకుండా ఉందంటే శ్రీదేవి రచనలకు గల విశిష్టత తెలుస్తుంది.
శ్రీదేవి 1929 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో జన్మించింది. తండ్రి డాక్టర్ గుళ్ళపల్లి నారాయణమూర్తి నాటకకర్త, రచయిత,
జాతీయవాది కావటాన శ్రీదేవికి బాల్యంనుండీ సాహిత్యాభిలాష, అభినివేశం అలవడ్డాయి. తండ్రితోపాటూ అనేక సమావేశాల్లో పాల్గొనటంవలన జాతీయ సమస్యల పట్లా, సాహిత్యంపట్లా స్పష్టమైన అవగాహన ఆమెకి కలిగింది.
Swapna Jeevi
₹175.00మనకు జరిగిందే కథ కాదు. మనలో జరిగేది కూడా కథే!
మానవజాతి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఎన్నో అంశాలలో కళ కూడా ఒకటి. మనిషి అంతరంగంలోని ఎన్నో విషయాలను వ్యక్తీకరించే మార్గం కళ. మాటలు, పదాలు వ్యక్తీకరించే భావాలను సైతం వివిధ కళారూపాల ద్వారా వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని మనిషి కనుగొన్నాడు. మానవుల మొట్టమొదటి కళారూపాలు పురాతన గుహల ‘గోడలపై చిత్రించిన బొమ్మలుగా కనుగొనబడ్డాయి. ఆ విధంగా చిత్రలేఖనం మానవుడి మొదటి కళగా అర్థం చేసుకోవచ్చు. కళల ద్వారానే సంస్కృతి వ్యాపించింది. కళ మరియు సంస్కృతి ప్రజలని ఒక సమాజంగా దగ్గర చేశాయి. సమాజాన్ని బలోపేతం చేయడానికి కూడా కళ, సంస్కృతి ఎంతో ఉపయోగపడతాయి. వినోదం, విశ్రాంతి పొందడం కోసమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడం, నేర్పించడం, వ్యక్తిగత వృద్ధి సాధించడంలో కూడా వివిధ కళలు ఎంతో ఉ పయోగపడతాయి. సమాజానికి ఇంత మేలు చేసే కళ వెనుక ఉండే కళాకారుల జీవితాలు చాలా వరకూ ఎన్నో కష్టనష్టాలతో కూడి ఉండడం మాత్రం ఎంతో బాధాకరమైన విషయం. బహుశా అందుకు కారణం కళాకారుడు మిగిలిన వారికంటే ఎక్కువ వ్యాకులత కలిగి ఉండి, సమాజం పట్ల చింతకలిగిన వాడై ఉండడం ఒక కారణం అయ్యుండొచ్చు. |
మరణం తప్పదని తెలిసిన మనిషికి తన క్షీణతను అధిగమించగలిగే ఒకే ఒక సాధనం కళ, కళాకారుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా, కళాకారుడు చేసిన సృష్టి అతనికి…………
Sundara Kandamu 1, 2&3
₹1,500.00పరిచయము
శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు
రాజమహేంద్రవరము శ్రీమద్రామాయణము భారతీయ సాహిత్యమున శిఖరాయమానమైన మహాగ్రంథము. వాల్మీకి ప్రణీతమైన యాదికావ్యము. వేదమంత్రములవలనం దెలిసికొనఁదగిన పరమాత్ముఁడు దశరథాత్మజుడుగా నవతరించెను. ఏడు కాండములుగా నున్న రామాయణములో ఇరువదినాలుగువేల శ్లోకములు గలవు. గాయత్రీమంత్రాక్షరములు ఇరువదినాల్గు. వాల్మీకి
రామాయణములోని ప్రతి వేయవ శ్లోకము ఆ మంత్రాక్షరముతో నారంభమగును. దానివలన రామాయణము పారాయణము చేయుటవలనఁ గర్తకు సకలకార్యసిద్ధులగుచున్నవి. మనోహరమైన కవిత్వానందముతోపాటు మహిమసిద్ధిప్రదమైన
రామాయణమునకు సుందరకాండము శిరసానీయము. సప్తకాండమండితమైన శ్రీమద్రామాయణములో సుందరకాండమును ప్రత్యేకముగాఁ బారాయణము చేయుచుందురు. తత్పారాయణము అభిష్టసిద్ధి నొసగుచుండుటయు సర్వభక్తానుభవము.
‘ఒక శ్లోకము, ఒక పాదము, ఒక పదము కూడ పుణ్యప్రదమని చెప్పఁబడినది. శ్రద్ధాభక్తులతో, అర్థజ్ఞానము కలిగి పారాయణ మొనర్చుటవలన గలిగెడి ప్రయోజన మనంతమైనది. సంస్కృతభాషాపరిచయము కలవారు ఆంధ్రులలో ఎందఱుందురు? అర్ధజిజ్ఞాసువులయిన ధార్మికులకు, ఆస్తికులకు, పారాయణాసక్తులకు సుబోధముగా నుండునట్లు “సుందరకాండము” ప్రచురిత మగుట తెలుగువారికి అపేక్షితము. ఇతఃపూర్వము వావిళ్ళవారు సార్థతాత్పర్యముగా ప్రచురించియున్నను, ఆ గ్రంథము లిపుడు లభ్యము గాకుండుటచేఁ బలువురు ఆంధ్రవివరణసహితమగు సుందరకాండమునకు బహుకాలముగాఁ బ్రతిక్షించుచున్నారు.
ఇపుడీ “సుబోధినీ” సహితమగు సుందరకాండము తెలుఁగువారి కోరికకు ఫలముగా వెలువడుచుండుట ఆనందదాయకము. ఈ పుణ్యకృతికి సంకల్పించినవారు శ్రీ బోయనపల్లి కామేశ్వరరావుగారు. వీరు రామనామప్రచారకాగ్రేసరులగు “శ్రీరామశరణు”గారి శిష్యులలో అగ్రగణ్యులు. త్యాగభోగములకుఁ దగిన సంపత్తితోపాటు ధార్మిక ప్రవృత్తి కలిగిన యుదారులు; నిరంతర శ్రీరామధ్యాన పూజాతత్పరులు. ఆంగ్లమున పట్టభద్రులయ్యును, భారతీయ సంప్రదాయములయెడ అవిచలితమైన శ్రద్ధాసక్తులు కలిగినవారు. వీరు తెనుఁగు పద్యరచన చేయ సహృదయులు. “అమృతోదయ” మన్న ఆంధ్రకావ్యమును కృతిపొందియన్నారు…….
Sri Devi Bhagavatham
₹600.00(అ) శ్రీమద్దేవీభాగవత మాహాత్మ్యం
ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడావిలాసం. జగత్సృష్టివేళ సృజనస్వరూప, రక్షణవేళ పాలన స్వరూప, సంహారవేళ రౌద్రస్వరూప. పరా – పశ్యంతి – మధ్యమా – వైఖరీ భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే. కనక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్ శక్తిని అనుగ్రహించుగాక ! ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి, నరనారాయణులకు శిరసువంచి, సరస్వతీదేవినీ వ్యాసమహర్షిని అభినుతించి పురాణం ప్రారంభించాలి.
నైమిశారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు. సూతమహర్షి! నువ్వు వందల సంవత్సరాలు జీవించు. వ్యాస శిష్యుడివి. మహామతివి. ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు. ఎంతో మనోహరంగా చెబుతున్నావు. విష్ణుకథలు చెప్పావు. అవతారగాథలు వర్ణించావు. శివుడి చరిత్రలు వినిపించావు. భస్మరుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తిశ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యమా అని జ్ఞాన – ఆనందాలను పొందాము. ఇంక ఇప్పుడు పావనాలలోకెల్లా పావనమూ అనాయాసంగా భుక్తిముక్తి ప్రదమూ అయిన మహాపురాణాన్ని నీ ముఖతః వినాలి అనుకుంటున్నాం. దయచేసి అటువంటిది అనుగ్రహించు.
శౌనకాది మహామునీశ్వరులారా ! అడగవలసింది అడిగారు. లోకహితం కోరి అడిగారు. కనక సర్వశాస్త్ర సారమూ పరమపావనమూ దేవీ భాగవతం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంతవరకే మిగతా పురాణాలూ తీర్థాలూ వ్రతాలూ మిడిసిపడేది. ఈ దేవీ భాగవతం పాపారణ్యాలకు గండ్రగొడ్డలి. గాఢ కిల్బిషతమస్సులకు పొద్దు పొడుపు, వినిపిస్తాను.
సూతమహరీ ! తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో వింటాం. విని తరిస్తాం. ఆ పురాణం ఏమిటి? దాన్ని వినడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా ? ఎన్ని రోజుల్లో వినాలి? ఏ పూజలు చెయ్యాలి? లోగడ ఎవరెవరు విన్నారు ? ఏమేమి ఫలాలు పొందారు ? ఎవరు వినిపించారు?
మునీశ్వరులారా ! విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసుగదా ! వేదాలను నాలుగుగా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేనివారికి ధర్మజానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యులద్వారా ప్రచారంలోకి తెచ్చాడు. అష్టాదశ పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు వినిపించాడు. చదివించాడు. వాటిలో దేవీ భాగవతం – ఉత్తమోత్తమ పురాణం, భుక్తిముక్తిప్రదం. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు.
Screenplay Direction
₹150.00మన తెలుగులో సినీ పరిజ్ఞానం గూర్చి తెలుసుకోవాలనుకున్న వారికి పుస్తక రూపంలో ఏ సమాచారమూ లభించదు. ఈ లోపం చిత్ర రంగ ప్రారంభదశ నుండి మనలను వెంటాడుతూనే ఉంది. కారణమేమిటంటే మొదటి నుండి మనకున్న సాంకేతిక నిపుణులు వాళ్ళ అనుభావాలను గ్రంథస్తం చేయలేకపోయారు. అనుభవజ్ఞుడు వ్రాయలేడు. వ్రాయగలిగిన వారికి సాంకేతిక నైపుణ్యం తెలియదు. ఈ ఇబ్బంది వలన మన తెలుగు సినీ రంగంలోని దర్శకులు, సాంకేతిక నిపుణులు తమ అనుభవాలను తమలోనే అణచివేసుకున్నారు.
నేను ‘నటసోపానం’ అనే నట సాంకేతిక సిద్ధాంత గ్రంథం వ్రాసిన తరువాత చాలా మంది మిత్రులు మన తెలుగులో స్క్రీన్ ప్లే, దర్శకత్వం గూర్చిన సమాచారం ఇసుమంతైనా లేదు. ఆ కొరత తీర్చగల్గే బాధ్యత తీసుకోమని నన్ను ప్రోత్సహించడంతో ఈ చిన్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాను. కళా రంగంలో తమ కలలను సాకారం చేయదలచుకొన్న వారు తప్పని సరిగా నటసోపానం చదివి తీరాలి. ఎందుకంటే అందులో కళలకు సంబంధించిన సమస్త సమగ్ర సంపూర్ణ సమాచారం వాదించిన విస్తరిలా ఉంది. ఒక నటుడు జీవితాంతం శ్రమపడి నేర్చుకున్న అనుభవసారం కంటే ఒక్క నటసోపానం, ఎన్నో రెట్లు గురువు రూపంలో మీకు సాంకేతిక సంస్కారం బోధిస్తుంది ఇది వాస్తవం.
ఈ చిన్న పుస్తకంలో రెండు గొప్ప విషయాల గురించి వివరించడం జరిగింది. ఒకటి స్క్రీన్ ప్లే, రెండు డైరెక్షన్. ఈ భాగాలలో పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించలేనివాడు కథను ప్రేక్షకామోదంగా చిత్రించలేడు. చిత్ర రంగంలో నాకున్న అనుభవం కొంచమేనని చెప్పలేను. అపారమని అంతకన్నా చెప్పలేను. కాని నేను రచించిన ఈ చిన్న పుస్తకం వర్ధమానులను ఉత్తమ విలువలు గల స్క్రీన్ ప్లే రైటర్స్ గా, డైరెక్టర్స్ గా తీర్చి దిద్దగలదని క్లాప్ కొట్టి మరీ చెప్పగలను.
Samakalina Bharatiya Kathalu
₹160.00ఉర్దూ కథ : శిరీస్ నియాజి
చిన్నచేప-పెద్దచేప
అదొక చీకటి రాత్రి! ప్రకృతి నలువైపులా నల్లటి దుప్పటి కప్పుకుంది. దూరాన ఉత్తర దిక్కులోని ఓ మూలలో మాత్రం రక్తం గడ్డకట్టినట్టు ఎర్రబడింది. ఆకాశం,
పగలంతా తమ కువకువలతో సందడి చేసిన పక్షులు అలసిపోయి తమ గూళ్ళలో దూరి నిశ్శబ్దంగా నిద్రిస్తున్నాయి. కుక్కలు మొరగటం, ఏడ్వటం మానేసి రోడ్లు, సందుల్లో తమ కడుపుల్లో తలలు దూర్చుకుని నిద్రకు ఉపక్రమించాయి.
ఇలాంటి భయానకమైన రాత్రి ఓ నీడ తూలుతూ నది వైపు వేగంగా కదులుతోంది. అతని భుజాలు ముందుకు వంగి ఉన్నాయి. చిరిగిన దుస్తులు, అరిగిన చెప్పులతో అతను నడుస్తున్న తీరు చూస్తే అతనొక ముసలివాడని, బలహీనమైన వ్యక్తి అని ఇట్టే చెప్పొచ్చు. కాకపోతే కటిక పేదరికమే అతన్ని వయస్సుకన్నా ముందే ముసలివాడిగా మార్చేసింది. అయితే అలాంటి బలహీనమైన వ్యక్తి అర్ధరాత్రి పూట నది దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు?
పైగా ఈ రోజు సాయంత్రమే రేడియోలో ఒక హెచ్చరిక వెలువడింది- “ఈ రోజు రాత్రి భయంకరమైన తుఫాను వచ్చే అవకాశముంది. అందువల్ల చేపలు పట్టే జాలరులు ఎవరూ నదిలోకి వెళ్ళకూడదు” అని. ఆ వార్త అనగానే ఆ జాలరి వెంటనే చేపల కాంట్రాక్టర్ దగ్గరికి ‘ఈ రోజు చేపలు పట్టలేనని చెప్పడానికి’ వెళ్ళాడు. ఆ మాట వినగానే కాంట్రాక్టర్ మండిపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేపలు పట్టాల్సిందేనన్నాడు. దాంతో తుఫాను రాత్రి అయినా చేపల కోసం నదిలోకి వెళ్ళక తప్పదనుకున్నాడు జాలరి. వెళ్ళకపోతే మరుసటి రోజు కాంట్రాక్టర్ తనకు డబ్బులు ఇవ్వడు. డబ్బు లేకపోతే ఇంట్లో పొయ్యి వెలగదు. తిండిలేక పిల్లలు విలవిల్లాడతారు. ఆకలిని తట్టుకునే వయసు వాళ్ళకింకా రాలేదు.
| ఓ పడవ నిండా పట్టిన చేపలకి కాంట్రాక్టర్ ఇరవై రూపాయలిస్తాడు. దాంతోనే అతను తనతోపాటు భార్య, ముగ్గురు కూతుళ్ళ కడుపులు నింపుతాడు. నిజానికి అతను పడే కష్టానికి ఇరవై రూపాయలు చాలా తక్కువ. కష్టం తనది, సుఖమూ, సొమ్మూ కాంట్రాక్టర్ ని అతనికి తెలుసు. చలిలో, వర్షంలో అవస్థలుపడి నదిలో చేపలు పట్టి నిజాయితీగా చేపలన్ని కాంట్రాక్టర్ కి చేరుస్తాడు. తన పిల్లల కోసం ఒక్క చేప కూడా తీసుకెళ్ళడు. అయినా కాంట్రాక్టర్ ఎన్నడూ అతనిపట్ల సానుభూతి చూపలేదు..