Showing 109–120 of 133 resultsSorted by latest

Andari Manishi – అందరి మనిషి

95.00
'అందరి మనిషి' లోని కథలను శశిశ్రీ 2011-2014 మధ్య రాశారు. కొన్ని ఎప్పుడు రాసింది తెలియడం లేదు. 'రాతిలో తేమ' కథల సంపుటిలో శశిశ్రీ తన కథలను తానే రెండు భాగాలుగా విభజించారు. అవి 1. అంతర్లోకం 2. బహిర్లోకం. ముస్లిముల జీవితాన్ని, హిందువులతో ముస్లిముల సంబంధాలను చిత్రించేవి మొదటి విభాగం. పూర్తిగా ముస్లిమేతర జీవితాలమీద రాసినవి బహిర్లోకం. 'అందరి మనిషి' లోని పదకొండు కథలను కూడా అలాగే విభజించుకోవచ్చు. 'పెద్దల పండగ', 'పురానా హవేలి' పూర్తిగా ముస్లిం జీవిత ప్రతిఫలనాలు, 'ఆరాత్రి ఆపాట', 'ఫో', 'అరుపు' హిందూ ముస్లిం సంబంధ కథలు, 'గుండెతడి', 'అందరి మనిషి', 'కిర్రుచెప్పులు', 'యెమ్టీఫెలో', 'గురువింద', 'కూపం', ముస్లిమేతర జీవిత ప్రతిబింబాలు.

Prapancha Prasiddha Janapada Kadhalu

90.00
ఏ కాలానివైనా, ఏ దేశానివైనా, ఏ భాషవైనా జానపద కథలంటేనే చిత్రవిచిత్ర చమత్కారాలతో సాగుతూ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసి తమ వెంట ఏ చుక్కల లోకానికో, ఏ అందాల సీమలకో తీసుకుపోతాయి. ఈ కథలు ఆశ్చర్యానందాలే కాదు. జీవితానికి అవసరమైన విలువలను అందిస్తాయి. తరతరాల అనుభవాల అనుభూతుల సారమే ఈ జానపద కథలు. ఈ జానపద కథలు రేకెత్తించే కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు. విశేషాలు... మాటలు అమ్మే అంగడి వల్ల బాటసారి పొందిన ప్రయోజనం? మనం కురూపులమైనా, సౌందర్యవంతులమైనా జీవితాంతం మనల్ని అంటిపెట్టుకుని ఉండేది ఏమిటి? స్వర్గానికి కోటీశ్వరుడు వస్తే జరిగిన కోలాహలానికి కారణం? మానవ జీవితంలో ఉండే దురాశలు, కుయుక్తులు, జిత్తులూ వాటిని పరిష్కరించే సుయుక్తులు ఈ కథల నిండా వున్నాయి. ఇంకా ఈ కథల్లో పీనాసివాళ్ళు, మంత్రగత్తేలు, వెర్రివెంగళమ్మలు, వేలెడంత పిల్లలు మీకు తారసపడతారు.

Gorky Kathalu

60.00
గోర్కీ దృష్టిలో సర్వప్రపంచమంటే మానవ సంబంధాల ప్రపంచం. మనిషితనం నిండుకున్న ప్రపంచం. మానవీయ శక్తుల్ని అడ్డుకునే ప్రతిశక్తుల మీద విజయం సాధించగలిగే అచ్చమైన మానవుల ప్రపంచం. పరస్పర అవగాహనకు అడ్డు తగిలే వాటిని, వివిధ జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, అలముకునే కుసంస్కారాన్నీ తెగగొట్టగల ప్రపంచం. మొరట పితృస్వామిక భావాలకూ, పైపై నాగరిక పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తులున్న వాళ్ళ ప్రపంచం, సంప్రదాయక నీతి స్థానంలో అపేక్షలను పెంచే ప్రపంచం. సమాజంతో సంబంధాలు లేని వాళ్ళ బతుకుల్ని ఈసడించుకునే ప్రపంచం, బాధలూ, భయాలూ, కరువులూ, కాటకాలు లేని ప్రపంచం. ఈ ప్రపంచాన్ని చాటేవే ఈ సంపుటిలోని కథలు కూడా. - మాక్సిం గోర్కీ

Milinda

200.00
ప్రతి మనిషికీ బతికే హక్కున్నట్టే ప్రేమించే హక్కు కూడా ఉంటుంది. అది స్త్రీ పురుషులకన్నా కాస్త భిన్నంగా ఉన్నవారికి దక్కడం లేదు. వారిని అర్ధం చేసుకోకపోగా చిత్రమైన కారణాలతో వారిని మానసిక శారీరక హింసలకు గురి చేస్తున్నారు. వారి గోడును వినిపించుకోవడానికి వారి దగ్గర భాష కూడా లేని వైనాన్ని మనం గమనించాలి. నా కథల ద్వారా స్వలింగులకు, ట్రాన్స్ జెండర్స్ కీ సంఘీభావం తెలుపుతాను. మారే కాలాన్ని బట్టి నేను స్త్రీ వాదిని మాత్రమేనా బలమైన మానవవాదినా అని ఆలోచించుకునే అవసరం కనబడుతోంది. స్త్రీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నాయంటే మగవారి ఆలోచనా విధానం మారుతోందనే చెప్పాలి. పిల్లల్ని చూపులతోనే బెదిరించే తండ్రులు ఈ తరంలో అరుదే. వంటగదిలో ప్రధాన పాత్ర కాకపోయినా సహాయ పాత్ర పోషిస్తున్నారు నేటి పురుషులు. ఒక పక్క స్త్రీల మీద దాడులు పెరుగుతున్నా స్త్రీలని గౌరవించి సమానత్వంతో చూసే పురుషులు, యువకులు కూడా ఎక్కువే ఉన్నారు. కుటుంబ పోషణ వల్ల తీవ్రమైన మానసిక వత్తిడికి లోనై, కుటుంబం చేత నిర్లక్ష్యానికి గురయ్యే మగవారూ లేకపోలేదు. అటువంటి ఉదంతాలకి నా కథలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రతీ స్త్రీ దేవతా కాదు ప్రతీ పురుషుడూ రాక్షసుడు కాదు కాబట్టి పురుషులకి నా కథల్లో గౌరవ ప్రదమైన స్థానం ఉంటుంది.

Bujjoni Kala – బుజ్జోని కల

35.00
'ఉదయం రోజును ప్రతిబింబించినట్లు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది' అంటాడు మిల్టన్‌. అందుకే నిండు నూరేండ్ల జీవితానికి ఉపయోగకరమూ, విజ్ఞానదాయకమూ అయిన ప్రాతిపదికను ఏర్పరచడంలో భాగంగా బాలసాహిత్యం ఆవిర్భవించింది. పిల్లలకు వినోదాన్ని పంచి, దాని ద్వారా విజ్ఞానాన్ని పెంచి, మానసిక వికాసాన్ని కల్గించడానికి అది ఒక మంచి సాధనమైంది. బాలసాహిత్యంలో గేయ ప్రధానమైన రచనలకు అత్యంత ప్రాధాన్యముంది. పుట్టినప్పటి నుంచి ఇవి పిల్లలకు ఉపకరిస్తాయి. తల్లులు పాడే జోలపాటలు, లాలి పాటలు, చందమామ పాటలు ఈ కోవకు చెందినవే. పాటలు శ్రవ్య సాహిత్యానికి సంబంధించినవి. కథలు కూడా ఇందులో భాగాలే అయినా వాటిని అర్థం చేసుకోవడానికి కొంత వయసు రావాలి. కానీ పాటలలా కాదు. వీటికి తాళం, లయ, గతి, ప్రాస మొదలైన నియమాలుండడం వల్ల, నాదాన్ని ఆశ్రయించడం వల్ల శ్రవణప్రియంగా ఉంటాయి. పిల్లలకు తొందరగా పట్టుబడతాయి. ప్రాచీన బాల సాహిత్యం ఎక్కువగా గేయరూపంలో ఉండడానికి కారణమిదే. గేయాల్లోని భావం వాళ్లకు అర్థం కాకున్నా వాటిలోని లయ వాళ్ల వెంటనడుస్తుంది. నాదం పరవశింపజేస్తుంది. అందుకే 'శిశుర్వేత్తి పశుర్వేతి వేత్తిగాన రస పణి:' అన్నాడు. 'బుజ్జోని కల' గేయ సంపుటిలోని గేయాలన్నీ ఐదారేండ్ల వయసు పిల్లల్ని ఉద్దేశించి రాసినవి. పిల్లల్లోకి పరకాయ ప్రవేశం చేసి రాసినవి. అందుకే సహజంగా గోచరిస్తున్నాయి. వీటిలో వస్తువైవిధ్యముంది. చిన్న పిల్లల అందచందాలకు, ముద్దుముచ్చట్లకు, చిలిపి చేష్టలకు, చిత్త ప్రవృత్తులకు శాస్త్రి ఈ పాటల ద్వారా ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. వీటిలో ఆసక్తికరమైన పిల్లల ఆటల్ని చూడొచ్చు. తేనెలొలికే ముద్దు మాటల్ని వినొచ్చు. నిర్మలమైన వాళ్ల మనసుల్ని చదవొచ్చు. - ఆచార్య ఎం.కె.దేవకి

Neelaveni – నీలవేణి

100.00
అవును ఇది కథన కుతూహలమే. పి.వి.సునీల్‌ కుమార్‌ కథల్లో తొంగి చూసేది, పొంగి పొరలేదీ సామాజిక అన్యాయంపై కదన కుతూహలం. ప్రేమరాహిత్యం నుండి సామాజిక న్యాయం వరకూ, పోలీసు నుండి పొలిటీషియన్‌ వరకూ ఏ అంశం ఆయన  కలం స్పృశించినా పాఠకుడికి వ్యంగ్యపు పంట పండినట్టే. అంతర్జాతీయ సాహిత్యంలోనే అరుదూ, తెలుగు సాహిత్యంలో అయితే అసలు ఊసేలేకుండా పోయిన సెటైర్‌ (వ్యంగ్యం) సునీల్‌ కుమార్‌ కలం నుండి తీయటి గోదావరి ధారలాగా పరవళ్ళు తొక్కుతోంది ఈ కథా సంపుటిలో. ''దెయ్యాలు' ప్రేమను పంచినా, 'డిసిప్లి'లు సామాన్యుడి కోసం మొరిగినా అన్నీ సునీల్‌ కుమార్‌ మార్కు పంచ్‌ లోనే. 'థూ' అన్నా, 'చీకటి' కన్నా, 'పరిశుద్ధంగా' వివాహాన్ని 'దేవదాసు' జరిపించినా ధిక్కార స్వరమే కానీ, మరీముఖ్యంగా వినోదాలు జల్లు. ఈ కథల్లో జీవం ఉంది, జీవితం ఉంది.... రంగుల హరివిల్లులా నవ్వులు పూయించగల హాస్య-వ్యంగ్య వైభవం ఉంది. అక్షరాల ఇది అనితరసాధ్యం... అందుకోండి అక్షర తూణీర వ్యంగ్య నీరాజనం.