- Academic8 products
Accessories17 products
- Action & Adventure21 products
- Activity Books16 products
- Animals0 products
- Anthologies6 products
- Arts & Literature6 products
- Astrology10 products
- Bhakthi38 products
- Biography and Autobiography35 products
- Cars & Trucks2 products
- CHILDREN13 products
- Classics5 products
Clocks1 product
- Contemporary3 products
- Criticism Books1 product
- Critics & Articles8 products
- Cultural27 products
- EDUCATIONAL1 product
- Essays1 product
- European0 products
- Family and Relationships1 product
- Films and Entertainment9 products
- Foreign Language0 products
Furniture5 products
- General32 products
- GENERAL21 products
- Genre Fiction1 product
- Health & Fitness11 products
- Historical1 product
- History14 products
- History & Politics28 products
- Home Making2 products
- Humour1 product
- Inspirational7 products
Lighting1 product
- Literature41 products
- Novel279 products
- Numerology0 products
- Padya Kavyalu1 product
- Personality Development14 products
- Philosophy7 products
- Plays & Dramas6 products
- Poetry2 products
- Poetry6 products
- Professional &Subject1 product
- Pulmanology & Vastu0 products
- Puranalu3 products
- Religious1 product
- Short Stories33 products
- Short Stories133 products
- TELUGU98 products
- top20228 products
Toys1 product
Showing 37–48 of 133 resultsSorted by latest
The Show Must Run
₹170.00
బంగారు వడ్లగింజలు
సుమారు ఇరవై ఏళ్ళక్రితం ఒకే కవరులో 'భట్టిప్రోలు కథలు' అనే పేరుతో నవ్య వీక్లీ కార్యాలయానికి వచ్చాయి, విజయరామరాజుగారి కథలు. భట్టిప్రోలు మావూరు దగ్గరే. అది గొప్ప బౌద్ధక్షేత్రం. వాన కురవంగానే అక్కడున్న దిబ్బలమీద బంగారు వడ్లగింజలు దొరుకుతాయని స్థానిక ప్రజల నమ్మకం. ఇప్పటికీ వాన పడ్డప్పుడు జనం అక్కడ వెతుకుతూనే వుంటారు.
డాక్టరుగారి కథలన్నీ భట్టిప్రోలు బంగారు వడ్లగింజల వంటివేనని నేను భావిస్తాను. పల్లెటూరియాసలో గొప్ప ఇతివృత్తాలతో రచించిన గొప్ప కథలు! దేనికదే బావున్నాయి.
'ద షో మస్ట్ రన్' కథాసంపుటిలో పల్లెటూరు, బస్తీ రెండింటినీ పట్టుకున్నారు.
సురభి నాటకాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక్క టిక్కెట్టు తెగకపోయినా, ఒక్క ప్రేక్షకుడు రాకపోయినా సరే, అనుకున్న టైంకి తెరలేస్తుంది. అదీ వారి ప్రత్యేకత.
భమిడిపాటి కామేశ్వరరావుగారు అనేవారు, “నువ్వు రాసిన రచని పదమూడేళ్ళు ఊరబెట్టి అలానే వుంచు. తర్వాతే పత్రికలకు ఇవ్వు" అని. దేనికైనా కాలం గీటురాయి. అందుకే భట్టిప్రోలు కథలను తలచుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా కూడా తలచుకుంటారు. వాటిలో 'చూరుకుట్టు బద్ద', 'నత్తముక్కల గోంగూర' నాకు బాగా నచ్చిన కథలు.................
Quilt
₹300.00
ముందుమాట వంటివి రాయడం నాకిష్టం ఉండదు, జంకు వల్ల. జంకు, ముందుమాటలు రాయడం చాతకానందువల్ల. కథలు, కవిత్వం కంటే ఈ తొలిపలుకులు రాయడం కష్టం అని నేననుకుంటాను. ఈ విద్య సులభంగా పట్టుబడేది కాదు. సమకాలీనుల్లో అతికొద్దిమందికి మాత్రమే శక్తిమంతమైన తొలిపలుకు జన్యువులున్నాయి. వాటివల్ల రసవత్తరమైన తొలిపలుకులు వెలువడుతాయి. మరి నేనెందుకీ సాహసానికి పూనుకున్నాను? నాకిష్టమైన రచయిత ఒకతను. వ్యక్తిగా, రచయితగా కూడా. తన నవలకి పరిచయం రాయమని అడగ్గానే రాశాను. అది అచ్చయిం తర్వాత నేను అనుకున్నట్టుగా రాయలేదని స్పష్టం అయింది. ఆ బాధ నన్నిప్పటికీ వదల్లేదు. సరే, గొర్తి సాయిగారిది అమలాపురం. ఇతని నాన్నగారు సూర్యనారాయణగారు నాకు పూర్వాశ్రమంలో మిత్రుడు, నేను అమలాపురం కాలేజీలో పనిచేస్తున్నప్పుడు. అందుచేత సాయిగారు అడగ్గానే (ఇంచుమించు) ఒప్పుకున్నాను. కానీ, ఇంకే రచయితనైనా, కొంచెం బాగా అర్థమయ్యే కథలు రాసేవాణ్ని అడిగి ఉండ వలసిందని అనుకుంటున్నాను.
Kothi Kommachi
₹750.00
సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ అన్నారు పండిత కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు.
మేము ఒప్పుకోలేదు. మేం తీశాం. "స్నేహం" అనే సినిమా తీశాం. మాకు ముందు హిందీలో "దోస్తీ" అనే సినిమా తీశారు తారాచంద్
బ్యా
పంచదార కన్నపరదార లేపి....
"తీయని అంటే సినిమా తీయకపోవడం కాదండి - తీయనిది అంటే తీపిగా ఉండేది. 'స్నేహం మధురమైనది అని కదా" అన్నారు స్వాతి బలరామ్
“ఓహో అదా- అయితే అలాటి తీపివి చాలానే ఉన్నాయి. వేసవి వెళ్ళగానే వచ్చే తొలకరి వానజల్లుకి మట్టి గుబాళించే వాసనల జల్లు తీయన... అమ్మానాన్నల ముద్దులు తీయన ఆలుమగల తొలిముద్దు అంతకంటే... మసక సంజెలో తొలి గిలి తగిలీ తగలని చేతులూ కలిసి కలియని చూపులూ- కృష్ణశాస్త్రిగారన్నట్లు పంచదారకన్న పరదార తీపిరా అని...
Emotional Pregnancy
₹290.00
అనగనగా ఒక చెట్టు. ఆ చెట్టు కింద ఒక అబ్బాయికి కూర్చుని ఉండడం అలవాటు. అటుగా వెళ్తూ, చెట్టుకింద కూర్చున్న అబ్బాయిని చూసి నవ్వుతూ దగ్గరకొచ్చి కూర్చుంటుంది ఒక అమ్మాయి. నవ్వూ నవ్వూ, మాటా మాటా, చేయీ చేయీ కలిశాక ఆడుకుందాం రమ్మని అడుగుతుంది. ఆ అబ్బాయి కదలడు. సరేలే అని అనుకుని వెళ్ళిపోతుంది.
మళ్ళీ మరుసటి రోజున వస్తుంది. నవ్వుతుంది. పలకరిస్తుంది. ఆడుకుందామని అడుగుతుంది. నవ్వుతాడు, పలకరిస్తాడు, కానీ కదలడు.
మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. నవ్వుతుంటుంది. పలకరిస్తుంటుంది.
ఆడుకుందామని అడుగుతూ ఉంటుంది. వాడు కదలడు.
మళ్ళీ వస్తుంది. నవ్వకుండానే, పలకరించకుండానే ఆడుకుందామని
అడుగుతుంది.
వాడు కదలకపోయేసరికి దానికి కోపం వస్తుంది. ఒక మాట అంటుంది విసురుగా. ఆడకపోతే మళ్ళీ రానని బెదిరిస్తుంది. అయినా వాడు కదలడు. దానికి ఓపిక నశించి ఇంకో రెండు మాటలనేసి వెళ్ళిపోతుంది.
అయినా మళ్ళీ తిరిగొస్తుంది. ఈ సారి ఏడుస్తుంది. ఒక్కసారైనా కదలవూ
అని బతిమాలుతుంది.
Anton Chekhov Kathalu 1
₹600.00
కథలు రాయడం నేర్పే పాఠాలు
చెహెూవ్ కథలన్నీ తెలుగులోకి తీసుకువస్తున్నామని కుమార్ కూనపరాజు గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమనిపించింది. అది ఇంత తొందరలో కార్యరూపం ధరిస్తుందనీ, మొదటి వంద కథలు ఇలా పుస్తక రూపంలో మీ చేతుల్లోకి వస్తాయనీ నేను ఊహించలేకపోయాను. ఇది తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా కథా ప్రక్రియకి అపురూపమైన కానుక అని భావిస్తున్నాను.
సాధారణంగా కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళు కొన్నాళ్ళు గడిచేక, తాము రాస్తున్న కథల వస్తువు పట్ల కాక, శిల్పం గురించి ఆలోచిస్తూ ఉండటం సహజం. కథలు ఎలా రాయాలి, కథని నిర్మించడంలో పాటించవలసిన నియమాలు, పద్ధతులూ ఉన్నాయా అనే విచికిత్స వాళ్ళల్లో మొదలవుతూండటం సహజం. ఈ మధ్య నేను పాల్గొన్న రైటర్స్ మీట్ లో కూడా నన్ను ఈ విషయం మీదనే మాట్లాడమని అడిగారు. కూడా.
కథ అంటే ఆధునిక కథానిక, ముఖ్యంగా, పాశ్చాత్య ప్రభావంతో రూపుదిద్దుకున్న చిన్నకథ అనుకుంటే, ఆ కథాశిల్పం గురించి తెలుగులో చెప్పుకోదగ్గ పుస్తకాలు లేవు. ఉన్న ఒకటీ అరా కూడా కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళని చేయిపట్టుకు నడిపించడానికి ప్రయత్నిస్తాయి తప్ప, దారి చూపించేవిగా లేవు. ఈ నేపథ్యంలో చెహెూవ్ కథలు మొత్తం తెలుగులోకి అనువాదం కావడం నిస్సందేహంగా ఎంతో
ప్రయోజనకారి.
ఒకప్పుడు బ్రిటిష్ యువరాజు ఒక ప్రసిద్ధ నీటిరంగుల చిత్రకారుణ్ణి తనకు చిత్రాలు ఎలా గియ్యాలో నేర్పమని అడిగాడట. అందుకు ఆ చిత్రకారుడు తనకి బొమ్మలు వెయ్యడం మాత్రమే తెలుసనీ, ఎలా వెయ్యాలో నేర్పడం తెలియదనీ, రాకుమారుడు చిత్రాలు గియ్యడం నేర్చుకోదలచుకుంటే, తాను బొమ్మలు వేస్తుండగా చూడటమొక్కటే మార్గమనీ చెప్పాడట. ఈ మాట కథానికా ప్రక్రియకి కూడా వర్తింపచెయ్యవచ్చు. కథలు ఎలా రాయాలో ఎవరో చెప్తే నేర్చుకోవడంకన్నా చెహెూవ్ కథలు మనమే నేరుగా చదవడం వల్ల కథా రచన సూత్రాలు సులభంగా పట్టుబడతాయి. ఇవి కథలు రాయడమెలానో నేర్పే పాఠాలు. జీవితాన్ని ఒక కథకుడు...........
Madhurantakam Rajaram Samagra Katha Sankalanam 5 Parts Of Set
₹3,000.00
సర్కసు డేరా
ఏ పుట్టలో పాములుంటాయో, ఏ పుట్టలో ఈసిళ్ళుంటాయో యిర్లవాడికి తెలిసినట్టు మరొకరికి తెలియదు. భుజాన మోపెడు ఈతపుల్లలతోనూ, చేత నీళ్ళదుత్తతోనూ వాడొకడు మీకు పల్లెపట్టుల్లో ఎదురైతే, అతగా డక్క డెక్కడో పుట్టమూసి ఈసిళ్ళు పట్టబోతున్నాడన్న మాట! కీటక సంహారకాండలో నాందీ వాచకంగా అతడు పుట్టలో ముఖ్యరంధ్రాన్ని మాత్రం మినహాయించి, మిగిలిన వాటిని మూసేస్తాడు. ఆ తరువాత చిక్కగా నీళ్ళు చిలకరిస్తాడు. రంధ్రానికి చేరువగా ఒక దిగుడు అమర్చి అందులో దివ్వె వెలిగిస్తాడు. ఎండుమట్టి పైన చల్లటి నీళ్ళు పడ్డంతో నీటి ఆవిరి పైకెగిరి, పుట్టలోపలి కీటకాలకు వాన కురుస్తున్నట్టో లేక కురిసి వెలిసినట్టో భ్రమ కలుగుతుంది. బారులు బారులుగా అవి పైకొస్తాయి. వచ్చీరాగానే మృత్యుదేవత క్రూర దంష్ట్రలాంటి దీపశిఖ వాటిని ఆహ్వానిస్తుంది. అవి మొదట రెక్కలు రాల్చుకుంటాయి. తరువాత యిర్లవాడికి మరునాటి ఎరగా మారిపోతూ కుప్పగా కూలిపోతాయి.
పూర్తిగా కాకపోయినా, కొంతవరకూ ఈ 'పుట్టమూత'తో పోలికలున్న సంఘటన ఒకటి పట్టణంలో జరిగింది.
గంటల కల్లా భోజనాలు ముగించి, జంబుచాపలు పరచుకోవడం తరువాయిగా దీపాలు ఆర్పేసి, వెచ్చగా వక్కాకు నములుతూ అరుగులపైన కూర్చున్న పల్లెటూళ్ళవాళ్ళకు ఆకాశంలో ఓ కాంతిపుంజం కనిపించింది. అది అచ్చంగా కాంతిపుంజం కూడా కాదు. భువినుండి దివికి ఏటవాలుగా ప్రసరిస్తున్న వెలుగుబాట. 'ఎన్నడూ లేంది, ఏనాడూ వినంది, ఏమిటీ విడ్డూరం' అని ఒక వైపున జానపదులు వెరగుపడిపోతున్నారు, మరొకవైపున ఆ వెలుగు వినువీధిలో నాలుగైదుసార్లు వలయాలు తిరిగి, అంతటితో తన పని తీరిపోయినట్టు అంతర్ధానమైపోయింది.
మెరుపూ, ఉరుమూ ఒకేసారి ఉద్భవించినప్పటికీ శబ్దవేగం కన్నా కాంతివేగం ఎక్కువ గనుక మెరుపు ముందుగా కనిపిస్తుందని చెబుతుంది విజ్ఞాన శాస్త్రం. ఇక్కడగూడా సరిగ్గా అలాగే జరిగింది. రాత్రి ఎనిమిది గంటలు, ఆ ప్రాంతంలో వెలుగు కనిపించింది...............
Asurudu
₹450.00
జయ పరాజయాల పురాణ గాధ
రామాయణ కధని ఇంతవరకూ లెక్కలేనన్ని సార్లు చెప్పటం జరిగింది. ఇది భగవంతుడి అవతారం అయిన రాముడి ఆసక్తికరమైన కధ. దుష్ట రాక్షసుడు రావణుడిని అతను సంహరిస్తాడు. ఇది ప్రతి భారతీయుడికీ సుపరిచితమే. చరిత్ర పుటలలో కూడా ఎప్పుడూ కధనం విజేతల పక్షానే ఉంటూ వస్తోంది. పరాజితుల గొంతు మౌనంగా ఉండి ఎవరికీ వినిపించదు. ఒకవేళ రావణుడూ, అతని ప్రజలూ ఈ కధని వేరేవిధంగా చెప్పాలనుకుంటే ఏమవుతుంది ?
రావణాయణ కధని ఎప్పుడూ ఎవరూ చెప్పలేదు.
'అసరుడు' పరాజితులైన అసురుల గాధ. 3000 సంవత్సరాలుగా వెలివేయబడ్డ పిడితులు ఎంతో ప్రేమగా కాపాడుకుంటూ వస్తున్న కధ ఇది. ఇంతవరకూ ఈ కధ చెప్పే సాహసం ఏ అసురుడూ చెయ్యలేదు. బహుశా పరాజితులైన వారూ, మరణించిన వారూ కధ చెప్పే సమయం ఆసన్నమైందేమో.
"కొన్ని వేల సంవత్సరాల వరకూ నన్ను ఒక దుర్మార్గుడిగా, ప్రతినాయకుడిలా చిత్రిస్తూ వచ్చారు. భారతదేశమంతటా నా మరణాన్ని పండగలా జరుపుకుంటారు. ఎందుకు? నా కుమార్తెకోసం దేవతలని ఎదిరించాననా? కులవ్యవస్థమీద ఆధారపడిన దేవతల పరిపాలన నా ప్రజలని కాడిలా అణచివెయ్యకుండా వారిని కాపాడాననా? మీరు విజేత కధ రామాయణం విన్నారు. నా కధ రావణాయణం కూడా వినండి. నా పేరు రావణుడు, నేను అసురుడిని, నాది పరాజితుడి కధ."
"నేను ఉనికిలేని వాడిని - కళ్ళకి కనిపించను, అశక్తుడిని, లెక్కలోకి రానివాడిని, ఎన్నడూ, ఎవరూ నా గురించి ఎటువంటి గాధలూ రాయరు. నేను రావణుడి చేతిలోనూ, రాముడి చేతిలోనూ బాధలు అనుభవించాను - ఒకరు నాయకుడు, మరొకరు ప్రతినాయకుడు. ఆ పాత్రలని అటూ ఇటూ మార్చుకోవటం కూడా సాధ్యమే. గొప్ప వ్యక్తుల కధలు చెప్పేటప్పుడు, నా గొంతు మరీ బలహీనంగా ఉండి ఎవరికీ వినిపించకపోవచ్చు. అయినా ఒక్క క్షణం నాకోసం వెచ్చించి నా కధ కూడా వినండి. నా పేరు భద్రుడు, అసురుజాతి నాది, నాది ఓటమికీ గురైన వాడి కధ."
ప్రాచీనకాలం నాటి అసుర సామ్రాజ్యం విచ్చిన్నమై పోయింది. ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి దేవతల పాదాలకింద నలిగిపోసాగింది. అసహాయ స్థితిలో అసురులు తమ రక్షకుడూ, యువకుడూ అయిన రావణుడిని ఆశ్రయించారు. రావణుడి నియంతృత్వంలో తమకి మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో భద్రుడిలాంటి సామాన్య జనం ఆ యువనాయకుడిని అనుసరించాలని అనుకున్నారు. దృఢ నిశ్చయంతోనూ, విజయం సాధించాలన్న ఆకాంక్షతోనూ రావణడు విజయ పరంపరలతో తన ప్రజలని ముందుకీ తీసుకువెళ్లాడు. దేవతల రాజ్యాలన్నిటినీ హస్తగతం చేసుకుని, ఒక సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. రావణుడు అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ, అసురులలో పేదవారు తమ పరిస్థితిలో పెద్దమార్పేమీ జరగలేదని గ్రహించారు. సరిగ్గా ఆ సమయంలో రావణుడు ఒక్క దెబ్బతో ప్రపంచ చరిత్రనే మార్చివేశాడు.
Vallu Padina Bhupala Ragam
₹225.00
డా.పి. శ్రీదేవి రాసిన 'కాలాతీత కథ' వాళ్ళు పాడిన భూపాలరాగం
- శీలా సుభద్రాదేవి
డా.పి. శ్రీదేవి పేరు చెప్పగానే 'కాలాతీత వ్యక్తులు' నవల గుర్తుకు రానివారు అరుదు. అయితే ఆమె కథలు కూడా రాసినట్లు తెలిసినా ఆ కథల్ని తెలిసినవారు తక్కువే. పి.శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాటిలో 'కాలాతీత వ్యక్తులు'కు దీటుగా ఉన్న కథలు ఉన్నాయి. నవలలో పాత్రల లాగే మరపురాని పాత్రలతో ఉన్న కథగా చటుక్కున చెప్పదగినది - 'వాళ్ళు పాడిన భూపాలరాగం'. ఇది 1959లో జయంతి (జులై) సంచికలో ప్రచురితం. 1966లో 'ఏరినపూలు' సంకలనంలో చేర్చబడింది. అనేక భిన్న మనస్తత్వాలు గల పాత్రలలో, అనేక సంఘటనలతో, ఆనాటి సమజానికి ప్రతిబింబంగా ఉండి, కథావిస్తృతి కలిగి ఉండటం చేత దీనిని నవలికగా కూడా చెప్పుకోవచ్చు. కాలాతీత వ్యక్తులు నవల రాసిన తర్వాత రాసిన కథ కావటాన కథాసంవిధానంలో, పాత్రల చిత్రణలో ఈ కథపై కూడా దాని ప్రభావం ఉంటుంది.
ఇందులోని కథంతా చెప్పకుండా పాత్రల్ని, పాత్రల స్వభావాల్నీ, మాత్రమే చెపుతాను. ఎందుకంటే ఇందులోని పాత్రలు కూడా సమాజంలో ఎప్పటికీ ఉండే పాత్రలే. పాత్రని సృష్టించేటప్పుడు పాత్రల యొక్క మూలస్వభావాన్ని కూడా పాఠకులకు అవగాహన అయ్యేలా సంఘటనల్నీ, సంభాషణల్నీ కూర్చే శైలి శ్రీదేవికే స్వంతం. అందుకనే వీరి పాత్రలు ఎప్పటికీ సజీవంగా వుంటాయి.
రామచంద్రయ్య: శుద్ధ మాష్టరీ ఉద్యోగం. లేమికి గానీ, అశుచికిగానీ బాధపడడు. అనారోగ్యం ఎరగడు. జీవితావసరాలు సమపాళ్ళలో వుండే కుదురైన సంసారం. రేడియోలూ, సినిమాలూ, గ్రామఫోన్ల వంటి అధునాతనమైన వాటిని నమ్మడు. ఇంట్లో ఏ కార్యం చేసినా పొదుపుగా, శాస్త్రోక్తంగా చేస్తాడు. ఒకరి మీద ఆధారపడకుండా బతకాలనే మధ్యతరగతి సగటు మనిషి మనస్తత్వం, జీవన విధానం కలవాడు. తిండి, బట్ట బతకటానికి చాలనేది అతని ఉద్దేశ్యం. అందుకే.....................
Shunyamlo Poolu
₹150.00
అమరావ్రతం
దీపశిఖపై మృత్యువు నర్తిస్తోందా అన్నట్టు గదిలో దీప గాలికి టపటపా కొట్టుకుంటోంది. మంచం మీద రంగాచారి చరమ దశలో ఉన్నాడు. భార్య సత్యవతి, కొడుకు రామాచారి కన్నీళ్ళతో చూస్తున్నారు. శాస్త్రులు గారు నాడి చూసి “ఇక లాభం లేదమ్మా సత్యవతీ" అని లేచారు. ఒక వైపు దేహాన్ని మృత్యువు కబళించివేస్తున్నా, రంగాచారి మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. వాళ్ళ రాజ్యంలోనే కాదు చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా రంగాచారి పేరు తెలియని వారు అరుదు. అంతటి గొప్ప శిల్పి ఆయన. రామాచారిని మాత్రం ఉండమని సత్యవతిని కూడా బయటకి వెళ్ళమని సైగ చేసారు. కన్నీళ్ళు పెట్టుకుంటున్న కొడుకువైపు చూసి "శిల్పికి మరణం లేదు. అసలు ఏ మనిషికీ మరణం ఉండదు. కళ్ళు తుడుచుకుని చెప్పేది విను" అన్నారు. ఆ దశలోనూ ఖంగున పలికింది ఆయన కంఠం...........................
Yuva
₹375.00
కొత్త స్వరాల అన్వేషణలో
(an appeal)
ఇదంతా వొక ఆందోళన జీవి గోల. వద్దనుకునే పాఠకులు యీ పేజీలు తప్పించి నేరుగా లోపలి కథల్లోకి వెళ్లిపోవచ్చు.
܀ ܀ ܀
చుట్టూ చీకటి. దారి అగమ్యం. చేతిలో దిక్సూచి లేదు. ఎక్కడ యెలా మొదలు కావాలో తెలీదు. అంతా యెగుడు దిగుళ్ళు. నడక ప్రతి అడుగులోనూ సంశయం. వెతుకులాట దేనికోసమో యేర్పడదు. కాళ్ళకి చుట్టుకునే తీగపై ఆశ. అది పామేమోనని భయం. కొన్నిటిని గుర్తించి నిర్వచించుకోవడం దగ్గరే మొదటి గండం యెదురవుతుంది. కొన్ని లేవని బెంగ. దూరంగా వొక వొంటరి చుక్క మెరుస్తుంది. అది వేకువ రాకడని తెలుపుతుంది. చూపు తేటబడుతుంది. దారి గోచరిస్తుంది.
అకస్మాత్తుగా ఆగిన కథో జీవితమో వొక ఆసరాతో మళ్ళీ మొదలౌతుంది. ఇదొక నిరంతర
ప్రయాణం.
܀
కొత్త తరం పాత తరం భుజాల మీద కూర్చుని చూస్తుంది కనకనే యెక్కువ దూరం చూడగలుగుతుంది - ఇవే మాటలు కాదు గానీ తన జీవితానుభవం నుంచి యిటువంటి అర్థం వచ్చే మాటలే అంటాడు ఐజాక్ న్యూటన్. మన యెదుగుదలకూ పురో గమనానికీ మనకంటే పెద్దవాళ్ళు అంతకుముందే నిర్మించిన దారి వొకటి వుంది కాబట్టి ఆ దారిలో నడవడం తేలిక అని ఆయన వుద్దేశ్యం. అయితే పాత దారుల్లో నడవడమో వాటిని పొడిగించుకోవడమో మాత్రమే చేస్తే కొత్త దారులు యెప్పుడు యెలా పరుచుకుంటాయి అన్నది పెద్ద ప్రశ్న. శాస్త్ర సాంకేతిక రంగాల్లో న్యూటన్ మాటల్ని కొంతవరకు అంగీకరించవచ్చేమో గానీ సృజనాత్మకతకి నెలవైన..................
Ontari Sikharalu
₹200.00
తుంటరి లోయలు
ఆకాశాన్ని అందుకున్నట్టుగా కనిపించే పర్వత శిఖరాలెంత గంభీరమైనవో, వాటినానుకుని కిందికి సాగే లోయలంత తుంటరివి..
యేరెండు శిఖరాలూ వొకలా సాధించవు. యేరెండు లోయలూ వొకలా వేదించవు. జాగ్రత్తగా గమనిస్తే యే యిద్దరు మనుషులు వొకలా వుండరని తెలుసుకో గలుగుతాం.
యెవరి ఆంతర్యం వాళ్ళదే అయిన యీ లోకంలో, ప్రతి మనిషీ వొంటరి శిఖరంలాగే బతక్క తప్పదు. అనివార్యంగా శిఖరాల నంటిపెట్టుకునే లోయలా జారిపోకా తప్పదు.
శిఖరాలు, లోయల బలాలు, బలహీనతలు కలగలసిన మానవ అస్తిత్వ ప్రవృత్తులు యెప్పటికప్పుడు కలిగించే విభ్రమాల్నీ, విస్మయాల్నీ చిత్రించే కథల సంపుటం యిది.
1977లో 'గుర్రమూ కళ్ళెమూ' అనే కథ రాసినప్పుడు నేనిలాంటి కథలు మరికొన్ని రాస్తాననీ, వాటినిలా వొక సంపుటంగా తీసుకురాగలననీ అనుకోలేదు. మొదటి నుంచీ సాహిత్యం నాకు ప్రపంచాన్ని అవగాహన చేసుకునే వేదికగానూ, సత్యాన్వేషణకొక వాహికగానూ, వ్యక్తిగత శోధనకొక మాధ్యమంగానూ కూడా తోడ్పడుతూ వస్తోంది.
వీటికి తాత్విక కథలనే పెద్ద పేరు పెట్టలేను గానీ యివన్నీ జీవితాన్ని మనస్సునూ ప్రశ్నించే కథలని మాత్రం చెప్పగలను - భౌతిక పార భౌతిక ప్రపంచాల మధ్య ఊగిసలాడే మానవుడి వెంపర్లాటలను అర్థం చేసుకోడానికి ప్రయత్నించే కథలివి. ప్రతిక్షణమూ | పరిణామాలకు గురవుతూ, అనుక్షణమూ సంక్లిష్టంగా మారిపోయే ప్రపంచంలో..............
Vallu Padina Bhupala Ragam
₹225.00
డా.పి. శ్రీదేవి రాసిన 'కాలాతీత కథ' వాళ్ళు పాడిన భూపాలరాగం
- శీలా సుభద్రాదేవి
డా.పి. శ్రీదేవి పేరు చెప్పగానే 'కాలాతీత వ్యక్తులు' నవల గుర్తుకు రానివారు అరుదు. అయితే ఆమె కథలు కూడా రాసినట్లు తెలిసినా ఆ కథల్ని తెలిసినవారు తక్కువే. పి.శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాటిలో 'కాలాతీత వ్యక్తులు'కు దీటుగా ఉన్న కథలు ఉన్నాయి. నవలలో పాత్రల లాగే మరపురాని పాత్రలతో ఉన్న కథగా చటుక్కున చెప్పదగినది - 'వాళ్ళు పాడిన భూపాలరాగం'. ఇది 1959లో జయంతి (జులై) సంచికలో ప్రచురితం. 1966లో 'ఏరినపూలు' సంకలనంలో చేర్చబడింది. అనేక భిన్న మనస్తత్వాలు గల పాత్రలలో, అనేక సంఘటనలతో, ఆనాటి సమజానికి ప్రతిబింబంగా ఉండి, కథావిస్తృతి కలిగి ఉండటం చేత దీనిని నవలికగా కూడా చెప్పుకోవచ్చు. కాలాతీత వ్యక్తులు నవల రాసిన తర్వాత రాసిన కథ కావటాన కథాసంవిధానంలో, పాత్రల చిత్రణలో ఈ కథపై కూడా దాని ప్రభావం ఉంటుంది.
ఇందులోని కథంతా చెప్పకుండా పాత్రల్ని, పాత్రల స్వభావాల్నీ, మాత్రమే చెపుతాను. ఎందుకంటే ఇందులోని పాత్రలు కూడా సమాజంలో ఎప్పటికీ ఉండే పాత్రలే. పాత్రని సృష్టించేటప్పుడు పాత్రల యొక్క మూలస్వభావాన్ని కూడా పాఠకులకు అవగాహన అయ్యేలా సంఘటనల్నీ, సంభాషణల్నీ కూర్చే శైలి శ్రీదేవికే స్వంతం. అందుకనే వీరి పాత్రలు ఎప్పటికీ సజీవంగా వుంటాయి.
రామచంద్రయ్య: శుద్ధ మాష్టరీ ఉద్యోగం. లేమికి గానీ, అశుచికిగానీ బాధపడడు. అనారోగ్యం ఎరగడు. జీవితావసరాలు సమపాళ్ళలో వుండే కుదురైన సంసారం. రేడియోలూ, సినిమాలూ, గ్రామఫోన్ల వంటి అధునాతనమైన వాటిని నమ్మడు. ఇంట్లో ఏ కార్యం చేసినా పొదుపుగా, శాస్త్రోక్తంగా చేస్తాడు. ఒకరి మీద ఆధారపడకుండా బతకాలనే మధ్యతరగతి సగటు మనిషి మనస్తత్వం, జీవన విధానం కలవాడు. తిండి, బట్ట బతకటానికి చాలనేది అతని ఉద్దేశ్యం. అందుకే.....................